For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తస్మాత్ జాగ్రత!! ఫ్రెంచ్ కిస్ తో 5 భయంకరమైన జబ్బులు ఖాయం !!

తస్మాత్ జాగ్రత!! ఫ్రెంచ్ కిస్ తో 5 భయంకరమైన జబ్బులు ఖాయం !!

|

'ము..ము.. ముద్దంటే చేదా.. నీకా ఉద్దేశం లేదా?' అంటూ ఏ సినీ కవి అన్నాడో. కానీ ఇప్పుడు ముద్దు నిజంగా చేదేనట. అదెలాగో తర్వాత తెలుసుకుందాం. ముద్దు అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. ముద్దుల్లో రకాలు ఉన్నాయి. ఎక్కువగా ఇష్టపడేది మాత్రం ఫ్రెంచ్ కిస్. అంటే అదర చుంభనం. లిప్ ని లిప్ తో లాక్ చెయ్యడం అన్నమాట. లవ్ లో ఉన్న వాళ్లు ఎక్కువగా ఫ్రెంచ్ కిస్ లు పెట్టుకోవడం కామన్. లిప్ ని లిప్ తో లాక్ చేసి ఎంజాయ్ చేస్తారు. ముద్దు అనేది మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతే కాదు లిప్ లాక్ తో క్యాలరీలు కూడా తగ్గుతాయని నమ్ముతారు. దీంతో ఇన్నాళ్లు ఫ్రెంచ్ కిస్సుల్లో మునిగి తేలారు. కానీ ఇక ముందు జాగ్రత్త పడాల్సిందే. లేదంటే.. భయంకరమైన జబ్బు ఖాయం అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

‘ఫ్రెంచ్‌ కిస్‌’ తో రోగాలు వచ్చే ఛాన్స్

‘ఫ్రెంచ్‌ కిస్‌’ తో రోగాలు వచ్చే ఛాన్స్

‘ఫ్రెంచ్‌ కిస్‌' తో రోగాలు వచ్చే ఛాన్స్ ఉందని, ముఖ్యంగా గనేరియా వంటి సుఖ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. గనేరియా పేరు వినే ఉంటారు కదా.. మనుషులకు సోకే బోలెడు సుఖవ్యాధులలో గనేరియా ఒకటి. అనారోగ్యకరమైన లైంగిక సంబంధాలవల్ల ఈవ్యాధి వస్తుందని సాధారణ భాషలో చెప్పుకోవచ్చు.

వైద్య పరిభాషలో చెప్పుకోవాలంటే

వైద్య పరిభాషలో చెప్పుకోవాలంటే

వైద్య పరిభాషలో చెప్పుకోవాలంటే గనేరియా సోకడానికి ప్రధాన కారణం నీసేరియా గనోకాకస్ అనే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా ముఖ్యంగా జననాంగాల నుండి ద్రవించే స్రవాలలో ఉంటుంది. సెక్సువల్లీ ట్రాన్స్ మిటెడ్ ఇన్ఫెక్షన్స్ లో ఒకటి అయిన ఈ గనేరియా సెక్స్ ద్వారా వ్యాపిస్తుంది. అయితే ఇప్పటివరకూ సాధారణ సెక్స్ తో పాటు ఓరల్ సెక్స్ ద్వారా మాత్రమే ఈ వ్యాధి సంక్రమిస్తుందనే అభిప్రాయం ఉండేది.

పరిశోధనలో ఫ్రెంచ్ కిస్ ద్వారా

పరిశోధనలో ఫ్రెంచ్ కిస్ ద్వారా

కానీ ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో ఫ్రెంచ్ కిస్ ద్వారా కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉందనే ఈ విషయం స్పష్టమైంది. దీన్ని లాన్సెట్ జర్నల్ లో పబ్లిష్ చేశారు.

ధూమపానం, మందుతాగడం కంటే ముద్దు ఆరోగ్యానికి

ధూమపానం, మందుతాగడం కంటే ముద్దు ఆరోగ్యానికి

ధూమపానం, మందుతాగడం కంటే ముద్దు ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఫ్రెంచ్ ముద్దుతో హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) అనేది త్వరగా వ్యాప్తి చెందుతుందట! ఈ వైరస్‌ వేగవంతంగా సోకడం వల్ల తల, మెడ క్యాన్సర్‌లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యులు అంటున్నారు.

అదర చుంబనం వల్ల ప్రతి సంవత్సరం పురుషులలో

అదర చుంబనం వల్ల ప్రతి సంవత్సరం పురుషులలో

అదర చుంబనం వల్ల ప్రతి సంవత్సరం పురుషులలో పదిశాతం, స్త్రీలలో ఏడుశాతం మంది క్యాన్సర్‌ బారిన పడుతున్నారని అమెరికాలో నిర్వహించిన మరో పరిశోధనలో వెల్లడైంది. ధూమపానం, మద్యపానం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వస్తాయన్న విషయం తెలిసిందే! అయితే చుంబనం వల్ల సంక్రమించే వైరస్‌ కారణంగా తల, మెడ క్యాన్సర్‌లు ఎక్కువ వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

అధర చుంబనం వల్ల వచ్చే క్యాన్సర్‌

అధర చుంబనం వల్ల వచ్చే క్యాన్సర్‌

అధర చుంబనం వల్ల వచ్చే క్యాన్సర్‌లకు కారణం ‘హ్యుమన్‌ పాపిల్లోమా వైరస్‌'(హెచ్‌పీవీ). ఈ వైరస్‌ కారణంగా స్త్రీలలో సర్వైకల్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందనే విషయం అందరికీ తెలిసిందే! నోరు, మెడ, చెవి వెనుకభాగాలలో క్యాన్సర్‌ రావడానికి ఈ వైరస్సే కారణమవుతుందని పరిశోధకులు అంటున్నారు.

స్త్రీ, పురుషుల్లో ఈ వైరస్‌ ఏ ఒక్కరిలో ఉన్నా

స్త్రీ, పురుషుల్లో ఈ వైరస్‌ ఏ ఒక్కరిలో ఉన్నా

స్త్రీ, పురుషుల్లో ఈ వైరస్‌ ఏ ఒక్కరిలో ఉన్నా ముద్దు పెట్టుకునే సమయంలో లాలాజలం ద్వారా ఎదుటివారి లోకి ప్రవేశిస్తుంది. తద్వారా వారికి కూడా పైన పేర్కొన్న క్యాన్సర్‌లు వచ్చే అవకాశం ఉందని అమెరికాలో నిర్వహించిన ఓ పరిశోధన వెల్లడించింది.

ఫ్రెంచ్‌ కిస్‌ వల్ల ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి

ఫ్రెంచ్‌ కిస్‌ వల్ల ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి

ఫ్రెంచ్‌ కిస్‌ వల్ల ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అమెరికాలో అయితే తల, మెడ క్యాన్సర్లు వస్తున్న వారిలో 10 శాతం మందికి హెచ్‌పీవీ వల్లనే వస్తున్నట్టు తేలింది.

ఈ వైరస్‌కి మగ, ఆడా అనే తేడా లేదట.

ఈ వైరస్‌కి మగ, ఆడా అనే తేడా లేదట.

ఈ ముద్దుతో 70 శాతం వైరస్ యాక్టివ్ అవుతుందట. ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు 250 రెట్లు అధికంగా ఈ క్యాన్సర్ బారిన పడతారని నిపుణులు అంటున్నారు. ఈ వైరస్‌కి మగ, ఆడా అనే తేడా లేదట. అందరిలోనూ ఒకే విధంగా సోకుతుందట. ము...ము...ముద్దంటే చేదా? ఆ ఉద్దేశం లేదా? అని ఎవరైనా కవ్వించి పిలిస్తే కాస్త ఆలోచించండి మరి.

ముద్దులో 278 క్రిములుంటాయ్‌!

ముద్దులో 278 క్రిములుంటాయ్‌!

ఏదైనా సరే మితంగా ఉంటే మేలు అతిగా ఉంటే అనర్థదాయకం అన్నారు. అందుకని హద్దుల్లో ఉంటూ ముద్దులు పెడితే తప్పులేదు. ముద్దు పెట్టుకునేటప్పుడు సుమారు 278 రకాల సూక్ష్మ క్రిములు ఒకరి నోటి నుంచి మరొకరి నోటిలోకి వెళ్లే ప్రమాదమూ ఉంది. అయితే ఈ సూక్ష్మ క్రిములన్నీ హానికరమైనవే అని చెప్పలేం. వాటిల్లో కొన్ని మంచివి కూడా ఉండొచ్చు. ఏది ఏమైనా, అధర చుంబనం సమయంలో నోటి పరిశుభ్రత చాలా ముఖ్యం. యాంటీ బ్యాక్టీరియల్ మౌత్‌వాష్ వంటివి వాడితే…మంచిది.

25 రకాల ముద్దులు

25 రకాల ముద్దులు

చేతిముద్దు, చెక్కిలి ముద్దు, ఫ్లయింగ్‌కిస్‌, లిప్‌కిస్‌ ఇలా ఎన్నో రకాల ముద్దులు ఉన్నాయి. ఒక్కో దాన్ని ఒక్కో సందర్భంలో పెడతారు. దాదాపు 25 రకాల ముద్దులు ఉన్నట్లుగా ఇప్పటివరకూ గుర్తించారు. ముద్దుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘ఫిలిమెటాలజీ’ అంటారు.

English summary

Got gonorrhea? It may have come from French kissing, study says

Gonorrhoea can be developed in the rectum, throat or eyes and may become increasingly difficult to treat given that certain strains of the infection are resistant to antibiotics.
Desktop Bottom Promotion