For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలాంటి భర్తలతో జర భద్రం.. లేదంటే జీవితాంతం బాధపడాల్సిందే...!

|

భార్యభర్తలు లేదా ప్రేమికులు ఎవరైనా సరే వారు ఉన్న రిలేషన్ షిప్ లో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో గొడవ పడుతూ ఉంటారు. అయితే దానికి కారణం మీరంటే మీరే అని నిందలు వేసుకుంటూ ఉంటారు.

అయితే తమలో తాము అభద్రతా భావంలో(Insecure) ఉండే వారే రెగ్యులర్ గా ఇలా ఎదుటివ్యక్తిలో లోపాలను వెతుకుతూ.. భాగస్వామిపై మరింత నిందలు వేస్తూ ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

మహిళల కంటే మగవారికే ఇలాంటి ఇన్ సెక్యూర్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయట. అయితే వారు వాటిని బయటపెట్టకుండా ఉండేందుకు పార్ట్నర్ పై నిందలు వేస్తుంటారట. ఇదొక్కటే కాదు.. ఇలా నిందలు వేసే సమయంలో భాగస్వామిపై అనుమానం కూడా వ్యక్తం చేస్తారట.

ఇదే అదనుగా భావించిన మరికొందరు మగాళ్లు మైండ్ గేమ్స్ కూడా ప్లే చేస్తారట. తాము మానసికంగా బాధపడుతూ.. తమలో ఉండే భయాన్ని తొలగించుకోవడానికి ఇలా చేస్తారట. ఈ సందర్భంగా భాగస్వామిపై అస్తమానం నిందలు వేస్తే.. అదే పనిగా అనుమానం వ్యక్తం చేసే భర్తలు ఎలాంటి మైండ్ గేమ్స్ ప్లే చేస్తారో మీరే చూడండి...

ఈ రాశుల వారు లవ్ లో ఈజీగా సక్సెస్ అవుతారట...! మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...ఈ రాశుల వారు లవ్ లో ఈజీగా సక్సెస్ అవుతారట...! మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...

వారి తప్పు కూడా..

వారి తప్పు కూడా..

చాలా మంది భర్తలు సాధారణంగా తాము చేసిన తప్పును లేదా పొరపాటును అంత సులభంగా ఒప్పుకోరు. అయితే మానసికంగా ఇబ్బంది పడేవారు.. అభద్రతా భావంలో ఉండేవారు తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకు ముందుగానే తమ భార్యపై దాన్ని నెట్టేసే ప్రయత్నం చేస్తారట. ముఖ్యంగా తాము చేసిన తప్పులను కూడా ఎదుటివారిపై ఎక్కువగా నెట్టేయడం వంటివి చేస్తారట. అన్ని పొరపాట్లను తమ భార్య ఖాతాలోకే జమ చేసేస్తారట. నలుగురిలో తన తప్పు ఏం లేదని.. అంతా తన భార్యదే అని చెప్పే ప్రయత్నం చేస్తారట.

భావోద్వేగ నటన..

భావోద్వేగ నటన..

మానసికంగా బాధపడేవారు భావోద్వేగంగా బాగా నటిస్తారట. అందుకే ఏదైనా విషయంలో మీ అవసరం పడితే నాటకం ఆడటం ప్రారంభిస్తారట. వారితో మీకు అవసరం లేకున్నా.. అది ఉన్నట్లు సీన్ క్రియేట్ చేస్తారట. ముందుగా మీ బలహీనతను కనుక్కొని.. దాన్ని అస్త్రంగా ఉపయోగించుకుంటారట.. ముఖ్యంగా మీరంటే ఇష్టమనో లేదా ప్రేమనో చేసుకుని మిమ్మల్ని బలవంతం చేస్తారు. ముఖ్యంగా భావోద్వేగంగా మిమ్మల్ని టార్గెట్ చేసుకుని.. తమలో తామే ఆనంద పడుతుంటారు.

పని చేయకపోతే..

పని చేయకపోతే..

సాధారణంగా భార్యభర్తలన్నాక కలిసి మెలసి పని చేసుకుంటూ ఉంటారు. అయితే కొందరు మాత్రం తమ అవసరాలకు తగ్గట్టు కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. నిత్యం తమ భార్యలు తమకు వండిపెట్టే అవసరాలతో పాటు.. మరిన్ని అవసరాలు తీర్చేలా.. ఎప్పుడూ ఏదో ఒక పని చేయించుకుంటూ ఉంటారట. ఒకవేళ వారు ఆ పని చేయకపోతే... వారి గురించి బూతుపూరాణం మొదలుపెట్టి.. వారేదో ఘోర తప్పిదం చేసినట్లు సీన్ క్రియేట్ చేస్తారట.

అసూయ వల్ల..

అసూయ వల్ల..

మరికొందరు మగవారు తమ స్నేహితులకు ఉన్న అందమైన భార్యలను చూసి అసహ్యపడుతూ ఉంటారు. అందమైన భార్య అంటే తమకే ఉండాలని.. ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికి ఉండకూడదని భావిస్తుంటారు. అందుకే తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల నుండి తమ భాగస్వామిని దూరంగా పెట్టేందుకు ప్రయత్నిస్తారట. తాము ఒక్కటే అందరితో మంచిగా ఉన్నట్టు నటిస్తారట. అక్కడితో నలుగురిలో తమ భార్యను చెడ్డవారిగా చూపించేలా ట్రై చేస్తారు. వారిని ఎవరితో మాట్లాడనీయకుండా చేస్తారు.

పార్ట్నర్ ను వెనక నుండి వాటేసుకుంటే.. సర్ ప్రైజే కాదు.. మస్తు సంతోషిస్తారట..!పార్ట్నర్ ను వెనక నుండి వాటేసుకుంటే.. సర్ ప్రైజే కాదు.. మస్తు సంతోషిస్తారట..!

గొడవ జరిగినప్పుడల్లా..

గొడవ జరిగినప్పుడల్లా..

ఏదైనా విషయంలో ఎప్పుడైనా ఇద్దరి మధ్య గొడవ జరిగితే.. అందులో తప్పంతా భార్యదే అని చెప్పడం వీరికి వెన్నతో పెట్టిన విద్య వారి మాటలు విన్న ఇతరులెవరైనా నిజంగా భార్యదే తప్పు అని భావిస్తారట.

ఇతరులతో మంచిగా..

ఇతరులతో మంచిగా..

అభద్రతా భావం ఉండే పురుషులు ఇతరులతో తామెంతో పర్ఫెక్ట్ మ్యాన్ అనేటట్టు మాట్లాడుతూ ఉంటారు. నలుగురిలో ఉన్నప్పుడు తమ భార్యకు ఎంతో గౌరవం, మర్యాద ఇస్తున్నట్టు నటిస్తున్నారు. కానీ ఎవ్వరూ లేని సమయం దొరికితే చాలు భార్యలను మానసికంగా చాలా ఇబ్బందులకు గురి చేస్తారట. మరికొందరు శాడిస్టులు అయితే.. దాడి చేస్తారట. ఇంకొందరు సైకో మాదిరిగా ప్రవర్తిస్తూ మాటలతోనే భాగస్వామిని చిత్రహింలు పెడతారు.

అనుమానిస్తూ..

అనుమానిస్తూ..

అంతేకాదు నలుగురిలో ఉన్నప్పుడు ఎవరైనా తమ భాగస్వామిని కనీసం పలకరించినా.. యోగక్షేమాలు అడిగినా కూడా వారిపై ఎక్కువ అనుమానం వ్యక్తం చేస్తారట. అంతేకాదు వారెవ్వరూ.. ఎందుకొచ్చారు.. ఏం పని ఎందుకని అలా అడిగాడు అంటూ అక్రమ సంబంధం అంటగట్టేందుకు ప్రయత్నిస్తారట.

ఇలాంటి లక్షణాలు ఉండే మగవారితో జాగ్రత్త సుమా.. ఇలాంటి వారికి ఎంత త్వరగా దూరమైతే అంత హాయిగా బతకొచ్చు.

English summary

Mind Games Insecure Men Play on Women

Here are these mind games insecure men play on women in Telugu. Take a look