For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  కొందరు మహిళలు సంబంధాలలో బోర్ ఫీల్ అవుతుంటారు ? ఎందుకో తెలుసా.

  |

  మీ భాగస్వామి ఆమె ముందు ఉన్నంత ఆసక్తికరంగా లేదని మీరు బాధపడుతున్నారా? వారు సంబంధంలో విసుగుచెందదానికి వెనుకగల కారణాలు కనుగొనేందుకు మీకు ఈ వ్యాసం సహాయపడగలదని ఆశిస్తున్నాం. ఒక్కోసారి కొందరు మహిళలు తమ సంబంధం గురించి మాట్లాడాలంటేనే విసుగు చెందుతుంటారు, సంబంధమే ఉందని ప్రేమ లేదంటూ వాపోతుంటారు.

  మహిళలoదరూ నేడు పురుషులతో సమానంగా నిగ్రహం తక్కువగా కలిగి ఉన్నారనడంలో ఆశ్చర్యం లేదు. సంబంధాలలో పురుషులు బోర్ ఫీల్ చూపిస్తే, మేమేం తక్కువా అన్న ఆలోచనను మహిళలు కూడా ప్రారంభించారు. అందులో ఆశ్చర్యమేముంది.

  ఎందుకు మహిళలు ఎక్కువగా విసుగు చెంది ఉంటారు ? మీకేమన్నా ఐడియా ఉందా.

  WHY DO WOMEN GET BORED IN THE RELATIONSHIP? REASONS YOU SHOULD KNOW.

  ఈతరానికి చెందిన స్త్రీలు తమకు కావాల్సిన అవసరాల గురించి, వారి కోరికలు గురించి చాలా ప్రత్యేకంగా ఉంటారు. వారు ఉన్న సంబంధంలో ఆ చిన్ని చిన్ని కోరికలను కూడా పొందలేకపోయినప్పుడు, ఆ సంబంధంలో ఖచ్చితంగా విసుగు చెందుతారు. ఇది అత్యంత సహజమైనది. ఎటువంటి ప్రణాళికలు, సంతోషాలు లేని స్తబ్ధత కూడిన జీవనం గడుపుతున్న ఎడల, ఖచ్చితంగా విసుగు చెందడం జరుగుతుంది. అలాంటి విసుగులు అధికమైతే సంబంధం నుండి బయటకు రావాలన్న ఆలోచనలు కూడా సర్వసాధారణo అయిపోతాయి.

  అసలు ఎటువంటి కారణాలు, అంతటి ఊహాతీత నిర్ణయాలకు కారణమవుతాయో ఊహించగలరా?

  కొన్ని కారణాలు సిల్లీగా అనిపించినా నిజమండీ బాబూ. కానీ అవి తెలుసుకోవడం వలన, అలాంటి తప్పులు జీవితంలో దొర్లకుండా జాగ్రత్త పడవచ్చు.

  అవసరానికేనా మేము?

  అవసరానికేనా మేము?

  ప్రతీ స్త్రీని మీరు యువరాణిగా, ఇంకా అవసరమైతే రాణిగా పరిగణించవలసి ఉంటుంది. మీపరిధిలో ఉన్న వస్తువులతో సమానంగా చూస్తే మాత్రం, అస్సలు సహించలేరు. ఏ మహిళైనా తన జీవితాన్ని భాగస్వామితో ఆనందంగా గడపాలని కోరుకుంటుంది. అదేవిధంగా భాగస్వామిపై ప్రేమను ప్రదర్శిస్తుంది. కానీ తనపట్ల భాగస్వామి కూడా అంతే ప్రేమను ప్రదర్శించాలని కోరుకుంటుంది. ఆ ప్రేమ దొరకని పక్షంలో విసుగుకు లోనవుతుంది.

  ఒక్కోసారి మొదట్లో సంబంధాలు బాగా ఉన్నా కూడా, రాను రాను కొంతమంది పురుషులు వారి వారి సౌకర్యాలను అనుసరించి ప్రణాళికలు చేస్తుంటారు. తద్వారా భాగస్వాముల పట్ల తెలీని దూరాన్ని ప్రదర్శిస్తుంటారు. దక్కిందే మహాభాగ్యం అన్న ధోరణితో వస్తువులను మనుషులను కలిపి చూసే చర్యలకు కూడా పాల్పడుతుంటారు అంటే అతిశయోక్తి కాదు.

  ఇలాంటి ఆలోచనలు, సర్వసాధారణంగా మారి జీవితంలో ఒక స్తబ్దత నెలకొంటుంది. తద్వారా అవసరానికేనా మేము అన్న భావనకు లోనవుతుంటారు. తద్వారా ఐ లవ్ యు అని చెప్పడానికి 10మైళ్ళ దూరం వెళ్ళడానికి కూడాసిద్దంగా ఉండరు.

  మొదట్లో పురుషులు మహిళలను ఆకర్షించడానికి అనేక ప్రయత్నాలను చేస్తుంటారు. వారిని ప్రత్యేకంగా భావిoచడం మొదలుపెడుతారు. కానీ ఈ భావనలు నెమ్మదిగా తగ్గుముఖం పట్టడం, అంత కలివిడిగా ఉండకపోవడం వంటి చర్యలను చేయడం ద్వారా, మహిళలు విసుగు చెందడం జరుగుతుంది. ప్రేమే లేనప్పుడు, మేమెందుకు అన్న భావనకు లోనవుతుంటారు. ఇలాంటివే విసుగుకు ప్రధాన కారణంగా ఉంటుంది.

  మహిళలు ఎక్కువగా సర్ప్రైస్ లకు, బహుమతులకు ఇష్టులై ఉంటారు.

  మహిళలు ఎక్కువగా సర్ప్రైస్ లకు, బహుమతులకు ఇష్టులై ఉంటారు.

  కొంతమంది పురుషులు ప్రేమించిన లేదా పెళ్ళైన మొదట్లో బహుమతులు ఇవ్వడం, లేదా సర్ప్రైస్ గురిచేసే ట్రిప్స్ ప్లాన్ చేయడం, వారి కోరికలను అడిగి తెలుసుకుని, వారికి తెలీకుండా కోరికలను నెరవేర్చడం వంటి పనులు కూడా చేస్తుంటారు. తద్వారా వీరిపై అధిక ప్రేమను కలిగి ఉంటారు. చాలా మంది ప్రేమ, బహుమతుల దృష్ట్యా? అని ఆలోచిస్తారు, కానీ, తమ పట్ల చూపుతున్న కేరింగ్ వీరిని దాసోహం చేస్తుందని గమనించకపోవడం దురదృష్టకరం. కానీ ఏదైనా పని ఒత్తిళ్ళ కారణంగా కానీ, లేదా మరేదైనా ఇతర కారణాల వలన కానీ పురుషుడు మొదట్లో బహుమతుల పరంగా చూపిన ఆసక్తిని ప్రదర్శించడు. తద్వారా తమ పైన ప్రేమ తగ్గిందేమో అన్న భావనకులోనై మహిళలు సాధారణంగానే విసుగుకు లోనవుతుంటారు. కావున సందర్భాన్ని అనుసరించి వారికి స్పెషల్ గా అనిపించేలా మీ ప్రేమను వ్యక్తపరచడం అన్నిటా మేలు. మీకు వంద పనులు ఉండవచ్చు, కానీ వారికి తమ కుటుంబమే అన్నీ అన్నట్లు ఉంటారు. వారి సంతోషం మీభాద్యత అని భావిస్తే మీ అంత గొప్పవారు ఎవరూ ఉండరు.

  రోమాన్స్ కి గుడ్ బాయ్ చెప్తున్నారా?

  రోమాన్స్ కి గుడ్ బాయ్ చెప్తున్నారా?

  ఒక చిన్న ముద్దులో ఉండే ఆప్యాయత విలువ ఏమిటో పురుషులకన్నా స్త్రీలకే ఎక్కువ తెలుసు. కానీ, ఆ ముద్దు పట్ల కూడా అయిష్టతను ప్రదర్శించే వారిని ఏమనాలి చెప్పండి. కొందరైతే కనీసం చేయి పట్టి నడిపించడానికి కూడా సుముఖంగా ఉండరు. అలాంటి వ్యక్తులు ప్రేమను కోరుకోవడం కూడా తప్పే మరి. ఎటువంటి సమస్యలున్నా, ఎంత పని ఒత్తిడి ఉన్నా, ఒక్క క్షణం మీ భాగస్వామిని దగ్గర తీసుకోవడం వలన మానసిక ప్రశాంతత కలగడమే కాదు. అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు కూడా లభిస్తాయి. ఎప్పుడైతే మీరు విముఖతను ప్రదర్శిస్తారో, మీపట్ల కూడా హేయభావం పెరుగుతుంది అనడంలో ఆశ్చర్యమేముంది.

  మహిళలు ఎప్పుడూ ఉత్తములనే ప్రేమిస్తారు

  మహిళలు ఎప్పుడూ ఉత్తములనే ప్రేమిస్తారు

  జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడూ మంచిగానే లేదా చెడుగానే ఉండరు, మంచిచెడుల కలయిక మనిషి జీవితం. ఇలా అవసరాన్ని బట్టి మంచిచెడులను ప్రదర్శించే వారంటే మహిళలు ఎక్కువ ఇష్టపడుతారు. ఉదాహరణకు, ఎవరైనా ఆకతాయిలు మహిళలను అవమానిస్తుంటే ఆక్షణాన భయాన్ని ప్రదర్శించే వారిని ఏ మహిళ ఇష్టపడుతుంది చెప్పండి. అలాగని సినిమా హీరోల్లా ఫైట్స్ చేయనవసరం లేదు. కనీసం ఎదుర్కొనే మనస్తత్వాన్ని కలిగుండాలని కోరుకుంటుంది. కానీ ఆలాంటి వ్యక్తిత్వాన్ని ప్రదర్శించలేని మనిషి పట్ల హేయభావం కలిగి ఉండడంలో ఆశ్చర్యం లేదు. కావున క్లాసీగానూ ఉండాలి, అవసరాన్ని బట్టి రౌడీగానూ ఉండాలి. అలాగని మనిషిని చూస్తేనే చెడుభావన కలిగేలా కాదండోయ్. దేనికైనా పరిమితులుంటాయి.

  కొంచమైనా హాస్య చతురత ఉందా మీలో?

  కొంచమైనా హాస్య చతురత ఉందా మీలో?

  కొందరు మొదట్లో హాస్యచతురతను అధికంగా ప్రదర్శిస్తుంటారు, కానీ రాను రాను వయసు పెరిగే కొద్దీ, హాస్యచతురత కాదు కదా హాస్యానికి కూడా స్పందించని తత్వాన్ని అలవరచుకుoటుoటారు. మహిళ ఎప్పుడు కూడా బావిలో కప్పలా ఉండాలని భావించదు. భాగస్వామితో గడిపిన కొన్ని నిమిషాలలో లోకమంతా తిరిగిన అనుభూతికి లోనవుతుంది. ఆ అనుభూతికి లోపం చేస్తే, ఆ సంబంధంలో కిక్కుండదు.

  English summary

  WHY DO WOMEN GET BORED IN THE RELATIONSHIP? REASONS YOU SHOULD KNOW.

  Men should remember the fact that getting into a relationship isn't just enough, it also requires dedication. Women, on the other hand, seek for the fun element in relationships and when they do not find it, they start to wonder about all their dreams of adventures.They start to miss the fun element and thus it makes them feel bored in the relationship.
  Story first published: Saturday, May 5, 2018, 13:30 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more