For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘ఈ జన్మకు ఇంతే... ఆమె తప్ప ఇంకెవరూ అందంగా కనిపించరు’

|

ప్రేమ అనేది స్వచ్ఛమైనదైతే జీవితాంతం కొనసాగుతుంది. తమకు నచ్చిన వ్యక్తితో జీవితాంతం హాయిగా కలిసి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో అనుకోని కారణాల వల్ల తగాదాలు అవుతుంటాయి. ఆ మాత్రం దానికి చాలా మంది విడిపోతూ ఉంటారు.

అయితే ప్రేమ విషయంలో సినిమా ఇండస్ట్రీలో అయినా.. ఇతర సెలబ్రెటీలైనా ఎక్కువకాలం కలిసి జీవించలేరు. ఇందుకు అనేకమంది ప్రముఖులనే ఉదాహరణగా చెప్పొచ్చు. అయితే చాలా మంది సెలబ్రెటీలు ప్రేమించుకునేటప్పుడు.. ప్రేమ పెళ్లి చేసుకునేటప్పుడు ఎంత గ్రాండ్ గా పార్టీలు చేసుకుంటారో అందరికీ తెలిసిందే.

అయితే సెలబ్రేటీలలో చాలా మంది త్వరగా ప్రేమలో పడటం.. అంతే త్వరగా బ్రేకప్ చెప్పడం లేదా లవ్ మ్యారేజ్ చేసుకోవడం.. ఆ తర్వాత డైవర్స్ తీసుకోవడం అనేది ఈరోజుల్లో చాలా కామన్. ముఖ్యంగా సినిమా, టీవీ, స్పోర్ట్స్, పాలిటిక్స్ ల్లో విడాకులు తీసుకోవడం... విడిపోవడం అనేది కొత్తేమీ కాదు. చాలా మంది చిన్న అపార్థాల ద్వారా విడిపోతుంటారు. మళ్లీ కలుస్తూనే ఉంటారు.

కొందరు భర్తలతో సంబంధం తెంచుకున్నప్పటికీ, పిల్లల్ని పెంచుకుంటూ ధైర్యంగా నిలబడి తమ సొంత నైపుణ్యాలతో సమాజంలో తలెత్తుకుని బతుకుతున్న ఒంటరి మహిళలు, విడిపోయిన భార్యలు ఎంతోమంది ఉన్నారు. ఇక సినిమా, టీవీ ఫీల్డ్ వాళ్లు విడిపోతే సోషల్ మీడియాలో ఎంతలా రచ్చరచ్చ జరుగుతుందో మనందరికీ తెలిసిందే. కానీ బిగ్ బాస్ ఎలిమినేటర్ సూర్యకిరణ్, హీరోయిన్ కళ్యాణి విడిపోయినట్టు ఇండస్ట్రీలోనే చాలా మందికి తెలియదట. ఎందుకంటే వారు విడిపోయే సమయంలో ఎవ్వరినీ కించపరచుకోలేరు. అంత సైలెంటుగా విడిపోయారు. కానీ ఇటీవల వీరిపై సోషల్ మీడియాలో కొంత ఎక్కువ శ్రద్ధ చూపించడం మొదలైంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ సూర్యకిరణ్ అలాంటి ప్రశ్నలే ఎక్కువగా ఎదురవ్వడంతో తన ప్రేమ, వివాహం, విడాకుల గురించి ఆయన ఓపెన్ అయ్యారు. తన గుండెల్లో దాచుకున్న ప్రేమను చెబుతూ కాస్త ఎమోషన్ అయ్యారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఆ విషయాల్లో మగవారు చేసే అతిపెద్ద పొరపాట్లేంటో తెలుసా...!

పదేళ్ల క్రితం వివాహం..

పదేళ్ల క్రితం వివాహం..

డైరెక్టర్ సూర్యకిరణ్, హీరోయిన్ కళ్యాణి గాఢంగా ప్రేమించుకున్నారు. వీరిద్దరూ ప్రేమించుకున్న కొద్దిరోజుల తర్వాత 2010లో అందరి సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నారు. ఆరేళ్ల పాటు ఆనందంగా వీరి దాంపత్య జీవితంలో ఏ సమస్య వచ్చిందో తెలియదు కానీ.. 2016లో విడిపోయారు.

అప్పట్లో పుకార్లొచ్చాయి..

అప్పట్లో పుకార్లొచ్చాయి..

వీరిద్దరూ విడిపోతున్నట్లు 2016లో పుకార్లు వచ్చాయి. అయితే వీరిద్దరూ ఎక్కడా మీడియాకు ఎక్కలేదు. లేనిపోని ఆరోపణలు అస్సలు చేసుకోలేదు. అసలు తమ విషయం గురించి బయటకు పొక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే వీరు విడిపోయి నాలుగేళ్లయినా సగటు అభిమానికి, ప్రేక్షకుడికి ఇంతవరకు తెలియదు. వారు అంత సైలెంటుగా డివైడ్ అయ్యారు మరి.

కళ్యాణి కూడా సానుకూలంగా..

కళ్యాణి కూడా సానుకూలంగా..

వీరిద్దరూ విడిపోయినంత మాత్రాన ఎలాంటి విమర్శలు చేసుకోలేదు. ఇటీవల డైరెక్టర్, తన మాజీ భర్త బిగ్ బాస్ షోకు సెలెక్ట్ అయినప్పుడు కూడా ఆమె తనను అభినందించి, నాలుగు మంచి మాటలే చెప్పారు. అదే సమయంలో ఆ షో నుండి ఎలిమినేట్ అయ్యాక సూర్యకిరణ్ కు ఇలాంటి ప్రశ్నలే ఎక్కువగా ఎదురవ్వడంతో తను ఎందుకు విడిపోయాడో చెప్పేశాడు.

అధ్యయనం! శృంగారంలో మాస్కులతో పాటు అవి తప్పకుండా వాడాలంట...!

ఓ షూటింగులో కళ్యాణిని చూసి..

ఓ షూటింగులో కళ్యాణిని చూసి..

తను సినిమా ఇండస్ట్రీలో చిన్ననాటి నుండే ఉన్నట్లు తెలిపాడు. అంతేకాదు చాలా చిత్రాల్లో బాలనటుడిగా నటించాడట. తనది మళయాళీ ఫ్యామిలీ. తనతో పాటు చెల్లెలు సుజిత కూడా బాలానటిగా చెప్పాడు. ఆమె సీరియళ్లలో బిజీగా ఉంటూ కొన్ని సినిమాల్లో కూడా చేస్తుందన్నాడు. అలా ఓ రోజు ఏదో షూటింగులో చూసి కళ్యాణిని చూశాడట. అంతే వెంటనే ఆమెపై ఇష్టం వచ్చింది. తను కూడా మళయాళీ బాలనటి. అందుకే పరిచయం, ప్రణయం, పరిణయం దాకా అంతా సాఫీగా సాగింది.

సంసారమే సాఫీగా సాగలేదు..

సంసారమే సాఫీగా సాగలేదు..

తన జీవితంలో అన్ని సాఫీగా సాగినప్పటికీ, కళ్యాణితో సంసారం మాత్రం సాఫీగా సాగలేదు. ‘నా జీవితంలో ఇంకో భార్యకు స్థానం లేదు' అంటూ కంటతడి పెట్టాడు. తను ఇంకా గుండెల్లో ఉందని.. ఆమె తప్ప ఇంకెవరూ నాకు అందంగా కనిపించరు. ఈ జన్మకు ఇంతే' అంటూ తన ఫెయిల్యూర్ స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు.

బిగ్ బాస్ లోనూ లవ్ ట్రాక్..

బిగ్ బాస్ లోనూ లవ్ ట్రాక్..

ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ షోలో కూడా తాను ఓ లవ్ ట్రాక్ నడిపినట్లు చెప్పుకొచ్చాడు సూర్యకిరణ్. యాంకర్ దేవీ నాగవల్లితో తాను లవ్ ట్రాక్ నడిపినట్లు తెలిపాడు. ఎందుకంటే ఆమె డైవోర్స్.. నేనూ డైవోర్స్. కాబట్టి ఆమెతో ఒక లవ్ ట్రాక్ నడుపుదాం అనుకున్నాను. హౌస్ లో ఎంట్రీ ఇచ్చాక తను నాతో బాగా కలిసిపోయింది. ఆమె చాలా స్టైట్ గా, మెచ్యూర్డ్ గా ఉంటుంది. అదే సమయంలో బాగా కష్టపడుతుంది.

లవ్ ట్రాక్ కంటిన్యూ చేద్దామంటే..

లవ్ ట్రాక్ కంటిన్యూ చేద్దామంటే..

ఆమెతో అలాగే కొన్నిరోజుల పాటు లవ్ ట్రాక్ నడుపుదామని అనుకున్నాను కానీ, ఊహించని విధంగా నేను బయటకు వచ్చేశా అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు డైరెక్టర్ సూర్యకిరణ్.

English summary

Love story of director suryakiran and Actress kalyani in telugu

Here we talking about love story of director suryakiran and actress kalyani in telugu. Read on