For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలా కూడా రివేంజ్ తీర్చుకుంటారా? మాజీ ప్రియురాలికి గట్టి షాకిచ్చిన ప్రియుడు...

|

ప్రస్తుత ఆధునిక కాలంలో ప్రేమ గురించి విచిత్రమైన కథలు వినిపిస్తున్నాయి. అయితే కొన్ని కథలు వినడానికి చాలా బాగుంటాయి. కానీ కొన్ని మాత్రం చాలా విచిత్రంగా అనిపిస్తాయి.


ఎందుకంటే ఈరోజుల్లో ప్రేమ అంటే కేవలం కొన్ని రోజులు కలిసిమెలిసి తిరగడం.. పార్కులు, సినిమాలు, పబ్బులు, డేటింగులు వంటివి చేయడం.. అయితే మోజు తీరాక మోసం చేయడం అనే వార్తలను మనం నిత్యం చూస్తూ ఉంటాం లేదా వింటూ ఉంటాం.


అయితే నిజంగా ప్రేమలో మునిగిపోయిన వారు బయటి ప్రపంచాన్ని అస్సలు పట్టించుకోరు. వారి ప్రపంచమే ప్రత్యేకంగా ఉన్నట్లు ఫీలవుతారు.


ఇలాంటి ప్రేమికులను కరోనా వైరస్ వంటి మహమ్మారి కూడా ఆపలేదు. ఎందుకంటే వీరు ప్రతి నిమిషం తమ ప్రేయసి గురించే ఆలోచిస్తూనే ఉంటారు.


అయితే ఇదంతా ఇద్దరూ గాఢంగా ప్రేమలో మునిగిపోయినప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఇద్దరిలో ఏ ఒక్కరిలో కొంచెం తేడా వచ్చినా.. అంతా తలకిందులైపోతుంది.


సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటే ఇటీవల చోటు చేసుకుంది. మన తెలుగు సినిమాల్లో చూపించినట్టుగానే.. మగాడు నిజాయితీగా ఓ అమ్మాయిని ప్రేమించడం.. ఆమె అవసరం తీరాక అతడిని వదిలిపెట్టడం చకచకా జరిగిపోతుంది.


అయితే ఇక్కడ మోసపోయిన ఆ మగాడు మాత్రం అందరిలాగా గడ్డం పెంచి.. మద్యం తాగుతూ దేవదాసులాగా మారలేదు. తన ప్రియురాలిపై కొన్ని రోజుల తర్వాత ప్రతీకారం తీర్చుకున్నాడు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి మరి...

సర్వే! మగవారికి అంగం చిన్నగా ఉంటే కలయికలో కష్టమేనా? ఏది నిజమో తెలుసుకోండి...

ఎంతగానో ఇష్టపడితే..

ఎంతగానో ఇష్టపడితే..

తన ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడిన తన ప్రేయసి తనను చిన్న కారణాన్ని సాకుగా చెప్పి బ్రేకప్ చేప్పడానికి కనీసం ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు.

రివేంజ్ ఛాన్స్..

రివేంజ్ ఛాన్స్..

అయితే తన ప్రేయసి బ్రేకప్ చెప్పిన సంవత్సరం తర్వాత ఓ యువకుడికి ఆమెపై రివేంజ్ తీర్చుకునే అవకాశం వచ్చింది. అతను ఇచ్చిన షాక్ కి ఆ అమ్మాయి షాకైంది. ఇదంతా మన దాయాది దేశమైన పాకిస్థాన్ లో చోటు చేసుకుంది.

ఆమెనే పెళ్లి చేసుకోవాలని..

ఆమెనే పెళ్లి చేసుకోవాలని..

కరాచీకి చెందిన హుసేన్ అనే యువకుడు ఓ అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఆ అమ్మాయే లోకంగా బతికాడు. ఎప్పటికైనా ఆమెనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

మన దేశంలో ఫస్ట్ నైట్ రోజు తెల్లని దుస్తులే ఎందుకు ధరిస్తారో తెలుసా?

బర్త్ డేకి గిఫ్ట్ ఇవ్వలేదని..

బర్త్ డేకి గిఫ్ట్ ఇవ్వలేదని..

అయితే.. ఓ రోజు తన ప్రియురాలి పుట్టినరోజుకు గిఫ్ట్ ఇవ్వడం మరచిపోయాడు. అదొక్క కారణంతో ఆమె హుసేన్ కి బ్రేకప్ చెప్పేసింది.

తట్టుకోలేకపోయాడు...

తట్టుకోలేకపోయాడు...

తన ప్రియురాలు బ్రేకప్ చెప్పడాన్ని హుసేన్ తట్టుకోలేకపోయాడు. చాలా సార్లు ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించాడు. కానీ ఎంత ప్రయత్నించినా ఫలితం మాత్రం దక్కలేదు.

ఏడాది తర్వాత..

ఏడాది తర్వాత..

కానీ ఏడాది తర్వాత తనకు మాజీ ప్రియురాలి నుండి ఓ మెసేజ్ వచ్చింది. అయితే ఆమెకు ఆకలేసి ఆ మెసెజ్ చేసిందట. ఆ మెసెజ్ లో ఆమె తనకు బాగా ఆకలిగా ఉందని పిజ్జా ఆర్డర్ చేయవా అంటూ మెసెజ్ చేయడం విశేషం.

మన దేశంలో ఫస్ట్ నైట్ రోజు తెల్లని దుస్తులే ఎందుకు ధరిస్తారో తెలుసా?

పిజ్జా ఆర్డర్ చేశాడు.. కానీ..!

పిజ్జా ఆర్డర్ చేశాడు.. కానీ..!

అయితే.. ఆ యువకుడికి.. తనకు ఆమె బ్రేకప్ చెప్పిన విషయం గుర్తుకు వచ్చి.. ఆమె అడిగినట్టే పిజ్జా ఆర్డర్ చేశాడు. కానీ తను రివేంజ్ తీర్చుకునేలా చేశాడు.

13,500 బిల్లు...

13,500 బిల్లు...

ఆమె ఒక్క చికెన్ పిజ్జాను అడిగితే, తను మాత్రం చాలా చికెన్ పిజ్జాలు ఆర్డర్ చేశాడు. అది ఎంతంటే ఏకంగా రూ.13,500 బిల్లు చేశాడు. అలా ఎక్కువ పిజ్జాలు, కూల్ డ్రింకులు ఆర్డర్ చేసి, తన మాజీ ప్రేయసి అడ్రస్ ఇచ్చాడు. బిల్లులో క్యాషన్ ఆన్ డెలీవరీ ఆప్షన్ సెలెక్ట్ చేశాడు.

షాకైన ప్రేయసి..

షాకైన ప్రేయసి..

ఈ విషయం తెలుసుకున్న ఆమె ఒక్కసారిగా షాకయ్యింది. ఇన్ని ఎందుకు ఆర్డర్ చేశావని.. ఆ యువకుడికి మెసెజ్ చేయగా.. మీ ఫ్యామిలీ మొత్తం కూర్చోని తినండి అంటూ సమాధానం ఇచ్చాడు.

నెంబర్ బ్లాక్..

నెంబర్ బ్లాక్..

అక్కడితో ఆగకుండా ‘‘నేను ఒక అబ్బాయిని చీట్ చేసినందుకు అతను నాకు సర్ ప్రైజ్ ఇచ్చాడు అని మీ తల్లిదండ్రులకు చెప్పు' అని మెసెజ్ చేసి, తర్వాత ఆమె నెంబర్ బ్లాక్ చేశాడు.

సోషల్ మీడియాలో..

సోషల్ మీడియాలో..

ఆ తర్వాత వారిద్దరి మధ్య సంభాషణను మొత్తం స్క్రీన్ షార్ట్స్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో అది కాస్త వైరల్ గా మారింది.

English summary

Man orders food costing Rs.13k as revenge on Ex Girlfriend

Here we talking about man orders food costing Rs.13k as revenge on ex girlfriend. Read on
Story first published: Tuesday, July 14, 2020, 19:45 [IST]