For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాత్రంతా ఆమే గుర్తొచ్చింది, నిద్ర రాలేదు, తెల్లవారుజామున ఫోన్ చేస్తే వెళ్లా, షాక్ అయ్యాను#mystory402

|

పొలంలో ఫేస్ బుక్ లో మెడికల్ స్టూడెంట్ తో చాటింగ్, హీరోయిన్లా ఉంది, చూశాక నోటి వెంట మాటలు రాలేదు #mystory400 స్టోరికి ఇది కంటిన్యూ కథనం.

తను నా చిన్ననాటి ఫ్రెండ్. పేరు కావ్య. ఎంబీబీఎస్ చదువుతోన్న తనకు ఏ మాత్రం గర్వం లేదు. అందరితో చాలా చనువుగా మాట్లాడుతుంది.
ఫేస్ బుక్ ద్వారా మళ్లీ నాకు టచ్ లోకి వచ్చిన తనని కలిసేందుకు సిటీకి బైక్ పై వెళ్లాను. ఫ్రెండ్ ఎఫ్ జెడ్ బైక్ తీసుకుని ఒక రేంజ్ లో రెడీ అయి తన దగ్గరకు వెళ్లాను. మెడలో స్కెతస్కోప్ వేసుకుని తెల్లకోర్టులో తను వస్తుంటే బలుపు సినిమాలో అంజలి గుర్తొచ్చింది. నేనేమో రవితేజ టైప్. మహామాస్.

తనమో చాలా క్లాస్. తనని చూడగానే వెంటనే ప్రపోజ్ చేసి తనతో కూడా ఐలవ్ యూ టూ చెప్పించుకుని అందరి ముందు వీడికి కత్తిలాంటి ఫిగర్ ప్లాట్ అయ్యిందిరా అని అనిపించుకోవాలనిపించింది. కానీ చెప్పాలంటే భయం. తను నన్ను కాఫీ షాప్ కు తీసుకెళ్లింది. ఇద్దరం కాఫీ తాగుతూ బోలెడన్నీ విషయాలు మాట్లాడుకున్నాం.

తను మాట్లాడుతుంటే

తను మాట్లాడుతుంటే

పాతరోజుల్ని గుర్తుకు తెచ్చుకున్నాం. అప్పటి సంతోషలన్నింటినీ నెమరువేసుకోగానే మనస్సు చాలా తేలికైంది. ఫ్రెండ్స్ అందిరి గురించి ఆరా తీసింది. అందరూ బాగున్నారా అని అడిగింది. తను మాట్లాడుతుంటే అలాగే గంటల తరబడి వినాలనిపించింది.

మెడిసిన్ చదివి ఉంటే ఎంత బాగుండో

మెడిసిన్ చదివి ఉంటే ఎంత బాగుండో

తను నవ్వుతుంటే నోటి నుంచి ముత్యాలు రాలుతున్నాయేమో అనిపించింది. తన తోటి అమ్మాయిలంతా హెయిర్ ను మొత్తం స్ట్రయిట్ చేసుకుని లూజ్ గా వదిలేసి మోడల్స్ మాదిరిగా ఉంటే తనమో వాలుజడతో తెలుగింటి ఆడపడుచులా ఉంది. తనతో మాట్లాడిన తర్వాత తనతో కాసేపు తిరిగాక నేను కావ్యతో పాటే మెడిసిన్ చదివి ఉంటే ఎంత బాగుండో అనిపించింది.

ప్రతిఫలం దక్కింది

ప్రతిఫలం దక్కింది

రోజూ ఇంత అందాన్ని చూస్తూ అన్నం లేకుండా బతికేసేవాడిని కదా అనిపించింది. మొత్తానికి ఫ్రెండ్ ని బతిమిలాడి ఎఫ్ జెడ్ బైక్ తీసుకుపోయినందుకు ప్రతిఫలం దక్కింది. తనను నా బైక్ పైనే హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చాను. ఇక ఆ రోజు తిరిగి మా ఊరికి వెళ్లాను. రాత్రంతా తనే గుర్తొచ్చింది. నిద్రనే రాలేదు.

ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది

ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది

తన మంచితనం, చలాకీతనం, అందం, అభినయం అన్నీ నాకు బాగా నచ్చాయి. దేవుడు ప్రత్యక్షమై ఒక వరం కోరుకో అంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే అవకాశం ఇవ్వు అని అడుగుదామనుకున్నా. నేను రెగ్యులర్ గా సిటీకి వెళ్లి కావ్యను కలిసేవాణ్ని. అలా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది.

Most Read :నా భర్తకు ఎప్పుడు మూడ్ వస్తే అప్పడు కావాలంటాడు, తనకు సుఖం దక్కితే చాలు, నా గురించి పట్టించుకోడుMost Read :నా భర్తకు ఎప్పుడు మూడ్ వస్తే అప్పడు కావాలంటాడు, తనకు సుఖం దక్కితే చాలు, నా గురించి పట్టించుకోడు

 తెల్లవారు జామున తన నుంచి ఫోన్

తెల్లవారు జామున తన నుంచి ఫోన్

సరిగ్గా గతేడాది ఫిబ్రవరి పద్నాలుగున నేను తనకు ప్రపోజ్ చేద్దామనుకున్నాను. అంతకు ముందు రోజు తెల్లవారు జామున నాకు తన నుంచి ఫోన్ వచ్చింది. నువ్వు నాకు ఒక హెల్ప్ చెయ్యాలంది.. చెప్పు అన్నాను. వెంటనే సిటీకి రాగలవా అంది. ఆన్ ద స్పాట్ లో వెళ్లాను.

పెళ్లి చేసుకోమని చెబుతుందేమో అనుకున్నా

పెళ్లి చేసుకోమని చెబుతుందేమో అనుకున్నా

ఒక అడ్రస్ చెప్పింది అక్కడికి వెళ్లగా చేతిలో పూలమాలలతో కనిపించింది.నా మనస్సులో ఆ క్షణం ఏవేవో ప్రశ్నలు మెదలాయి. నన్ను తనని పెళ్లి చేసుకోమని చెబుతుందేమో అనుకున్నాను. కానీ మరుక్షణమే తను ఇచ్చిన షాక్ నుంచి నేను ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాను. ఒక అబ్బాయిని చూపించి ఇతను నేను నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. ఈ రోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుంటున్నాం. నువ్వు కాస్త సాక్షి సంతకం పెడతావా అంది.

అలాంటి ఫిగర్ కు ఫుల్ కాంపిటేషన్

అలాంటి ఫిగర్ కు ఫుల్ కాంపిటేషన్

నా ప్యూజ్ లు ఎగిరిపోయాయి. అయినా నా ఆశకు కూడా ఒక హద్దు ఉండాలి. అలాంటి ఫిగర్ కు ఫుల్ కాంపిటేషన్ ఉంటుందని ఆల్రెడీ బుక్ అయిన పీస్ అని అర్థం చేసుకోలేకపోవడం నా తప్పే. అందుకే ఫిగర్ ను చూసి, రెండు మాటలు మీతో మాట్లాడిందని నాలాగా డ్రీమ్స్ లో తేలిపోకండి.

Most Read :కలయిక అంటే భార్యలో భయం ఏర్పడానికి కారణం అదే, సిప్రిడోఫోబియా, ఈ వ్యాధి వస్తే భర్తపై అన్నీ అనుమానాలేMost Read :కలయిక అంటే భార్యలో భయం ఏర్పడానికి కారణం అదే, సిప్రిడోఫోబియా, ఈ వ్యాధి వస్తే భర్తపై అన్నీ అనుమానాలే

English summary

My Love Married Someone else

my love married someone else