For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘నేను నా ఫ్రెండ్ ను ప్రేమిస్తున్నా.. కానీ తను కంప్లైంట్ చేస్తే.. నా ఫ్యూచర్ ఏంటి..’

|

ఆ యువకుడు.. యువతికి చిన్ననాటి నుండి అంటే పాఠశాల చదివే సమయం నుండే పరిచయం ఉంది. వారిద్దరూ స్కూల్ కలిసి వెళ్లేవారు.. కలిసే ఇంటకొచ్చే వారు. అయితే వారిద్దరూ కాలేజీలోనూ కలిశారు.

ఇంటర్మీడియట్ పూర్తయ్యాక.. ఇంజనీరింగులోనూ ఒకే కోర్సులో జాయిన్ అయ్యారు. అయితే వారిద్దరూ చిన్నప్పటి నుండి మంచి స్నేహితులుగా ఉన్నారు. అయితే వీరి గురించి స్నేహితులు, కాలేజీలో అంతా వీరిని ప్రేమికులుగా భావించేవారు. ఇదే విషయాన్ని వారిద్దరికీ చెబుతుండేవారు. అది విన్న వారిద్దరూ నవ్వుకునే వారు.

కానీ ఓ రోజు ఆ యువకుడికి ప్రేమ గురించి కొన్ని ఉదాహరణలు చెప్పడంతో తను ఆలోచనలో పడ్డాడు. అంతే తాను తనని నిజంగా ప్రేమిస్తున్నాని డిసైడ్ అయ్యాడు. అయితే ప్రేమ గురించి తనకు చెబితే ఎలా రియాక్ట్ అవుతుందో అని భయపడుతున్నాడు. ఎందుకంటే తను ఆడవారి విషయంలో చాలా సీరియస్ గా ఉంటుంది.

అంతేకాదు ప్రేమ, గీమ అంటే తనకు ఇష్టముండదు. ఇంతకుముందు తన ఫ్రెండ్స్ ఇలా మోసపోవడంతో వారి తరపున అనేక పోరాటాల్లో పాల్గొంది. సోషల్ మీడియాలో సైతం #MeTooకు మద్దతు పలికింది. ఇప్పుడు తన ప్రేమ గురించి చెబితే.. తన భవిష్యత్తు ఏంటనే భయాందోళన తనలో మొదలైంది. ఈ నేపథ్యంలో తన సమస్యకు సరైన పరిష్కారం సూచించగలరు అని ఓ యువకుడు నిపుణులను సంప్రదించాడు. ఇంతకీ ఆ కుర్రాడు తన స్నేహితురాలని ప్రేమ ప్రతిపాదన గురించి చెప్పాడా? తను ఎలా రియాక్ట్ అయ్యిందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆ కార్యంలో అనుభవం లేనోళ్లు.. ఎక్కువగా చేసే పొరపాట్లు ఇవే..

అమ్మాయిలంటే భయం..

అమ్మాయిలంటే భయం..

హాయ్ ‘నా పేరు ఉమేష్(పేరు మార్చాం). నేను స్కూల్ డేస్ లో చదువుకునే నాటి నుండి నాకు అమ్మాయిలంటే భయం. కానీ నా చిన్ననాటి స్నేహితురాలితో ఒక్కటే సన్నిహితంగా ఉండేవాడిని. అయితే తనపై నాకు తెలియకుండా ప్రేమ పుట్టింది.

తనను పెళ్లి చేసుకోవాలని..

తనను పెళ్లి చేసుకోవాలని..

తనకు నా ప్రేమ గురించి చెప్పాలని ఎంతో ఆత్రుతగా ఉంది. కానీ తను ఎలా స్పందిస్తుందో అని చాలా భయంగా ఉంది. ఒకవేళ తను ఈ విషయాన్ని నెగిటివ్ గా తీసుకుని, సోషల్ మీడియాలో నా వివరాలన్నీ #MeToo యాష్ ట్యాగ్ తో పెట్టేస్తుందేమోనని భయమేస్తోంది. దీంతో నా భవిష్యత్తు ఏమవుతుందనే ఆందోళన ఎక్కువగా ఉంది. నాకు సరైన సలహా ఇవ్వగలరు' అంటూ ఆ యువకుడు నిపుణులను సంప్రదించాడు. ఆ కుర్రాడికి ఎలాంటి సమాధానం వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.

భయాన్ని వదిలేయండి..

భయాన్ని వదిలేయండి..

#Me Too ఈ యాష్ ట్యాగ్ గురించి మరియు సోషల్ మీడియా గురించి, ఫిర్యాదుల గురించి భయాన్ని వదిలేయండి. ఎందుకంటే #Mee Too అనే దాంట్లో ఒకప్పుడు ఎక్కువ మంది తమను వేధించే వ్యక్తుల గురించి మాత్రమే చెప్పారు గానీ.. ప్రేమించే వ్యక్తుల గురించి ఎక్కడా చెప్పలేదు. అంతేకాదు వారు ఇతర మహిళలతో సక్రమంగా ప్రవర్తించాలని కోరారు.

‘ముందు అన్నయ్యతో లవ్.. బ్రేకప్..! తర్వాత నాకు ప్రియురాలిగా..' రేస్ సినిమాలా మారిన మా ప్రేమ కథ...!

అలా ఆలోచించొద్దు..

అలా ఆలోచించొద్దు..

ఇలాంటి ఆలోచనలు కేవలం మీ ఒక్కరికే కాదు.. చాలా మంది పురుషులకు ఇలాంటి అనుమానాలు ఉన్నాయి. తోటి మహిళలతో గౌరవంగా మెలగాలనే అనేక చట్టాలు చెబుతున్నాయి. అయినా కూడా మీరు తనతో ఈ విషయం గురించి మీకు భయంగా ఉంటే.. మీరు వీలైనంత త్వరగా.. మీ సమీపంలోని మానసిక నిపుణులను కలిసి మీ భయానికి వీడ్కోలు చెప్పండి.

పరోక్షంగా ట్రై చేయండి..

పరోక్షంగా ట్రై చేయండి..

మీరు మీ ప్రేమ విషయాన్ని డైరెక్ట్ చెప్పకుండా.. ఏదైనా సినిమా కథ చెబుతూ.. అందులో నీవుంటే ఏమి చేస్తావు.. అని పరోక్షంగా అడగండి. దాన్ని బట్టి తన మనసులో మాటలను తెలుసుకోండి. అప్పుడు మీరు ఎలాంటి భయం లేకుండా మీ ప్రేమను వ్యక్తం చేయొచ్చు.

ముందే సిద్ధంగా ఉండండి..

ముందే సిద్ధంగా ఉండండి..

మీరు మీ ప్రేమ విషయం చెప్పాక.. తనకు ఇష్టమైతే మీ ప్రేమకు పచ్చజెండా ఊపుతుంది. లేదంటే సున్నితంగా తిరస్కరిస్తుంది. ఎందుకంటే తను ఇదివరకే మీ స్నేహితురాలు కాబట్టి. ఈ సానుకూల వాతావరణాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ తను మీ ప్రేమను రిజెక్ట్ చేస్తే.. మీరు తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ముందే అన్నింటికీ సిద్ధంగా ఉండాలి.

English summary

I am in love with my classmate, how should i tell her this

Read on to know the details, i am in love with my classmate, how should i tell her this.
Story first published: Thursday, May 27, 2021, 18:00 [IST]