For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Happy Propose Day 2023:ఇలా ప్రపోజ్ చేస్తే ఎవరైనా సరే మీకు ఫిదా అవ్వాల్సిందే...!

ఇలా ప్రపోజ్ చేస్తే, ఏ అమ్మాయి అయినా మీకు ఫిదా అయిపోవడం ఖాయామట...

|

ఫిబ్రవరి మాసం వచ్చిందంటే చాలు ప్రేమికులందరూ తెగ సంబరపడిపోతుంటారు. అయితే వాలెంటైన్స్ డే వచ్చే సమయంలో మాత్రం కొందరు అబ్బాయిలు తెగ ఆందోళన చెందుతారు.

Ways to propose a girl in Telugu

తమకిష్టమైన అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలా అని తెగ హైరానా పడుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రపోజ్ డే కూడా వచ్చేసింది. రిలేషన్ షిప్ విషయానికొచ్చేసరికి ప్రతి అమ్మాయి తమకు అబ్బాయిలే ప్రపోజ్ చేయాలని కోరుకుంటారు.

Ways to propose a girl in Telugu

అయితే చాలా మంది అబ్బాయిలు తమ ప్రేయసిని ఎంతలా ఆరాధిస్తున్నామనేది కాదు.. ఆ విషయాన్ని ఆమెకు అర్థమయ్యేలా చెప్పడంలో విజయవంతం అయితేనే ప్రేమ సక్సెస్ అవుతుంది.

Ways to propose a girl in Telugu

అప్పటిదాకా వన్ సైడ్ ట్రాక్ లో ఉన్న మీ లవ్.. రెండు ట్రాక్ లపై సాఫీగా సాగిపోతుంది. అయితే అమ్మాయిలకు ఎలా ప్రపోజ్ చేస్తే ఫిదా అవుతారో తెలియాలంటే ఈ చిట్కాలు పాటించండి... మీ లవ్ ట్రాక్ పై కొత్త ప్రయాణం ప్రారంభించండి...

Happy Rose Day 2021:రోజ్ డే సందర్భంగా మీ ప్రియమైన వారిని ఈ సందేశాలతో సర్ ప్రైజ్ చేసేయ్యండి...Happy Rose Day 2021:రోజ్ డే సందర్భంగా మీ ప్రియమైన వారిని ఈ సందేశాలతో సర్ ప్రైజ్ చేసేయ్యండి...

చాలా ధైర్యం కావాలి..

చాలా ధైర్యం కావాలి..

ఓ అమ్మాయి దగ్గరికి వెళ్లి అబ్బాయి ‘ఐ లవ్ యూ, విల్ యు మ్యారీ మీ' అని అడగాలంటే.. ఎంతో ధైర్యం కావాలి. అంతకంటే ముందు మీ మనసులోని ఎన్నో ప్రశ్నలకు సమాధానం కూడా కావాలి. ప్రతి వ్యక్తి ప్రేమను తెలిపేముందు ఒక అబ్బాయిగా కొన్ని విషయాల్లో స్పష్టత తెచ్చుకోవాలి. ముందుగా అమ్మాయి ఇష్టయిష్టాలు, అభిరుచులు, అలవాట్ల వంటి వాటిని తెలుసుకోవాలి. ఆ తర్వాత ప్రపోజ్ చేయాలనే విషయం గురించి ఆలోచించాలి.

ఇవి గుర్తించాలి..

ఇవి గుర్తించాలి..

మీరు ఇష్టపడుతున్న అమ్మాయిని డేట్ కి పిలవాలంటే.. లేదా ప్రేమను వ్యక్తం చేయడానికి లేదా జీవితాంతం కలిసుండేందుకు వివాహం చేసుకోమని అడగడానికి ముందు మీరు వారి ఇష్టయిష్టాలేంటో తెలుసుకోవాలి. ఇలాంటివి తెలుసుకోవడం వల్ల మీరు సులభంగా ప్రపోజ్ చేయొచ్చు. దానికి తగినట్లు ప్లాన్ చేసుకోవచ్చు. ఉదాహరణకు తనకు సినిమాలంటే ఇష్టమైతే.. తనతో కలిసి సినిమా చూస్తూ రోజంతా గడిపి చివర్లో ప్రపోజ్ చేయండి. మీరు ప్రేమను వ్యక్తం చేసి ఊరుకోకుండా పువ్వులు, చాక్లెట్లు, వారి మనసుకి నచ్చే వస్తువులను గిఫ్టులుగా అందించండి. ఎందుకంటే మీరు ప్రపోజ్ చేసే రోజు వారికి మరపురానిదిగా, ఎప్పటికీ నిలిచిపోవాలి కదా..!

మీ మనసులోని మాటను..

మీ మనసులోని మాటను..

ఒక్కసారిగా మీ మనసులోని మాటను మీరు ఇష్టపడే అమ్మాయితో చెబితే.. వెంటనే సమాధానం రాకపోవచ్చు. కాబట్టి నెమ్మదిగా తనకు విషయం అర్థమయ్యేలా చెప్పాలి. ఎందుకంటే మీరు తనకు సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు. షాక్ ఇవ్వాలనుకోవడం లేదు కాబట్టి.. మీరు ఈ విషయాన్ని డైరెక్టుగా కాకుండా, ఇన్ డైరెక్టుగా చెప్పే ప్రయత్నం చేయండి.

స్నేహితుల సహాయం..

స్నేహితుల సహాయం..

ఉదాహరణకు మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని లేదా ప్రేమ విషయాన్ని చెప్పడానికి ఇబ్బందిగా ఉంటే.. తన దగ్గర కాకుండా మీ స్నేహితులతో లేదా వారి స్నేహితులతో ప్రస్తావించండి. తర్వాత వారిద్దరూ మాట్లాడుకునేటప్పుడు ఈ విషయం కచ్చితంగా చర్చకు వస్తుంది. అప్పుడు మీ మనసు గురించి వారికి కచ్చితంగా తెలుస్తుంది.

ప్రేమికుల దినోత్సవం వాలెంటైన్ చనిపోయినందుకు కాదు ఆ దేవత కోసం చేసుకుంటున్నాం...ప్రేమికుల దినోత్సవం వాలెంటైన్ చనిపోయినందుకు కాదు ఆ దేవత కోసం చేసుకుంటున్నాం...

తన మనసు గెలవాలంటే..

తన మనసు గెలవాలంటే..

సినిమాల్లో చూపినట్టు అమ్మాయిని ప్రపోజ్ చేసే ముందు మోకాళ్లపై నిలబడి తనకిష్టమైన పువ్వులను లేదా చాక్లెట్లను బహుమతిగా ఇవ్వడం అనేది పాతపద్ధతే కావచ్చు. కానీ ఇలా చేయడం వల్ల మీరు తప్పకుండా ఆమె మనసును గెలుచుకోగలరు. మీరు మోకాళ్లపై నిలబడి రెడ్ రోజెస్ తో మీ ప్రేమను వ్యక్తపరిస్తే.. ఎలాంటి అమ్మాయి అయినా ఫిదా అయిపోవడం ఖాయం.

నచ్చిన ఫుడ్..

నచ్చిన ఫుడ్..

మీకు నచ్చిన అమ్మాయి భోజన ప్రియురాలు అయితే తనకు నచ్చిన ఫుడ్ ను ఇప్పించండి. తనతో కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్ చేయండి. అదే సమయంలో ఆహ్లాదకరమైన సంగీతం వినండి. అలా సంగీతం వస్తున్నప్పుడు మీ ఫుడ్ ను తెప్పించుకోండి. ఆ తర్వాత నెమ్మదిగా మీ ప్రేమ విషయాన్ని బయటపెట్టండి.

ప్రేమ సందేశం..

ప్రేమ సందేశం..

మీరు కోరుకున్న అమ్మాయిని సర్ ప్రైజ్ చేయాలంటే.. తన ఇంటి ముందు లేదా తను పని చేసే చోట మీ ప్రేమ సందేశంతో కూడిన బ్యానర్ ను ఉంచండి. కానీ ఓ విషయం ఆమె పేరును మాత్రం అస్సలు వాడొద్దండి. ఆమెను మీరు ముద్దుగా ఏమని పిలుస్తారో ఆ పేరే రాసేయండి. అంతే తనపై మీకు ఎంత ప్రేమ ఉందో ఇట్టే తెలిసిపోతుంది.

మంచి సందర్భం..

మంచి సందర్భం..

మీరు కోరుకున్న అమ్మాయికి మీ మనసులోని మాటను తెలియజేయడానికి మంచి సందర్భాన్ని చూసుకోవాలి. ఉదాహరణకు తన పుట్టినరోజు లేదా మీ పుట్టినరోజు లేదా మీ ఇద్దరి ఫ్రెండ్ షిప్ స్టార్టయిన రోజు ఇలాంటి రోజుల్లో మీ మనసులోని భావాలను తెలియజేస్తే.. వారికి మరింత ప్రత్యేక అనుభూతి కలుగుతుంది.

ట్రెక్కింగ్, క్యాంపింగ్..

ట్రెక్కింగ్, క్యాంపింగ్..

మీరు మనసిచ్చిన అమ్మాయితో పాటు నేచర్ తో సమయం గడపడానికి ఇష్టపడే వ్యక్తి అయితే.. చక్కటి కొండ ప్రదేశాన్ని ఎంచుకుని ట్రెక్కింగ్, క్యాంపింగ్ ఫైర్ వంటివి ఏర్పాటు చేయండి. ఇక్కడికి మీ స్నేహితులంతా కలిసి వెళ్లినా కూడా.. మీ ఇద్దరూ కలిసి ఏకాంతంగా ఉన్నప్పుడు మీ మనసులోని మాటను వారికి చెప్పేయండి.

సర్ ప్రైజ్ చేయండి..

సర్ ప్రైజ్ చేయండి..

మీరు అపార్టుమెంట్లో ఉంటున్నట్లయితే.. మీ ఇరుగుపొరుగు వారిని మీ ప్రేమ గురించి తెలియజేసి.. వారిని లైట్లు ఆర్పమని రిక్వస్ట్ చేసుకోండి. 'I Love You' అని మాత్రమే కనబడేలా లైట్లను సెట్ చేయండి. తర్వాత మీ గర్ల్ ఫ్రెండ్ కళ్లను మూసి బాల్కనీలోకి తీసుకెళ్లి మీ మనసులోని మాటలను ఆమెకు చూపించండి. ఆమె తప్పకుండా ఇష్టపడతుంది.

ఆ సమయంలో బీచ్ కు..

ఆ సమయంలో బీచ్ కు..

సూర్యాస్తమయానికి ముందు తనను బీచ్ కు తీసుకెళ్లండి. కారులో లేదా మీ మొబైల్ లో చక్కని మ్యూజిక్ ఆన్ చేసి బ్లూటూత్ స్పీకర్ తో మంచి పాటలను ప్లే చేయండి. సూర్యాస్తమయాన్నిఆస్వాదిస్తున్న వేళ ఆమెకు మీ మనసులోని మాటలను చెప్పేయండి.

ఇలా చేయడానికి మీకు ఇబ్బందిగా అనిపిస్తే.. ప్రేమ లేఖ ద్వారా మీ మనసులోని భావాలను ఆమెకు తెలియజేయండి. ఆ లేఖను నేరుగా తనకే అందించండి. లేదా స్నేహితుల ద్వారా అందజేయండి.

FAQ's
  • వాలెంటైన్ వీక్ లో ప్రపోజ్ డే ఎప్పుడు జరుపుకుంటారు?

    ప్రతి సంవత్పరం ప్రపంచ వ్యాప్తంగా వాలెంటైన్ వీక్ లో భాగంగా రెండో రోజున అంటే ఫిబ్రవరి 8వ తేదీన ‘ప్రపోజ్ డే’ జరుపుకుంటారు. ఈ రోజున తమ మనసుకు నచ్చిన వారికి ప్రపోజ్ చేయాలనుకుంటారు. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు మరోసారి ప్రపోజ్ చేసుకుని ఆనాటి మధుర క్షణాలను గుర్తు చేసుకుంటారు.

English summary

Happy Propose Day: How to Propose a Girl in Telugu

Here we are talking about the ways to propose a girl in Telugu. Read on
Desktop Bottom Promotion