For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  రాణి పద్మావతితో ఖిల్జీ గడిపాడా? ఆమెను రత్నసేనుడు అనుభవించాడా?

  By Bharath
  |

  ఇప్పుడు దేశంలో చాలా ప్రాంతాల్లో పద్మావతి.. పద్మావత్ ఒక హాట్ టాపిక్ అయ్యింది. మన తెలుగు రాష్ట్రాల్లో దీని గురించి అంతటా చర్చ నడవడం లేదుగానీ చాలా రాష్ట్రాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్.

  రాజస్థాన్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌లలో ఇదొక పెద్ద రాజకీయ వివాదంగా మారింది. ఇంతకీ పద్మావతి ఎవరు? ఆమె అసలు చరిత్ర ఏమిటో ఒకసారి తెలుసుకుందామా.

  పద్మావత్‌ పేరుతో..

  పద్మావత్‌ పేరుతో..

  చిత్తోర్‌గఢ్‌ రాణి పద్మావతి చరిత్రకు సంబంధించి జానపదులు పాడుకొనే పాటలు, మాలిక్‌ మొహమ్మద్‌ జయాసీ అనే సూఫీ కవి 1530లో రాసిన కవిత మాత్రమే ఆధారాలుగా ఉన్నాయి. పద్మావత్‌ పేరుతో అవధీ భాషలో రాశాడాయన. ఇప్పటికీ అవధీలో పద్మావత్‌ అనే మాండలికం ఉంది. అందులో చాలామంది మాట్లాడతారు కూడా. అల్లావుద్దీన్‌ ఖిల్జీ మరణించిన 224 ఏళ్ళకు జయాసీ ఆ కవితను రాశాడు. గానం చేశాడు.

  అపురూప అందగత్తె

  అపురూప అందగత్తె

  పద్మావతి అపురూప అందగత్తె. సింహళదేశ రాజకుమారి. చిత్తోర్‌గఢ్‌ రాజు రత్నసేనుణ్ణి వివాహం చేసుకుంటుంది. ఆమె అందచందాల గురించి తెలిసిన అల్లావుద్దీన్‌ ఖిల్జీ ఆమెను దక్కించుకోవడానికి చిత్తోర్‌గఢ్‌పైకి దండెత్తుతాడు. ఆమె అతనికి దక్కదు. ఓ యుద్ధం లో భర్త మరణించడంతో సతీ సహగమనం చేస్తుంది. అయితే ఇది అంతా కల్పితమనీ కొందరు ప్రజలు వాదిస్తున్నారు.

  రోజంతా హీరామన్‌ తో గడిపేది

  రోజంతా హీరామన్‌ తో గడిపేది

  జయాసీ రాసిన కథ ప్రకారం పద్మావతి మరోరకంగా ఉంది.

  పద్మావతిని రాణి పద్మిని అని ముద్దుగా పిలిచేవారు. ఆమెకు చాలా మంది నెచ్చెలులతో పాటు హీరామన్‌ అనే పలుకు నేర్చిన రామచిలుక కూడా ఉండేది. రోజంతా కూతురు చిలుకతో గడపడం చూసి సింహళ రాజు గంధర్వసేనుడికి చిరాకెత్తేది.

  హీరామన్‌ ను చంపేయాలనుకుంటాడు

  హీరామన్‌ ను చంపేయాలనుకుంటాడు

  చిలుకను చంపించాలనుకుంటాడు. విషయం తెలిసిన పద్మావతి ఆ చిలుకను స్వేచ్ఛగా ఎగరేసేస్తుంది. దాన్ని పిట్టలమ్ముకునే ఓ వ్యక్తి పట్టుకొని చిత్తోర్‌గఢ్‌ రాజు రత్నసేనుడికి ఇస్తాడు. ఆ చిలుకకు మాటలు వచ్చు కాబట్టి పద్మావతి అందం గురించి ఆ చిలుక రత్నసేనుడికి వివరిస్తుంది. దాంతో రత్నసేనుడు ఎలాగైనా పద్మావతిని తన దాన్ని చేసుకోవాలనుకుంటాడు.

  అజ్ఞాతవాసిలా

  అజ్ఞాతవాసిలా

  రత్నసేనుడు అజ్ఞాతంగా ఆమెను కలవాలనుకుంటాడు. ఒక భక్తుడి వేషంలో సింహళ దేశానికి పయనమవుతాడు. ఆయన వెంట 16 వేల మంది సైన్యం ఉంటుంది. శివభక్తుడైన రత్నసేనుడు- అక్కడి శివాలయంలో పూజలు చేస్తున్న సమయంలో పద్మావతి వచ్చి వెళుతుంది. ఆమెను చూడలేక పోయాననే బాధతో చనిపోవాలనుకుంటాడు. కానీ శివపార్వతులు ప్రత్యక్షమై, కోటకు వెళ్ళి యువరాణిని కలవమని చెబుతారు.

  ఉరి తీయాలనుకుంటారు

  ఉరి తీయాలనుకుంటారు

  భక్తుడి వేషంలోనే కోటకు వెళ్ళినపుడు సింహళరాజు అతనిని బంధించి ఉరి తీయాలని ఆజ్ఞాపిస్తాడు. రత్నసేనుడి వెంట వచ్చినవారు ఆయన అసలు రూపం ఏంటో చెప్పడంతో సంతోషపడి తన కూతుర్నిచ్చి వివాహం చేస్తాడు. అతనికి 16 వేల మంది పద్మినీ జాతి స్త్రీలను కూడా ఇస్తాడు.

  ఏకాంతంగా ఉన్నప్పుడు

  ఏకాంతంగా ఉన్నప్పుడు

  వారంతా పద్మావతి వెంట చిత్తోర్‌గఢ్‌ వెళతారు. తిరుగు ప్రయాణంలో సముద్ర తుఫానులో ఇరుక్కుంటారు. శివుడి దయతో బయటపడతారు. తరువాత పద్మావతితో కలిసి చిత్తోర్‌గఢ్‌ చేరతాడు. అప్పటికే అతనికి నాగమతి అనే భార్య ఉంటుంది. ఒకనాడు ఏకాంత సమయంలో పద్మావతితో ఉన్నపుడు.. ఆమె బంటు రాఘవ చేతనుడనే బ్రాహ్మణుడు అకస్మాత్తుగా లోపలికి వచ్చేస్తాడు.

  ఖిల్జీ అలా తెలుసుకుంటాడు

  ఖిల్జీ అలా తెలుసుకుంటాడు

  ఆగ్రహించిన రత్నసేనుడు అతనికి దేశ బహిష్కారం విధిస్తాడు. దేశం విడిచివెళ్లిపోయే ముందు అతనికి పద్మావతి ఓ అపురూపమైన గాజుల జత ఇస్తుంది. చిత్తోర్‌గఢ్‌ విడిచి ఢిల్లీ వెళ్లిపోయిన రాఘవ చేతనుడు అక్కడ ఢిల్లీ సుల్తాన్‌ అల్లావుద్దీన్‌ ఖిల్జీని కలుస్తాడు. ఆ గాజుల జత గురించి ఖిల్జీ అడిగినపుడు పద్మావతి గురించి, ఆమె సౌందర్యం గురించి రమణీయంగా చెబుతాడు.

  ఖిల్జీ ఆమెను సొంతం చేసుకోవాలనుకుంటాడు

  ఖిల్జీ ఆమెను సొంతం చేసుకోవాలనుకుంటాడు

  ఖిల్జీ ఆమెను సొంతం చేసుకోడానికి ఛిత్తోర్‌గఢ్‌పై దాడికి వెళతాడు. యుద్ధంలో గెలవలేకపోతాడు. చివరకు సంధికి అంగీకారం కుదురుతుంది. ఖిల్జీని కోటలోకి ఆహ్వానిస్తాడు రత్నసేనుడు. అక్కడ ఖిల్జీ లీలామాత్రంగా పద్మావతిని దర్శిస్తాడు తప్పితే ఆమె దక్కదు. సంధికి ఒప్పుకున్నట్లే నటించి ఖిల్జీ రత్నసేనుణ్ణి బంధించి ఢిల్లీ తీసికెళ్ళిపోతాడు.

  రాజు లేని రాజ్యమని తెలుసుకుని..

  రాజు లేని రాజ్యమని తెలుసుకుని..

  భర్తను విడిపించమని ఇద్దరు సైన్యాధికారులను ఢిల్లీకి పంపుతుంది పద్మావతి. విడిపించే క్రమంలో ఒకరు సుల్తాన్‌ సైనికులతో పోరాడి చనిపోగా, మరొకరు రాజును క్షేమంగా తీసుకొస్తారు. రాజు లేని రాజ్యమని తెలుసుకున్న పొరుగు రాజు దేవపాలుడు అప్పటికే పద్మావతిని దక్కించుకోడానికి సైన్యంతో వస్తాడు. రత్నసేనుడు దేవపాలుడితో తలపడతాడు. యుద్ధంలో వీరిద్దరూ మరణిస్తారు. వార్త విన్న పద్మావతి సతీ సహగమనం చేస్తుంది. రత్నసేనుడి తొలిభార్య నాగమతి కూడా చితిలో దూకి మరణిస్తుంది.

  ఖిల్జీ మరోసారి

  ఖిల్జీ మరోసారి

  కొన్నాళ్ళ తరువాత ఖిల్జీ మరోసారి చిత్తోర్‌గఢ్‌పై దండెత్తుతాడు. అతనికి లొంగక అక్కడి రాణివాసులంతాసామూహికంగా ఆత్మాహుతికి పాల్పడతారు. ఇప్పటికీ వారు చితిపేర్చి మరణించిన స్థలం- జౌహార్‌ కుండ్‌ -చిత్తోర్‌గఢ్‌ సమీపంలో ఉంది. దర్శనీయ స్థలాల్లో అదీ ఒకటి. చిత్తోర్‌గఢ్‌ రాణీ దక్కలేదు. అక్కడి ప్రజలూ ఇస్లాంలోకి మారలేదు. రాళ్ళూ ఇటుకలతో చేసిన కోటను మాత్రం ఖిల్జీ ఇస్లాంలోకి మార్చగలిగాడన్న చిన్న సెటైర్‌తో తన గేయాన్ని ముగిస్తాడు జయాసీ.

  మరో కథ

  మరో కథ

  పద్మావతి గురించి ప్రచారంలో ఉన్న రెండో కథ కూడా జయాసీ రాసినదే. రాజ్‌పుట్‌ లు ఎక్కువగా నమ్మే కథ ఇది.. దాని ప్రకారం- రాణి పద్మావతి సింహళదేశ రాజకుమార్తె. కత్తియుద్ధంలో ఆమెకు ఎవరూ సాటిలేరు.. తాను చెప్పిన వ్యక్తిని కత్తియుద్ధంలో ఓడించే వీరుణ్ణే పెళ్లాడతానంటూ ప్రకటిస్తుంది. అయితే పద్మావతి సూచించిన ఆ వ్యక్తి వేరెవ్వరో కాదు.. ఆమే.. చాలా మంది రాజులు ఆమె చేతిలో ఓడిపోతారు.

  రత్నసేనుడుదే పద్మావతి

  రత్నసేనుడుదే పద్మావతి

  చివరకు రాజ్‌పుట్‌ రాజైన చిత్తోర్‌గఢ్‌ రాజు రత్నసేనుడు గెలుస్తాడు.. అతనిని వరిస్తుంది పద్మావతి. ఇక ఆమెకు బంటు అయిన రాఘవ చేతనుడు. భూతప్రేత పిశాచాలను ఆవాహన చేసే మాంత్రికుడు.. అతనిని రత్నసేనుడు దేశం నుంచి వెలివేయడంతో ఖిల్జీ దగ్గరకు చేరి పద్మావతి గురించి కీర్తిస్తాడు.. అది విన్న ఖిల్జీ ఆమె కోసం దండెత్తినపుడు.. రత్నసేనుడు ఆ యుద్ధంలోనే మరణిస్తాడు... అది విని పద్మావతి- ఖిల్జీకి దక్కకుండా రహస్య మార్గంలో జౌహార్‌ కుండ్‌ చేరి చితిలో దూకి మరణిస్తుంది..

  ఇంకో కథ

  ఇంకో కథ

  ఈస్టిండియా కంపెనీలో పనిచేసిన జేమ్స్‌ టాడ్‌ అనే అధికారి రాజ్‌పుట్‌ చరిత్రను పరిశోధించి ఒక కథ ప్రచురించాడు.. ఇది జయాసీ కథ కు కొద్దిగా భిన్నంగా ఉంటుంది. పద్మావతి సింహళ దేశ ప్రభువైన హమీర్‌ శంక్‌ కుమార్తె.. ఆ సమయంలో చిత్తోర్‌గఢ్‌ను పాలించిన రాజు లక్ష్మణ్‌సింగ్‌. ఇతని బంధువైన భీమ్‌సింగ్‌ (భీమ్‌సీ) ను పెళ్ళి చేసుకుంటుంది. ఆమె అందం గురించి విన్న అల్లావుద్దీన్‌ ఖిల్జీ దండెత్తుతాడు. పద్మావతి దక్కకపోవడంతో.. సంధికొచ్చితానుకేవలం పద్మావతి అందం చూసి వెళ్ళిపోతానంటాడు.

  ఇలా చేశారు

  ఇలా చేశారు

  అయితే ఓ అద్దంలో ఆమె ప్రతిబింబం మాత్రమేఅతనికి కనబడుతుంది.దాంతో భీమ్‌సీని బంధించి.. పద్మావతిని తనకిస్తేనే అతనిని విడుదల చేస్తానంటాడు. దాంతో పద్మావతి సింహళీయులనైన తన బంధువుల సాయం కోరుతుంది. ఆమె మేనమామలు- గోరా, బాదల్‌- ఓ వ్యూహంతో భీమ్‌సీని విడిపిస్తారు. వీరులైన కొందరు రాజ్‌పుత్‌ సైనికులను చెత్తబుట్టల్లో దాచి- వాటిని మోసే వారిగా మరో కొంత మంది వీరులను రహస్యంగా పంపి ఖిల్జీని ఎదిరిస్తారు. చిన్నవాడైన తన కొడుకును సురక్షితంగా వేరే ప్రదేశానికి పంపి, ఖిల్జీతో పోరాడుతూ భీమ్‌సీ మరణిస్తాడు. పద్మావతి జౌహార్‌ కుండ్‌లో సహగమనం చేస్తుంది..

  మరో కథ ఏంటంటే..

  మరో కథ ఏంటంటే..

  రత్నసేనుడికి ప్రభావతి అనే భార్య ఉంటుంది. ఆమె బాగా వంట చేయగలదు. ఓ రోజు రాజు ఆమెను విసుక్కుంటాడు. దాంతో ఆమె- నా కంటే బాగా ఎవరైనా వంటచేయగలరా, అసలు నా కన్నా ఎవరైనా అందంగా ఉంటారా అని రాజును నిలేస్తుంది.. దాంతో రత్నసేనుడు కొందరి ద్వారా పద్మిని గురించి విని సింహళదేశానికి వెళ్ళడం, ఆమెను పెళ్లాడడం జరుగుతుంది. అయితే ఇది గొప్ప రచనగా చెప్పగలం గానీ అది వాస్తవిక గాథ కాదనీ చాలామంది చరిత్రకారులు అంటున్నారు.

  అసలు పద్మావతి ఉందా?

  అసలు పద్మావతి ఉందా?

  జాయసీ కథ నిజమా కాదా అన్న విషయంలో అనేక వాదనలున్నాయి. చాలామంది చరిత్రకారులు, ప్రొఫెసర్లు దీన్ని కొట్టిపడేస్తున్నారు. చరిత్ర ప్రకారం ఖిల్జీ చితోడ్‌గఢ్‌పై దండెత్తి రతన్‌ సేన్‌ను 1303లో ఓడించాడు. 1316లో చనిపోయాడు. ఆ కాలంలో పద్మావతి పేరుతో రాణి ఎవరూ లేరన్నది వారి వాదన. అల్లావుద్దీన్‌ మరణించిన 224 ఏళ్ల తర్వాత జాయసీ కవితలో పద్మావతి గురించి రాశాడు.

  English summary

  the fascinating legend of alauddin khilji his obsession with rani padmavati

  the fascinating legend of alauddin khilji his obsession with rani padmavati
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more