Latest Updates
-
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే!
ఆ విషయాల్లో మగవారు చేసే అతిపెద్ద పొరపాట్లేంటో తెలుసా...!
పురుషులు సంబంధం విషయంలో ఎలాంటి పెద్ద తప్పులు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరి జీవితంలో బంధం.. అనుబంధం.. అనురాగం అనేవి చాలా ముఖ్యమైనవి. అందులో దాంపత్య జీవితం మరీ ముఖ్యమైంది. ఇలాంటి సుదీర్ఘమైన బంధాన్ని ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పదికాలాల పాటు సాఫీగా ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు.

అయితే సంసారం అన్నాక సరదాలు, పోట్లాటలు, మనస్పర్దలు అనేవి సహజంగానే ఉంటాయి. అయితే ఇలాంటి విషయాల్లో చాలా మంది పురుషులు ఎన్నో తప్పులు చేస్తుంటారు. చాలా మంది మగాళ్లు పెళ్లికి ముందు తాము పులిలా బతికామని.. కానీ పెళ్లి తర్వాత తమ జీవితంలో ఆనందం అనేదే లేకుండా పోయిందనే బాధలో ఉండిపోతారంట.

వారిలో చేవ తగ్గినా.. లేదా ఇంకా ఏదైనా సమస్య ఎదురైనా కూడా అందుకు కారణం తమ భార్యే కారణమని ఫీలవుతారంట. పిల్లలు చదువుకోకపోయినా.. ట్యాంకులో నీళ్లు రాకపోయినా.. వంటలో ఉప్పు తక్కువైనా.. లేదా కారం ఎక్కువైనా.. ఇలా అనేక కారణాలను పడకగదికి ఆపాదించి బూతులు తిడుతూ ఉంటారట.

సరిగ్గా ఇలాంటి విషయాలపై నిపుణులు సర్వే జరిపితే, అందులో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకొచ్చాయి. వాటిలో ముఖ్యంగా చాలా మంది పురుషులు తమలో ఉన్న లోపాన్ని భార్య ఎక్కడ కనిపెడుతుందో అనే ఆందోళనతో... తమ భాగస్వామిని ముందే ఏదో ఒక కారణం ఆమెపై నెట్టేసి వారిని తిట్టడం వంటివి చేస్తుంటారట. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం రండి...

అలా బాధపడేవారే..
వాస్తవం చెప్పాలంటే.. ఎవరైతే మగవారు ఆత్మన్యూనతతో బాధపడుతూ ఉంటారో.. అలాంటి వారే తమ జీవిత భాగస్వామిపై అస్తమానం నోరు పారేసుకుంటారు. తమలో ఎన్నో లోపాలు ఉన్నప్పటికీ, వాటన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి, ఆ నెపాన్ని తమ భార్యపై నెట్టేస్తుంటారు.

తప్పు లేకపోయినా..
చాలా మంది పురుషులు తమ భాగస్వామి ఏ తప్పు చేయకపోయినప్పటికీ వారు పశ్చాత్తాపపడేలా చేస్తారు. ‘నేనేప్పుడు కరెక్టే.. నేనసలు తప్పులే చేయను' అనే భావనలో ఉండటమే వారు చేసే పెద్ద తప్పు. ఇలాంటి తప్పుల వల్ల బంధంలో గొడవలు మొదలవుతాయి. కనీసం సరదాగా మాట్లాడుకునే పరిస్థితి కూడా ఉండదు.

ఒత్తిడి పెరిగితే..
ఎవరైతై అబ్బాయిలు దాంపత్య జీవితంలో ఒత్తిడిని అనుభవిస్తుంటారో.. అలాంటి సమయంలో దాన్ని అధిగమించేందుకు ప్రయత్నించకుండా.. ఎప్పుడూ కోపంగా.. ఒత్తిడి వంటి భావోద్వేగాలకు లోనవుతూ తన భాగస్వామిపై ఏవేవో నిందలు వేస్తుంటారు.

ఇవి ఆలోచించాలి..
ఒక మహిళ అమ్మగా... సేవకురాలిగా.. భార్యగా.. ఉద్యోగినిగా.. ఇంకా ఎన్నో బాధ్యతలకు సమన్యాయం చేసేందుకు అనునిత్యం ఆరాటపడుతూ ఉంటుంది. అలాంటి ఇల్లాల్లిని మనం ఇష్టపడకుండా.. నిందలు వేయడం కరెక్టు కాదంటున్నారు నిపుణులు. నిజానికి ప్రతి ఒక్కరి జీవిత భాగస్వామిలో మనకు నచ్చే అంశాలు.. నచ్చని అంశాలు ఉంటాయి.

ఆ కార్యాన్ని ఆస్వాదించాలని..
మరి కొందరు మగాళ్లు ఆ కార్యంలో ప్రతి కదలికనూ ఆస్వాదించాలని కోరుకుంటూ ఉంటారు. అలా కోరుకున్న ప్రతిసారీ తన భాగస్వామి యాక్టివ్ రోల్ ప్లే చేయాలని ఆశిస్తుంటారు. అయితే అమ్మాయిల్లో సహజంగా వచ్చే బిడియం వల్లో లేదా ఇంకేదో కారణాల వల్ల ఆమె అందుకు సహకరించకపోవచ్చు. అలాంటి సమయంలో మీరే చొరవ తీసుకుని.. సమస్య ఎక్కడుంటే పరిష్కారానికి ప్రయత్నం చేయాలి.

ప్రేమగా చెబితే..
మీరు ప్రతి చిన్న విషయానికీ అరవడం.. ఆమెను వేధించడం వంటివి చేస్తూ మీ జీవిత భాగస్వామి మనసును గాయపరచడం వంటివి చేయడం సరైన పని కాదు. ఎలాంటి ఆడవారైనా సరే ప్రేమగా చెబితే ఏ పనైనా చాలా ఇష్టం చేసేస్తారు.

అలా మాట్లాడకూడదు..
అంతేగానీ మీ బంధం గురించి మీ ఇద్దరి భవిష్యత్తు గురించి మాట్లాడేందుకు నోరు తెరిస్తే చాలు వారితో వాదనలకు దిగడం.. టాపిక్ డైవర్ట్ చేయటం.. అసలు ఏమి మాట్లాడినా గొడవలు జరిగేలా మాట్లాడకూడదు. అలా మాట్లాడినప్పుడే మీ బంధం గురించి మీరు మళ్లీ పునరాలోచించాల్సి వస్తుంది.



Click it and Unblock the Notifications