డేటింగ్ ఆలోచన వస్తే ఈ భారతీయ పురుషులు మదిలో మెదులుతారు

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

డేటింగ్ ఆలోచన వస్తే ఈ భారతీయ పురుషులు మదిలో మెదులుతారు

అమ్మాయిలూ ఊపిరి గట్టిగా బిగబట్టుకుని చూడండి... కింద చెప్పిన వారిలో మీరు అభిమానించేవారు కూడా ఉన్నారేమో ..!

టైమ్స్ మాగజైన్ ప్రకారం “ది మోస్ట్ డిసైరబుల్ మెన్ ఆఫ్ 2017” లో మహిళలు అత్యధికంగా అభిమానించే పురుషుల జాబితాలో ఉన్న భారతీయ పురుషులు వీరే.

Unbearably Attractive Indian Men Every Girl Would Wish to Date ,

ప్రతి సంవత్సరం, టైమ్స్ మాగజైన్ మహిళలను మంత్రముగ్దులను కానీ లేదా వారి కనుసైగతో చెంతకు అమ్మాయిలను చేర్చుకోగలిగే పురుషుల జాబితాను పంచుకుంటుంది. ఈ అద్బుతమైన పురుషుల జాబితాలో భారత దేశం నుండి ఎంపిక అయిన వారు ఎవరో తెలుసుకోవాలని ఉందా ? అయితే ఈ వ్యాసం మీకోసమే.

తమను తాము ప్రదర్శించుకునే విధానం వ్యక్తిత్వం మీద మాత్రమే ఈ విజయం ఉంటుంది అనుకుంటున్నారా? కాదండీ బాబు. కంప్లీట్ పాకేజ్ లా కనిపించే వ్యక్తులు వీరు. ఎంచుకోబడిన అన్ని అంశాలలో ఉన్నతంగా ఉన్నవారినే ఈ టైమ్స్ ఎంపిక చేస్తుంది కూడా. మరి ఎవరు వారు ? మీకోపానికి గురికాకముందే ఆలస్యం చేయకుండా వారెవరో చూసేద్దాం.

రన్వీర్ సింగ్

రన్వీర్ సింగ్

రన్వీర్ 2015 లో ఇదే జాబితాలో అగ్ర స్థానంలో నిలిచాడు. టైమ్స్ అంటే అభిమానమేమో కానీ, వదల్లేకున్నాడు. మళ్ళీ 2017 లో చోటు దక్కించుకున్నాడు. ప్రత్యేకమైన తనకంటూ గుర్తింపు తెచ్చే శైలిని కలిగి, ఎల్లప్పుడూ పెదాలపై నవ్వును కనిపించేలా చేసే ఈ బాజీరావ్ భాయ్, ఆ మందహాసంతోనే అమ్మాయిల గుండెలను కొల్లగొడుతున్నాడు అని వేరే చెప్పనవసరం లేదు. తద్వారా ఈ టైటిల్ కు అన్ని అర్హతలు కలవానిగా ఉన్నాడు అనడంలో ఆశ్చర్యమే లేదు.

ప్రభాస్ :

ప్రభాస్ :

క్రమశిక్షణకు, పట్టుదలకు మారుపేరుగా ఉన్న ప్రభాస్ తన ప్రతి సినిమాలోనూ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ బాహుబలితో విశ్వం తలెత్తి చూసే తారగా మెరిసిన ప్రభాస్, అమ్మాయిల కలల రాకుమారుడే మరి.

విరాట్ కోహ్లి :

విరాట్ కోహ్లి :

విద్వంసకర బాటింగ్ తో, కెప్టెన్ గా అత్యత్తమ ప్రదర్శనను టీంకు అందిస్తున్న విరాట్ కోహ్లికీ క్రికెట్ అంటే ఎంత ప్రాణమో , అనుష్కా శర్మ అంటే కూడా అంతే అభిమానం. అనుష్కాశర్మ తన జీవితంలో అడుగు పెట్టినా కూడా మహిళా అభిమానుల సంఖ్యను మాత్రం తగ్గించలేకపోయింది.

హ్రితిక్ రోషన్ :

హ్రితిక్ రోషన్ :

అప్పటి కల్హోనా హో నుండి మొన్నటి కాబిల్ వరకు ప్రతి చిత్రంలోనూ వైవిధ్యాన్ని ప్రదర్శించే హ్రితిక్ కు దేశమంతా అభిమానులే అనడంలో ఆశ్చర్యమే లేదు. డాన్స్, ఫైట్స్, ఫిజిక్, నటన ఎందులో ప్రవేశం లేదో ఎవ్వరికీ అర్ధం కాదు. ఒక మల్టీ టాలెంట్ నటుడిగా బాలీవుడ్ లో చెరగని ముద్ర వేసుకున్న హ్రితిక్ తో ఒక్క ఫోటో అయినా దిగాలని ఏ అమ్మాయి కోరుకోదు చెప్పండి.

సిద్దార్ధ మల్హోత్రా :

సిద్దార్ధ మల్హోత్రా :

తన తొలి చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ లో అభిమన్యుగా తన కెరీర్ ప్రారంభించిన సిద్దార్థ్ అప్పట్లో ఒక సంచలనమే. అతని చూపు, శరీర సౌష్టవం, తన మార్గాన్ని తను మార్చుకున్న విధానం బాలీవుడ్ స్టన్నర్ గా నిలబెట్టింది అనడంలో ఆశ్చర్యం లేదు.

మహేష్ బాబు :

మహేష్ బాబు :

మహేష్ బాబు లేని లిస్టు అంటే, అది ఖచ్చితంగా ఫేక్ నివేదికే మరి. టాలీవుడ్ ప్రిన్స్ గా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న యువరాజు మహేష్. ఎటువంటి కాంట్రవర్సీల జోలికి వెళ్ళకుండా అందమైన నవ్వుతో సమాధానం చెప్పే ఫామిలీ మాన్ మహేష్ బాబుకు దాసోహం అన్ని అమ్మాయి ఉంటుందా.

రాణా దగ్గుబాటి :

రాణా దగ్గుబాటి :

రాణా ఎలాంటి నటుడో ఒకరికి చెప్పనవసరం లేదు. భల్లాలదేవునిగా బాహుబలిలో , లెఫ్ట్నెంట్ కమాండర్ గా ఘాజీ లో చూపిన నటనకు యావత్ దేశం నిశ్చేష్టులై కుర్చీలకు అతుక్కుపోయి మరీ చూశారు అనడంలో అతిశయోక్తి లేదు. అతని వ్యక్తిత్వం, దేహ ధారుడ్యం అమ్మాయిల చూపుల బాణాలతో విలవిల్లాడుతుంది.

జితేష్ సింగ్ రావ్ :

జితేష్ సింగ్ రావ్ :

లక్నోకు చెందిన జితేష్ , పీటర్ ఇంగ్లాండ్ చేత మిస్టర్ ఇండియా వరల్డ్ 2017 టైటిల్తో కూడా గౌరవించబడ్డాడు. అతను ఒక ఇంజనీరింగ్ పట్టాతో, ఒక జిల్లా స్థాయి ఫుట్బాల్ ఆటగాడిగా , స్విమ్మర్ గా పూర్తి ప్యాకేజీ గా ఉన్నాడనే చెప్పవచ్చు. ఒక అమ్మాయి ఇంతకన్నా ఏమి ఎక్స్పెక్ట్ చేయగలదు చెప్పండి?

దుల్కర్ సల్మాన్ :

దుల్కర్ సల్మాన్ :

దక్షిణ భారత దేశంలో పేరెన్నిక కలిగిన స్టార్లలో దుల్కర్ సల్మాన్ ఒకరు. మలయాళం టాప్ స్టార్లలో ఒకరైన దుల్కర్ సల్మాన్ బెంగుళూరు డేస్ సినిమాలోని నటనతో దేశం మొత్తం అమ్మాయిల అభిమానాన్ని చూరగొన్నాడు. త్వరలో మహానటి సినిమాలో జెమిని గణేషన్ పాత్రను పోషిస్తున్న దుల్కర్ నిజానికి కుటుంబాన్ని అమితంగా ప్రేమించే వ్యక్తుల్లో ఒకరుగా ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఎల్లప్పుడూ తన భార్య , కూతురు ఫోటోలు షేర్ చేస్తూ ఒక ఫామిలీ మాన్ గా అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నాడు. అందమైన నవ్వుతో, యువతకు ఇన్స్పిరేషన్ ఇచ్చే స్టైల్ లో ఎప్పుడూ చలాకీగా ఉండే దుల్కర్ సల్మాన్ కు సాహో అన్ని అమ్మాయి ఉంటుందా.

ప్రధమేష్ మౌలింగ్కర్ :

ప్రధమేష్ మౌలింగ్కర్ :

ఇతను మిస్టర్ ఇండియా సుప్రనేషనల్ 2018 అనే బిరుదును కూడా పొందాడు. గోవా నుండి వచ్చిన ఈ మోడల్ మరియు పారిశ్రామికవేత్త అయిన ప్రధమేష్ కు ఇంకా పెళ్లి కాలేదు. కాబట్టి అమ్మాయిల చూపులు ఇతని వెంట తిరగడం ఖాయం. ఒక ఫుట్ బాల్ ఆటగాడి నుండి ఫిట్నెస్ మోడల్ గా మారిన ప్రధమేష్ చురుకైన చూపులు అతన్ని అమ్మాయిల కలల హీరోని చేస్తున్నాయి.

English summary

Unbearably Attractive Indian Men Every Girl Would Wish to Date

Unbearably Attractive Indian Men Every Girl Would Wish to Date ,