For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పార్ట్నర్ ను వెనక నుండి వాటేసుకుంటే.. సర్ ప్రైజే కాదు.. మస్తు సంతోషిస్తారట..!

|

మనలో పెళ్లైన జంటలు లేదా ప్రేమలో ఉండే జంటల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. కొందరి మధ్య రెగ్యులర్ గా జరుగుతుంటాయనుకోండి. అదే వేరే విషయం.

అయితే మీ నుండి మీ భాగస్వామి పదే పదే దూరంగా వెళ్తున్నారంటే.. వారిని కాసేపు అలా వదిలేయడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వారంతట వారే మీ గురించి తెలుసుకునేంత వరకు కొంత సమయం ఇవ్వాలి.

అయితే సింగిల్ గా ఉన్నప్పుడు ఎలా ఉన్నా ఓకే కానీ.. ఒక్కసారి మింగిల్ లైఫ్ లోకి వచ్చాక మాత్రం కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైనది బాడీ లాంగ్వేజ్. ఎందుకంటే అది మీ ప్రవర్తనను.. మీ మూడ్ ను తెలియజేస్తుంది.. దేనిపై మీకు ఆసక్తి ఉందో తెలిసేలా చేస్తుంది.. కాబట్టి భాగస్వామిని సంతోషపెట్టేందుకు ఏమి చేయాలి.. ఏమి చేయకూడదనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Study :సెక్స్ లో మగాళ్ల కన్నా మహిళలకే కోరికలు ఎందుకు ఎక్కువుంటాయో తెలుసా...Study :సెక్స్ లో మగాళ్ల కన్నా మహిళలకే కోరికలు ఎందుకు ఎక్కువుంటాయో తెలుసా...

వినడం ఇష్టం లేకపోతే..

వినడం ఇష్టం లేకపోతే..

మనలో చాలా మంది ఏదైనా కార్యక్రమాల్లో లేదా సభలో తెగ ఉపన్యాసాలు ఇస్తుంటారు. వారి ఊకదంపుడు ఉపన్యాసాలను వినలేక చాలా మంది చప్పట్లు కొట్టి.. ఇంతవరకు చెప్పింది చాలు..ఇక వెళ్లి కూర్చో అన్నట్టు కరతాళ ధ్వనులు చేస్తారు. అదే భాగస్వామి విషయానికొస్తే.. మీకు మీ భాగస్వామి చెప్పేది నచ్చకపోయినా.. మీరు వారు చెప్పే విషయాలను వినడానికి ఇష్టపడకపోతే.. మీ మాటలకు అక్కడితో పుల్ స్టాప్ పెట్టమని చేతులు కట్టుకుంటారట.

నేరుగా చూడకుండా..

నేరుగా చూడకుండా..

మనలో చాలా మంది మాట్లాడేటప్పుడు కళ్లలోకి నేరుగా చూడటానికి భయపడతారు. అదే ప్రేమలో ఉన్నవారు మాత్రం గంటలకొద్దీ కళ్లలో కళ్లు పెట్టి చూసుకుంటూ మాట్లాడుకుంటారు. కానీ సాధారణంగా మనం మాట్లాడేటప్పుడు నేరుగా చూడకుండా తలను పైకెత్తి చూడటం వంటివి చేస్తుంటాం. ఇది ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందట. అదే సమయంలో మీరు ఎదుటివారి పట్ల తక్కువ భావనతో ఉన్నట్లుగా సంకేతాలు పంపిస్తుంది.

వేలు చూపిస్తే..

వేలు చూపిస్తే..

సాధారణంగా మనం ఎక్కడైనా బయటకు వెళ్లినప్పుడు లేదా ఏదైనా ఫంక్షన్ లో పాల్గొన్నప్పుడు మనకు కావాల్సిన వారిని పిలవమని.. చుట్టుపక్కల వారికి వేలిని చూపిస్తుంటాం. అయితే అలా చేయడం వల్ల మీరు ఏదో తప్పు చేస్తున్నారనే ఫీలింగ్ ఎదుటివారికి కలుగుతుందట.

లైంగిక కార్యం గురించి ఆందోళన పడేందుకు గల కారణాలేంటో తెలుసా...లైంగిక కార్యం గురించి ఆందోళన పడేందుకు గల కారణాలేంటో తెలుసా...

కూర్చొనే పద్ధతి..

కూర్చొనే పద్ధతి..

మనలో చాలా మంది భుజాలను వాల్చేసి తల కిందికి వాల్చి కూర్చుంటారు. ఇలా కూర్చుంటే మీ బలహీనతను తెలుపుతున్నట్లు అవుతుందట. దీంతో మీరు మీ భాగస్వామితో లేదా ఇంకా ఎవరితో అయినా మీరు సరిగ్గా కూర్చోకపోతే వారికి మీ మీద నమ్మకం, విశ్వాసం అనేది అంత సులభంగా కుదరదట.

షేక్ హ్యాండ్..

షేక్ హ్యాండ్..

మనలో ఎవరితో అయినా ఎప్పుడైనా కలిసినప్పుడు షేక హ్యాండ్ అనేది సాధారణంగా ఇస్తూనే ఉంటాం. అయితే అలా షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ భాగస్వామికి షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు వారి చేతి మీద మీ చేయి ఉంటే.. మీరు వారి కంటే ఎక్కువ అనే ఫీలింగ్ కలుగుతుందట. అలాగే మీరు వారి చేతిని వంచడం వంటివి చేయకూడదట.

పదే పదే ఫోన్ చేసుకోకవడం..

పదే పదే ఫోన్ చేసుకోకవడం..

ఈరోజు మనలో చాలా మంది చాలా సందర్భాల్లో ఎంతమందిలో ఉన్న ఫోన్ ను పదే పదే చెక్ చేసుకోవడం వంటివి చేస్తూనే ఉన్నారు. అయితే మీరు మీ భాగస్వామితో కూడా ఉన్నప్పుడు కూడా అలా చేయడం వారికి అంతగా నచ్చదట. అది చాలా అసహ్యంగా అనిపిస్తుందట. మీరు వారితో అలా చేయడం వల్ల వారి పట్ల మీకు అంతగా ఆసక్తి లేదనిపిస్తుందట.

దగ్గరిగా వెళ్లి మాట్లాడటం..

దగ్గరిగా వెళ్లి మాట్లాడటం..

మనలో చాలా మంది ఎదుటి వారి దగ్గరికి వెళ్లి మాట్లాడటం.. లేదా భుజాలపై తడుముతూ మాట్లాడటం వంటివి చేస్తూ ఉంటారు. అయితే మీ భాగస్వామితో కూడా అలా చేస్తే.. తను ఏ ఇబ్బంది పడకపోతే.. ఒకే. కానీ తను ఏ మాత్రం ఇబ్బందిపడ్డా.. పక్కకు జరుగుతున్నా మీరు వారిని వదిలేయాలి. వారికి కొంత సమయం ఇవ్వాలి. లేదంటే మీ రిలేషన్ షిప్ సమస్యలు పెరుగుతాయి.

రెగ్యులర్ హగ్..

రెగ్యులర్ హగ్..

కపుల్స్ ఇద్దరూ రొమాన్స్ పరంగా ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండాలంటే.. మీ భాగస్వామిని రెగ్యులర్ హగ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే రోజు మొత్తంలో మూడు నిమిషాల పాటు భాగస్వామిని కౌగిలించుకోవడం వల్ల మీ బంధం మరింత బలపడుతుందట. అది కూడా వెనక నుండి గట్టిగా వాటేసుకుంటే.. భాగస్వామిని ఆశ్చర్యంతో పాటు ఆనందంలో ముంచేయొచ్చట.

English summary

Common Body Language Mistakes That Destroy Relationships in Telugu

Here are the common body language mistakes that destroy relationships in Telugu. Have a look
Story first published: Wednesday, July 28, 2021, 17:32 [IST]