For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కపుల్స్ ఆ కార్యాన్ని అకస్మాత్తుగా అవాయిడ్ చేసేందుకు గల కారణాలేంటో తెలుసా...

|

పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్క జంట వెంటనే ఆశించేది ఆ కార్యాన్నే.. సింగిల్ గా ఉన్నప్పుడు తమ పార్ట్నర్ తో కలిసి ఎంజాయ్ చేసేందుకు ఏవేవో కలలు కంటూ ఉంటారు.

అవన్నీ ఒక్కరాత్రిలోనే అనుభవించాలని ఆశిస్తూ ఉంటారు. పెళ్లైన కొత్తలో కొందరు రతి క్రీడలో మన్మథుడిలా రెచ్చిపోతారు. మహిళలు సైతం తమ కలల రాకుమారుడితో రాత్రి వేళ ఎంచక్కా ఎంజాయ్ చేయాలని, తమ మనసులో ఉన్న కోరికలన్నీ తీర్చుకోవాలని ఊహించుకుంటూ ఉంటారు.

అనునిత్యం ఆ విషయం గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు ఖాళీ సమయం దొరుకుతుందా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తారు. అందరి మధ్య ఉన్నప్పటికీ.. తమ ధ్యాసంతా కేవలం దానిపైనే ఉంటుంది.

అయితే మొదట్లో కలయికలో ఆనందంగా పాల్గొన్నప్పటికీ.. క్రమంగా ఆ కార్యంపై ఆలుమగలిద్దరికీ ఆసక్తి తగ్గిపోతుందట. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది. నిపుణులు ఏం కారణాలు చెబుతున్నారనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...

రొమాన్స్ తర్వాత ఇలా మాట్లాడితే.. మీ బంధం మరింత బలపడుతుందట...!

కొన్నిరోజుల తర్వాత..

కొన్నిరోజుల తర్వాత..

పెళ్లైన కొత్తలో రతి క్రీడలో పాల్గొనేందుకు ప్రతి ఒక్క జంట చాలా ఉత్సాహం చూపుతారు. రొమాన్స్ చేయడంలోనూ చాలా చురుకుగా ఉంటారు. ప్రతి క్షణం ఆ కార్యం గురించే ఆలోచించడం వంటివి చేస్తుంటారు. కుటుంబసభ్యులందరూ ఉన్నా ఇంట్లోనే చాటుగా రొమాన్స్ చేయడం వంటివి చేయాలని తహతహలాడుతుంటారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆసక్తి తగ్గిపోతుంది.

ఏకాంత సమయం దొరికినా..

ఏకాంత సమయం దొరికినా..

కొన్ని రోజుల తర్వాత భార్యభర్తలిద్దరికీ కావాల్సినంత ఏకాంత సమయం దొరుకుతుంది. అయితే ఆ సమయంలో వారిద్దరూ ఆ కార్యంపై అంతగా ఆసక్తి చూపరు. అంతేకాదు ఇద్దరి మధ్య సాన్నిహిత్యం తగ్గిపోతుంది.

రోజువారీ కార్యకలాపాలు..

రోజువారీ కార్యకలాపాలు..

మనలో చాలా మంది జంటలు రొమాన్స్ కు దూరం కావడానికి ప్రధాన కారణం రోటీన్ లైఫ్ కి అలవాటు పడటమేనని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా ఉదయం నిద్ర లేచిదగ్గర్నుంచే ఉరుకులు.. పరుగుల జీవితంలో పడి పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేయడాన్ని మరచిపోతున్నారు. అంతేకాదు ఆ కార్యాన్ని రోటీన్ గా చేయడం వల్ల వారికి రొమాన్స్ పట్ల ఇంట్రస్ట్ తగ్గిపోతుందట.

పెళ్లికి రెఢీగా ఉండేవారికి.. ఈ వధువులిచ్చే సలహాలేంటో చూసెయ్యండి...

ఉత్సాహం తగ్గిపోవడం..

ఉత్సాహం తగ్గిపోవడం..

మరికొందరు జంటలకు ఆ కార్యంలో పాల్గొనేందుకు మొదట్లో ఉత్సాహం ఉన్నప్పటికీ.. తర్వాతి కాలంలో తమ బిజీ లైఫ్ కారణంగా ఆ కార్యంలో ఉత్సాహం తగ్గిపోతుందట. దీంతో తమ భాగస్వామితో చాలా దూరంగా ఉంటారట. అంతేకాదు.. ఫోర్ ప్లేకి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం కలయికకు ప్రియారిటీ ఇవ్వడం వల్ల కూడా ఆలుమగలిద్దరికీ ఆ కార్యంలో పాల్గొనేందుకు ఆసక్తి తగ్గిపోతుందట.

పరిస్థితులు అనుకూలించక..

పరిస్థితులు అనుకూలించక..

మరి కొందరు జంటలకు ఆ కార్యంలో పాల్గొందామని ఆశగా ఉన్నప్పటికీ.. దాన్ని అవాయిడ్ చేస్తారట. ఎందుకంటే ఇంట్లో పిల్లలు, పెద్దలు ఉంటారు. ఈ నేపథ్యంలో తమ కలయికను పిల్లలు ఎక్కడ చూస్తారో.. గది దాటి బయటకు ఎక్కడ శబ్దం వినిపిస్తుందో అని మరి కొందరు ఆ కార్యానికి దూరంగా ఉంటారట. రతి క్రీడలో రెచ్చిపోదామని ఆశగా ఉన్నప్పటికీ.. పరిస్థితులు అనుకూలించక ఆ కార్యానికి దూరంగా ఉంటారట.

అవి వాడటం వల్ల..

అవి వాడటం వల్ల..

కొందరు కపుల్స్ పిల్లలు పుట్టకుండా ఉండేందుకు మార్కెట్లో లభించే కొన్ని రకాల పిల్స్ వాడుతూ ఉంటారు. అయితే వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా కూడా రొమాన్స్ పట్ల ఆసక్తి తగ్గిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బాడీలో మార్పులు..

బాడీలో మార్పులు..

ఇక పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరి బాడీలో కొన్ని మార్పులొస్తాయి. అయితే ఈ విషయాన్ని చాలా మంది ఒప్పుకోరు. అయితే ఇదంతా కలయికలో పాల్గొనడం వల్లే జరుగుతుందట. అందుకే చాలా మంది తాము పెళ్లి తర్వాత కూడా ఫిట్ గా ఉండాలని ఉదయాన్నే వాకింగ్ చేయడం.. గంటలకొద్దీ జిమ్ లో గడపడం వంటివి చేస్తుంటారు. ఈ క్రమంలోనే రొమాన్స్ కి దూరంగా ఉండాలని భావిస్తారట. దీని వల్ల కూడా కపుల్స్ రతి క్రీడకు దూరమవుతారట.

English summary

Most Common Reasons Why Married Couples Stop Having Romance

Here are the most common reasons why married couples stop having romance. Have a look