For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు ఈ అర్హతలుంటేనే ఆ విషయంలో ఆసక్తి కలుగుతుందని మీకు తెలుసా?

|

ప్రేమ, ప్యార్, ఇష్క్, ప్రీతి, లవ్ ఇలా అనేక భాషలలో, విభిన్నమైన భావాలను వ్యక్తపరిచే ఈ రెండక్షరాలకు రెండు జీవితాలను ఏకం చేసే శక్తి ఉంది. ఏ ఆటలో అయినా ఒక్కరే గెలుస్తారు. కానీ ప్రేమ అనే గేమ్ లో ఇద్దరూ గెలుస్తారు. అందుకే ప్రేమకు ఈ ప్రపంచంలో పురాతన కాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అనేది చాలా ముఖ్యమైనది. అలాంటి ప్రేమ ప్రతి ఒక్కరి జీవితాన్ని మలుపు తిప్పుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఆ ప్రేమ పరిపూర్ణంగా మారాలని అనేక మంది కలలు కంటు ఉంటారు. అయితే ప్రతి ప్రేమా వివాహం వరకు వెళ్లదు. మధ్యలోనే బ్రేకప్ లు, ప్యాకప్ లు చెప్పేసుకోవడం తాజాగా ఫ్యాషన్ అయిపోయింది. అయితే ప్రేమలో పరిపూర్ణంగా ఉన్నారని చెప్పడం అంత సులభమైన పనేనా? ఒకవేళ వారిది పరిపూర్ణమైన ప్రేమ అన్నారనుకోండి.

ఆ ప్రేమికుల్లో ఎవరో ఒకరు ఏదో ఒక కారణం వల్ల ఇతరులను పెళ్లి చేసుకున్నారు అనుకోండి. అలాంటి పరిస్థితుల్లో ఏమి చేస్తారు? అప్పుడు ఆ ఇద్దరి ఇష్టాలను దూరంగా, వాస్తవాలకు తగ్గట్టు జీవితాన్ని కొనసాగించాల్సిందేనా! ఈ నేపథ్యంలో ఏది సరైన ప్రేమ అని డిసైడ్ చేయడంలో చాలా మంది అయోమయంలో పడతారు. ఇప్పటికే చాలా మంది ప్రపంచ వ్యాప్తంగా పరిపూర్ణ సంబంధం కోసం ఎన్నో ప్రమాణాలను పరిశోధించారు. ఎన్నో జంటలు భిన్నంగా ఉన్నప్పటికీ, సంబంధాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన, శాస్త్రీయంగా ఉన్న లక్షణాలను అంచనా వేయొచ్చని సైన్స్ చెబుతోంది. ఈ సందర్భంగా పరిపూర్ణ ప్రేమ కోసం కావాల్సిన అర్హతలేంటో చూద్దాం...

తక్కువ గొడవలు..

తక్కువ గొడవలు..

పరిపూర్ణమైన ప్రేమలో ఉన్న వారు గొడవ పడతారు. కానీ వారి గొడవలు చాలా తక్కువగా ఉంటాయి. వారు ఒకప్పుడు ఎలా ఉండేవారో, ఎంత ప్రేమలో ఉండేవారో అలాగే ఉండటానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. అలాగే సమయం గడుస్తున్న కొద్దీ వారి గొడవలను వారు సులభంగా మరచిపోతారు.

ఇంటి పనుల్లో సాయం..

ఇంటి పనుల్లో సాయం..

ఎవరైతే పరిపూర్ణ ప్రేమను కలిగి ఉంటారో, వారు ఇంట్లో భాగస్వామికి ఎల్లప్పుడూ సాయం చేస్తుంటారు. ఎందుకంటే వారు సరైన సంబంధంలో ఉన్నప్పుడు ఇంటి పనుల్లోనూ సమానంగా ఉండాలని భావిస్తారు. అలాగే వారు ఇద్దరు ఒకవేళ ఉద్యోగాలు చేస్తుంటే కూడా ఒకరికొకరు వారి పరిస్థితులను అర్థం చేసుకుంటారు.

రొమాన్స్..

రొమాన్స్..

పరిపూర్ణమైన రిలేషన్ షిప్ కోరుకునే వారు అన్నింటికంటే ముఖ్యంగా మానసికంగా, శారీరకంగా కలిసి పోయేందుకు ఎక్కువ ఆసక్తిని చూపుతారు. వివాహం చేసుకున్న వారికి కూడా ఆ ఘట్టం ముఖ్యమైనది. ఇక అనేక మంది జంటలు రొమాన్స్ లో ఉన్నప్పుడే సంతోషకరమైన జీవితాలను గడుపుతున్నారు.

తగిన విశ్రాంతి..

తగిన విశ్రాంతి..

పరిపూర్ణమైన ప్రేమికులకు తగిన విశ్రాంతి అనేది చాలా అవసరం. ఇలాంటివన్నీ విజయవంతమైన ప్రేమికులకు శృంగారం పట్ల ఆసక్తిని మరింత పెంచుతుంది. ఇది వారి అవగాహనకు సంకేతం.

పెద్దగా నవ్వుతూ..

పెద్దగా నవ్వుతూ..

నవ్వు అనేది నిజంగా ఒక మెడిసిన్ లాంటిది. అందుకే ఓ ప్రముఖ కవి నవ్వు గురించి ఇలా అన్నాడు. నవ్వడం ఒక యోగం.. నవ్వకపోవడం ఒక రోగం.. నవ్వించడం ఒక భోగం..అని నవ్వు గురించి మూడు ముక్కలో చక్కగా చెప్పారాయన. ఇదే సూత్రం ప్రతి జంటకూ ఉపయోగపడుతుంది. ఎందుకంటే పెద్దగా నవ్వే జంటలు రిలేషన్ షిప్ లో ఎక్కువగా ఉంటారని సైన్స్ చెబుతోంది.

ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం..

ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం..

పరిపూర్ణమైన ప్రేమలో ఉన్న వారంతా ఒకరినొకరు నిత్యం ప్రోత్సహించుకుంటారు. ఒకరి విజయాన్ని గుర్తుంచుకోవడం ఇతరులను ఆనందపరుస్తుంది. ఇక వ్యక్తిలోని ఉత్తమ లక్షణాలను వెల్లడించడానికి ఇవి చాలా చక్కగా దోహదం చేస్తాయి.

ఫ్రెండ్స్ సర్కిల్..

ఫ్రెండ్స్ సర్కిల్..

అనేక మంది ప్రేమికులకు ఫ్రెండ్స్ సర్కిల్ అనేది కచ్చితంగా ఉంటుంది. ఇది పెళ్లికి ముందుగానీ, తర్వాత గానీ మరియు ప్రేమకు ముందు లేదా తర్వాత ఏదో రకంగా సహాయం చేస్తూనే ఉంటుంది. అందుకే ఎన్నోసార్లు ప్రేమ కన్నా స్నేహమే గొప్పది అని చాలా మంది చెబుతుంటారు.

ఖర్చులు..

ఖర్చులు..

ఖర్చుల విషయంలో ఆకలితో ఉన్నవారు, సంపాదనలో ఉన్నవారు విజయవంతమైన జంటలుగా మారే అవకాశం ఉందని తాజా అధ్యయనం కనుగొంది. దీన్ని అంగీకరించడం కష్టమే అయినప్పటికీ అధిక వ్యయం ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

చిన్నా పెద్ద తేడాలు..

చిన్నా పెద్ద తేడాలు..

పరిపూర్ణ సంబంధం విషయంలో ఎక్కువగా మగవారు (పెద్దవారు) ముందుగా మరియు ఆడవారు (చిన్న వారు)తర్వాత ఉంటే ఈ సంబంధం మరింత విజయవంతమవుతుందని పలు సర్వేలు చెబుతున్నాయి. కానీ కొన్నిచోట్ల ఆడవారే మగవారి కంటే పెద్దగా ఉన్నా వారి అండర్ స్టాండిగ్ బట్టి అవి కూడా పరిపూర్ణంగానే ఉంటాయి.

ఎంత విభేదించినా..

ఎంత విభేదించినా..

గౌరవప్రదంగా ఉండే జంటలు ఎంతగా గొడవ పడ్డా.. వారిలో వారు వాటిని నాలుగు గోడల మధ్యే పరిష్కరించుకుంటారు. అంతేకాని బహిరంగంగా గొడవలకు సంబంధించిన విషయాలను బయట పెట్టుకోరు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరినొకరు అగౌరవపరచుకోరు. ఒకరిపై ఒకరికి ఎప్పుడు ప్రేమ, గౌరవం ఉంటుంది.

గతం గురించి..

గతం గురించి..

పరిపూర్ణ సంబంధంలో ఉన్న ఏ ఇద్దరు వ్యక్తులైనా గతం గురించి తప్పకుండా తెలుసుకుంటారు. ప్రేమలో ఉన్న వ్యక్తులైతే తమ సహచరుల గతం గురించి పట్టించుకోకుండా వర్తమానంలో ఎలా సంతోషంగా ఉండాలో ఆలోచిస్తుంటారు.

English summary

How To Find a Perfect Relationship Scientifically?

Science has predicted these traits that are needed to make a relationship successful. Read on
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more