For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాక్ డౌన్ టైములో పెళ్లి చేసుకున్నారా? అయితే ఈ పొరపాట్లు చేయకండి...

|

ఆలుమగల మధ్య సంబంధం ఎంతో అన్యోన్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. ఎందుకు దంపతుల మధ్య సంబంధం చాలా ప్రత్యేకమైనది కాబట్టి. ఒకప్పుడు ఉరుకుల పరుగుల జీవితంలో భార్యభర్తలు సరదాగా గడిపేందుకు సమయం అస్సలు దొరికేది కాదు.

ఒకవేళ దొరికినా ఆ సమయం అప్పుడే గడిచిపోయిందా అని అందరూ బాధపడేవారు. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఇళ్లకే పరమితమయ్యారు.

ఈ పరిస్థితి భార్యభర్తలిద్దరికీ చాలా సరికొత్తగా మారిపోయింది. ఇలాంటి సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చాలా వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో గొడవలు కూడా అదే స్థాయిలో పెరిగే అవకాశం ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో భార్యభర్తలిద్దరూ తమకు తెలియకుండానే చాలా తప్పులు చేస్తుంటారు. దీని వల్లే ఇద్దరి మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది. అందుకే అలాంటి పొరపాట్లు అస్సలు చేయకూడదు.

దీని వల్ల మీ ఇద్దరి మధ్య రోజురోజుకీ ప్రేమ పెరగటే కాదు... సాన్నిహిత్యమూ పెరుగుతుంది. ఇంతకీ ఆలుమగలు చేసే ఆ పొరపాట్లేంటో ఇప్పుడు చూద్దాం...

మీ పురుషాంగంలో అసురక్షిత సెక్స్ వల్ల కలిగే ఈ సమస్య నుంచి బయటపడటానికి ఇలా చేయండి ...!మీ పురుషాంగంలో అసురక్షిత సెక్స్ వల్ల కలిగే ఈ సమస్య నుంచి బయటపడటానికి ఇలా చేయండి ...!

ప్రేమగా మాట్లాడితే..

ప్రేమగా మాట్లాడితే..

మన దేశంలో ఇంటి నుండి పని చేయడానికి ఎవ్వరూ ఆసక్తి చూపరు. ఎందుకంటే మనలో చాలా మంది ఆఫీసుకు వెళ్లి పని చేసే వారే ఎక్కువగా ఉన్నారు. ప్రతిరోజూ ఇంట్లోనే పని చేయాల్సి వస్తే.. మొదట్లో బాగానే ఉన్నప్పటికీ, కొంతకాలం తర్వాత విసుగు, చిరాకు, కోపం వంటివి వస్తుంటాయి. ఈ సమయంలో భాగస్వామితో గొడవలు పెరుగుతుంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే, మీరు మీ భాగస్వామితో నిత్యం ప్రేమతో మాట్లాడేందుకు ప్రయత్నించాలి. వారితో విలువైన సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి. ఇలా చేస్తే, మీ ఇద్దరి మద్య అవగాహన పెరగడమే కాదు.. ప్రేమ కూడా పెరుగుతుంది...

రొమాన్స్ విషయంలో..

రొమాన్స్ విషయంలో..

లాక్ డౌన్ కారణంగా చాలా మందికి రొమాన్స్ చేసేందుకు కావాల్సినంత సమయం దొరికింది. అయితే కేవలం ఆ కార్యంతో ప్రేమను వ్యక్తం చేయడం మంచిది కాదు. మితిమీరిన కలయిక వల్ల మీకు ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి ఆ కార్యానికి అప్పుడప్పుడు కొంత విరామం ఇచ్చి.. తిరిగి ప్రారంభించండి. అప్పుడు ఇద్దరు సంతోషంగా ఉంటారు.

అన్ని పనులు చేయాలి..

అన్ని పనులు చేయాలి..

లాక్ డౌన్ సమయంలో భార్యభర్తలిద్దరూ కలిసి ఇంటి పనులన్నింటినీ స్వయంగా చేయాలి. కావాలంటే మీరు పనిని షేర్ కూడా చేసుకోవచ్చు. ఒకరు అంట్లు తోమితే.. మరొకరు వంట చేయడం.. ఇంటిని శుభ్రం చేయడం వంటి ఇంటి పనులను కలిసిమెలసి చేయాలి. అంతేకానీ కేవలం ఒక్కరికే ఈ బాధ్యతలన్నీ అప్పచెబితే ఇద్దరి మధ్య ఆటోమేటిక్ గా తగాదాలు వస్తాయి.

అమ్మాయిల అందమైన పెదాల వెనుక అన్ని రహస్యాలు దాగున్నాయా?అమ్మాయిల అందమైన పెదాల వెనుక అన్ని రహస్యాలు దాగున్నాయా?

బయటకు వెళ్లే విషయంలో...

బయటకు వెళ్లే విషయంలో...

లాక్ డౌన్ సమయంలో బయటకు వెళ్లడం దాదాపు అసాధ్యం. కాబట్టి మీరిద్దరూ దగ్గర్లో ఉండే బంధువుల ఇంటికో లేదా స్నేహితుల ఇంటికి వెళ్లడం వంటివి చేస్తే మీరు ఇంట్లోనే లాక్ అయిపోయినట్లు భావించరు.

అన్ లాక్ సమయంలో...

అన్ లాక్ సమయంలో...

ఇటీవలే దేశవ్యాప్తంగా అన్ లాక్ డౌన్ 3.0 కూడా ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా కేంద్రం విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈ మార్గదర్శకాలను అనుగుణంగా మీరు బయటకు వెళ్లడం వంటివి ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ మీరిద్దరూ ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ కి వెళ్లాలనుకుంటే, మీరిద్దరూ కచ్చితంగా మాస్కు, శానిటైజర్ మీ వద్ద ఉంచుకోవాలి. అంతకంటే ముందు స్థానిక యంత్రాంగం యొక్క అనుమతులను తప్పనిసరిగా తీసుకోవాలి.

ఇష్టమైన వంటలను..

ఇష్టమైన వంటలను..

అన్ లాక్ ప్రారంభమైనప్పటికీ.. ఇంతకుముందులాగా రెస్టారెంట్లలో, హోటళ్లలో డిన్నర్లకు, క్యాండిల్ లైట్ డిన్నర్ వంటివి ప్లాన్ చేసుకోకండి. ఎందుకంటే బయట పరిస్థితులు అంతగా మంచిగా లేవు. అందుకు బదులుగా మీకు ఇష్టమైన వంటను మీరే తయారు చేసుకోండి. ఒకవేళ మీకు వంట రాకపోతే యూట్యూబ్ వంటి సోషల్ మీడియా సైట్లలో చూసి నేర్చుకోండి.. మీరు కొత్తగా ట్రై చెయ్యండి..

English summary

Mistakes Married Couples Should Avoid During Lockdown

Here we talking about mistakes married couples should avoid during lockdown. Read on