ప్రేమ క‌థ: జీవితంలో సెకండ్ చాన్స్ వ‌స్తే...!

By: sujeeth kumar
Subscribe to Boldsky

మ‌న ప్రియ‌మైన వారిని మెప్పించాలంటే మ‌నం ప‌ర్‌ఫెక్ట్‌గా ఉండాల‌నే అపోహ‌లో చాలా మంది ఉంటారు. మ‌రి కొంద‌రైతే ప‌ర్‌ఫెక్ట్‌గా లేక‌పోతే ఇక మ‌న‌ల్ని ఎవ్వ‌రూ ప్రేమించ‌ర‌నే భ్ర‌మ‌తో ఉండిపోతారు. అయితే ఇందులో నిజం లేదు. ఎవ‌రైనా మిమ్మ‌ల్ని నిజంగా ప్రేమిస్తే, మీలో ఎలాంటి లోపాలున్నా ప్రేమిస్తారు.

ఆనంది అనే అమ్మాయి విష‌యంలోనూ ఇది నిరూపిత‌మైంది. త‌న గ‌తం భ‌విష్య‌త్ కు ఆటంకంగా నిలుస్తుంద‌ని ఆమె అనుకుంది. జీవితంలో ఎప్పుడూ ఆనందంగా ఉండ‌లేను, ప్రేమతో కూడిన వైవాహిక జీవితం త‌న‌కు ఉండ‌ద‌ని అనుకుంది.

love story | when life gives you a second chance

ఆమె ఇలా ఆలోచిస్తుంటే విధి మాత్రం మ‌రోలా ఉంటుంది. త‌ల‌రాత‌ను మార్చ‌డం ఎవరిత‌రం కాదు. ఆనందీ క‌థ‌నే తీసుకుంటే ఆమె జీవితం ఎన్ని మ‌లుపులు తిరిగి చివ‌ర‌కు క‌థ ఎలా సుఖాంత‌మ‌య్యిందో తెలుసుకుందాం...

అందాల రాకుమారుడితో పెళ్లి

అందాల రాకుమారుడితో పెళ్లి

ఆనంది 23 ఏళ్ల చ‌క్క‌న‌మ్మ‌. చెన్నైలోని సెయింట్ స్టీవెన్స్ కాలేజీలో డిగ్రీ చ‌దివింది. ఆమెకు త‌గిన వ‌రుడిగా భావించి సింబ‌యాసిస్‌లో ఎంబీఏ చ‌దివిన రాఘ‌వ‌కు ఇచ్చి నెల‌లోపే పెళ్లి జ‌రిపించేశారు. త‌న క‌ల‌ల అందాల రాకుమారుడు ద‌క్కాడ‌ని ఆనంది ప‌ర‌వ‌శించిపోయింది.

క‌ల‌లు క‌ల్ల‌లుగా...

క‌ల‌లు క‌ల్ల‌లుగా...

ఈ ఆనందం ఎంతో కాలం నిల‌వ‌లేదు. రెండు నెల‌ల త‌ర్వాత ఆనంది త‌మ బంధం బ‌ల‌హీన‌మైంద‌ని గుర్తించింది. ఒక రాత్రి రాఘ‌వ తాగి ఇంటికొచ్చాడు. అకార‌ణంగా ఆమె ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించాడు. అప్ప‌టి నుంచి చీటికి మాటికి కొట్లాట‌లు, చీత్కారాలు. అయ్యిందేదో అయ్యింది.. ఇక తెగ‌తెంపులే న‌య‌మ‌ని నిశ్చ‌యానికి వ‌చ్చేసింది.

ఆ మ‌రుస‌టి రోజే ఆమె విడాకుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొంది. నెల‌లోపే ఇద్ద‌రూ విడిపోయారు.

అంత సుల‌భం కాలేదు...

అంత సుల‌భం కాలేదు...

విడాకులు వ‌చ్చినంత సుల‌భంగా జీవితం గ‌డ‌ప‌డం రాలేదు ఆనందికి. ఆమె క‌ష్టం వారి స‌మీప బంధువులు చూడ‌లేక‌పోయారు. త‌ల్లిదండ్రులు థెర‌పీ సెష‌న్ల‌లో పాల్గొన‌మ‌ని ప్రోత్స‌హించారు.

అప్పుడే...

అప్పుడే...

థెర‌పీ సెష‌న్ల‌కు వెళ్లేట‌ప్పుడే ఆమెకు సైకాల‌జిస్టు అయిన డాక్ట‌ర్ అమ‌న్ కౌశిక్‌తో ప‌రిచ‌య‌మేర్ప‌డింది. ప‌టియాలాకు చెందిన ఈ అబ్బాయి ఆనందిలో రెండు నెల‌ల్లోనే మామూలు స్థాయికి తీసుకురాగ‌లిగాడు. సాధార‌ణ జీవితాన్ని గ‌డ‌ప‌డం ప్రారంభించిందామె.

ఆ త‌ర్వాత ఏమైందంటే..

ఆ త‌ర్వాత ఏమైందంటే..

ఆనంది థెర‌పీ సెష‌న్ల‌ను మానేసిన వెంట‌నే డాక్ట‌ర్ అమ‌న్ త‌న‌ను మిస్ అవుతున్న‌ట్టు గ్ర‌హించాడు. అప్పుడే అత‌డు వారి త‌ల్లిదండ్రుల‌ను క‌లిసి త‌న నిర్ణ‌యం గురించి చెప్పాడు.

అంత తొంద‌రగా ఒప్పుకోలేక‌పోయారు

అంత తొంద‌రగా ఒప్పుకోలేక‌పోయారు

అమ‌న్ వ‌చ్చి ఆనందీ త‌ల్లిదండ్రుల‌తో మాట్లాడాడు. త‌న‌ను పెళ్లి చేసుకుంటాన‌ని అన్నాడు. అయితే ఆనందీ త‌ల్లిదండ్రులు మ‌ళ్లీ ఆమెను వివాహ కూపంలోనికి నెట్టొద్ద‌ని అనుకున్నారు. ఇలాంటి ఆలోచ‌న‌ల‌తోనే నెల‌ల‌పాటు ఆలోచించి చివ‌ర‌కు ఒప్పుకున్నారు.

అంత సులువు కాలేదు

అంత సులువు కాలేదు

అమ‌న్ త‌ల్లిదండ్రులు ఈ వివాహం ప‌ట్ల అస్స‌లు సుముఖంగా లేరు. పైగా విడాకులు తీసుకున్న ఒక మ‌హిళ త‌మ కోడ‌లిగా రావ‌డాన్ని అస్స‌లు స‌హించ‌లేక‌పోయారు.

ప్రేమ పెరిగేకొద్దీ..

ప్రేమ పెరిగేకొద్దీ..

నిజ‌మైన ప్రేమ ఉంటే ఎవ్వ‌రూ ఆప‌లేరు అన్న సంగ‌తి రుజువైంది. అమ‌న్‌, ఆనందీలు పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్నార‌న్న విష‌యాన్ని గ‌మ‌నించిన అమ‌న్ త‌ల్లిదండ్రులు వారి వివాహానికి సై అన‌క త‌ప్ప‌లేదు.

క‌థ ముగిసిపోలేదు..

క‌థ ముగిసిపోలేదు..

పెళ్లి త‌ర్వాత‌..ఆనందీకి ఒక విష‌యం మాత్రం అర్థం అయింది. త‌న తొలి వివాహ పాడైంద‌ని, రెండోది అలాగే ఉంటుంద‌ని చెప్ప‌లేం. లైఫ్‌కి సెకండ్ చాన్స్ ఇవ్వ‌డం స‌బ‌బే అనిపించింది.

ఈ రోజు ఆనందీ, అమ‌న్‌ల‌కు పండంటి బిడ్డ పుట్టింది. వారి జీవితం ప‌రిపూర్ణ‌మైంది. ఇరు వ‌ర్గాల త‌ల్లిదండ్రుల ఆశీస్సులు అందివ‌చ్చాయి. అన్ని ర‌కాల క‌ష్టాల‌ను ఎదురీది ఎలా త‌మ ప్రేమ‌ను గెలిపించుకున్నారో వీళ్ల ప్రేమ క‌థ చ‌దివితే అర్థ‌మ‌వుతుంది.

English summary

love story | when life gives you a second chance

Here is the story of Anandi and how her life ultimately had a 'happily ever after' ending. Check them out!
Story first published: Thursday, January 25, 2018, 17:30 [IST]
Subscribe Newsletter