For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రియమైన వ్యక్తి చేతిలో మోసపోయారా? అసలెందుకు ఇలా జరుగుతుందో తెలుసుకోండి

ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తులు మనల్ని మోసం చేస్తే గుండెను పిండేసినట్లు అవుతుంది. ఆ బాధను భరించడం చాలా కష్టంగా ఉంటుంది. నేనింతగా ప్రేమించినా నన్ను మోసం చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది అనే ప్రశ్న తలెత్తుతుంది.

|

ప్రేమలో నమ్మకం, గౌరవం, నిబద్ధతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇవే మంచి సంబంధానికి పునాది. ఒక బంధంలో నిలబడటంలో నమ్మకానిది అత్యంత ముఖ్యమైన పాత్ర. అదొక్కటి ఉంటే అన్ని సంబంధాలు బలంగా నిలబడతాయి. ఒకరికొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం, నిబద్ధత అనేవి సంబంధాన్ని నిలబెడతాయి. ఒక బంధంలో ఇవి లేనప్పుడు ఆ బంధం ముసుగులో మోసం చేసే అవకాశాలు ఉంటాయి. మనం ఎంతో ప్రేమించాం అనుకునే వ్యక్తులు కూడా మోసం చేసే అవకాశాలు ఉంటాయి.

Cheated by a loved one? Know why this is happening in Telugu

ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తులు మనల్ని మోసం చేస్తే గుండెను పిండేసినట్లు అవుతుంది. ఆ బాధను భరించడం చాలా కష్టంగా ఉంటుంది. నేనింతగా ప్రేమించినా నన్ను మోసం చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది అనే ప్రశ్న తలెత్తుతుంది.

అసలు ఒక వ్యక్తి ఎందుకు మోసం చేస్తాడు.. తమను ప్రాణంగా ప్రేమిస్తున్నారని తెలిసినా అలా మోసం ఎలా చేయగలిగారు అనే ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాం.

సాన్నిహిత్యం లేకపోవడం:

సాన్నిహిత్యం లేకపోవడం:

ఏ సంబంధానికైనా సాన్నిహిత్యం చాలా ముఖ్యం సాన్నిహిత్యం ఉన్నప్పుడే భాగస్వామితో సుఖ దుఃఖాలను స్వేచ్ఛగా పంచుకోగలుగుతారు. లేకపోతే రెండింటి మధ్య ఒక రకమైన సరిహద్దు నిర్మాణంగా, విభేదాలు తలెత్తుతాయి. ఒకరితో ఒకరు సంతృప్తి చెందనప్పుడు ఈ సాన్నిహిత్యం లేకపోవడం సాధారణంగా ఏర్పడుతుంది. కాబట్టి మీ భాగస్వామికి ఏది అవసరమో, కూర్చుని చర్చించుకోండి. లేకుంటే వారు మరొకరిని వెతుక్కుంటూ వెళ్లవచ్చు.

నిర్లక్ష్యం:

నిర్లక్ష్యం:

సంబంధంలో దేనినైనా సహించవచ్చు కానీ నిర్లక్ష్యాన్ని మాత్రం ఎప్పటికీ సహించలేం. ప్రతి విషయంలోనూ వారిని పరిగణనలోకి తీసుకోకపోవడం లేదా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు వారి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం.

ఒకరితో బంధంలో ఉన్నప్పుడు వారి అభిప్రాయాలకు, వారు ఇచ్చే సూచనలకు విలువ ఇవ్వాలి. జీవితాంతం తోడుండే బంధంలో వ్యక్తిగతం అంటూ ఉండదు. ఒకరు తీసుకునే నిర్ణయాలు ఇద్దరిపై ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పుడు వారి అభిప్రాయాలను, సలహాలు, సూచనలు తీసుకోవాలి.

ప్రతీకారం:

ప్రతీకారం:

బాధను, కోపాన్ని వ్యక్తీకరించడానికి ప్రతీకారం ఒక భయంకరమైన మార్గం. మీరు చేసిన తప్పు లేదా చేసిన బాధకు ఈరోజు ప్రేమను మోసం చేసి ప్రతీకారం తీర్చుకునే సందర్భం వచ్చినప్పుడు మోసం చేస్తారు. నేరుగా ప్రతీకారం తీర్చుకునే ధైర్యం లేకపోవడం, తాహతు లేకపోవడం వల్ల ప్రేమ అనే ముసుగు వేసుకుని ప్రతీకారాన్ని తీర్చుకుంటారు.

కోరికల్లో మార్పులు:

కోరికల్లో మార్పులు:

కొందరికి ఒకే వ్యక్తితో ఉండటం బోరింగ్‌గా అనిపిస్తుంది. ఎల్లప్పుడూ కొత్త వాటి కోసం, భిన్నమైన వాటి కోసం వెతుకుతుంటారు. అలాంటి వ్యక్తి సంబంధాన్ని బోరింగ్‌గా భావించినప్పుడు, వారు ఆ వ్యక్తిని మోసం చేసి కొత్త వారిని వెతుక్కోవచ్చు. అలాంటి వ్యక్తులు తమ సెక్స్ జీవితంలో వెరైటీని కోరుకోవచ్చు. వారి దైనందిన జీవితంలో ఏదో ఒక రకమైన సాహసం చేయాలనుకోవచ్చు.

కమిట్‌మెంట్ సమస్యలు:

కమిట్‌మెంట్ సమస్యలు:

మోసం చేయడానికి కమిట్మెంట్ కారణం కాదు. కానీ కొన్ని సంబంధాలు ముగిసిపోవడానికి కమిట్మెంట్ పెద్ద కారణంగా నిలుస్తుంది. ఎందుకంటే కొంత మందికి కమిటెడ్‌గా ఉండటం నచ్చదు. ఎలాంటి కట్టుబాట్లు లేకుండా స్వతంత్రంగా ఉండటాన్ని కొందరు ఇష్టపడతారు. అలాంటి వ్యక్తులు రాబోయే కట్టుబాట్లకు భయపడతారు. వారి సంబంధాన్ని విచ్ఛిన్నం చేయాలని నిర్ణయించుకుంటారు.

ప్రేమ లేకపోతే:

ప్రేమ లేకపోతే:

మీరు ప్రేమించే వ్యక్తి మిమ్మల్ని తిరిగి ప్రేమించకపోవచ్చు. దీని వల్ల వారు మీ పట్ల తమ ఆకర్షణను కోల్పోయి ఉండవచ్చు. దాని కోసం మీతో ప్రేమలో ఉండటానికి బదులుగా, వేరొకరి దగ్గర లభించే ప్రేమ కోసం వెళ్లిపోవచ్చు. ఒక్కసారి మనసు విరిగిపోతే తిరిగి అతికించడం కష్టం.

English summary

Cheated by a loved one? Know why this is happening in Telugu

read this to know Cheated by a loved one? Know why this is happening in Telugu
Story first published:Saturday, December 17, 2022, 16:39 [IST]
Desktop Bottom Promotion