నిజమైన ప్రేమలో దూరం ఎప్పుడుకాని 'ఘర్షణ ' కు దారి తీయదు ఎందుకో మీరే చూడండి!

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

నిజమైన ప్రేమ మార్గంలో దూరం అనేది ఎప్పుడు గాని మధ్యలో రాదు, అడ్డంకిగా మారదు. ఈ విషయమే ఎన్నోసార్లు పలు సందర్భాల్లో చాలా ఆంగ్ల నవలలు మరియు బాలీవుడ్ సినిమాల్లో చూపించడం జరిగింది. అయితే చాలామంది ప్రజలు ఈరోజుల్లో ఉన్న ప్రేమ కథలన్నీ కూడా కేవలం ఆకర్షణ మరియు బాహ్యసౌందర్యం పై మాత్రమే ఆధారపడి ఉన్నాయని భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రేమలు ఎక్కువకాలం నిలవవు అని కూడా భావిస్తున్నారు. కానీ, ఈ అనుమానం నిజానికి చాలా దూరంగా ఉందని గమనించాలి.

అసలు నిజం ఏమిటంటే, ఇంకా నిజాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాలంటే, పాతకాలంలో ప్రేమలు ఎంత స్వచ్ఛంగా మరియు పరిపూర్ణంగా ఉండేవో ఈ కాలంలో ప్రేమలు కూడా అంతే కల్మషం లేకుండా ఉన్నాయి. ప్రేమికులు మాట్లాడుకొనే తీరులో మరియు వ్యవహరించే తీరులో మార్పు వచ్చి ఉండొచ్చేమో గాని ప్రేమలో ఉన్న సారాంశం, మాధుర్యం మాత్రం అలానే ఉంది.

దూరప్రాంతపు సంబంధ బాంధవ్యాలు :

దూరప్రాంతపు సంబంధ బాంధవ్యాలు :

మరొక గుర్తించవలసిన విషయం ఏమిటంటే, ఇవాళ్టి కాలంలో చాలామంది ప్రజలు సంకుచిత భావాల సంకెళ్లను తెంచుకొని హుందాగా ప్రవర్తిస్తున్నారు. కులం మరియు జాతి ఇలా అన్నింటిని పక్కన పెట్టి మరీ ప్రేమిస్తున్నారు. నిజం చెప్పాలంటే, ప్రేమ ఎన్నో కొత్త దారులను కనిపెడుతోంది మరియు సామాజికంగా సమాజం అభివృద్ధి జరిగేలా చేస్తుంది ఈ తరం ప్రేమ.

ప్రతి నిమిషం విమాన ప్రయాణ రేట్లు పడిపోతూ ఉన్నాయి మరియు దీనికి తోడు వీటిని భరించ కలిగే స్థోమత, ఆర్ధిక వనరులు మరియు మార్గాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇవి నిజమే ఎందుకంటే, కొన్ని సందర్భాల్లో డబ్బుని తల్లిదండ్రులకు కనపడకుండా దాచిపెట్టవలసి రావొచ్చు.

దీనికి తోడు ఇద్దరి వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు నిజమే అయితే దూరం అనేది ఒక సంఖ్యగా మాత్రమే కనిపిస్తుంది మరియు ప్రతి మైలు మీ మోములో చిరునవ్వుని తీసుకువస్తుంది. సిమ్రాన్ మరియు వివాన్ లకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన ప్రేమ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

' అతడి ' భాగం :

' అతడి ' భాగం :

వివాన్ ఎక్కువగా ఉత్సాహంగా ఆటలను ఆడేవాడు. ఎవరు ఏ ఆట చెప్పినా, ఆ ఆటను ముందే ఆడి ఉంటాడు. టౌన్ హాల్ లో లెవెల్ 8 ఆటగాడిగా ఘనతని సాధించాడు. ఇతనిని ఈమధ్యనే ఒక కొత్త వీడియో గేమ్ గ్రూప్ లో చేర్చారు. ఇతను ఒక యుక్త వయస్సులో ఉన్న కుర్రాడు. ఇతడు అస్సాం రాష్ట్రానికి చెందిన బాలుడు. కానీ, ఇతనిని కన్నడ కి సంబంధించిన వీడియో గేమ్ గ్రూప్ లో వేశారు. ఇది తెలిసి అతడు అస్సలు ఆశ్చర్యపోలేదు. ఎందుచేతనంటే, అతడికి ఆటను ఆడటం మాత్రమే తెలుసు. అతడు తన జీవితమే ఆటగా భావించాడు. కాబట్టి ఎందులో ఉన్న పర్వాలేదు అనుకున్నాడు.

మనిషికి దూరంగా ఉన్నా.. మనసుకి దగ్గరయ్యే మార్గాలు

' ఆమె ' భాగం :

' ఆమె ' భాగం :

స్వతహాగా కన్నడిగ అయిన సిమ్రాన్ గుజరాత్ లో పెరిగింది. ఈమె ఆటలను అస్సలు ఆడేది కాదు. కానీ, ఒక వీడియో గేమ్ వల్ల తలెత్తిన ఘర్షణ కారణంగా ఈమెను ఈమె స్నేహితులు 'కస్తూరి కన్నడ' అనే గ్రూప్ లో చేర్చారు. సిమ్రాన్ ఆటకు కొత్త అయినప్పటికీ ఎంతో త్వరగా నేర్చుకోవడం ప్రారంభించింది.

' కేవలం ఒక ఆట ' కంటే ప్రేమ ఎక్కువైనప్పుడు :

' కేవలం ఒక ఆట ' కంటే ప్రేమ ఎక్కువైనప్పుడు :

ఒకానొక సమయంలో ఆన్ లైన్ లో వీడియో గేమ్ ఆడటం కోసమై విపరీతంగా తయారవుతున్న సమయంలో వివాన్, సిమ్రాన్ కు లెవెల్ 2 బేస్ పై ఎలా దాడి చేయాలి అనే విషయమై పాఠాలు చెప్పేవాడు. 'కస్తూరి కన్నడ' గ్రూప్ కంటే కూడా పెద్దదైన ఒక గ్రూపుకు చెందిన వ్యక్తి లెవెల్ 2 ఆట గురించి గ్రూప్ లో మాట్లాడటం సమయం వృథాగా భావించారు. అందుచేత వీరిద్దరూ గ్రూప్ లో సంబాషించుకోవడం ఆపివేయాలని మిగతా గ్రూప్ సభ్యులు భావించారు. ఆ తర్వాత వివాన్, సిమ్రాన్ నెంబర్ తీసుకున్నాడు. ఇలా జీవితకాల సంబంధ బాంధవ్యానికి బీజం పడింది.

నెంబర్ లు మార్చుకోవడం తో మొదలైన ప్రయాణం మనస్సులు మార్చుకోవడం వరకు వెళ్ళింది :

నెంబర్ లు మార్చుకోవడం తో మొదలైన ప్రయాణం మనస్సులు మార్చుకోవడం వరకు వెళ్ళింది :

మొదట వృత్తిపరంగా సాగిన మాటలు, కాస్త మెల్లగా సమయం గడిచే కొద్దీ వ్యక్తిగత ఇష్ట ఇష్టాలు వరకువెళ్లింది. కొన్ని సందర్భాల్లో వీళ్ళ మాటలకు ప్రేమ కూడా తోడైంది. ఇలా కొనసాగుతున్న క్రమంలో నెలలోపే, తాను తన జీవితంలో తనకు కావాల్సిన ప్రేమని గుర్తించానని భావించింది సిమ్రాన్.

మొదట్లో సంశయించినా కూడా :

మొదట్లో సంశయించినా కూడా :

తన పట్ల వివాన్ భావాలు ఎలా ఉన్నాయి అనే విషయం సిమ్రాన్ కి ముందే తెలిసినా కూడా, మొదట్లో ఇవన్నీ కేవలం ఆకర్షణ మాత్రమే అని భావించి పక్కన పెట్టేసింది. అసలు ఇప్పటివరకు కలవని వ్యక్తితో ఎలా ప్రేమలో పడగలం అని అలోచించి వెనక్కు తగ్గింది. అంతేకాకుండా అసలు వివాన్ తనని ఇష్టపడుతున్నాడా లేదా అనే విషయం తెలియకుండా ఎలా ముందుకు వెళ్లాలని ఆలోచించింది.

మనవాళ్ళు దూరంలో ఉన్నప్పుడు సంబంధం మరింత బలంగా ఉండాలంటే

ప్రేమను ఎంత గొప్పగా చెప్పారంటే :

ప్రేమను ఎంత గొప్పగా చెప్పారంటే :

గుజరాత్ లో పెరిగిన ఈ అమ్మాయికి మన్మధుడు విసిరిన ప్రేమ బాణం అప్పుడే గుచ్చుకుంది. రోజులు గడిచేకొద్దీ వీరిద్దరి మధ్య సంభాషణలు పెరగసాగాయి. వివాన్ కూడా సిమ్రాన్ ని ప్రేమించడం మొదలు పెట్టాడు. రెండు నెలల తర్వాత ధైర్యానంతా కూడగట్టుకొని వీడియో కాల్ చేసి ఆమెను అడిగేద్దాం అనుకున్నాడు. ఆ వీడియో కాల్ చేయడానికి ముందే తన చుట్టూ పరిసరాలు, పరిస్థితితులు ఎలా ఉండాలి అనే విషయమై ఖచ్చితత్వంతో ఉన్నాడు వివాన్. మొత్తం గదినంతా వెలుగులతో అలంకరించి, శ్రావ్యమైన సంగీతాన్ని పెట్టి ఇలా ఎన్నో చేసాడు. వివాన్ ఇలా ఎంతో గొప్పగా చేయడంతో సిమ్రాన్ వద్దు అని అనలేకపోయింది. ఆ తర్వాత సిమ్రాన్ మరియు వివాన్ కలిసి తమ జీవిత ప్రయాణాన్ని మొదలుపెట్టారు.

సమాయత్తం అవడం :

సమాయత్తం అవడం :

ఎప్పుడైతే ఇద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలు చిగురించాయో, అటువంటి సమయంలో చాలా మార్పులు వివాన్ లో గమనించారు అతని స్నేహితులు. ఎప్పుడూ విపరీతంగా ఖర్చుపెట్టే ఇతడు డబ్బుని ఆదా చేయడం ప్రారంభించాడు. రెండు నెలల పాటు ఇలా చేసి, గౌహతి నుండి బెంగుళూరు వెళ్లి వచ్చే అంత డబ్బుని కూడబెట్టాడు.

ఎందుకంటే, తాను ప్రేమించిన అమ్మాయి అక్కడే ఉంది కాబట్టి. ఇలా చేయడానికి ఎంతో కృషి అవసరమైంది. ఎవరికైనా మొదటిసారి ఒక కొత్త నగరానికి వెళ్లాలంటే అంత సులభమైన విషయం ఏమి కాదు. ఇది మరింత నిజం అవుతుంది ఎప్పుడంటే, అక్కడ స్థానిక భాష మనకు తెలియనప్పుడు.

వివాన్ విషయంలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, డబ్బులు కూడబెట్టడం మాత్రమే ఇక్కడ కష్టతరమైన విషయం కాదు. దీనికి తోడు ఈ విషయాన్ని అటు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు మరియు కాలేజీ లో ఉన్న ఉపాధ్యాయులకు తెలియకుండా రహస్యంగా ఉంచాలి. కానీ, ఒక ప్రముఖ వ్యాఖ్య ఉంది. నీవు గనుక ఏదైనా గట్టిగా కావాలని కోరుకుంటే అటువంటి సమయంలో ఈ మొత్తం ప్రపంచమే నీ వెంట ఉండి నడిపిస్తుంది, సహాయం చేస్తుంది. వివాన్ విషయం లో ఇదే జరిగింది. ఇతడు తన ప్రయాణాన్ని విజయవంతంగా మొదలుపెట్టగలిగాడు.

మొదటిసారి కలయిక :

మొదటిసారి కలయిక :

వివాన్ సిమ్రాన్ కి ఫోన్ చేసి హాస్టల్ గేట్ దగ్గర తనకు ఒక పార్సిల్ వచ్చిందని దానిని తీసుకోమని చెప్పాడు. కానీ, సిమ్రాన్ అప్పుడు తరగతులకు వెళ్ళడానికి సమాయత్తం అవుతుంది. ఇది విన్న వెంటనే ఆ ఆలోచనకే ఆమె ఎంతగానో ఆశ్చర్యపోయింది. తాను ప్రేమించే వ్యక్తి దగ్గర నుండి ఊహించని బహుమతి అందుకోబోతున్నాను అని తెలిసి ఉబ్బితబ్బి పోయింది.

గేట్ దగ్గరకు ఎంతో ఆతృతగా పరుగెత్తుకు వెళ్ళింది. అక్కడ ఉన్న ' ఆ బహుమతి ' ని చూసి ఈమె నోట మాట రాలేదు. మరో వైపు తాను ఇన్ని రోజులు పడ్డ కష్టం వల్లే ఈ ప్రేమని గెలుపొందానని, ఆమె వేసుకున్న వ్యూహాలు మొత్తంగా ఎంతో అలసిపోయిన ఈ ప్రయాణానికి ఒక నిజమైన విలువుగల కానుకలాగా ఇతడు తన జీవితంలోకి వచ్చాడు అని భావించి ఎంతో ఆనందపడింది.

ఆ తర్వాత రోజులు ఎలా గడిచాయంటే :

ఆ తర్వాత రోజులు ఎలా గడిచాయంటే :

మొదటిసారి కలిసిన తర్వాత సిమ్రాన్, వివాన్ ఇద్దరు రెండు రోజుల పాటు ఆనందంగా గడిపారు. ఆ తర్వాత వివాన్ గౌహతి వెళ్ళిపోయాడు. ఈ సమయంలోనే ఇద్దరు, ఒకరి గురించి ఇంకొకరు బాగా తెలుసుకున్నారు.

సమయం గడుస్తున్న కొద్దీ సిమ్రాన్ తో పాటు వివాన్ ఇద్దరు ప్రేమలో మరింత లోతులకు వెళ్లిపోయారు. మొదటిసారి వివాన్ వెళ్లి కలిసిన ఆ క్షణం, ఇక జీవితాంతం ఈ బంధం ఎప్పటికి ఇలానే ఉంటుంది మరియు ఒక మంచి భాగస్వామి దొరికాడు అనే భరోసాని ఇచ్చింది. ఇది తమ ఇద్దరి జీవితంలో జరిగిన ఒక గొప్ప విషయం అని, ఇది జరగాలని ఉంది కాబట్టి ఇది జరిగిందని ఇద్దరు గుర్తించారు.

ఇక ఇక్కడి నుండి వీరి ప్రయాణం ఎలా సాగిందంటే :

ఇక ఇక్కడి నుండి వీరి ప్రయాణం ఎలా సాగిందంటే :

వీరిద్దరూ మొదటిసారి కలుసుకొని ఈ రోజు కి 5 సంవత్సరాలు అవుతోంది. ఆ తర్వాత వీరిద్దరూ మరో పది సార్లు విజయవంతంగా కలుసుకున్నారు. వీలైనప్పుడల్లా సిమ్రాన్ గౌహతి వెళ్లిపోయేది. వివాన్ కూడా అదే పని చేసేవాడు.

ఇద్దరు ఈ విషయాన్ని తమ కుటుంబాలతో చెప్పాలని నిశ్చయించుకున్నారు. వివాన్ మరియు సిమ్రాన్ ఇద్దరు ఉన్నత చదువులు చదవడం పూర్తి కావడం తో ఇక ఈ జంట ఒక్కటై మిగతా జీవతాన్ని అందంగా గడిపి జీవితంలో నిలదొక్కుకోవాలని భావిస్తున్నారు.

ఆన్ లైన్ వీడియో గేమ్ లు అనేటివి వీరి జీవితంలో గతమే అయి ఉండొచ్చు. కానీ, సిమ్రాన్ మరియు వివాన్ ఇద్దరు వివాహం అనే కొత్త అంకాన్ని మొదలు పెట్టడానికి ఇదే ఒక సాధనంగా ఉపయోగపడింది. ఈ జంట పెళ్లిచేసుకొని ఆనందకరమైన జీవితం గడపాలని మనం అందరం ఆశిద్దాం.

English summary

When distance does not ‘Clash’

Maintaining long-distance relationships is a tough job. But here, we'll tell you a story about Simran and Vivaan. Read to know the beautiful love story between the two where distance was never a barrier for them..
Story first published: Monday, January 15, 2018, 14:00 [IST]
Subscribe Newsletter