For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

True Love Story : ప్రియురాలి కోసం ఇండియా నుండి యూరప్ కు సైకిల్ పై వెళ్లాడట...! మరి తన ప్రేమ సక్సెస్ అయ్యిందా..

1975లో జరిగిన ఓ గొప్ప ప్రేమ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

మన మనసుకు నచ్చిన వారితో జీవితాంతం కలిసి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటాం. ఇది మానవ నైజం. అదే మనం ప్రేమించిన వారు మనల్ని విడిచిపెట్టి ఒక్క క్షణం దూరంగా ఉన్నా కొన్ని యుగాలుగా వారి నుండి దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది.

A True Love story in 1975, When love is the greatest ability

అయితే ఇదంతా నిజమైన మరియు నిజాయితీ గల ప్రేమలో మాత్రమే కనిపిస్తుంది. అలాంటి రెండక్షరాల ప్రేమకు ఎంతో శక్తి ఉంటుంది. ఈ ప్రేమ కులం, మతం, జాతి, వర్గం వంటి వాటిని అస్సలు చూడదు. కేవలం మనసును మాత్రమే చూస్తుంది.

A True Love story in 1975, When love is the greatest ability

అందుకే ఓ ప్రేమికుడు తన ప్రేమ కోసం ఇండియా నుండి సైకిల్ పై యూరప్ లోని స్వీడన్ కు తన ప్రియురాలిని కలిసేందుకు వెళ్లాడు. అయితే తన ప్రేమ సకెస్స్ అయ్యిందా? తన ప్రేయసిని కలిసి ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకున్నాడా లేదా? ఇంతకీ ఎవరతను? అనే విషయాలన్నింటినీ ఇప్పుడు మనం తెలుసుకుందాం...

కాజల్ కౌగిలిలో కిచ్లూ ప్రతిరోజూ బంధి అయిపోవాల్సిందేనట...! రోజూ హగ్ చేసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా...కాజల్ కౌగిలిలో కిచ్లూ ప్రతిరోజూ బంధి అయిపోవాల్సిందేనట...! రోజూ హగ్ చేసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా...

అపారమైన సంపద..

అపారమైన సంపద..

ప్రేమకు కులం, మతం, ప్రాంతం, డబ్బు, స్థాయి వంటివి ఏమి అవసరం లేదని నిరూపించింది ఈ ప్రేమ జంట. యూరప్ దేశాల్లోని స్వీడన్ కు చెందిన ఆమె(చార్లెస్)కు కోట్ల రూపాయల ఆస్తి ఉంది. కొన్నితరాలు కూర్చుని తిన్న తరగని ఆస్తి ఉంది.

ఢిల్లీ వీధుల్లో..

ఢిల్లీ వీధుల్లో..

యూరప్ నుండి విమానంలో ఢిల్లీకి వచ్చిన ఆమె ఆ దేశ నగర వీధుల్లో షాపింగ్ చేస్తూ ఉండేది. అదే సమయంలో రోడ్డుపై బొమ్మలు వేసుకునే దళిత యువకుడు(మహానందియ) కనబడ్డాడు.

అందమైన బొమ్మలు..

అందమైన బొమ్మలు..

ఆ యువకుడికి ఉన్న గొప్ప ట్యాలెంట్ ఏంటంటే.. ఎవరినైనా కొన్ని నిమిషాల పాటు చూస్తే, సరిగ్గా అలాంటి బొమ్మలను దించేస్తుంటాడు. ఎవరైనా తనకు రూపాయి ఇచ్చి ఫొటో తీయమంటే చాలు వారి ఫొటోను పది నిమిషాల్లో గీసి ఇచ్చేవాడు. అలా విదేశాలకు చెందిన కోటీశ్వరురాలు తన బొమ్మ వేయమని అడుగుతుంది.

నచ్చలేదని చెప్పడంతో..

నచ్చలేదని చెప్పడంతో..

తను ఆమె అడిగిన వెంటనే తనన బొమ్మను పది నిమిషాల్లో అందంగా వేసి ఇచ్చాడు. అయితే తను వేసిన బొమ్మ ఆమెకు నచ్చదు. అందుకే ఆమె ఆ బొమ్మ గురించి ఏమి చెప్పకుండా వెళ్తుంది. అయితే తనకు ఆ సమయంలో చాలా బాధ కలుగుతుందట.

మళ్లీ తన స్నేహితులతో..

మళ్లీ తన స్నేహితులతో..

మరుసటి రోజు తను మళ్లీ స్నేహితులతో కలిసి అక్కడ షాపింగ్ కోసం వచ్చింది. అయితే ఈసారి ఆ యువకుడు తన బొమ్మ నచ్చలేదా? అని ఆమెకు అడగడంతో.. ఆమె నచ్చలేదని చెప్పిందట. తనకు పది నిమిషాల్లో కాదు.. పర్ఫెక్టుగా ఉండే బొమ్మ కావాలని అడుగుతుందట.

మరో అవకాశం..

మరో అవకాశం..

దీంతో ఆ యువకుడు తనకు మరో అవకాశమివ్వాలని.. తన ట్యాలెంట్ ఏంటో చూపుతానని అడుగుతాడు. తన స్నేహితులు కూడా ఒక్క ఛాన్స్ ఇద్దాం అని చెప్పడంతో సరేనని ఒప్పుకుంటుందట. అప్పుడు మరింత శ్రద్ధతో తన చేయికి పదును పెట్టి ఆమె బొమ్మను అందంగా తీర్చిదిద్దడానికి సుమారు 5 గంటల పాటు శ్రమిస్తాడు.

పది రూపాయలు చేతిలో..

పది రూపాయలు చేతిలో..

అయితే అప్పటికీ ఆమె ఆ ఫొటోకు సంబంధించి ఏదో పర్వాలేదు అన్నట్టుగా రెండు ముక్కలు మాట్లాడి పది రూపాయలు చేతిలో పెట్టి వెళ్లిపోయింది. కానీ తన బొమ్మను మెచ్చుకోకపోవడంతో అతను మరింత బాధపడ్డాడట. ఎందుకని తను గీసిన ఫొటోలు ఆమెకు నచ్చడం లేదనే విషయం గురించి ఎక్కువగా ఆలోచించాడు. అప్పుడే తను ఎక్కడ తప్పు చేస్తున్నాడో తెలుసుకున్నాడు.

కలర్ పెన్సిళ్లతో..

కలర్ పెన్సిళ్లతో..

ఆ తర్వాత తన దగ్గర ఉన్న డబ్బంతా జమ చేసి, ఖరీదైన కలర్ పెన్సిళ్లను కొన్నాడు. ఆమె పెయింటింగ్ కోసం ఆ పెన్సిళ్లను దాచి పెట్టుకున్నాడు. తిండి కూడా మానేసి వాటిని దాచిపెట్టుకున్నాడు. అప్పటి నుండి ఆమె కోసం ఎదురుచూసేవాడు.

డబ్బులొద్దు లాస్ట్ ఛాన్స్..

డబ్బులొద్దు లాస్ట్ ఛాన్స్..

అలా ఆమె కోసం అన్వేషిస్తుంటే.. ఓ రోజు అకస్మాత్తుగా తను షాపింగ్ చేస్తూ కనిపించింది. అంతే వెంటనే తను ఆమె దగ్గరికి వెళ్లి, మీరు నాకు డబ్బులివ్వకండి.. కానీ ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నేను మీ ఫొటోను మరింత అందంగా గీస్తానని చెప్పాడు. ఒకవేళ అది మీరు బాగోలేదంటే తన జీవితంలో ఇక బొమ్మలే వేయనని చెప్పాడు.

నాలుగు గంటల్లో..

నాలుగు గంటల్లో..

ఎట్టకేలకు సరాదాగా ఒప్పుకున్న ఆమెకు ఫొటోలో కూడా రానంత అందంగా ఫొటో గీసి ఇచ్చాడు ఆ యువకుడు. ఆ ఫొటోకు చిన్న ఫ్రేమ్ లాంటిది కట్టి ఇచ్చాడు. అందరూ దాన్ని చూసి మెచ్చుకున్నారు. అప్పుడు ఆమె కూడా ఇది చాలా బాగా వచ్చింది. ఎలా వచ్చిందని అడగగా.. ఇది నా చేతుల్లో కాదు.. ఈ ఖరీదైన పెన్సిళ్ల మహత్యం అన్నాడు.

నా కళను అవమానిస్తే..

నా కళను అవమానిస్తే..

నన్ను అవమానించినా తట్టుకుంటాను కానీ, నా కళను అవమానిస్తే తట్టుకోలేను మేడమ్ అన్నాడు. అప్పుడామె నాకు మరో ఫొటో కావాలని అడిగింది. కానీ తనతో అప్పుడు ఖరీదైన పెన్సిళ్లు లేవని, తన మూడు రోజుల సంపాదనతో వాటిని కొని ఫొటో గీశానని చెప్పాడు. అయితే ఆమె నా దగ్గర అవి ఉన్నాయిలే అని, వాటిని కొని తనకు ఇచ్చింది.

మోడరన్ ఫొటో..

మోడరన్ ఫొటో..

ఈసారి తను మరింత అద్భుతంగా ఫొటో వేశాడు. మహామహులే వేయనంత అద్భుతంగా మోడరన్ ఫొటో వేసి ఇచ్చాడు. అంతే ఆమె ఫిదా అయిపోయింది. అప్పుడే తనకు తన తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అబ్బాయి మనది తక్కువ కులం అయినా.. నువ్వు మాత్రం గొప్పొడివి అవుతావు. నువ్వు విదేశాల నుండి వచ్చే రాకుమారిని పెళ్లాడతావు అని చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అమ్మ చెప్పిన తనేనేమో అనుకున్నాడు.

టీ తాగడానికొస్తారా..

టీ తాగడానికొస్తారా..

అంతే ఆమె గురించి వివరాలు అడగడం మొదలెట్టాడు. ఆ తర్వాత టీ తాగడానికి మా ఇంటికొస్తారా అని అమాయకంగా అడిగాడు. అంతే ఆమె మారు మాట్లాడకుండా వస్తాను అనడంతో.. తన పనులను వెంటనే ముగించుకుని.. తను నివసించే స్లమ్ ఏరియాకు తెల్ల అమ్మాయిని తీసుకెళ్లాడు.

అందరూ ఆశ్చర్యపోయారు..

అందరూ ఆశ్చర్యపోయారు..

అందరూ నల్లగా ఉండే ఆ ప్రాంతంలో తెల్ల అమ్మాయి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అది కూడా దళిత యువకుడు తీసుకురావడంతో అందరూ ఆవాక్కయ్యారు.

మా ఊరికొస్తారా?

మా ఊరికొస్తారా?

ఆ తర్వాత తను ఆమెను మా ఊరికొస్తారా అడుగుతాడు. ఆమె మీ ఊళ్లో ఏముందని అడగగా.. మా ఊళ్లో చూడటానికి అందమైన ప్రదేశాలు లేకపోయినా.. మా ఊరికి దగ్గర్లో కోణార్క్ టెంపుల్ ఉంది. అది చూపిస్తాను అని చెప్పడంతో ఆమెనే తన ఖర్చులతో అవి చూడటానికి వస్తుంది. అదే సమయంలో ఆ దళిత యువకుడు తనకు కావాల్సినవన్నీ దగ్గరుండి మరీ ఏర్పాటు చేస్తుంటాడు.

తనకు ఫ్లాట్ అయ్యింది..

తనకు ఫ్లాట్ అయ్యింది..

తను ఆమె పట్ల చూపుతున్న ప్రేమాభిమానాలకు ఆమె ఫ్లాట్ అయిపోయింది. అంతే అక్కడ వారి కుటుంబ సభ్యుల మధ్యే మీ అందరికి ఇష్టమైతే తనని పెళ్లి చేసుకుంటానని చెబుతుంది. అంతే అందరూ షాకయ్యారు. అయితే మీరు సుఖంగా ఉంటామంటే మాకెలాంటి అభ్యంతరం లేదని యువకుడి తల్లిదండ్రులు చెబుతారు.

వెంటనే పెళ్లి..

వెంటనే పెళ్లి..

అంతే ఆ వెంటనే గిరిజనుల సంప్రదాయంలో వారి పెళ్లి కూడా జరిగిపోయింది. అయితే ఆమె ఢిల్లీ పర్యటన ఆ మరుసటి రోజే ముగిసిపోయింది. దీంతో ఆమె తన దేశానికి తిరుగు పయనమైంది. వెళ్లేటప్పుడు తనతో ఒకే మాట చెప్పి వెళ్లింది. నీ కోసం నేను ఎదురుచూస్తుంటా అని చెప్పి, విమానంలో వెళ్లిపోయింది.

లెటర్లు రాసుకున్నారు..

లెటర్లు రాసుకున్నారు..

తను వారి దేశం చేరుకున్న వెంటనే ఇద్దరు ఉత్తరాలు రాసుకున్నారు. అయితే తను ఒంటరి వాడినయ్యాయని ఆ యువకుడు బాధపడుతూ ఉండేవాడు. కానీ తన భార్యను చూడాలనే తపనతో తన దగ్గర ఉన్న డబ్బుతో కొత్త సైకిల్ కొన్నాడు. నాలుగు జతల బట్టలను తీసుకుని సైకిల్ పై యూరప్ కు పయనమయ్యాడు.

వారే డబ్బులిచ్చి..

వారే డబ్బులిచ్చి..

ఢిల్లీ నుండి కాశ్మీర్, అక్కడి నుండి ఆఫ్ఘనిస్థాన్, ఆ తర్వాత ఇరాన్ వరకు చేరిపోయాడు. అప్పుడు తన సైకిల్ రిపేరీ వచ్చినా, ఎలాగోలా దాన్ని సరిచేసుకుంటూ.. దారిలో ఎక్కడబడితే అక్కడ బొమ్మలు వేసుకుంటూ, తనకు తినడానికి కావాల్సిన సొమ్ముతో ముందుకు వెళ్లిపోయాడు. అయితే ఆప్ఘనిస్థాన్, ఇరాన్ లో మాత్రం భాష తెలియక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కానీ తన బొమ్మల సహాయంతో తన ప్రేమ కథను చెప్పడంతో వారే కొంత డబ్బు ఇచ్చి మరీ.. తనను సాగనంపారట.

ఎట్టకేలకు తన ప్రేయసి దగ్గరకు..

ఎట్టకేలకు తన ప్రేయసి దగ్గరకు..

అలా సైకిల్ పై వెళ్లిన తనకు ఎట్టకేలకు తన ప్రేయసి కనిపించిందట. అంతే ఆమె దగ్గరికి వెళ్లేసరికి, తను కూడా ఆశ్చర్యపోయింది. వేల కిలోమీటర్లు సైకిల్ మీద ప్రయాణం చేయడంతో బక్కచిక్కిపోయాడు ఆ యువకుడు. అయినా కూడా ఆమె తనకు ఆహ్వానం పలికింది.కొద్దిరోజులయ్యాక తన పేరేంట్స్ చెప్పింది. కానీ వారు మొదట్లో ఒప్పుకోలేదు. చివరకు ఆమెను కాదనలేక తనతో పెళ్లికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత వారిద్దరూ ఆర్టిస్టులుగా సెటిలైపోయారు. అనంతరం మన దేశానికి వచ్చిన తన లవ్ స్టోరీ గురించి అందరికీ చెప్పి ఆశ్చర్యపరిచాడు. విమానం టికెట్ కొనలేకే సైకిల్ పై వెళ్లానని చెప్పాడు. ఇలాంటి స్టోరీ ఏ సినిమాలో ఉండదంటే అతిశయోక్తి కాదేమో. నిజమే మరీ అప్పట్లో లవ్ అంటే ఫుడ్ డెడికేషన్ ఉండేది.

గమనిక : ఈ సమాచారం అంతా మాకు ఇంటర్నెట్ తో పాటు ఇతర చోట్ల దొరికిన కొన్ని కథల ఆధారంగా, మాకు ఉన్న పరిజ్ణానాన్ని బట్టి జోడించి రాసినవి. ఇవి ఎవ్వరినీ కించపరిచే ఉద్దేశ్యంతో రాసినవి మాత్రం కాదు. ఇక్కడ ఉన్న సమాచారానికి బోల్డ్ స్కై.తెలుగుకు ఎలాంటి సంబంధం లేదని పాఠకులు గమనించగలరు.

English summary

A True Love story in 1975, When love is the greatest ability

Here we are talking about the true love story in 1975, when love is the greatest ability. Read on
Story first published:Saturday, January 23, 2021, 11:18 [IST]
Desktop Bottom Promotion