For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆన్ లైనులో ఆ పనులు చేసేటప్పుడు.. ఇవి మరిస్తే అంతే సంగతులు..!

|

ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ.. ఎవ్వరి మీద పుడుతుందో ఎవ్వరికీ తెలియదు. అదొక అద్భుతమైన అనుభూతి. అయితే మనం ఎవరినైనా ప్రేమించాలంటే ఒకప్పుడు మన చుట్టూ ఉన్నవారిని లేదా మన క్లాస్ మేటో, కొలిగో లేదా ఇంకా ఎవరైనా మనకు అందుబాటులో ఉండే వారిని, మనకు తెలిసినవారిని మాత్రం సెలెక్ట్ చేసుకునేవాళ్లం.

అయితే ఇప్పుడు కాలం మారింది. ప్రేమించడానికి మనకు తెలిసిన వాళ్లే ఉండనక్కర్లేదు. మనకు తెలియని వాళ్లను కూడా ప్రేమించేయొచ్చు. అదంతా స్మార్ట్ ఫోన్ మహిమే. స్మార్ట్ ఫోన్ అందుబాటులోకొచ్చార ప్రపంచమే మన అరచేతిలో వచ్చి వాలిపోయిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ స్మార్ట్ ఫోన్లో అనంతపురం నుండి అమెరికా దాకా.. అమరావతి నుండి ఆస్ట్రేలియా వరకు ఉన్న అమ్మాయిలందరితో చాటింగ్ చేయొచ్చు.

ఇదంతా సోషల్ మీడియా పుణ్యమే. ఇప్పుడు ఆన్ లైనులో ప్రేమించుకోవడానికి మరియు డేటింగు కోసం కూడా ప్రత్యేకమైన అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీ వివరాలు అప్ లోడ్ చేస్తే చాలు.. మీ అలవాట్లు, అభిరుచులకు తగ్గట్టు పార్ట్నర్లను సెలెక్ట్ చేసుకోవచ్చు. వారిలో మీకు నచ్చిన వారితో అక్కడే ప్రేమాయణం కూడా కొనసాగించొచ్చు.

ఇలాంటి పనులు ఇద్దరికీ మంచి ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అయితే మీరు ఆన్ లైనులు అలాంటి పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకంటూ కొన్ని హద్దులు, పరిమితులు ఉంచుకోవాలి. లేదంటే పరిస్థితులన్నీ తలకిందులవుతాయి. ఈ సందర్భంగా ఆన్ లైనులో ఆ కార్యంలో పాల్గొనాలనుకునే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ఆసక్తకిరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఇలా చేస్తే ఆ కార్యంలో ఆందోళన అనేదే ఉండదట...!ఇలా చేస్తే ఆ కార్యంలో ఆందోళన అనేదే ఉండదట...!

తప్పుగా ఫీలవ్వట్లేదు..

తప్పుగా ఫీలవ్వట్లేదు..

ప్రస్తుతం చాలా మంది ఆన్ లైన్ చాటింగ్, డేటింగును తప్పుగా ఫీలవ్వడం లేదు. ఇది విదేశాల్లో చాలా కామన్ మ్యాటర్. కానీ ఇలాంటివి ఇప్పుడు మన దేశంలో కూడా ప్రారంభమయ్యాయి. ఇందుకోసం ప్రత్యేకమైన యాప్ లను కూడా వాడుతున్నారు. ఆన్ లైనులో ఆ కార్యంలో అపరిమితంగా పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో వీరు చాటింగ్, వీడియో కాలింగ్స్ తో ఆ కార్యాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేస్తున్నారట.

తెలియని వ్యక్తులతో..

తెలియని వ్యక్తులతో..

సాధారణంగా మన దేశంలో పెళ్లయిన జంటలు వారి జీవితంలో మొట్టమొదట ప్రాధాన్యం ఇచ్చేది లైంగిక కార్యానికే. ఇలాంటి చర్యలే భార్యభర్తల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతాయని నిపుణులు కూడా చెబుతున్నారు. వారి అన్యోన్యతకు ప్రతీకగా నిలిచేది కూడా ఇదే. ఇక కొత్తగా దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిన వారికి ఆ కార్యంతోనే అనుబంధం బలపడుతుంది. అయితే ఈరోజుల్లో శృంగారం అనేది కేవలం కపుల్స్ మాత్రమే కాకుండా, తెలియని వ్యక్తులతో కూడా ఆ కార్యాన్ని ఆస్వాదిస్తున్నారు.

సీక్రెట్స్ చెప్పొద్దు..

సీక్రెట్స్ చెప్పొద్దు..

మీరు ఆన్ లైన్ లో ఆ కార్యానికి సంబంధించిన విషయాల గురించి చాటింగ్ చేస్తుంటే.. మీ ఫోన్ కు సంబంధించిన సీక్రెట్స్(పాస్ వర్డ్, పిన్ నెంబర్స్) వంటి విషయాలతో పాటు మీ పర్సనల్ విషయాలను అస్సలు షేర్ చేసుకోవద్దు. అలాగే మీరు చేసిన చాటింగ్ వివరాలను చాలా గోప్యతగా ఉంచుకోవాలి. అవి మీ పేరేంట్స్ చూస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయి. మరోవైపు కొందరు వ్యక్తులు ఇలాంటి వివరాలను చెడు పనులకు కూడా వాడొచ్చు. వీటిని చూపి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసే ఛాన్సు కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి వివరాలను ఎక్కువగా మీ వద్ద ఉంచుకోవద్దు.

మీ ప్రియురాలిని ఇంప్రెస్ చేయాలంటే.. ఇవి చేయక తప్పదు బ్రదర్...!మీ ప్రియురాలిని ఇంప్రెస్ చేయాలంటే.. ఇవి చేయక తప్పదు బ్రదర్...!

హద్దుల్లో ఉండండి..

హద్దుల్లో ఉండండి..

మీరు ఆన్ లైనులో మీ పార్ట్నర్ తో చాటింగ్ చేసే సమయం చాలా ఉత్సాహంగా ఉంటుంది. అయితే ఈ చాటింగ్ టైములో కొంచెం కేర్ ఫుల్ గా ఉండండి. ముందుగా మీ కంటూ కొన్ని హద్దులు విధించుకోండి. వాటిని మీ బ్రెయిన్ లో ఉంచుకుని సెక్స్టింగ్ వంటివి చేయండి.

ఇవి చేయొద్దు..

ఇవి చేయొద్దు..

ఇటీవల కాలంలో వీడియో కాలింగ్స్ వినియోగం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే చాలా మంది తమ సెల్ నుండి నగ్న చిత్రాలను షేర్ చేయడం వంటివి చేస్తున్నారు. అయితే ఇలాంటి పనులను అస్సలు చేయకూడదు. ఎందుకంటే మీరు ఎదుటి వ్యక్తిని ఎంత నమ్మినా మీ ఇద్దరి మధ్య ఏదైనా తేడాలొస్తే, మీరు ఇబ్బందుల్లో చిక్కుకునే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ఫొటోలు షేర్ చేయొద్దు. లేదంటే మీ ఫొటోలు ఆన్ లైనులో లీకయ్యే ప్రమాదం ఉంటుంది.

అది కనబడకుండా..

అది కనబడకుండా..

ఒక వేళ మీ ఫొటోలను షేర్ చేసుకోవాలని అనుకుంటే.. మీ ఫేస్ క్లారిటీగా కనబడకుండా చూసుకోండి. లేదంటే లేనిపోని సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మీరు చాటింగ్ చేస్తున్న వ్యక్తి మీ నుండి ఏం కోరుకుంటున్నారనే విషయాన్ని ముందే తెలుసుకోవడం మంచిది. వారు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారా? లేదా యాక్టింగ్ చేస్తున్నారా అనే విషయంలో క్లారిటీ తెచ్చుకోవాలి.

ముందు చెప్పొద్దు..

ముందు చెప్పొద్దు..

మీరు సెక్స్టింగ్ చేసే వ్యక్తి మీకెంతలా నచ్చినా.. ఆ విషయాన్ని ముందుగా వారికి చెప్పొద్దు. కొన్నిరోజులు వారిని గమనించండి. అందుకోసం వారికి చాటింగులో ఆసక్తి కోల్పోకుండా ఆసక్తికరమైన విషయాలను చర్చించండి. అయితే బోరింగ్ మ్యాటర్స్ ను ఎత్తకండి. మీకు అన్ని విషయాల్లో స్పష్టత వచ్చిన తర్వాతే మీరు వారితో ప్రేమాయణం కొనసాగించొచ్చు.

English summary

How Online Dating Affects Mental Health and Behavior in Telugu

Here we are talking about the how online dating affects mental health and behaviour in Telugu. Have a look