For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలాంటి లక్షణాలుండే అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే ఎన్ని లాభాలో మీరే చూడండి...

|

కళ్యాణం వచ్చినా.. కక్కు వచ్చినా ఆగదంటారు. అయితే కళ్యాణం చేసుకునే ముందు కొన్ని విషయాలను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది వరికటిలాగా పెళ్లి అనగానే అమ్మాయిలు సిగ్గు పడుతూ వచ్చి పెళ్లి పీటల మీద కూర్చొనే రోజులు ఎప్పుడో పోయాయి.

ప్రస్తుతం కాలం మారింది. పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి. అబ్బాయిలైనా.. అమ్మాయిలైనా తమకు ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేస్తూ వివాహానికి అలాగే చేసుకోవాలని భావిస్తున్నారు.

వీటి సంగతి పక్కన బెడితే మన దేశంలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహాం అంటే చాలా ముఖ్యమైన కార్యక్రమం. హిందూ శాస్త్రాల ప్రకారం అబ్బాయిలు ఎలాంటి లక్షణాలు ఉండే అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలో పూర్వకాలంలోనే నిర్ణయించారు.

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒకే ఒక్కసారి వచ్చే ముఖ్యమైన ఘట్టం. అలాంటి ఘట్టాన్ని ఎంతో ఆడంబరంగా చేసుకోవాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు.

ఈ నేపథ్యంలో అబ్బాయిలందరూ ఈ విషయాలను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే హిందూ ధర్మం ప్రకారం ఇలాంటి లక్షణాలు అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే మీకు కచ్చితంగా అదృష్టం వస్తుందట... ఇంతకీ ఆ లక్షణాలేంటో ఇప్పుడు చూసేయ్యండి...

మగువలలో ఇలాంటి లక్షణాలుంటే మగవారి మతి పోయినంత పనవుతుందట...!

మనీ సేవింగ్స్..

మనీ సేవింగ్స్..

హిందూ శాస్త్రం ప్రకారం ఆడవారం దేవతలతో సమానం. లక్ష్మీ దేవత వంటి వారు మీ కుటుంబ ఆర్థిక వ్యవస్థను పెంచుతారో వారిని అస్సలు వదులుకోకండి. అలాగే ఆదాయాన్ని పొదుపు చేసేవారిని, స్వచ్ఛమైన మనసు ఉండేవారిని పెళ్లి చేసుకుంటే కచ్చితంగా అదృష్టం కలిసి వస్తుంది.

సహనం ఉండే వారిని..

సహనం ఉండే వారిని..

అమ్మాయిలకు అబ్బాయిల కంటే చాలా సహనం ఎక్కువగా ఉంటుంది. అందుకే భూదేవంత సహనం వంటి ఉండాలని పెద్దలు చెబుతుంటారు. అలా భూదేవిని కూడా మహిళలతోనో పోల్చారు. ఇప్పటివారిలో అది చాలా వరకు తగ్గిపోయినా.. ఓపిక ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో అలాంటి వారిని అస్సలు వదులుకోకండి.

పెద్దల పట్ల గౌరవం..

పెద్దల పట్ల గౌరవం..

ఎవరైతే పెద్దలను గౌరవిస్తారో.. వారితో హుందాగా నడుచుకుంటారో అలాంటి వారు కుటుంబ శ్రేయస్సు కోరుకుంటారని అర్థం. అలాంటి వారికి మీరు ప్రేమ మరియు సాన్నిహిత్యంతో దగ్గరవ్వాలి.

ఇలాంటి వ్యక్తులతో శృంగారం చేస్తే.. చివరికి మీరే చింతిస్తారు... వారెవరో చూసెయ్యండి మరి...

క్లిష్ట సమయాల్లో తోడుగా..

క్లిష్ట సమయాల్లో తోడుగా..

స్త్రీలకు సహనంతో పాటు బలం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే మీకు క్లిష్ట సమయాల్లో తోడుగా ఉంటారనిపిస్తారో.. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు మద్దతు తెలిపి, ప్రేమను పంచుతారో.. మీ కుటుంబాన్ని చీకటి నుండి వెలుగులోకి ఎవరైతే నడిపించగలరని మీరు నమ్ముతారో అలాంటి వారిని పెళ్లి చేసుకోవాలి.

విద్య, సమాజంపై అవగాహన..

విద్య, సమాజంపై అవగాహన..

ఎవరైతే అమ్మాయిలు చదువుకుని ఉంటారో... సమాజంపై కూడా కాస్తో.. కూస్తో అవగాహన కలిగి ఉంటారో అలాంటి వారు కచ్చితంగా తెలివైన వారయ్యుంటారు. అలాంటి లక్షణాలుండే అమ్మాయిలు మీ జీవితంలోకి వస్తే మీరు చాలా అదృష్టవంతులవుతారు.

మంచి నడవడిక..

మంచి నడవడిక..

అమ్మాయిలలో చాలా మంది చుట్టూ ఉన్న పరిస్థితులను గమనిస్తూ జీవితంలో కింది స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగింటారో అలాంటి వారిని.. అందులోనూ మంచి నడవడిక ఉండే వారిని పెళ్లి చేసుకోవాలి.

వాత్సాయనుడి కామసూత్రాల ప్రకారం స్త్రీ భుజాలను తాకితే.. ఏం జరుగుతుందో తెలుసా...

ధర్మం పట్ల గౌరవం..

ధర్మం పట్ల గౌరవం..

మీరు పెళ్లి చేసుకునే అమ్మాయిలకు తన మతం, ధర్మం, ఆచారం పట్ల గౌరవం ఉండాలి. అలాగే ఆమె కూడా సంప్రదాయాలు పాటిస్తూ ఉంటే మీరు అలాంటి వారిని నిరంభ్యంతరంగా పెళ్లి చేసుకోవచ్చు. అలాంటి సామాజిక పనులను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు.

మీకే అంకితం..

మీకే అంకితం..

ఎవరైతే అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా అంకితమయ్యేందుకు సిద్ధంగా ఉంటుందో తన సౌందర్యాన్ని సంస్కారంతో తన భర్త మాత్రమే పొందాలి అనుకుంటారో అలాంటి వారిని వదులుకోకండి.

బంధాలకు విలువ..

బంధాలకు విలువ..

అమ్మాయిలలో చాలా మంది పెళ్లి అయిన వెంటనే వేరు కాపురం పెడదామని చెబుతూ ఉంటారు. దీని వల్ల లాభాలు, నష్టాలు రెండూ ఉన్నాయి. కాబట్టి బంధాలు, అనుబంధాలను పెంచుకుంటూ పిల్లలు, పెద్దవారితో కలిసిపోయే వారిని పెళ్లి చేసుకోవాలి.

ఆకట్టుకునే మాటతీరు..

ఆకట్టుకునే మాటతీరు..

తమ ప్రవర్తన, మాటతీరుతో అందరినీ ఏకకాలంలో ఆకట్టుకునే అమ్మాయిలను మీరు అస్సలు వదులుకోకండి. అలాంటి వారు మీ కుటుంబ సంక్షేమం కోరుతూ, తెలివిగా సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. వారి మంచి నైపుణ్యాలను కూడా ప్రదర్శిస్తారు.

సేవా గుణాలు..

సేవా గుణాలు..

అమ్మాయిలలో ఎవరికితై సేవ చేసే గుణం, ఆకలితో ఉన్నప్పుడు ఏదైనా ఆహారం ఇచ్చే అలవాటు ఉంటుందో అలాంటి వారినే పెళ్లి చేసుకోండి.

English summary

Men who marry women with these characteristics are lucky

Here we talking about men who marry women with these characteristics are lucky. Read on.
Story first published: Saturday, June 6, 2020, 18:30 [IST]