`
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలాంటి ప్రీ వెడ్డింగ్ షూట్ ఎవ్వరూ చేయలేరు... ఇంతకీ ఏమి చేశారంటే...!

|

సాధారణంగా మన దేశంలో పెళ్లి తంతు అంటే నిశ్చితార్థం, తాంబూలం, మంగళవాయిద్యాలు, మంగళసూత్రం, రిసెప్షన్ వంటి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. అలాంటి వివాహం అనే మధురమైన ఘట్టం చాలా మంది జీవితంలో కేవలం ఒకే ఒక్కసారి వస్తుంది. అయితే పెళ్లి చేసుకునే వారిలో ఎవరైనా అత్యంత ఎక్కువకాలం పాటు దాచుకునే వాటిలో ఫొటోలు ఒకటి. ఇలాంటి ఫొటోలను ఎంతకాలమైనా చూసుకుని తెగ ఆనందపడిపోతుంటారు చాలా మంది కపుల్స్.

ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో చాలా మంది కపుల్స్ పెళ్లి తర్వాత లేదా పెళ్లికి ముందు ఫోటీ షూట్లు చేసుకోవడం అనేది చాలా సర్వసాధారణమైపోయింది. అంతేకాదు ప్రస్తుతం ఇది ట్రెండ్ గా మారిపోయింది. ఒకప్పుడు కేవలం ధనికులు లేదా ప్రముఖులు మాత్రమే తీసుకునే ఈ ప్రీవెడ్డింగ్ ఫొటోషూట్లను ఇప్పుడు అందరూ తీసుకుంటున్నారు.

దీని కోసం అందమైన ప్రదేశాలు.. కొత్త బట్టలు, మేకప్ ఆకర్షణీయంగా చేసుకుని ప్రతి ఫొటో ఆకర్షణీయంగా కనిపించేలా ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కొంచెం భిన్నంగా ఫొటోషూట్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇటీవల వెరైటీ పేరిట కేరళ జంట చేసిన ఫొటోషూట్ పై చాలా విమర్శలు వచ్చాయి. కానీ తాజాగా కర్నాటకకు చెందిన ఓ జంట మాత్రం ప్రీ వెడ్డింగ్ షూట్ ను అందరికంటే వెరైటీగా.. అది కూడా ఎవ్వరూ ఊహించలేనంత.. కనీసం ఆలోచన కూడా చేయలేనంత ఫొటోషూట్ తీసుకుంది.

దీన్ని చూసిన నెటిజన్లు వారిని అభినందిస్తున్నారు. అసలు ఫొటో షూట్ అంటే ఇలా సింపుల్ గా ఉండాలని చెబుతున్నారు. దీంతో ఈ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. ఆ ఫొటోలేంటో మీరు చూసెయ్యండి...

ఫోటో చూసిన వారు..

ఫోటో చూసిన వారు..

వీరి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ యొక్క థీమ్ చూసిన ఒక జంట ఫోటోషూట్ మరింత అర్ధవంతంగా ఉండాలని అభినందిస్తున్నారు. ఈ జంట భవన నిర్మాణ కార్మికులుగా కనిపిస్తున్నారు. అతను ఇటుకలను పేర్చినట్లయితే, ఆమె భవనాన్ని భద్రపరచడానికి అవసరమైన గారను తీసుకువస్తోంది.

వివాహం ఇల్లు లాంటిది

వివాహం ఇల్లు లాంటిది

ఇల్లు నిర్మించేటప్పుడు, ఇంటి పునాది బలంగా ఉండేందుకు.. ఎలాగైతే రాళ్లను, ఇటుకలను పేర్చి కడతామో అదేవిధంగా భర్త ఇటుక అయితే, భార్య ఇసుక లేదా సిమెంట్ మాదిరిగా కలిసిపోతేనే ఆ దాంపత్య జీవితం స్థిరపడుతుందని వారి భావన. ఈ ఫొటోషూట్ లో మరో అర్థమేమిటంటే.. జీవితంలో కూడా ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటేనే ముందుకు సాగగలమని.. ఇంటి నిర్మాణానికి ఇంకొకరి మద్దతు ఉంటేనే ఇల్లు పూర్తవుతుందని ఫొటోషూట్ ద్వారా తెలియజేసే ఆలోచన అద్భుతమని నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

సంతోషంగా ఉంటాం..

సంతోషంగా ఉంటాం..

ఈ జంట భవన నిర్మాణ కార్మికుల వలె కనిపించడమే కాదు.. వారు తినడం మరియు విడదీయడం వంటి దృశ్యం చాలా చూపరులను హ్రుదయాలను ఇట్టే హత్తుకుంటున్నాయి. ముఖ్యంగా అతను ఆమె కోసం నీరు త్రాగినప్పుడు, ఈ ఫోటో మరో లెవెల్ కు పోయిందని చెప్పొచ్చు. కష్టజీవుల గురించి కరెక్టుగా చెప్పే చిత్రమని చెప్పొచ్చు.

విభిన్నమైన ఆలోచన.

విభిన్నమైన ఆలోచన.

మనం ఇంతవరకు ఎన్నో ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్లను చూశాం. రొమాంటిక్ గా.. కొన్ని విచిత్రంగా.. వికారంగా ఉండే వాటిని కూడా చూశాం. కానీ గూడు కట్టుకునే జీవిలాగా కనిపించే వారి ఫొటోషూట్ ను ఇప్పుడే చూస్తున్నాం. ఇలాంటి ఫొటోషూట్ ఆలోచన ఎవ్వరు చేయలేరు. వీరి విభిన్నమైన ఆలోచన చాలా అర్థవంతమైందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

English summary

Couple Recreates Scenes From House Construction in Pre-Wedding Photoshoot

Couple recreats scenes from house construction in pre wedding photoshoot, read on.
Story first published: Friday, November 20, 2020, 11:30 [IST]