`
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీటిని అలవాటుగా చేసుకుంటే మీ భాగస్వామి ఎల్లప్పుడూ మీ చెంతనే ఉండడం ఖాయం..

|

ఈ కంప్యూటర్ కాలంలో రిలేషన్ షిప్ లో ఉన్నవారికి అన్నిటికంటే అతి ముఖ్యమైన విషయం భాగస్వామితో సంతోషంగా గడపడం. ప్రతిరోజూ గజిబిజీ లైఫ్ లో పడి తమ సంబంధాలను తనివితీరా కొనసాగించలేకపోతున్నారు. పని వేళలు ఇద్దరికి వేర్వురుగా ఉండటం, లేదా ఇతర కారణాలు ఏవైనా కావొచ్చు. మన దేశంలో ఇలాంటి వాటి వల్ల ఎక్కువ మంది తమ బంధాన్ని కొనసాగించలేక విడిపోవడానికే సుముఖత చూపుతున్నారు.

క్షణికావేశంలో కోర్టు మెట్లు ఎక్కేస్తున్నారు. ఇందుకు గల కారణాలను ఒక్కసారి పరిశీలిస్తే మొదటగా బంధంపై వీరికి అవగాహన లేకపోవడమే అని పలు అధ్యయనాలలో తేలిందట. అందుకే మీ భాగస్వామితో గడపడానికి తగిన సమయం కేటాయించండి. వారితో ప్రతిరోజూ సరదాగా మాట్లాడండి.. కొన్ని సందర్భాల్లో ఆటలు సైతం ఆడండి.. ఇలాంటివి అన్నీ మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి. మీ భాగస్వామితో మీ బంధాన్ని నిరంతరం పెంచుకునేందుకు ఈ అలవాట్లను అలవర్చుకోండి.. ఈ సందర్భంగా అద్భుతమైన అలవాట్లు ఏవేవో ఈ స్టోరీ ద్వారా తెలుసుకోండి...

1) విహార యాత్రలు..

1) విహార యాత్రలు..

రిలేషన్ షిప్ లో ఉన్నవారు లేదా కొత్తగా వివాహం చేసుకున్న వారు మీ భాగస్వామితో బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు సరదాగా వారంతపు సెలవురోజుల్లో ట్రిప్స్ ను ప్లాన్ చేయండి. ఏదైనా కొత్త స్థలం మరియు కొత్త వాతావరణంలో మీరు ఒకరితో ఒకరు మీ బంధాన్ని పెంచుకోవడానికి సరైన ప్రదేశం. మీ బంధం బలోపేతానికి ఇలాంటి ట్రిప్స్ బాగా ఉపయోగపడతాయి.

2) మార్కెట్ కు వెళ్లండి..

2) మార్కెట్ కు వెళ్లండి..

మీరిద్దరూ ఆదివారం సెలవు రోజు కాబట్టి మార్కెట్ కు వెళ్లడం, ఒకరితో ఒకరు గడపడానికి సులభమైన మరియు అందమైన మార్గం. ఇది మీ భాగస్వామిని ప్రత్యేకంగా సంతోషపరుస్తుంది. మీరు తాజా పండ్లు మరియు కూరగాయలను కొనడానికి కలిసి ఆ రోజును గడపవచ్చు. అలాగే మీరు ఒకరికొకరు రుచికరమైన వంటకాలు తయారు చేసుకోవచ్చు. ఇష్టమైన, మంచి రుచికరమైన వంటలు చేయడం మరియు తినడం కూడా మీ భాగస్వామితో కొంత సాన్నిహిత్యం పెరిగేలా చేస్తుంది.

3 రోలర్ స్కేటింగ్..

3 రోలర్ స్కేటింగ్..

మీ భాగస్వామితో మీకు అందుబాటులో ఉండే చోట ఒక జత రోలర్ బ్లేడ్ లను తీసుకోండి. ఇద్దరు కలిసి రోలర్ స్కేటింగుకు వెళ్లండి. అలా వెళ్లేటప్పుడు మీరిద్దరూ ఒకరి చేతులు ఒకరి పట్టుకోండి. ఇలాంటి సమయంలో మీరు చాలాసార్లు కింద పడవచ్చు. కానీ ఇది చాలా సజీవమైన ఆటగా మారి మీలో ప్రేమను మరియు ఆనందాన్ని పెంచుతుంది.

4) ఫొటో షూట్..

4) ఫొటో షూట్..

ప్రస్తుత కాలంలో ఫొటోషూట్ అంటే అందరూ తెగ ఇష్టపడతారు. మీ భాగస్వామితో బంధం పెంచుకునేందుకు మీ భాగస్వామి సంతోషంగా ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా ఫొటోలను తీయండి. తర్వాత మీరిద్దరూ కలిసి ఆ ఫొటోలను చూడండి. అప్పుడు మీ భాగస్వామి ఆశ్చర్యపోవడం ఖాయం. ఆ క్షణం మిమ్మల్ని మరింత రిఫ్రెష్ చేయవచ్చు. మీరు కలిసి గడిపిన అందమైన సమయాన్ని మీరే గుర్తు చేసుకోవచ్చు. ఇలాంటి ఫొటోల వల్ల మీరు ఎన్ని సంవత్సరాలు గడిచినా అలాంటివి చూసినప్పుడు మీ పాత మధుర క్షణాలు మళ్లీ గుర్తుకు వస్తాయి. ఇది మీ సంబంధాన్ని మరింత బలపరుస్తుంది.

5) డ్యాన్స్...

5) డ్యాన్స్...

కపుల్స్ మధ్య సాన్నిహిత్యం పెరగడంలో డ్యాన్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొంతమంది కపుల్స్ డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం కూడా మీకు తెలిసిందే. ఇలాంటివి మీ ఇద్దరిని కంఫర్ట్ జోన్ లో ఉంచుతాయి. సినిమాలు మరియు స్టోరీలలో కూడా డ్యాన్స్ తర్వాత రొమాన్స్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు వారు సాన్నిహిత్యం మరియు ఉద్దీపనకు మూలంగా మారవచ్చు. ఇది మీకు కొత్తగా మరియు దగ్గరగా అనిపిస్తుంది.

6) తోటను ఏర్పాటు చేయడం..

6) తోటను ఏర్పాటు చేయడం..

తొటపని అనేది ఒక ఆహ్లాదకరమైన అభిరుచి. మీరిద్దరూ ఏదైనా ఆరు బయట ప్రదేశంలో లేదా మీ ఇంటికి దగ్గర్లో అందమైన తోటను ఏర్పాటు చేయవచ్చు. మీరిద్దరూ ఇష్టపడే కూరగాయలు లేదా పువ్వులను, మీకు కావాల్సిన వాటిని మీ తోటలో పెంచడాన్ని అలవాటుగా చేసుకుంటే మీ సంబంధంలో ప్రేమను బలోపేతం చేస్తుంది. దీని వల్ల అనేక అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వీటి వల్ల మీరు తాజా కూరగాయలను మీ తోటలోనే పొందవచ్చు.

7) కలిసి వంటలు చేసుకోవడం..

7) కలిసి వంటలు చేసుకోవడం..

మీ భాగస్వామితో కలిసి వంటు చేయడం అనేది ఒక గొప్ప అభిరుచి. మీకు నచ్చిన వంటకాలు మరియు మీరు ఎప్పుడూ రుచి చూడని కొన్ని వంటలను ప్రయత్నించాలి. ఇలాంటివి మిమ్మల్ని మరింత దగ్గర చేస్తుంది. మీరిద్దరూ ఇష్టపడే ఆహారాన్ని తయారు చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన మార్గం. అలాగే మీరు వంటల పోటీ సైతం పెట్టుకోవచ్చు. విజేత ఎవరు అనే విషయాన్ని మీ స్నేహితులను నిర్ణయించమని చెప్పొచ్చు.

8) అడ్వెంచర్ కు వెళ్లడం..

8) అడ్వెంచర్ కు వెళ్లడం..

మీరిద్దరూ అడ్వెంచర్ ఆటలను గనుక ఇష్టపడితే, ఇది మరొక గొప్ప బహిరంగ అభిరుచి కావచ్చు. దీని వల్ల మీరు సముద్రంలో చాలా రకాల చేపలను చూడవచ్చు. కొన్ని అద్భుతమైన అవశేషాలను సైతం చూడవచ్చు. భవిష్యత్తులో మీరిద్దరూ పాత జ్ఞాపకాల గురించి తిరిగి చూసినప్పుడు, ఇది గుర్తుకు వచ్చే సంఘటన అవుతుంది. స్కూబా డైవింగ్ వెళుతున్నప్పుడు, ఇది అందమైన కొత్త జ్ఞాపకాలను సృష్టించగలదు. ఇది గొప్ప బంధం మరియు మంచి అనుభవం అవుతుంది.

9) క్యాంపులు వేయడం..

9) క్యాంపులు వేయడం..

మీరిద్దరూ కలిసి చేయగలిగే అభిరుచికి క్యాంప్ అనేది గొప్ప ఆలోచన. మీరు ఒకరి నుండి ఒకరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఎందుకంటే మీరు క్రొత్త వాతావరణంలో కొన్ని రోజులు ఉంటారు. మీరు మీ భాగస్వామితో ఒంటరిగా గడపవచ్చు. ఇది మీ ఇద్దరికీ గొప్ప ఉపశమనం ఇస్తుంది.

10) స్విమ్మింగ్..

10) స్విమ్మింగ్..

స్విమ్మింగ్ అనేది మంచి వ్యాయామం. దీన్ని మీరిద్దరూ కలిసి చేయడం అనేది గొప్ప అభిరుచి. మీ భాగస్వామికి స్విమ్మింగ్ గురించి తెలియకపోతే మీరే నేర్పించవచ్చు. ఇది శారీరకంగా మరియు మానసికంగా మీ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. ఇది మంచి శృంగార అనుభవంగా మారుతుంది.

11) జిమ్ కు వెళ్లడం..

11) జిమ్ కు వెళ్లడం..

మీరిద్దరూ కలిసి జిమ్ కు వెళ్లండి. కలిసి వ్యాయామం చేయండి. దీని ద్వారా మీ భాగస్వామి ప్రేరేపించబడవచ్చు. మీ భాగస్వామి ఆరోగ్యంగా ఉండటానికి మిమ్మల్ని ఇది ప్రోత్సహిస్తుంది. వ్యాయామశాలలో కొన్ని శృంగారమైన విషయాలు మీకు కొన్ని సమయాల్లో సంభవిస్తాయి. లేదా యోగా క్లాస్ కోసం అయినా మీరిద్దరూ కలిసి వెళ్ళవచ్చు. ఒత్తిడి లేని యోగా మీ జీవితంలో మీకు మనశ్శాంతిని ఇస్తుంది. దీని వల్ల మీరు ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.

12) కొత్త సంగీతం నేర్చుకోండి..

12) కొత్త సంగీతం నేర్చుకోండి..

మీ ఇద్దరిలో ఎవరికైనా సంగీతం పట్ల ఆసక్తి ఉంటే వయోలిన్, పియానో ​​లేదా తబలా ఎలా ప్లే చేయాలో తెలుసుకోండి. ఎందుకంటే సంగీతానికి ఈ ప్రపంచంమే పరవశించి పోతుంది. మీ సహచరుడికి ఇష్టమైన పాట లేదా సంగీతాన్ని ప్లే చేసి వారిని సంతోషపెట్టండి. అది వారికి కూడా నేర్పండి. దీని వల్ల మీపై పెరగొచ్చు.

13) మసాజ్ చేసుకోండి..

13) మసాజ్ చేసుకోండి..

మీరిద్దరూ మసాజ్ చేయడం నేర్చుకోండి. మీకు అవసరమైన మొత్తం సమాచారాన్ని యూట్యూబ్ నుండి లేదా పుస్తకాల ద్వారా పొందొచ్చు. అందులో మంచి మసాజ్ ఎలా చేయాలో మీరు తెలుసుకోవాల్సిన ప్రతి దాని గురించి మీకు నేర్పుతుంది. దీన్ని మీరిద్దరూ కలిసి నేర్చుకోవచ్చు. మీరు నేర్చుకున్నదాన్ని మీ సహచరుడికి చూపించవచ్చు. దీని వల్ల మీ మనస్సు మరియు శరీరానికి చాలా ప్రయోజనాలు లభిస్తాయి.

14) చదరంగం..

14) చదరంగం..

చదరంగం అనే ఆటను ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇష్టపడతారు. ఎందుకంటే ఇది మేధోపరంగా ఉత్తేజపరిచే ఆట. మీరు మీ భాగస్వామితో కలిసి ఈ ఆటను ఆడవచ్చు. ఈ గేమ్ ద్వారా కొత్త విషయాలను సైతం నేర్చుకోవచ్చు. అయితే పందెం వేసుకుని ఆడండి. ఓడిపోయిన వారు గెలిచిన వారు ఏది చెబితే అది సరదాగా చేయమని చెప్పవచ్చు. ఇద్దరి మధ్య బంధం మరియు బంధాన్ని ఇది బాగా బలపరుస్తుంది. ఇలాంటి వాటి వల్ల మీరు మీ జీవితంలో ప్రేమను పొంది సంతోషంగా సంబంధాలను కొనసాగిస్తారు.

English summary

Hobbies For Couples To Strengthen Their Relationship

Here are the list of hobbies to do for couples to strengthen their relationship. Read on.
Story first published: Friday, November 29, 2019, 14:53 [IST]