For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూడేళ్లుగా ప్రేమ... మూడు ముళ్లు పడేదెప్పుడో... పెళ్లి దగ్గరకొచ్చేసరికి...

నా ప్రియురాలు తన పేరేంట్స్ కు ప్రేమ గురించి చెప్పేందుకు భయపడుతోంది.

|

'జీవితం ఒక్కోసారి మనల్ని తెలియని అద్భుతమైన ప్రదేశాలకు తీసుకెళ్తుంది. ముందుగా మనం ఏదైతే కోరుకుంటామో అది అందేలా చేస్తుంది. అయితే మన మనసుకు నచ్చిన వ్యక్తులను మాత్రం దక్కకుండా చేస్తుంది.

My Girlfriend is scared to tell her parents about our love

మనకిష్టమైన వారి కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కదు' అంటూ తన ప్రేమ జీవితంలో తాను ఎదుర్కొంటున్న విచిత్రమైన సంఘటన గురించి చెప్పుకొచ్చాడో ఓ యువకుడు. ప్రతి ఒక్క అబ్బాయికి పెళ్లి గురించి ఎన్నో కలలు ఉంటాయి.

My Girlfriend is scared to tell her parents about our love

తన కలల రాకుమారిని పెళ్లి చేసుకోవాలని.. అది కూడా ప్రేమ వివాహం చేసుకుని.. జీవితాంతం ఆనందంగా జీవించాలని భావిస్తారు. అయితే తన జీవితంలో ప్రేమ అనే తొలి పరీక్షలో విజయం సాధించినా..

My Girlfriend is scared to tell her parents about our love

పెళ్లి విషయం వచ్చేసరికి తన ప్రియురాలిని ఒప్పించలేకపోతున్నానని.. అందరి ప్రేమలో మాదిరిగానే కులం, మతం.. వర్గం వంటి సమస్యలు తనకు కూడా ఎదురవుతున్నాయని.. తన ప్రేమను ఎలా గెలిపించుకోవాలో తెలియక ఓ యువకుడు మదనపడిపోతున్నాడు. ఇంతకీ తన సమస్యేంటి... అతనికి ఏదైనా పరిష్కారం లభించిందా లేదా అనే విషయాలను అతని మాటల్లోనే తెలుసుకుందాం..

ఇవి అలవాటు చేసుకుంటే అమ్మాయిని 'ఆ' విషయంలో అవలీలగా ఆకట్టుకోవచ్చు...! .ఇవి అలవాటు చేసుకుంటే అమ్మాయిని 'ఆ' విషయంలో అవలీలగా ఆకట్టుకోవచ్చు...! .

మూడేళ్ల ప్రేమ...

మూడేళ్ల ప్రేమ...

హాయ్! నా పేరు రమేష్ (పేరు మార్చాం). నేను నా గర్ల్ ఫ్రెండ్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. మూడేళ్ల ప్రేమను పరిణయం దాకా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. కానీ, నేను వేరే కులం, తనది మరో కులం కావడం వల్ల నా ప్రియురాలు మా ప్రేమ గురించి వాళ్ల పేరేంట్స్ కు చెప్పడం లేదు.

ఒత్తిడి చేస్తున్నా..

ఒత్తిడి చేస్తున్నా..

వాళ్ల ఇంట్లో కులం, మతం పట్టింపులు చాలా ఎక్కువట. నేను ఎంతగా ఒత్తిడి చేస్తున్నా సరే.. తను నన్ను ప్రేమించిన విషయం వాళ్ల ఇంట్లో చెప్పడం లేదు. దీని గురించి తనకు నేను చాలాసార్లు చెప్పి చూశాను. ఎంతో కన్విన్స్ చేశాను.

ఎంత చెప్పినా..

ఎంత చెప్పినా..

మంచి సమయం, సందర్భం చూసుకుని.. నువ్వు ప్రేమలో ఉన్నావన్న విషయం చెప్పమన్నాను. ఆ తర్వాత వారి రియాక్షన్ బట్టి మనం ఏం చేయాలో నిర్ణయించుకుందామన్న కూడా తను చాలా భయపడుతోంది. ప్రేమ విషయం తెలిపాక వారే మిగిలిన విషయాలు తెలుసుకుంటారని చెప్పినా అర్థం చేసుకోవడం లేదు.

వామ్మో! 3 రోజులు ప్రేయసితో.. 3 రోజులు భార్యతో గడిపేలా ఒప్పందం... చివరికి ఏమైందో తెలిస్తే షాకవుతారు...!వామ్మో! 3 రోజులు ప్రేయసితో.. 3 రోజులు భార్యతో గడిపేలా ఒప్పందం... చివరికి ఏమైందో తెలిస్తే షాకవుతారు...!

ఫోన్ చేసి మాట్లాడొచ్చా..

ఫోన్ చేసి మాట్లాడొచ్చా..

తన పరిస్థితి చూస్తే.. నా ప్రియురాలు ఇప్పట్లో మా ప్రేమ గురించి వాళ్ల ఇంట్లో చెప్పేటట్టు కనిపించడం లేదు. మరోవైపు మా ఇంట్లో నేను మా ఇంట్లో మా ప్రేమ గురించి చెప్పేశాను. మా పేరేంట్స్ నా ప్రేమకు ఎలాంటి షరతులు విధించలేదు. మా ప్రేమకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు.. ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావట్లేదు. నేను స్వయంగా వాళ్ల పేరేంట్స్ ఫోన్ చేసి మా ప్రేమ విషయం చెప్పొచ్చా.. అది కరెక్టో కాదో నాకు తెలియడం లేదు' అని రమేష్ వాపోయాడు.

నేనేం చేయాలి..

నేనేం చేయాలి..

తను అలా చేయడం సరైందా కాదా అనే సమస్యకు నిపుణులు ఏమి సమాధానం చెబుతారో ఇప్పుడు తెలుసుకుందాం. కులం, మతం, వర్గ పట్టింపులు లేకుండా తమ మనసుకు నచ్చిన వారిని పెళ్లి చేసుకోవడం అనేది మన దేశంలో ఎప్పటి నుండో ఉంది.

పెళ్లి పెద్దల చేతిలో..

పెళ్లి పెద్దల చేతిలో..

ఇప్పటికే మన సమాజంలో ప్రేమ పెళ్లి చేసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మనలో చాలా మంది ప్రేమించిన వారినే పెళ్లి చేసుకునే హక్కు తమకు ఇవ్వాలని పోరాటం చేస్తున్నారు. కానీ, ఇప్పటికీ పెళ్లి అనే ముఖ్యమైన ఘట్టం అనేది పెద్దల చేతుల్లోనే ఉంది. మనం ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది వారి ఇష్టాలపైనే ఆధారపడి ఉంటుంది. కొందరేమో వీటిని పట్టించుకోకుండా ముందుకెళ్తుంటే.. మరికొందరు మాత్రం పెద్దలకు భయపడి.. కట్టుబాట్లను గౌరవించి, వారికి నచ్చజెప్పలేక వారిలో వారే కుమిలిపోతున్నారు.

Ratan Tata :రతన్ టాటా ప్రేమలో ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారో తెలుసా? అందుకే ఆయన పెళ్లి చేసుకోలేదా?Ratan Tata :రతన్ టాటా ప్రేమలో ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారో తెలుసా? అందుకే ఆయన పెళ్లి చేసుకోలేదా?

అంత ఈజీ కాదు..

అంత ఈజీ కాదు..

ఇక మీ విషయానికొస్తే.. మీరు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే మీ ఇద్దరు ఒకే కులం కాదంటున్నారు. కుటుంబ కట్టుబాట్లకు కట్టుబడి ఉండే వారి పేరేంట్స్ ను ఒప్పించడం అనేది అంత సులభం కాదు. ఇది మీకు ఎంతో ఇబ్బందికరంగానే ఉంటుంది.

మరోసారి ఛాన్స్ ఇవ్వండి...

మరోసారి ఛాన్స్ ఇవ్వండి...

అయితే మీ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి.. తను మిమ్మల్ని బాగా ప్రేమిస్తుంది కాబట్టి, మీరు తను నిర్ణయం తీసుకోవడానికి మరో ఛాన్స్ ఇచ్చి చూడండి. తను నిజంగా లైఫ్ మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఉంటే తప్పకుండా ఓ నిర్ణయానికి వస్తుంది. అప్పటివరకు మీరు తనకు మద్దతుగా ఉండండి. ఎలాంటి ప్రెజర్ లేకుండా ఓపికతో ఎదురుచూడండి.

అందుకు సిద్ధపడాలి..

అందుకు సిద్ధపడాలి..

అంతేకాదు, మీరు ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే, తన పేరేంట్స్ మీతో పెళ్లికి ఒప్పుకునే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే తను మీరు ఊహించని నిర్ణయం తీసుకుంటే.. తట్టుకోగలిగే ధైర్యాన్ని కూడా తెచ్చుకోవాలి.

ఫోన్ చేయడానికి బదులు..

ఫోన్ చేయడానికి బదులు..

మీరు వాళ్ల పేరేంట్స్ కి ఫోన్ చేయడానికి బదులు.. తనతో మరోసారి స్పష్టంగా మాట్లాడండి. లేదా నిర్ణయాన్ని తనకే వదలేయండి. ఒకవేళ మీరు తన పేరేంట్స్ తో మాట్లాడాలని నిర్ణయించుకుంటే.. ఈ విషయం తనకు తప్పకుండా చెప్పాలి. అప్పుడే.. తన పేరేంట్స్ వద్ద మీ రిలేషన్ గురించి ధైర్యంగా మాట్లాడగలరు. ఒకవేళ ఇప్పటికీ మీరు కన్ఫ్యూజన్లో ఉంటే మానసిక నిపుణులను లేదా కౌన్సిలర్ ను కలిస్తే మంచి ఫలితం ఉంటుంది.

English summary

My Girlfriend is scared to tell her parents about our love

Here we are talking about the my girlfriend is scared to tell her parents about our love. Read on
Story first published:Thursday, February 18, 2021, 15:42 [IST]
Desktop Bottom Promotion