For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎంత గొడవ పడితే.. అంత ప్రేమంట...! అప్పుడే ఆ బంధం గట్టిగా బలపడుతుందట...!

|

ప్రేమికులు లేదా భార్యభర్తలు చిన్న చిన్న వాటికే మనస్పర్దలు పెంచుకుంటున్నారా? అనవసరంగా గొడవలు పడుతున్నారా? ప్రతిరోజూ మాట మాటకు పెంచుకుంటూ విడాకుల వరకు వెళ్తున్నారా? అయితే ఆలుమగలు, లేదా ప్రేమ పావురాలు.. ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ అనేది జీవితాంతం కొనసాగాలంటే ఏమి చేయాలో తెలుసా? ఖరీదైన వస్తువులు బహుమతులివ్వడం..

తమ ప్రియురాలు లేదా భాగస్వామి కోరిన కోరికలను నెరవేర్చడం వంటివి చేయాలా? ఇవేవీ చేయకుండానే ప్రేమికుల లేదా దంపతుల మధ్య బంధం బలపడేందుకు కొన్ని చిట్కాలున్నాయని పలు అధ్యయనాలు తెలిపాయి. భార్యభర్తలు లేదా ప్రేమికుల బంధం బలపడేందుకు పరిశోధకులు చెప్పిన విషయాలు వింటే మీరు ఆశ్చర్యపోతారు. అదేంటంటే మీకు, మీ భాగస్వామికి మధ్య ఎంత గొడవ జరిగితే అంత ప్రేమ పెరుగుతుందంట.

ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు కలిసి జీవిస్తున్న సమయంలో గొడవలు రావడం అనేది సర్వసాధారణమైన విషయం. ఇది చాలా సహజంగా జరిగే ప్రక్రియ. అయితే ఇలాంటి గొడవలు తమ బంధానికి మరింత మంచి చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఓ సర్వే కూడా నిర్వహించారట. అందులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయంట. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం...

వాలెంటైన్ వీక్ 2020 : ఏడు రోజులు.. ఏడు వింతలు.. ఏడు పద్ధతులు.. మీ ప్రేమ బంధానికి పునాదులు...!

గొడవ పడేవారే ఆనందంగా..

గొడవ పడేవారే ఆనందంగా..

ఓ పరిశోధన ప్రకారం భార్యభర్తలు లేదా ప్రేమికులు ఏదైనా విషయం గురించి చర్చించకోవడం లేదా గొడవ పెట్టుకోవడం వంటివి జరిగితే ఆ జంటలు మిగిలిన జంటల కన్నా పది రెట్లు ఎక్కువగా ఆనందంగా ఉంటారంట.

గొడవలను వాయిదా వేయటం..

గొడవలను వాయిదా వేయటం..

గొడవలకు సంబంధించిన ఈ సర్వేలో సుమారు వెయ్యి మంది పాల్గొన్నారట. తమ భాగస్వామి చేసిన పనులు నచ్చకపోయినా.. వాటి చూస్తూ ఊరుకునే వ్యక్తులు కూడా ఆనందంగా ఉండలేరట. వారిలో అసహనం పెరిగి ఎప్పుడో ఒకసారి పెద్ద గొడవకు దారి తీసే ప్రమాదం ఉందట. దీనిపై ప్రముఖ రచయిత జోసఫ్ జెన్నీ ఏమన్నారంటే ‘‘గొడవలను వాయిదా వేయడం కపుల్స్ చేసే అతి పెద్ద తప్పు‘‘ అని అన్నారు.

కోపం తెచ్చకుంటాం..

కోపం తెచ్చకుంటాం..

‘‘మనలో చాలా మంది ప్రేమ లేదా పెళ్లి బంధం గురించి ఏదేదో ఊహించుకుంటాం. అవి జరగకపోతే ఎంతో బాధపడతాం. కొన్నిసార్లు కోపం తెచ్చుకుంటాం. కానీ ఎదుటి వ్యక్తికి మాత్రం ఏమీ చెప్పకుండా ఉండిపోతాం. మన కోపం తీవ్రమయ్యేంత వరకు ఏమీ మాట్లాడం. అయితే వీటన్నిటినీ కలిపి ఒకేసారి గొడవ పడితే పట్టరానంతంగా మారిపోతుంది‘‘ అని జోసఫ్ అన్నారు.

కోపాన్ని అణచుకోవాలి..

కోపాన్ని అణచుకోవాలి..

‘‘చాలా మంది కోపం వచ్చిన సమయంలో వాటిని అణచుకోవాలని భావిస్తుంటారు. కానీ వాటి వల్ల నష్టాలను అంచనా వేయలేరు. ఇందుకు కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఒకటికి రెండు సార్లు మీరు వదిలేద్దాం అనుకున్న అంశాలు అతిపెద్ద గొడవ మారిన సందర్భాలు చాలా ఉన్నాయి.‘‘ అని గుర్తు చేస్తున్నారు.

ప్రేమ జాతకం ఫిబ్రవరి 2020 : ఈ 2 రాశుల వారు ప్రేమలో మునిగి తేలుతారట! మీ రాశి కూడా ఉందేమో చూడండి...

గొడవ వల్ల వచ్చే ఫలితాలు..

గొడవ వల్ల వచ్చే ఫలితాలు..

అయితే మనలో చాలా మంది కపుల్స్ గొడవ పడటానికి గల కొన్ని కారణాలను చెప్పారు. ‘‘మనం గొడవ పెట్టుకున్న వెంటనే వచ్చే ఫలితాలపైనే మనం ఫోకస్ పెడతాం. వాటి గురించి ఎక్కువ కాలం ఆలోచించం. ఇలా గొడవ పెట్టుకోకుండా ఎదుటివారిపై కోపాన్ని పెంచుకుంటే వారిపై నమ్మకం, ఇద్దరి మధ్య ఫీలింగ్స్, దగ్గరితనం అన్నింటిపై అది ప్రభావం చూపించే అవకాశం ఉంది‘‘ అంటున్నారు.

చిన్నవే అనుకుంటే చింతలే..

చిన్నవే అనుకుంటే చింతలే..

ఇవి కొన్నిసార్లు చిన్న చిన్న గొడవలే అనిపించినప్పటికీ అవి భవిష్యత్తులో పెద్దగా మారిపోయి తమ బంధంలో లుకలుకలు ఏర్పడేలా చేస్తాయట. అందుకే చిన్న చిన్న వాటికే గొడవలు పడి.. దాన్ని అక్కడికక్కడే వదిలేసే కపుల్స్.. ఎక్కువగా గొడవలు పడని వారికంటే చాలా సన్నిహితంగా.. ఎక్కువ కాలం సంతోషంగా ఉంటారట.

చెడు విషయాల గురించి..

చెడు విషయాల గురించి..

అయితే ప్రతి కపుల్ తమ బంధాన్ని బలపరచుకోవాలంటే ఇద్దరి మధ్య కమ్యూనికషన్ గ్యాప్ లేకుండా చూసుకోవాలని పరిశోధన చెబుతోంది. కమ్యూనికేషన్ అంటే కేవలం మంచి విషయాలు మాత్రమే కాదు. చెడు విషయాల గురించి మాట్లాడుకోవాలట. అయితే ప్రతిరోజూ మాట్లాడుకోవాలని.. ప్రతి రోజూ గొడవ పడాలని రూలేమీ లేదట.

రెండో పెళ్లి వారు సైతం..

రెండో పెళ్లి వారు సైతం..

ఈ పరిశోధన ప్రకారం రెండో పెళ్లి చేసుకున్న వారిలో కూడా చాలా మంది తాము సరిగ్గా అన్ని విషయాల గురించి చర్చించుకోకపోవడం వల్లే తొలిసారి విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారట.

ప్రేమ అనేది..

ప్రేమ అనేది..

ప్రేమ అనేది కేవలం ఒకసారి ప్రేమించి తర్వాత వదిలేసేది కాదు.. ఆనందకరమైన బంధం కోసం ప్రతిరోజూ ఇద్దరూ ప్రయత్నిస్తూ ఉండాల్సిందే. బంధంలో ఉన్న సమయంలో కేవలం నిజం చెప్పడం, అవసరమైన విషయాల గురించి గొడవ పడకుండా మాట్లాడుకోవడం.. ఒకరిపై మరొకరికి నమ్మకం వల్ల ఇద్దరు సన్నిహితంగా ఉండి ఎక్కువ రోజులు కలిసి ఉంటారట.

చిన్న గొడవలైతే పర్వాలేదు..

చిన్న గొడవలైతే పర్వాలేదు..

మీరు గొడవలు కలిగించే విషయాలపై ఎప్పటికప్పుడు మాట్లాడుకోవడం అనేది చాలా ముఖ్యం. ఆ విషయం గురించి మీరు ఎలా మాట్లాడుతున్నారు అనే విషయం కూడా చాలా కీలకమట. మాటలతో ప్రారంభించి చిన్న చర్చ లేదా చిన్న గొడవ వరకు పర్వాలేదంట. కానీ ఇది మరీ పెద్ద గొడవలా కాకుండా ప్రేమికులు లేదా దంపతులే ప్రయత్నించాల్సి ఉంటుంది.

పొరపాటు గురించి..

పొరపాటు గురించి..

మీరు మీ భాగస్వామికి గౌరవం ఇస్తూనే వారు చేసిన పొరపాటు గురించి వారిని అడగాలి. వారు చేసిన తప్పులన్నీ ఎత్తి చూపుతూ.. వారిని ఒకేసారి ఇబ్బంది పెట్టడం సరికాదని జోసఫ్ చెబుతున్నారు. ఇలా మీ గొడవ ఒక వాగ్వాదంలా సాగితే ఇతరుల కంటే మీరు పది రెట్లు ఎక్కువగా ఆనందంగా ఉంటారట. చివరిగా మీరు ఇద్దరూ ఒక అభిప్రాయానికి వస్తే మీరిద్దరూ విజేతలుగా నిలుస్తారట. అయితే భేదాభిప్రాయాలు ఉంటే ఓడిపోయినట్టేనట. అయితే బంధం అంటే ఒకరు గెలవడం.. మరొకరు ఓడిపోవడ అనేది కాదు. ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన చర్చలాగా జరగాలంట. ఇందుకోసం కపుల్స్ ప్రయత్నం చేయాలట.

English summary

Couples Who Argue Together, stays together, research finds

Here we are talking about, couples who argue together, stays together, research finds. Read on
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more