For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఎంతటి మగాడినైనా మీ కోసం పరితపించేలా చేయాలంటే, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

  |

  పురుషులు సంక్లిష్టమైనవారే అయితే కనుక ఈ రోజు, ఈ కధనం ఉండేది కాదు. పురుషులు, అతిసాధారణ జీవులు. స్త్రీలలో తమకు నచ్చిన కొన్ని లక్షణాలు ఉండాలని పురుషులు కోరుకుంటారు. ఒక స్త్రీ, పురుషుడు కోరుకునే గుణగణాలను కలిగి ఉన్నట్లైతే, ఖచ్చితంగా అతను ఆమెను ప్రేమించే తీరతాడు.

  పురుషులను ప్రేమలో పడేయడం చాలా సులభమైన పని. మీరు తెలుసుకోవలసినదల్లా, మీరు వారి వద్ద ఎలా నడుచుకోవాలి మరియు ఎలా మాట్లాడాలి అనేది మాత్రమే.

  ఈ వ్యాసం ద్వారా సులువుగా పాటించగలిగే సూత్రాలతో, ఒక పురుషుడిని మీ ప్రేమలో ఎలా పడేయవచ్చో తెలుసుకోండి.

  MAKE ANY GUY FALL FOR YOU: THINGS TO KNOW

  ప్రేమలో పడేయడమనేది ఒక కళ, పైగా ఈ విద్యలో ఆడవారు ఆరితేరి ఉంటారు. అటువంటి వారు కూడా ఈ సూత్రాలను అనుసరిస్తే, ఎదురు లేని మగాడిని కొంగుకు కట్టుకోవచ్చు.

  మీరెంతో ఆతృతగా తెలుసుకోవాలనుకుంటున్న ఆ సూత్రాలను ఇక్కడ మీకోసం అందిస్తున్నాం. ఇక చదవండి.

  1. కళ్ళతో మాట్లాడండి.

  1. కళ్ళతో మాట్లాడండి.

  స్త్రీ తన కళ్ళతోనే పురుషుని మనసులో ప్రేమకు బీజాలు చల్లుతుంది. పెదవులు అరచి చెప్పలేని మాటను కూడా, కళ్ళు మూగగా చెప్తాయి. పురుషుల చూపు మీవైపు తిప్పుకోవాలంటే, ఈ సూత్రాన్ని మరవద్దు.

  కళ్ళు మన మనసులోని ఏ భావాలను దాచలేదు మీరు కోపంతో ఊగిపోతున్నపుడు, కళ్ళలో ప్రశాంతతను అభినయించలేరే! అది కుదరని పని. ఎవరివల్లా కాదు.

  అతనిని కట్టిపడేయాలంటే, మీ భావోద్వేగాలను బయటపెట్టకుండా దాచగలరా? మీ మనస్సు లోతుల్లో అతనిపై ఉన్న ప్రేమను, అతనితో కళ్ళు కలపకపోతే తప్పదాచలేరు.

  మీ కళ్ళల్లో కవ్వింపులే, అతని హృదయం యొక్క తలుపులను తెరుస్తాయి. చిటికెలో వారు మీకోసం అల్లల్లాడిపోతారు.

  2. కొన్ని పనులు చేయమని వారిని అడగండి.

  2. కొన్ని పనులు చేయమని వారిని అడగండి.

  ఆయనను మీ కొరకు చిన్న చిన్న పనుకు చేసిపెట్టమని అడగండి. అలా చేసినందుకుగాను వారిని పొగడ్తలతో ముంచెత్తండి. ఖచ్చితంగా మీ పాచిక పారుతుంది. మీ కోసం అతను చురుకుగా కనిపించేందుకు తీరైన దేహం పొందడానికి కసరత్తులు చేస్తుండవచ్చు. అటువంటప్పుడు, అతని కండలను, దృఢమైన దేహాన్ని గురించి ప్రశంసించండి. అతనికి వినసొంపుగా ఉండే మెచ్చుకోలు మాటలతో, మిగిలిన మగవారితో పోలిస్తే, ఇతను ఉన్నతుడనే భావనను కలిగించండి. మీరు తప్పకుండా మీ ఛేదించాలనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు.

  మీరు ఎదో అవసరం ఉన్నదని నటిస్తూ ఆయన సహకారాన్ని కోరుకున్నట్లైతే, వారు ఖచ్చితంగా ఉబ్బితబ్బిబవుతారు. అతను మీకు అత్యవసరమైన తోడు అనే భావన కలిగి, అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారని సంతృప్తి చెందుతారు.కొంతకాలం మీ గర్వాన్ని చుట్టచుట్టి, అతని సహాయాన్ని అర్ధించండి. మీరు చేసుకోగలిగే పనులకు కూడా అతని సలహా తీసుకోండి.

  3. అతనితో నవ్వులు పంచుకోండి.

  3. అతనితో నవ్వులు పంచుకోండి.

  అతను వేసే జోకులకు చిరునవ్వులు చిందించండి. నిజాయితీగా మీరెంత వరకు నవ్వగలిగితే, అంతవరకే నవ్వండి. పురుషులు, మీరు వారినిని విడిచి ఉండలేరని, వారి హాస్యస్ఫూర్తి ని మీరు ఇష్టపడుతున్నారనే భావనను ప్రేమిస్తారు. చాలామంది ఆడవాళ్లు సరదాగా ఉండే మగవాళ్ళని కోరుకుంటారు కనుక, వారు వేసే జోకులకు నవ్వడానికంటే ఉత్తమమైన మార్గం ఇంకేముంటుంది? వారు ఎల్లప్పుడూ సరదాగా, నవ్వుతూ, తుళ్ళుతూ ఉండకపోవచ్చు, కానీ మిమ్మల్ని మెప్పించడానికి మీ ముందు అలా ప్రవర్తించవచ్చు. కనుక అటువంటి సందర్భాలలో వారి హాస్యచతురతను మీరు మనసారా ఆస్వాదిస్తున్నట్లు మసులుకుంటే, అతను మీ బుట్టలో పడిపోయినట్లే! ఇలా ఒకసారి చేసి ఫలితం ఎలా ఉంటుందో చూడండి. ఎక్కువ ఆలోచించకుండా, చిరునవ్వులు చిందిస్తూ అతనిని, మీ మాయలో పడేయండి!

  4. మీ అందాలను ఒకేసారి పంచుకోకండి

  4. మీ అందాలను ఒకేసారి పంచుకోకండి

  గుర్తుంచుకోండి! ఈ విషయంలో మీరు చాలా సున్నితంగా ప్రవర్తించాలి. మీలోని అందాలను కొద్ది కొద్దిగా ఆయన ముందు పెట్టండి, ఒకేసారిగా బయటపడకండి. మీలో ఉద్వేగాన్ని అదుపులో పెట్టుకోండి. మనసుపడ్డ మగాడిని మీ చుట్టూ ప్రదక్షిణలు చేసేట్టు చేయాలంటే, అన్నిటికంటా ప్రభావవంతమైన మార్గం ఓరగా మీ అందాలను ప్రదర్శించడమే! గుర్తుంచుకోండి, సున్నితత్వాన్ని మరువకూడదు. కాస్త కాస్తగా చూపిస్తూ అతన్ని అంగలార్చేలా చేయండి. ఒక్కసారే పెద్ద అడుగు వేయవద్దు. మగవారు ఏ పనైనా ఒక్క ఉదుటులోనే జరిగిపోవాలనుకుంటారు, కానీ వారి ముందు కొద్ది కొద్దిగా బయటపెడుతూ ఊరిస్తే తప్పేముంది? కాస్త గుట్టు పాటిస్తే, ఆసక్తి అధికమవుతుంది. వారు కోరినవన్ని కష్టపెట్టకుండా చేతికందిస్తే, మజా ఉండదు. అతను మీ కొరకు పరితపించేటట్టు చేస్తే, మీ విలువ పెరుగుతుంది. అన్ని విధాలుగా అతన్ని సంసిద్ధం చేసాక మాత్రమే అతని ముందు పూర్తిగా బయటపడండి. లేడీస్, ఈ నాలుగు సూత్రాలు మనసులో పెట్టుకుంటే ఎంతటి ప్రవరాఖ్యుడైనా కూడా మీ ముందు తలవొంచాల్సిందే! కొమ్ములు తిరిగినా మగాడినైనా ఈ సూత్రాలను పాటించి పడగొట్టేయండి! ఇంకెందుకు ఆలస్యం?

  English summary

  MAKE ANY GUY FALL FOR YOU: THINGS TO KNOW

  Guys like it all at once but what's wrong in hiding a bit and revealing it slowly, eh? It is beneficial to be a bit mysterious. If you will give him everything that he wants and desires, even without him having to work for it a little bit. Make him drool a little bit for you and keep your precious "you" to yourself until you feel he is ready totally.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more