For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ భాగస్వామిలో ఈ లక్షణాలుంటే.. మీ వివాహ జీవితానికి మధ్యలోనే ముగింపు పలుకుతారట...!

తమ భాగస్వామిని సెలెక్ట్ చేసుకోవడంలో చాలా మంది చేసే పెద్ద పొరపాట్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

మన చేతికి ఉండే ఐదు వేళ్లు సమానంగా ఉండవు. అలాంటిది ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కరూ సమానంగా ఉండరు.. ఒకే రకంగా ఆలోచించరు.. ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంటుంది.

Biggest Mistakes People Make When Choosing a Life Partner in Telugu

ఉదాహరణకు అందరూ రొమాంటిక్ గా ఉండరు. అందరూ హ్యామర్ గా ఉండరు. కొందరు పెళ్లికి ప్రాముఖ్యత ఇవ్వరు.. మరికొందరు ప్రేమకు ప్రాధాన్యత ఇవ్వరు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపుతారు.

Biggest Mistakes People Make When Choosing a Life Partner in Telugu

ఎంత వద్దనుకున్నా కళ్యాణం మాత్రం చేసుకుంటారు. అందుకే పెద్దలు ఇలా అంటారు 'కళ్యాణం వచ్చినా.. కక్కు వచ్చినా ఆగదు'. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది చాలా ముఖ్యమైనది. ఒకప్పుడు పెళ్లికి ముందు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసేవారట.

Biggest Mistakes People Make When Choosing a Life Partner in Telugu

మరిప్పుడు అలాంటి పరిస్థితులు లేవనుకోండి. అయినా కొన్ని సందర్భాల్లో అన్నింటినీ పరిశీలించి.. చాలా వివరాలను ఆరా తీసి సంబంధాలను సెట్ చేసుకుంటూ ఉంటారు. ఎన్ని చూసినా కొన్ని సందర్భాల్లో మనల్ని అన్ని విధాలుగా అర్థం చేసుకునే భాగస్వామి దొరకకపోవచ్చు. ఇదిలా ఉండగా.. పెళ్లి విషయంలో చాలా మంది వ్యక్తులు తమ భాగస్వామి ఎంపిక విషయంలో చేసే అతి పెద్ద పొరపాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

కపుల్స్ మధ్య సాన్నిహిత్యం పెరగాలంటే.. ఇవి తగ్గించుకోవాల్సిందే...కపుల్స్ మధ్య సాన్నిహిత్యం పెరగాలంటే.. ఇవి తగ్గించుకోవాల్సిందే...

కఠినంగా ఉంటే..

కఠినంగా ఉంటే..

మన జీవితంలో ఎదురయ్యే కొందరు వ్యక్తులు చాలా కఠినంగా ఉంటారు. వీరు కేవలం తమ కెరీర్ కే ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. అయితే రిలేషన్ షిప్ లో మాత్రం అలా ఉండరు. ఎల్లప్పుడూ వీరినే ప్రేమించాలి.. వీరినే ఇష్టపడాలి.. వీరితోనే క్లోజ్ గా ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి వారికి రొమాంటిక్ భాగస్వామి దొరకడం కొంత కష్టమే. ఒకవేళ వీరికి ఎవరైనా భాగస్వామి దొరికినా.. వీరి కఠినత్వం కారణంగా త్వరలోనే వీరిద్దరూ విడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

నెగిటివ్ థింకింగ్..

నెగిటివ్ థింకింగ్..

మరి కొందరు వ్యక్తులు ఎల్లప్పుడూ పాజిటివ్ ఆలోచనలకు బదులుగా నెగిటివ్ గా ఆలోచిస్తుంటారు. వీరు తమ భాగస్వామి అభిప్రాయాలు, అలవాట్లు, అభిరుచుల గురించి అస్సలు పట్టించుకోరు. అంతేకాదు భాగస్వామిపై ఎప్పుడూ ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి చెడు అలవాట్ల కారణంగా వీరు తమ జీవిత భాగస్వామిని త్వరగా దూరం చేసుకుంటారు.

భవిష్యత్తు గురించి..

భవిష్యత్తు గురించి..

మరి కొందరు వ్యక్తులు వివాహానికి ముందు.. వివాహం తర్వాత ఒకేలా ఉంటారు. ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకోరు. ప్రతి విషయంలోనూ చాలా ఈజీగా మూవ్ ఆన్ అవుతూ ఉంటారు. వీరు పార్ట్నర్ ఫీలింగ్స్ ని అస్సలు పట్టించుకోరు. ప్రస్తుత పరిస్థితి తప్ప.. భవిష్యత్తు గురించి ఏ మాత్రం ఆలోచించరు. రిలేషన్ షిప్ ను సైతం చాలా లైట్ తీసుకుంటారు. ఎక్కువ కాలం కలిసి జీవించాలని కోరుకోరు. ఇలాంటి వారిని మనువాడితే.. ఆ బంధం అతి త్వరగా కట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

నాలుగు పదుల వయసు దాటాక.. ఆ కార్యం కష్టమేనా?నాలుగు పదుల వయసు దాటాక.. ఆ కార్యం కష్టమేనా?

ఫీలింగ్స్ విషయంలో..

ఫీలింగ్స్ విషయంలో..

మరి కొందరు పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత కూడా తమ ఫీలింగ్స్ ను బయట పెట్టేందుకు తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు. వీరు ఏ విషయాన్ని అంత త్వరగా ఓపెన్ అవ్వరు. ఎక్కువగా తమ పార్ట్నర్ ఓపెన్ అయ్యేలా ప్లాన్ చేస్తారు. అయితే వీరు వివాహ జీవితంలో ఎంతో ఆనందంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఏదైనా ఇబ్బందులు వస్తే.. వాటిని భాగస్వామితో చెప్పేందుకు చాలా సతమతమవుతారు. దీని వల్ల ఇద్దరి మధ్య మానసికంగా, భావోద్వేగ పరమైన ఇబ్బందులు రావొచ్చు. ఇలాంటి భాగస్వాముల భావోద్వేగాలను అర్థం చేసుకోవడం కొంత కష్టమే.

గందరగోళంలో..

గందరగోళంలో..

మరికొందరు వ్యక్తులు తమ రిలేషన్ షిప్ గురించి ఒక క్లారిటీతో ఉండరు. ఎప్పుడూ గందరగోళ పడుతూ ఉంటారు. రోజుకో విధంగా తమ కోరికలను, నిర్ణయాలను మార్చుకుంటూ ఉంటారు. వీరు కొన్నిసార్లు కుటుంబానికి, స్నేహితులకు ప్రాధాన్యత ఇస్తే.. మరికొన్నిసార్లు బంధువులకు ప్రాధాన్యత ఇస్తుంటారు. చివరగా భాగస్వామిపై ఆసక్తి చూపుతారు. కాబట్టి ఇలాంటి వారితో కాపురం చేయడం కష్టమే.

నిజాయితీ విషయంలో..

నిజాయితీ విషయంలో..

కొందరు వ్యక్తులు రిలేషన్ షిప్ ను చాలా నిజాయితీగా చూస్తారు. కానీ మరికొందరు వ్యక్తులు సంబంధాల విషయంలో మోసం చేస్తూ ఉంటారు. వీరు రిలేషన్ షిప్ లో ఒకరి కంటే ఎక్కువమందితో కమిట్ అవ్వడం వంటివి చేస్తూ ఉంటారు. ఇది తెలిసినా భాగస్వాములు వారు తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధపడతారు. ఈ కారణంగా వీరు రిలేషన్ షిప్ లో స్థిరంగా ఉండలేరు. కాబట్టి ఇలాంటి లక్షణాలున్న వ్యక్తులను పెళ్లి చేసుకునేందు ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించండి. లేకపోతే మీ వైవాహిక జీవితానికి మధ్యలోనే ముగింపు పలకాల్సి వస్తుంది.

పర్సనాలిటీ విషయంలో..

పర్సనాలిటీ విషయంలో..

కొందరు వ్యక్తులు తమకు కాబోయే భాగస్వామికి ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం ఉంటే చాలనుకుంటారు. అలాంటి వారికి మంచి పర్సనాలిటీ లేకపోయినా.. వ్యక్తిగతంగా వారు ఎంత చెడ్డవారైనా.. గుడ్డిగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి వారిని పెళ్లి చేసుకుంటే.. పెళ్లైన తొలి రోజు నుండే మీకు కష్టాలు ప్రారంభమవుతాయి. ఎందుకంటే వారి చెడు ప్రవర్తన కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

English summary

Biggest Mistakes People Make When Choosing a Life Partner in Telugu

Here are the biggest mistakes people make when choosing a life partner in Telugu. Have a look
Story first published:Monday, August 23, 2021, 14:49 [IST]
Desktop Bottom Promotion