For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షాకింగ్ సర్వే! లాక్ డౌన్ వేళ వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగాయట... అది కూడా 10 లక్షలకు పైనే...!

|

విదేశాలలో వివాహేతర సంబంధాలు అంటే సర్వసాధారణం. అయితే మన దేశంలో అది ఒక అపవిత్ర కార్యంగా అనేక మంది భావిస్తుంటారు. కానీ అదంతా గతం. ఇప్పుడంతా అలాంటి వాటిపై ఆసక్తి చూపుతున్నాయట చాలా జంటలు. దీని వల్లనే చాలా దారుణలు జరుగుతున్నాయనే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఓ వైపు లాక్ డౌన్ ఉన్నప్పటికీ ఈ వివాహేతర సంబంధాలు మాత్రం ఆగడం లేదంట. నిత్యం ఏదో ఒక చోట ఇలాంటివి బయటపడుతూనే ఉన్నాయి.

అయితే తాజాగా ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో పురుషులు ఎక్కువగా వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారని తేలింది. ఆ సంఖ్య కూడా పది లక్షల మార్కును దాటేసిందని ఆ సంస్థ బాంబు పేల్చేసింది. అంతేకాదు ప్రస్తుతం జరుగుతున్న అనేక నేరాల వెనుక ఇలాంటి అక్రమ సంబంధాలే కారణంగా నిపుణులు కూడా చెబుతున్నారు.

ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ ఉన్నప్పటికీ, చాలా మంది ఇలాంటి అక్రమ సంబంధాలపై ఎందుకు ఆసక్తి చూపుతున్నారు? కేవలం శారీరక సుఖం కోసమేనా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

OMG! గర్భం పొందడానికి ఆ లెస్బియన్లు ఎంత పని చేశారంటే...!

ఓ వ్యక్తితోనే..

ఓ వ్యక్తితోనే..

పూర్వ కాలంలో మన పెద్దలు అప్పటి పరిస్థితిని బట్టి ఆ కాలంలో ఒక మగాడు ఎంత మహిళలనైనా పెళ్లి చేసుకోవచ్చు. ఎలాంటి వారితో అయినా శారీరక సంబంధాలు పెట్టుకోవచ్చు. అయితే కాలం మారడంతో ఇందులో మార్పులొచ్చాయి. పరిస్థితుల ప్రభావం కారణంగా ఓ వ్యక్తితోనే సంబంధం కొనసాగించాలని నియమాలను తీసుకొచ్చారు. అప్పటి నుండే మనలో చాలా మంది ఒక్కరినే వివాహం చేసుకుని, హాయిగా కాపురం చేసుకుని జీవించేవారు.

ఎవరికి నచ్చినట్టు వారు..

ఎవరికి నచ్చినట్టు వారు..

అయితే ప్రస్తుతం పరిస్థితులు కూడా చాలా మార్పులు రావడంతో ప్రతి ఒక్కరికీ కావాల్సినంత స్వేచ్ఛ దొరికింది. దీంతో పెళ్లి అయినా కూడా చాలా మంది ఎవరినైనా ఇష్టపడితే వారిని ఎలాగోలా ఒప్పించేసి వారితో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. దీన్ని స్వేచ్ఛగా భావిస్తున్నారు. ఈ కారణంగానే చాలా మంది వారిని నచ్చినట్టు జీవిస్తున్నారు. అయితే ఇలాంటి వాటిపై ఓ సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి.

భార్యభర్తల గొడవలే..

భార్యభర్తల గొడవలే..

చాలా మంది విపరీతంగా వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి గల కారణాలేంటి అని ఆరా తీస్తే, భార్యభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండటమే దీనికి కారణమని తేలిందట. స్మార్ట్ యుగంలో కావాల్సినంత స్వేచ్ఛ దొరకడం, చిన్న చిన్న విషయాలకే జంటల మధ్య మనస్పర్దలు రావడం.. వారిలో ఒకరిపై ఒకరికి చిరాకు కలగడం వంటి వాటి వల్ల వివాహేతర సంబంధాలకు ఆసక్తి చూపుతున్నారట.

అక్కడ మగాళ్లకు ప్రవేశం నిషేధం.. కానీ మహిళలు గర్భం దాలుస్తున్నారు.. అదెలా సాధ్యమంటే?

త్వరగా పెళ్లి చేసుకోవడం..

త్వరగా పెళ్లి చేసుకోవడం..

అయితే మన దేశంలో ఇప్పటికీ చాలా చోట్ల బాల్య వివాహాలు జరుగుతూ ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇలా చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల, వారు అనుకున్న విధంగా లైఫ్ పార్ట్ నర్ దొరకలేదని భావిస్తున్నారట చాలా మంది. దీని వల్ల ఇతర సంబంధాలను వెతుక్కోవడం వంటివి చేస్తున్నారట.

ఆర్థిక సమస్యలు..

ఆర్థిక సమస్యలు..

మరోవైపు భార్య భర్తల మధ్య ఆర్థిక పరమైన విషయాలలో సమస్యలు పెరగడం కూడా వివాహేతర సంబంధాలకు దారి తీస్తొందట. లేదా విపరీతమైన వ్యామోహం, కోరికల వల్ల వేరే వారితో సంబంధాలు పెట్టుకోవాలని భావిస్తున్నారట.

ఒకరి గురించి మరొకరికి..

ఒకరి గురించి మరొకరికి..

అయితే చాలా మంది భార్యభర్తలు కలిసి కావాల్సినంత సమయం గడపలేకపోతున్నారట. ఎవరి గోల వారిదే అన్న తీరుగా వ్యవహరిస్తున్నారట. బయటి వ్యక్తులకు కేటాయించిన కనీస సమయాన్ని కూడా కట్టుకున్న వారితో గడపం లేదంట. కనీసం వారి ఇష్టాలు కూడా తెలుసుకోవడం లేదట. అంతేకాదు ప్రేమను కూడా చూపడం లేదట. పెళ్లి జరిగిందా.. ఏం జరిగినా వారు మనల్ని అస్సలు వదిలిపోలేరులే అన్న ఓ ధీమా కారణంగా ఇతరులతో రిలేషన్ షిప్ ను పెంచుకుంటున్నారట.

అమ్మాయిలు ఈ పనులు చేస్తే.. అబ్బాయిలు ఆటోమేటిక్ గా ప్రేమలో పడిపోతారట...!

గ్లీడెన్ యాప్ లో..

గ్లీడెన్ యాప్ లో..

సరిగ్గా ఇలాంటి సమయంలో ‘గ్లీడెన్ యాప్‘ సంస్థ వివాహేతర సంబంధాలపై మన దేశంలో సర్వే నిర్వహించగా.. కరోనా వైరస్ మహమ్మారి ఉన్నప్పటికీ 10 లక్షల మందికి పైగా వినియోగదారులు వివాహేతర సంబంధాలపై ఆసక్తి చూపారట. అంతేకాదు రోజురోజుకు సభ్యత్వాలు కూడా పెరుగుతున్నాయట.

మెట్రో నగరాల్లోనే ఎక్కువ..

మెట్రో నగరాల్లోనే ఎక్కువ..

అయితే ఇలాంటి వివాహేతర సంబంధాలు ఎక్కువగా ముంబై, కోల్ కత్తా, ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో పాలిటన్ నగరాల నుండే ఎక్కువగా ఉన్నాయని ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు.

విరహాన్ని తట్టుకోలేక..

విరహాన్ని తట్టుకోలేక..

అయితే ఇలా సభ్యత్వం తీసుకున్న కొందరితో ఆ సంస్థ ప్రతినిధులు మాట్లాడారట. లాక్ డౌన్ కారణంగా వర్చువల్ రొమాన్స్ కోసం వెతుకుతున్న యువత మరియు విద్యావాంతులైన నిపుణులతో కూడా మాట్లాడారట. వీరు మాట్లాడిన వారిలో మహిళలు వర్చువల్ వ్యవహారాన్ని తమ ప్రాథమిక ఎంపికగా కోరుకుంటున్నారని వారు వెల్లడించారు.

సాన్నిహిత్యంగా ముఖ్యమని...

సాన్నిహిత్యంగా ముఖ్యమని...

ఈ ఏడాది మార్చి 28 నుండి మే 5వ తేదీ వరకు జరిగిన సర్వేలో సుమారు 1500 మంది పాల్గొన్నారట. 64.6 శాతం మంది ప్రజలు వివాహం లేదా సంబంధంలో సాన్నిహిత్యం ముఖ్యమైందని భావిస్తున్నారట. కేవలం 28.7 శాతం సంబంధంలో ఒక ముఖ్యమైన భాగంగా దీనికి అనుకూలంగా ఓటు వేశారట.

ఇద్దరు వ్యక్తులతో ఒకేసారి..

ఇద్దరు వ్యక్తులతో ఒకేసారి..

మరో 5.3 శాతం మంది ప్రజలు సాన్నిహిత్యాన్ని వివాహం బంధంలో కొంతభాగమే అని ఓటు వేశారట. అయితే సుమారు 2 శాతం మంది ప్రజలు వివాహంలో ముఖ్యమైనది సాన్నిహిత్యం కాదు అని ఓటేశారట. ఈ సర్వే ఫలితంగా జనాభాలో 48.1 శాతం మంది ఒకే సమయంలో ఇద్దరు వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో ఉండొచ్చని భావిస్తున్నారట. 44.5 శాతం మంది దీనికి వ్యతిరేకంగా ఉండాలని భావిస్తున్నారు.

English summary

'Gleeden' App Based On Extra-marital Affairs, Crosses 10 Lakh Users In India

Here we talking about gleeden app based on extra-marital affairs, crosses 10 lakh users in India. Read on