For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా వైరస్ కలవరం : కలయికలో పాల్గొంటే కరోనా కాటేస్తుందా?

|

కరోనా వైరస్ చైనా నుండి పక్క దేశాల్లో ఏ సమయంలో అడుగు పెట్టిందో తెలియదు కానీ.. దాని కలవరం మాత్రం ప్రపంచమంతటా వ్యాపించింది. ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఓ) కూడా ఈ వైరస్ ను తీవ్రంగా పరిగణించింది.

అంతటితో ఆగకుండా దీనిని ప్రపంచానికే మెడికల్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. కరోనా వైరస్ మానవుడి జుట్టు కంటే 900 రెట్లు సన్నగా ఉంటుందని.. అందుకే ఇది మానవుడిని అత్యంత సులభంగా సోకుతుందని తెలిపింది. అయితే ఈ కరోనా వైరస్ మన దేశాన్ని ప్రస్తుతం ముప్పుతిప్పలు పెడుతోంది. రోజురోజుకు కరోనా మహమ్మారికి సంబంధించిన కేసులు పెరిగిపోతుండటంతో ప్రతి ఒక్కరూ భయాందోళన చెందుతున్నారు. అయితే ఈ వైరస్ గురించి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు కూడా వ్యాప్తి చెందుతున్నాయి. అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మీరు మీ భాగస్వామితో కలయికలో పాల్గొంటే లేదా మీ పార్ట్ నర్ ముద్దు పెట్టుకోవడం ద్వారా కూడా ఈ వైరస్ సోకుతుందని చాలా మంది భయపడిపోతున్నారు. అయితే ఎంత మాత్రం నిజం ఉందో తెలుసుకుందాం...

జర భద్రం! కరోనా వైరస్ మీ ఫోన్ నుండి కాటేస్తుంది... అయితే కలవరపడకండి... ఈ టిప్స్ ఫాలో అవ్వండి...

WHO విజ్ఞప్తి..

WHO విజ్ఞప్తి..

సోషల్ మీడియాలో కరోనా వైరస్ కలవరానికి సంబంధించిన పుకార్లను, అసత్య ప్రచారాలను నమ్మొద్దని WHO విజ్ఞప్తి చేసింది. ఇలాంటి వాటిని ఏ మాత్రం పట్టించుకోవద్దని, WHO జారీ చేసిన సూచనలను పాటించాలని ప్రజలను కోరుతూ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

తాజాగా కలకలం..

తాజాగా కలకలం..

కరోనా వైరస్ భయం నేపథ్యంలో ఓ మనిషి ఎంత దగ్గరివారైనా వారి పట్ల ఒక రకమైన అనుమానంతోనే చూస్తున్నారు. తాజాగా ఒక భర్త తన భార్యకు కరోనా వైరస్ ఉందేమో అనే భయంతో ఆమెను టాయిలెట్ లో పెట్టిన సంఘటన కలకలం రేపింది.

కరోనా దెబ్బ..

కరోనా దెబ్బ..

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ మహిళను ఆసుపత్రికి తరలించి, ఆమెకు కరోనా లేదని తేల్చి చెప్పేంత వరకు ఆమె భర్త అనుమానం పోలేదు. కరోనా దెబ్బకు కట్టున్న భర్తే ఇలా చేస్తే.. ఇతర మానవ సంబంధాలపై కరోనా దెబ్బ ఏ మాదిరిగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

పెరుగుతున్న దూరం..

పెరుగుతున్న దూరం..

కరోనా వైరస్ దెబ్బకు పార్ట్ నర్స్ మధ్య దూరంగా బాగా పెరిగిపోతోందట. ముఖ్యంగా కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగస్తుల మధ్య ఈ దూరం మరింత పెరిగిపోతోందని వారే చెబుతున్నారు. ఉదయం ఇంటి నుండి బయటికెళ్లిన తర్వాత వారు పని నిమిత్తం అందరితో కలవడం చేస్తుంటారు.

ఏసీల్లో పనిచేయడం వల్ల..

ఏసీల్లో పనిచేయడం వల్ల..

పైగా ప్రస్తుతం చాలా మంది పని చేసే కార్యాలయాల్లో ఏసీలు సర్వసాధారణంగా మారిపోయాయి. అయితే ఈ వైరస్ చల్లని వాతావరణంలో మరింత వేగంగా వ్యాపిస్తుందన్న ప్రచారం పెరిగిపోవడంతో చాలా మంది తెగ భయపడిపోతున్నారు.

సన్నిహితంగా ఉండేందుకు..

సన్నిహితంగా ఉండేందుకు..

కరోనా వైరస్ దెబ్బకు అనేక మంది జంటలు ఆడా, మగా అనే తేడా లేకుండా ఎవరైనా సరే వారి పార్ట్ నర్ తో ఇంతకుముందులా సన్నిహితంగా ఉండేందుకు సంకోచిస్తున్నారు.

తస్మాత్త్ జాగ్రత్త: కరోనా వైరస్ వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు, వృద్ధులకు ప్రమాదం ఎక్కువ: అధ్యయనం...

అపొహలతో..

అపొహలతో..

ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు కరోనా వైరస్ అపొహలను ఎక్కువగా నమ్ముతున్నారు. దీని కోసం అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే వీరు ఆఫీస్ పనుల మీద తరచు ప్రయాణాలు చేస్తుంటారు. ఆన్ సైట్ వర్క్ అంటూ వివిధ నగరాలకు సైతం తిరుగుతుంటారు.

ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుందంటే..

ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుందంటే..

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కరోనా వైరస్ సోకిన వ్యక్తికి దగ్గరగా వెళ్లిన తర్వాత మీకు కరోనా వైరస్ వస్తుందా లేదా అనేది నాలుగు అంశాలపై ఆధారపడి ఉంటుంది.

1) మీరు ఆ బాధితులకు ఎంత దగ్గరకు వెళతారు.

2) దగ్గు లేదా తుమ్ము సమయంలో బాధితుడి నీటి బిందువులు(తుంపర్లు) మీపై పడిన సమయంలో

3) మీరు వారితో చేతులు కలిపినప్పుడు

4) మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు మరియు మీ రోగ నిరోధక శక్తి బలంగా ఉందో లేదో చూసుకోవాలి.

చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే...

చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే...

వాస్తవానికి మీరంతా కరోనా వైరస్ ను చూసి అందరూ ఇంతగా భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ ఈ వైరస్ పట్ల ఆందోళన చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలు. తరచూ చేతులను శుభ్రపరచుకోవడం. శానిటైజర్లను వాడటం.. వేడి నీటితో నోటిని పుక్కిలించుకోవడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు మనల్ని మనం కరోనా వైరస్ బారి నుండి కాపాడుకోవచ్చు.

English summary

Coronavirus Scare : Partners scared while getting intimate

Here we talking about coronavirus scare : partners scared while getting intimate. Read on