For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కపుల్స్ మధ్య సాన్నిహిత్యం పెరగాలంటే ఇవి తగ్గించుకోవాల్సిందే...!

|

మనలో చాలా మంది జీవితాల్లో ఏదైనా తట్టుకోలేని సంఘటన జరిగినప్పుడు మనం రెండు పనులను కచ్చితంగా చేయొచ్చు. అందులో మొదటిది ఆ జరిగిన సంఘటనను పదే పదే తలచుకుని బాధపడుతూ.. మనకు మనమే శిక్ష వేసుకోవడం.

లేదా అదే సంఘటనను పాజిటివ్ తీసుకుని ఆ కష్టాలు, బాధల నుండి బయటపడి హాయిగా జీవితాన్ని కొనసాగించడం. ఈ రెండింట్లో ఏదైనా మన చేతుల్లోనే ఉంది. మన మానసిక పరిస్థితి ఆధారంగానే..మనం ప్రయాణించే రూట్ కూడా మారిపోతూ ఉంటుంది.

ఇదిలా ఉండగా.. చాలా మంది జంటలు కోపంలో ఏవేవో మాటలు అనుకుంటారు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దీంతో వారిద్దరి మధ్య బంధం బలహీనపడిపోతుంది. అయితే మీ రిలేషన్ షిప్ లో కోపం, చిరాకు వంటివి రాకూడదంటే కొన్ని చిట్కాలను పాటించాలి. అవేంటో మీరే చూడండి.. మీ బంధాన్ని మరింత బలంగా మార్చుకోండి...

నాలుగు పదుల వయసు దాటాక ఆ కార్యం కష్టమేనా? ఒకవేళ మళ్లీ అవకాశమొస్తే..

అవి కలిస్తే..

అవి కలిస్తే..

ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కోపం అనేది సహజంగానే వస్తుంది. ఇది మానవునికి సంబంధించిన సాధారణ భావోద్వేగం. కొన్నిసార్లు కోపం బయటకు కనబడకపోయినా.. ఏమీ మాట్లాడకపోయినా కూడా దాని ఉనికిని మాత్రం తెలియజేస్తుంది. ముఖ్యంగా మనం ఎక్కువగా ఇష్టపడే వారితో.. మన పరస్పర చర్యలలో కోపం అనేది తరచుగా తలెత్తుతుంది. కానీ రిలేషన్ షిప్ లో అభిరుచులు కలిస్తే.. కోపం వంటి భావోద్వేగాలు ఇట్టే తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రతిస్పందన ముఖ్యం..

ప్రతిస్పందన ముఖ్యం..

రిలేషన్ షిప్ లో ఉండే వారు కోపాన్ని కంట్రోల్ చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. కోపంతో ఉన్న మీ భాగస్వామిని శాంతపరచేందుకు మీరు కొన్ని చిలిపి పనులు చేయాలి. ముఖ్యంగా ప్రేమగా మాట్లాడాలి. తను కోపం తగ్గే వరకు మీరు సారీ చెబుతూనే ఉండాలి. కొన్నిసార్లు మీ తప్పు లేకపోయినా మీరే క్షమించమని కోరాలి.

స్నేహితులతో షేర్ చేసుకోండి..

స్నేహితులతో షేర్ చేసుకోండి..

మీకు రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు మీ భాగస్వామితో తరచుగా గొడవలు జరుగుతుంటే.. మీరు ఇలాంటి విషయాలను నమ్మకమైన స్నేహితులతో షేర్ చేసుకోవచ్చు. వారు మీకు ఏవైనా మంచి సలహాలు ఇవ్వొచ్చు. ఆ సమయంలో మీకు కాస్త ఉపశమనంగా అనిపించొచ్చు. అలాగే వారు ఇచ్చే భరోసా మాటలు మీకు దీర్ఘకాలంలో చాలా అరుదుగా ప్రభావవంతంగా ఉంటాయి.

కపుల్స్ మధ్య ఇలాంటి లక్షణాలుంటే..

మౌనంగా ఉండటం..

మౌనంగా ఉండటం..

మీరు మీ భాగస్వామితో గొడవ పడినప్పుడు.. పదే పదే వాదనకు దిగకుండా.. వారితో మౌన పోరాటం చేయొచ్చు. దీని వల్ల మీరు తాత్కాలికంగా శాంతింపబడతారు. అయితే ఇదే సమయంలో మీ భాగస్వామి మీ గురించి ఆందోళన, కోపం పెంచుకోవచ్చు. అలాంటప్పుడు ఓ పేపర్ పై పెన్నుతో రాసి ఇవ్వొచ్చు. మీ ఆలోచనలను వారితో పంచుకోవడానికి వారికి కొంత సమయం ఇవ్వాలి.

ప్రశాంతంగా ఉండండి..

ప్రశాంతంగా ఉండండి..

మనం ప్రేమించే వ్యక్తి మనపై కోపంగా ఉన్నప్పుడు.. వీలైనంత మేరకు వారిని శాంతింపజేయడానికి బలవంతం చేస్తుంటాం. కానీ అలా చేస్తే ఫలితం ఉండకపోవచ్చు. అవి చివరికి ఎవరి ఆలోచనలు, ప్రవర్తనలు లేదా భావోద్వేగాలను నియంత్రించలేవు. అలాంటి సమయంలో వారిని కూల్ చేసే బదులు మీరు కంట్రోల్ లో ఉండాలి. ముఖ్యంగా చాలా ప్రశాంతంగా ఉండాలి. వారికి లోతైన శ్వాస తీసుకునే ఛాన్స్ ఇవ్వండి.

నమ్మకం ఉండాలి..

నమ్మకం ఉండాలి..

మీ భాగస్వామి మీపై కోపం, చిరాకు చూపుతుంటే.. దాన్ని తట్టుకోవడం అంత సులభం కాదు. చాలా బాధగా ఉంటుంది. అయితే ఇద్దరి మధ్య బంధం జీవితాంతం బలంగా ఉండాలంటే.. నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నపుడే పదే పదే కోపం వంటివి వస్తాయి. అయితే అలాంటివి జరగకుండా ఉండాలంటే.. మీరు చాలా ధైర్యంగా ఉండాలి. మీరు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. అప్పుడే మీ బంధం బలపడుతుంది.

English summary

How to Control Anger and Frustration in Relationship in Telugu

Here we are talking about the how to control anger and frustration in relationship in Telugu. Have a look
Story first published: Thursday, August 19, 2021, 17:24 [IST]
Desktop Bottom Promotion