For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mantras From Kamasutra in Telugu: శృంగారంలో ఈ నియమాలను ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి...

|

ఒకప్పుడు శృంగారం గురించి చాలా మందికి అనేక అపొహలు ఉండేవి. అందుకే దాని గురించి బహిరంగంగా మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడేవారు.

ఇప్పటి డిజిటల్ యుగంలో కూడా అనేక మందికి ఆ కార్యంపై అంతగా అవగాహన లేదు. అయితే పూర్వకాలంలో మాత్రం రొమాన్స్ గురించి, ముఖ్యంగా కామసూత్రాల్లోని భంగిమల గురించి ఓపెన్ గానే మాట్లాడేవారట.

ఆ విషయంలో ఏ మాత్రం సిగ్గు పడేవారు కాదట. అందుకే శృంగారం అనే అంశాన్నే వాత్సాయనుడు ప్రధానంశంగా తీసుకునొ 'కామ సూత్ర' అనే పుస్తకాన్ని రెండో శతాబ్దంలో రాశాడని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఇలాంటి గ్రంథాల్లోని అద్భుతమైన భంగిమలు, సూచనల మేరకు శృంగారంలో పాల్గొంటే మన మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.

అంతేకాదు మనం మన భాగస్వామితో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడానికి ఇది చక్కటి మార్గంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రపంచంలోని ఏ ఇద్దరు వ్యక్తులనడిగినా.. తమ శృంగారం జీవితం ఆనందంగా లేదనే సమాధానం చెబుతున్నారని కొన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రేమికులు, దంపతులు కామసూత్రలో చెప్పిన కొన్ని ముఖ్యమైన సూత్రాలను పాటిస్తే చాలు.. మీ దాంపత్య జీవితం ఆనందంగా మారిపోతుందట. మీ ఇద్దరి మధ్య బంధం బలంగా మారిపోతుందట. అంతేకాదు కపుల్స్ లైఫ్ లో ఎన్నో మార్పులను సాధించొచ్చు. అయితే ఈ సూత్రాల్లో కొన్ని చిత్ర విచిత్రమైన నియమాలు ఉన్నాయి. అవేంటో మీరే చూడండి...

ఈ 4 రాశుల మగాళ్లు మగువలను మహారాణిలా చూసుకుంటారట...!

క్లీన్ చేసుకున్నాకే..

క్లీన్ చేసుకున్నాకే..

ఏ ఇద్దరు వ్యక్తులైనా కలయికలో పాల్గొనాలని భావిస్తే.. ముందుగా తమ జననాంగాలను పూర్తిగా శుభ్రం చేసుకోవాలని కామసూత్ర గ్రంథం చెబుతోంది. ఆ తర్వాతే శృంగారంలో పాల్గొనాల్సి ఉంటుంది. అందుకే పూర్వ కాలంలో శృంగారంలో పాల్గొనడానికి ముందు స్నానం కచ్చితంగా చేయాలనే నిబంధనను పెట్టారు. దాన్ని కచ్చితంగా ఆచరించేవారు. పూర్తిగా నగ్నంగా మారి ఆ కార్యంలో పాల్గొనకూడదట. స్త్రీపురుషులిద్దరూ తమ శరీరంపై కనీసం దుప్పటినైనా కప్పుకోవాలి.

ఇద్దరికీ అవగాహన..

ఇద్దరికీ అవగాహన..

కామసూత్ర ప్రకారం.. ఆడ, మగవారిద్దరికీ కామశాస్త్రం గురించి కనీస అవగాహన ఉండాలట. వీటి గురించి తెలుసుకోవడం వల్ల శృంగార జీవితం ఆనందకరంగా మారుతుందట. శృంగారంలో పాల్గొనే వారు ఎక్కువగా రాత్రి వేళలో పాల్గొనాలట. అయితే అర్థరాత్రిలోపు ముగించాలట. ఎవరైతే అర్ధరాత్రి ఆ కార్యాన్ని చేస్తారో.. అది రాక్షసుల క్రీడగా పరిగణించబడుతుందట. ఈ సమయంలో శృంగారంలో పాల్గొంటే పుట్టే పిల్లల్లో రాక్షస లక్షణలు ఎక్కువగా వస్తాయట.

కోరికలు మంచికే..

కోరికలు మంచికే..

మనలో యవ్వనంలో ఉన్నవారు, ముఖ్యంగా పెళ్లయిన వారు, ప్రేమలో ఉన్నవారి కోరికలు అమాంతం పెరుగుతూ ఉంటాయి. ఇలాంటి వారికి కలిగే కోరికల వల్ల మంచే జరుగుతుందట. ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన కార్యంగా కామసూత్రలో పేర్కొనబడింది. లైంగిక ప్రేరేపణ వల్ల అవమానం, ఇబ్బంది, అపరాధ భావాలకు సంబంధించిన ఆలోచనలు అనేవి పూర్తిగా అవాస్తవం. శృంగారం అనేది మానసికంగా, శారీరకంగా ఒకరికొకరు కలిసి పోయే అద్భుతమైన కలయిక.

ఫోన్ సెక్స్ కు ముందు ఇలా చేస్తే అద్భుతమైన అనుభూతిని పొందొచ్చు...!

ప్రెగ్నెన్సీ టైమ్ లో..

ప్రెగ్నెన్సీ టైమ్ లో..

ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉంటారో.. వారు ఆ కార్యానికి దూరంగా ఉండాలట. బిడ్డ పుట్టే వరకు శృంగారంలో పాల్గొనకూడదట. ప్రెగ్నెన్సీ తర్వాత శృంగారంలో పాల్గొనడం వల్ల బిడ్డ వికలాంగులుగా పుట్టే అవకాశాలు ఉంటాయట. అలాగే కొన్ని పవిత్రమైన చెట్లు, స్మశాన వాటికలు, పవిత్ర స్థలాలు, దేవాలయాలు, గురుకులాలు, ఆసుపత్రుల వంటి ప్రదేశాల్లో ఆ కార్యంలో పాల్గొనడకూడదట. ఇలా చేసిన వ్యక్తులు జీవితాంతం భయంకరమైన వ్యాధుల బారిన పడతారట.

బాధలో ఉన్నప్పుడు..

బాధలో ఉన్నప్పుడు..

మీరు శృంగారంలో పాల్గొనడానికి ముందు మీ భాగస్వామి కూడా అందుకు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉందా లేదా అనేది కచ్చితంగా చూసుకోవాలి. తనకు ఇష్టం లేనప్పుడు లేదా వారు బాధలో ఉన్నప్పుడు ఆ కార్యంలో బలవంతంగా పాల్గొనరాదు. ఇలా చేయడం వల్ల చాలా పెద్ద నేరంగా పరిగణించబడుతుందట. పీరియడ్స్ సమయంలో కూడా కలయికలో పాల్గొనకూడదు. ఒక వేళ బలవంతంగా పాల్గొంటే మగాళ్లకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందట. అయితే పీరియడ్స్ పూర్తయిన 4 రోజుల తర్వాత అంటే ఐదో రోజు నుండి ఆ కార్యంలో పాల్గొనవచ్చు.

కామ సూత్రం ప్రకారం శృంగారానికి ముందు ఏమి చేయాలి?

ఏ ఇద్దరు వ్యక్తులైనా కలయికలో పాల్గొనాలని భావిస్తే.. ముందుగా తమ జననాంగాలను పూర్తిగా శుభ్రం చేసుకోవాలని కామసూత్ర గ్రంథం చెబుతోంది. ఆ తర్వాతే శృంగారంలో పాల్గొనాల్సి ఉంటుంది. అందుకే పూర్వ కాలంలో శృంగారంలో పాల్గొనడానికి ముందు స్నానం కచ్చితంగా చేయాలనే నిబంధనను పెట్టారు. దాన్ని కచ్చితంగా ఆచరించేవారు. పూర్తిగా నగ్నంగా మారి ఆ కార్యంలో పాల్గొనకూడదట. స్త్రీపురుషులిద్దరూ తమ శరీరంపై కనీసం దుప్పటినైనా కప్పుకోవాలి.

కామసూత్రం ప్రకారం, గర్భం దాల్చిన సమయంలో ఎందుకు ఆ కార్యంలో పాల్గొనకూడదు?

ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉంటారో.. వారు ఆ కార్యానికి దూరంగా ఉండాలట. బిడ్డ పుట్టే వరకు శృంగారంలో పాల్గొనకూడదట. ప్రెగ్నెన్సీ తర్వాత శృంగారంలో పాల్గొనడం వల్ల బిడ్డ వికలాంగులుగా పుట్టే అవకాశాలు ఉంటాయట. అలాగే కొన్ని పవిత్రమైన చెట్లు, స్మశాన వాటికలు, పవిత్ర స్థలాలు, దేవాలయాలు, గురుకులాలు, ఆసుపత్రుల వంటి ప్రదేశాల్లో ఆ కార్యంలో పాల్గొనడకూడదట. ఇలా చేసిన వ్యక్తులు జీవితాంతం భయంకరమైన వ్యాధుల బారిన పడతారట.

English summary

Mantras From Kamasutra in Telugu

Mantras From Kamasutra in Telugu: Check out the important things you can learn from Kamasutra. Read on,
Story first published: Saturday, May 7, 2022, 14:33 [IST]