For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ఆ క్షణాలను హాయిగా ఆస్వాదించొచ్చా...

పెద్దలు కుదిర్చిన పెళ్లిలో కూడా ప్రేమ పుడుతుందని మీకు తెలుసా.

|

ప్రస్తుత సమాజంలో నేటి తరం అమ్మాయిలు, అబ్బాయిలు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడానికి అంతగా ఇష్టపడటం లేదు. తమ మనసుకు నచ్చిన వారిని వెతుక్కుని పెళ్లాడటానికి ప్రాధాన్యమిస్తున్నారు.

Arranged Marriage Love Story in Telugu

ముఖ్యంగా తమ స్నేహితులలో ఎవరైనా ఎవరైనా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటే వింతగా చూసే పరిస్థితి కూడా వచ్చింది. అయితే ఓ అధ్యయనం ప్రకారం ప్రపంచంలో 55 శాతం వివాహాలు పెద్దలు కుదిర్చినవే.

Arranged Marriage Love Story in Telugu

వాటిలో 4 శాతం మాత్రమే విడాకుల వరకు వెళ్లాయి. అందుకే పెద్దలు కుదిర్చిన సంబంధాలు ఎక్కువ కాలం పాటు నిలుస్తున్నాయి. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. అయితే ప్రేమ పెళ్లి అయినా.. పెద్దలు కుదర్చిన వివాహం అయినా ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని మాత్రం కచ్చితంగా గుర్తుంచుకోవాలి.

Arranged Marriage Love Story in Telugu

ఏ బంధమైనా బలంగా ఉండాలంటే.. వారిద్దరి మధ్య సఖ్యత, అర్థం చేసుకునే మనస్తత్వం, ప్రేమానురాగాలు ఉండాలి. ఇలాంటివి ఉన్న వారి బంధం పది కాలాల పాటు పదిలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు ఎంచుకున్న భాగస్వామి ఎలా ఉన్నారని కాదు.. మీ రిలేషన్ షిప్ ఎంత స్ట్రాంగ్ గా ఉందనే విషయాన్ని మీరు గుర్తించాలి. ఈ సందర్భంగా పెద్దలు కుదర్చిన పెళ్లి తర్వాత కూడా ప్రేమ పెరుగుతుందా లేదా ఒకవేళ అదే నిజమైతే అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

తాళి కట్టినవాడితో రొమాన్స్ చేయలేకపోతున్నా.. కానీ కడుపు వచ్చింది.. ఇప్పుడేం చేయను..తాళి కట్టినవాడితో రొమాన్స్ చేయలేకపోతున్నా.. కానీ కడుపు వచ్చింది.. ఇప్పుడేం చేయను..

ఇష్టాయిష్టాలకు విలువ..

ఇష్టాయిష్టాలకు విలువ..

మీ ఇష్టాలకు విలువ ఇస్తూనే మీకు సరైన జోడిని ఎంపిక చేసేందుకు తల్లిదండ్రులు బాగానే కష్టపడతారు. కానీ ఒక సంబంధం వచ్చిందంటే ముందుకు వెళ్లొచ్చా.. లేదా అని మనకంటే ఎక్కువ ఆలోచిస్తారు. తెలిసిన వారందరితో ఆరా తీస్తారు. అయితే ప్రేమ వివాహంలో ఇలాంటి వాటికి అవకాశం ఉండకపోవచ్చు.

బాగా సర్దుకుపోతారు..

బాగా సర్దుకుపోతారు..

పెద్దలు కుదిర్చిన పెళ్లిలో దాదాపుగా మీ పుట్టింటి, అత్తింటి వారి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు ఒకటే కావడం వల్ల మీ అత్తింట్లో మీరు త్వరగానే ఇమిడిపోగలుగుతారు. పైగా మిమ్మల్ని మీరు పెద్దగా మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు.

దగ్గరి వ్యక్తినే..

దగ్గరి వ్యక్తినే..

పెద్దలు కుదిర్చిన పెళ్లిలో మీ కుటుంబ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లకు దగ్గరగా ఉండే కుటుంబానికి చెందిన అబ్బాయినే మీకు భర్తగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. కాబట్టి మీ భర్త అందరితో చాలా త్వరగా కలిసిపోతారు. చిన్న చిన్న ఇబ్బందులున్నప్పటికీ సర్దుకుపోతారు.

మీ భాగస్వామిలో మీరు పట్టించుకోని లక్షణాలేంటో తెలుసా...మీ భాగస్వామిలో మీరు పట్టించుకోని లక్షణాలేంటో తెలుసా...

భవిష్యత్తు గురించి..

భవిష్యత్తు గురించి..

పెళ్లి తర్వాత అయినా.. పెళ్లికి ముందు అయినా ప్రతి ఒక్కరికి భవిష్యత్తు గురించి చాలా ఆలోచనలుంటాయి. ముఖ్యంగా తమ లైఫ్ పార్ట్ నర్ ఎలా ఉండాలో అనే విషయంపై కూడా స్పష్టత ఉంటుంది. కాబట్టి మీకు నచ్చిన వరుడు దొరికేంత వరకు మీరు ఎదురుచూడొచ్చు.

కొన్ని అనుమానాలు..

కొన్ని అనుమానాలు..

ఎవరితో అయినా ప్రేమలో ఉన్నా.. డేటింగ్ చేస్తున్నా.. మీకు కొన్ని సందేహాలుంటాయి. ‘నాకు పెళ్లవుతుందా?' ‘నన్ను మోసం చేయరు కదా'అనే అనుమానాలు వేధిస్తుంటాయి. అంతేకాదు ‘నేను వారి కుటుంబానికి నచ్చుతానా' అనే విషయాలు కొంత భయపెడుతుంటాయి. అయితే పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ఇలాంటి సందేహాలు పెద్దగా ఉండకపోవచ్చు.

ప్రేమ వివాహంలో..

ప్రేమ వివాహంలో..

ప్రేమ వివాహం చేసుకున్న వారు తమ లైఫ్ పార్ట్ నర్ ఇంతకుముందులా లేరని.. బాగా మారిపోయారని చెబుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో భార్యభర్తల మధ్య మనస్పర్దలు కూడా వస్తుంటాయి. అయితే పెద్దలు సెట్ చేసిన సంబంధంలో మార్పు గురించి పెద్దగా ప్రస్తావన రాకపోవచ్చు. ఎందుకంటే వివాహం తర్వాత వారి న్యూ లైఫ్ స్టార్టవుతుంది కాబట్టి. ఈ క్రమంలో ఇద్దరు ఒకరినొకరు తెలుసుకొంటు ముందుకు సాగుతారు.

పెద్దగా అంచనాలుండవు..

పెద్దగా అంచనాలుండవు..

పెద్దలు సెట్ చేసే మ్యాచ్ విషయంలో వివాహం చేసుకునే వారు చాలా ఓపికగా ఉంటారు. ముందుగా తమ భాగస్వామి గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఇద్దరూ ఒకరితో ఒకరు పెద్దగా పరిచయం లేనివారే. కాబట్టి ఒకరిపై ఒకరు పెద్దగా అంచనాలు పెంచుకోరు. అంతేకాదు ప్రతి క్షణాన్ని హాయిగా ఆస్వాదిస్తారు.

English summary

Arranged Marriage Love Story in Telugu

Here we talking about the arranged marriage love story in Telugu.Read on,
Desktop Bottom Promotion