Just In
- 2 hrs ago
నోటి దుర్వాసన రాకుండా నాలుకను ఎలా శుభ్రం చేసుకోవాలి?
- 2 hrs ago
National Doctors’ Day 2022 :వైద్య రంగానికి జీవితాన్ని అంకితం చేసిన బిదన్ చంద్ర రాయ్ గురించి నమ్మలేని నిజాలు..
- 3 hrs ago
Ashada Bonalu 2022 in Telangana :బోనం అంటే ఏమిటి? బోనాల పండుగ జరుపుకునేందుకు గల కారణాలేంటో తెలుసా...
- 4 hrs ago
బ్లాక్ టీ లేదా మిల్క్ టీ, ఏ టీ తాగాలో తెలుసుకొని ఆరోగ్యంగా ఉండండి..
Don't Miss
- Finance
Small savings rate: వచ్చే నెలలో స్మాల్ సేవింగ్స్ వడ్డీ రేట్లు పెరిగే అవకాశం
- Sports
ICC T20I Rankings: కోహ్లీ రికార్డును తుడిచిపెట్టిన బాబర్ ఆజం.. టీ20ల్లో అరుదైన ఘనత
- Movies
విడాకుల వ్యవహారం మీద స్పందించిన హేమచంద్ర-శ్రావణభార్గవి.. అయినా క్లారిటీ రాలేదుగా!
- Technology
భారత్ నుండి సర్వర్లను తొలగించిన మరో VPN సంస్థ!
- News
vastu tips: బుద్ధుడి విగ్రహాలను ఇళ్ళలో పెట్టుకుంటున్నారా? అయితే చెయ్యకూడనివి ఇవే!!
- Automobiles
రేపు భారతీయ మార్కెట్లో విడుదల కానున్న మారుతి సుజుకి కొత్త కార్.. వివరాలు
- Travel
మనసును బంధించే బన్నెరఘట్ట నేషనల్ పార్క్!
Bizarre:తన ప్రియురాలిని కలిసేందుకు ఎలక్ట్రిషియన్ ఏం చేశాడో తెలిస్తే షాకవుతారు...!
Bizarre Love Story: ప్రేమ అనే రెండక్షరాలకు ఎంతో పవర్ ఉంది. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధానికి బలమైన పునాది ప్రేమ. ఒక్కసారి ప్రేమలో పడితే చాలు ఎక్కడలేని శక్తి వచ్చేస్తుంది.
అయితే తమ ప్రేమ విషయం ఎవ్వరికీ తెలియకుండా ఉండాలంటే ప్రస్తుత ప్రపంచంలో కాస్త కష్టమే. అయినా ఓ ప్రేమికుడు తన ప్రియురాలిని నిత్యం కలిసేందుకు కొన్ని తుంటరి పనులు చేశాడు. ఇలా ఒకసారి కాదు.. రెండుసార్లు ఏకంగా కొన్నిరోజుల పాటు చేసేశాడు.
తను చేసిన పనికి గ్రామంలోని ప్రజలందరూ తల్లడిల్లిపోయేవారు. ఇంతకీ ఆ కుర్రాడు ఏం చేశాడు.. తను చేసిన పనికి గ్రామస్తులు ఎందుకు ఇబ్బంది పడ్డారు.. ఇంతకీ తన ప్రేమ సక్సెస్ అయ్యిందా లేదా అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Relationship
Tips
:'నా
భార్య
నా
ప్రమేయం
లేకుండానే
ప్రెగ్నెన్సీ
తెచ్చుకుంది..
నేనేం
చేయాలి'

కరెంట్ కట్..
బీహార్ రాష్ట్రంలోని పూర్నియా జిల్లా గణేష్ పూర్ గ్రామంలో ప్రతిరోజూ కరెంట్ కట్ అవుతూ ఉండేది. ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి కామన్ అనుకున్నారంతా.. అయితే రోజూ ఒకే సమయానికి కరెంట్ కట్ కావడం.. సరిగ్గా రెండు మూడు గంటల తర్వాత పవర్ రావడం జరుగుతూ ఉండేది. దీంతో గ్రామస్తులు చాలా ఇబ్బంది పడ్డారు.

అంతా బాగానే ఉన్నా..
అయితే పక్కన ఉన్న గ్రామాల్లో కరెంట్ కట్ కావడం లేదు.. కేవలం తమ గ్రామంలోనే ఎందుకు కరెంట్ పోతోందని గ్రామస్తులకు అనుమానం వచ్చింది. కరెంట్ ఆఫీసుకు ఫోన్ చేస్తే.. అక్కడి సిబ్బంది మా నుండి ఎలాంటి సమస్యా లేదు. ఇక్కడంతా బాగానే ఉందని సమాధానమిచ్చారు. మళ్లీ ఊరెళ్లి ట్రాన్స్ ఫార్మర్ ను కూడా మరోసారి చెక్ చేశారు.. అక్కడ కూడా బాగానే ఉంది.

ఏం జరుగుతోందో..
అదే సమయంలో గ్రామస్తులు ఒక ప్లాన్ వేశారు. చిన్న చిన్న టీమ్స్ గా ఏర్పడి కరెంటో పోయిన ప్రాంతాల్లో కొన్నింటిని బ్యాటరీ లైట్లతో, సెల్ ఫోన్ టార్చితో జాగ్రత్తగా పరిశీలించారు. అయితే అలా కరెంట్ అయిన సమయంలో ఎక్కడా దొంగతనాలు జరగలేదు. ఎక్కడా దొంగల జాడ కూడా లేదు. అయితే ఏం జరుగుందనే విషయం వారికి అంతుచిక్కలేదు.
మీరు
సెక్స్
జీవితంలో
హ్యాపీగా
గడుపుతున్నారా
లేదా?

రాత్రిపూట కలిసేలా..
అదే గ్రామానికి చెందిన ఎలక్ట్రిషియన్.. అదే ప్రాంతంలో నివసించే ఓ యువతిని ప్రేమించాడు. తనను పగలు కలిసేందుకు సమయం కుదరక.. రాత్రిపూట కలిసేలా ప్లాన్ వేసుకున్నారు. ఇంకేముంది అనుకున్న టైం ప్రకారం.. తన లవర్ ను కలిసేందుకు వెళ్లినప్పుడంతా ఊళ్లో కరెంట్ కట్ చేసేవాడు.

రాత్రిపూల రాసలీలాల్లో..
అయితే ఓ రోజు కొందరు చిన్నారులకు ఓ స్కూల్ దగ్గర ఏదో చప్పుడు వినిపించింది. చీకట్లోనే తమ పెద్దలతో కలిసి ఏ మాత్రం శబ్దం చేయకుండా అక్కడికి చేరుకున్నారు. వారు ఊహించింది నిజమే.. అక్కడ ప్రేమ జంట ఆ కార్యంలో మునిగిపోయి ఆస్వాదిస్తూ ఉంది. ఒక్కసారిగా బ్యాటరీ లైట్లు వేసేసరికి వారు ఉలిక్కిపడ్డారు. వారిని వెంటనే బయటకు తీసుకొచ్చారు. నాలుగు దెబ్బలు పడేసరికి.. అసలు విషయం చెప్పేశాడు.

తను ఎలక్ట్రిషియన్ అని
తన ప్రియురాలిని కలిసేందుకు ఊరికి కరెంట్ చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. ప్రతిరోజూ స్కూల్ కు చేరుకుని.. రెండు మూడు గంటలు గడిపిన తర్వాత కరెంట్ ఆన్ చేస్తున్నట్లు చెప్పాడు. అయితే తనకు తగిన శిక్ష తప్పదని అక్కడి వారు బెదిరిస్తుంటే.. ఆ ప్రేమికురాలు మాత్రం వారిని కాళ్లమీద పడి ప్రాధేయపడింది.

పెళ్లి చేసేశారు..
ఈ నేపథ్యంలో ఆ గ్రామ సర్పంచి, పంచాయతీ పెద్దలు వీరి గోల ప్రతిరోజూ భరించడం కంటే.. వీరికి పెళ్లి చేయడమే మేలని నిర్ణయం తీసుకున్నారు. వెంటనే వారికి వివాహం జరిపించారు. ఇప్పటినుంచైనా కరెంట్ కోతల బాధ తప్పుతుందని అందరూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు.