For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఈ రూల్స్ ని తప్పక పాటించాలి

|

ప్రేమకు హద్దులు ఉండవు. ఇష్టం లేకుండా ఆకర్షణ ఏర్పడదు. ప్రేమను నిర్వచించడం కష్టం. ప్రేమను స్వయంగా ఫీల్ అవ్వాలి గాని వివరించి చెప్పలేము. అయితే, ప్రేమలో కూడా కొన్ని ఆటుపోట్లు తప్పవు. అటువంటి ఆటుపోట్లను అధిగమిస్తే ప్రేమలోని ఆనందాన్ని మరింత ఆస్వాదించగలుగుతారు. తద్వారా, మీ బంధం మరింత పదిలమవుతుంది.

ప్రేమలో పడటం రిలేషన్షిప్ లో ఉండటం రాకెట్ సైన్స్ కాదు. అయితే, ప్రేమను పదిలపరచుకోవటం మాత్రం కాస్త సహనంతో కూడిన అంశమన్న విషయాన్ని మీరు గమనించి తీరాలి.

ఈ రూల్స్ ను గుర్తుంచుకుని పాటిస్తే మీ రిలేషన్ షిప్ వర్థిల్లుతుంది. ఈ రిలేషన్ షిప్ రూల్స్ ను తెలుసుకోండి మరి.

1. సరిగ్గా ఎంచుకోండి:

1. సరిగ్గా ఎంచుకోండి:

సరైన భాగస్వామిని ఎంచుకోవడమనేది రిలేషన్ షిప్ ను పదిలంగా ఉంచేందుకు ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ విషయంలో బ్లండర్ చేయకూడదు. మీరు ఎంచుకున్న భాగస్వామి యొక్క గుణగణాలు మీకు తెలిసి ఉండాలి. వారి అభిరుచుల గురించి తెలుసుకోండి. మీరు ఎంచుకున్న వ్యక్తి తన చేతలలో మాటలలో నిజాయితీని ప్రదర్శిస్తున్నాడా లేదా గమనించండి.

2. భాగస్వామిని అర్థం చేసుకోవడం ముఖ్యం

2. భాగస్వామిని అర్థం చేసుకోవడం ముఖ్యం

మీ భాగస్వామి యొక్క ఇష్టాలు, అయిష్టాలు, వారికి ఏ అంశాలు ముఖ్యమైనవి ఏవి కావు అన్న విషయంలో స్పష్టమైన అవగాహన కలిగి ఉండండి. భాగస్వామికి సంబంధించిన ఈ విషయాలను తెలుసుకోకపోవటం వలన అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. వాటిని అరికట్టాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.

 3. మొదట్నుంచీ మీలాగే ఉండండి:

3. మొదట్నుంచీ మీలాగే ఉండండి:

చాలా మంది తమ ఇన్నర్ ఫీలింగ్స్ ను భాగస్వామి ముందు అణచివేస్తూ ఉంటారు. ఆలా చేయడం వలన భవిష్యత్తులో రిలేషన్ షిప్ దెబ్బతినే అవకాశం తలెత్తుతుంది. మీరు మీలా ఉంటే ఏ సమస్యా దరిచేరదు. మీ భాగస్వామి వద్ద స్వేచ్ఛగా మీ భావాలను వ్యక్తీకరించండి. లోపలొకటి పెట్టుకుని బయటకి ఒకలా ప్రవర్తిస్తే రిలేషన్ షిప్ లో ఇబ్బందులు తలెత్తవచ్చు

4. మీ భాగస్వామి ఆకాంక్షలను తెలుసుకోండి:

4. మీ భాగస్వామి ఆకాంక్షలను తెలుసుకోండి:

రిలేషన్ షిప్స్ ఫెయిల్ అవడానికి భాగస్వామి గురించి పూర్తిగా అవగాహన లేకపోవటం ప్రధాన కారణంగా నిలుస్తోంది. మీ పార్ట్నర్ కున్న ఆకాంక్షలను తెలుసుకోవాలి. మీరే విధంగా వారికి తోడ్పడగలరో తెలుసుకోవాలి. ఒకరి అభిరుచులను, అభిలాషలను, ఆకాంక్షలను ఒకరితో ఒకరు పంచుకుంటేనే రిలేషన్ షిప్ ను సంపూర్ణంగా ఆస్వాదించగలుగుతారు.

5. రెగ్యులర్ గా కమ్యూనికేట్ చేసుకోండి

5. రెగ్యులర్ గా కమ్యూనికేట్ చేసుకోండి

కమ్యూనికేటింగ్ అనేది రిలేషన్ షిప్ ని యాక్టివ్ గా ఉంచే ముఖ్య అంశం. ఇది రిలేషన్ షిప్ కు గట్టి పునాదిగా వ్యవహరిస్తుంది.

6. రిలేషన్ షిప్ పై మీ పార్ట్నర్ అభిప్రాయాన్ని తెలుసుకోండి

6. రిలేషన్ షిప్ పై మీ పార్ట్నర్ అభిప్రాయాన్ని తెలుసుకోండి

రిలేషన్ షిప్ పై ప్రతి ఒక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ఈ అంశంపై మీ పార్ట్నర్ అభిప్రాయం ఏమిటో తెలుసుకోండి. తద్వారా, రిలేషన్ షిప్ అనేది మీ భాగస్వామికి ఎంత ముఖ్యమో మీకు అర్థం అవుతుంది.

7. రెగ్యులర్ గా ప్రేమను పొందండి

7. రెగ్యులర్ గా ప్రేమను పొందండి

రిలేషన్ షిప్ ప్రారంభ దశలో ఒకరంటే ఒకరికి విపరీతంగా ఆకర్షణ కలిగి ఉంటుంది. రాను రాను వారికది కామన్ గా మారుతుంది. అయితే, ఇంటిమసీని తగ్గనివ్వకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటిమసీ అనేది ఒక జంట అన్యోన్యంగా ఉండేందుకు అవసరమైన అంశం. ఇది లేదంటే రిలేషన్ షిప్ కు అర్థమే లేదు. కాబట్టి, భాగస్వామిపై ప్రేమను కురిపిస్తూనే ఉండండి.

8. ఒకరినొకరు చులకనగా చేసుకోకండి

8. ఒకరినొకరు చులకనగా చేసుకోకండి

సాధారణంగా, ప్రేమలోనున్న జంటకి ఒకరంటే ఒకరికి విపరీతమైన ఇష్టం కలిగి ఉండటం సహజం. ఆ తరువాతి స్టేజ్ లలో ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని కోరుకుంటారు. ఈ విధంగా బేధాభిప్రాయాలు తలెత్తుతాయి. కాబట్టి, ఒకరంటే ఒకరికి అపారమైన గౌరవం కలిగి ఉండాలి.

9. ఇద్దరికీ ఇష్టమైనప్పుడే శృంగారంలో పాల్గొనండి:

9. ఇద్దరికీ ఇష్టమైనప్పుడే శృంగారంలో పాల్గొనండి:

మీ పార్ట్నర్ ని శృంగారానికి బలవంత పెట్టకండి. మీ ఇద్దరికీ నచ్చినప్పుడే శృంగారంలో పాల్గొనండి. శృంగారానికి ముందు హెల్తీ కాన్వర్సేషన్ జరగాలి. తద్వారా, ఇద్దరూ మంచి సమయాన్ని ఆస్వాదించగలుగుతారు.

10. కోపాన్ని చర్చలతో తగ్గించుకోండి

10. కోపాన్ని చర్చలతో తగ్గించుకోండి

మీ రిలేషన్ షిప్ పై మీ కోపం ఆధిపత్యాన్ని ప్రదర్శించకూడదు. ఇది మీ రిలేషన్ షిప్ ను సునామీలా తుడిచిపెట్టేస్తుంది. వాదనలు, గొడవలతో రిలేషన్ షిప్ ఏ విధంగా దెబ్బతింటుందో ఊహించుకోవడం కూడా కష్టమే. కాబట్టి, ఎంతటి సమస్యనైనా చర్చలతో తీర్చుకోవాలి. ఈ జాగ్రత్తను పాటిస్తే మీ రిలేషన్ షిప్ అనేది పదిలంగా నిలుస్తుంది.

11. నిజాయితీగా ఉండండి

11. నిజాయితీగా ఉండండి

మీ భాగస్వామి పట్ల నిజాయితీగా ఉండండి. మాటలలో, చేతలలో, నిర్ణయాలలో అలాగే ప్రేమలో నిజాయితీని పంచండి.

12. తప్పులను ఒప్పుకుని క్షమాపణను కోరండి

12. తప్పులను ఒప్పుకుని క్షమాపణను కోరండి

మీ తప్పుంటే ఒప్పుకుని క్షమాపణను కోరండి. తప్పు మీదైనా ఎదుటివారే క్షమాపణ చెప్పి తీరాలనడం మూర్ఖత్వం. రిలేషన్ షిప్ దెబ్బతినకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తను పాటించడం తప్పనిసరి.

క్షమించాలని నోటి ద్వారానే అడగక్కర్లేదు. చిన్న నోట్ రాసినా, లేదంటే మీ అభిప్రాయాలను చెబుతూ లెటర్ అయినా పర్లేదు.

English summary

Rules You Need To Know Of When You Are In A Relationship

Rules You Need To Know Of When You Are In A Relationship,Rules you need to know of when you are in a relationship to enhance your love life and have a healthy and positive relationship
Desktop Bottom Promotion