For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్త సంవత్సర వేళ.. కపుల్స్ ఈ రిజల్యూషన్స్ తీసుకుంటే.. మీ సంసారం సాఫీగా సాగొచ్చు...!

కొత్త సంవత్సరం వేళ కపుల్స్ ఎలాంటి రిజల్యూషన్స్ తీసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం...

|

సాధారణంగా మనలో చాలా మంది కొత్త సంవత్సరం వస్తోందంటే చాలు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కానీ వాటిని అనుసరించేవారు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తారు.

New Years Resolutions for Couples in Telugu

ఎందుకంటే కొత్త సంవత్సరం వేళ అందరికీ కొత్త ఎక్సైట్ మెంట్ వచ్చేస్తుంది. ఇదే ఉత్సాహంలో కొన్ని రిజల్యూషన్స్ చేసుకుంటారు. ఎందుకంటే 2020లో ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ వల్ల ఇబ్బందులకు గురయ్యారు. ఇలా గత సంవత్సరం ఇబ్బందులు మనల్ని దెబ్బతీసినా.. దాని ప్రభావం కొత్త సంవత్సరం వేళ మన మీద పడకుండా కొన్ని రిజల్యూషన్స్ చేసుకోవడం సహజమే.

New Years Resolutions for Couples in Telugu

ఈ నేపథ్యంలో కొందరు కొత్త సంవత్సర సమయంలో కొన్ని రిజల్యూషన్లను తీసుకుంటారు. అయితే వీటిని ఆచరణలో పెట్టే వారు మాత్రం చాలా తక్కువనే చెప్పొచ్చు. కొన్నిసార్లు అవి పాటించినా వారు ఆశించిన ఫలితం నెగిటివ్ గా రావొచ్చు. దీంతో చాలా మంది నిరుత్సాహపడిపోతాం. అయితే అధైర్యపడాల్సిన అవసరం లేదు.

New Years Resolutions for Couples in Telugu

మీరు కూడా 2021 కొత్త ఏడాదిలో ఈ రిజల్యూషన్ తీసుకుని ముందుకెళ్లండి. ఈ సందర్భంగా కపుల్స్ కొత్త సంవత్సరం వేళ అనేక రిజల్యూషన్స్ తీసుకుంటారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Benefits of Having Morning Sex : మార్నింగ్ సెక్స్ లో పాల్గొంటే ఎక్కువ మజా పొందుతారట...!Benefits of Having Morning Sex : మార్నింగ్ సెక్స్ లో పాల్గొంటే ఎక్కువ మజా పొందుతారట...!

డిజిటల్ స్పేస్ ఇవ్వకండి..

డిజిటల్ స్పేస్ ఇవ్వకండి..

2020 సంవత్సరంలో కరోనా కారణంగా చాలా మంది మధ్య ప్రత్యక్షంగా దూరం పెరిగిపోయింది. దీంతో డిజిటల్ కనెక్టివిటీకి ప్రాధాన్యత బాగా పెరిగింది. ఈ సందర్భంగా పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉన్నప్పటికీ డిజిటల్ గ్యాప్ మాత్రం ఇవ్వకండి. రోజులో కనీసం ఒక్కసారైనా స్మార్ట్ ఫోన్లో.. లేదా వీడియో కాల్స్ తో సన్నిహిత్యాన్ని పెంచుకోండి. అయితే దీన్ని పరిమితంగా ఉంచుకుని.. పలు జాగ్రత్తలు పాటిస్తూ ప్రత్యక్షంగా కలిసి ఉంటే మీ బంధం మరింత పెరుగుతుంది.

కుకింగ్ కలిసి చేయడం..

కుకింగ్ కలిసి చేయడం..

మీరిద్దరూ ఎంత మంచిగా కుకింగ్ చేస్తారనేది అంతగా ప్రాధాన్యత లేని అంశం. మీరిద్దరూ కలిసి కుకింగ్ చేయడం అనేది చాలా ముఖ్యం. మీరిద్దరూ ఒకరితో ఒకరు మనసులోని అనుకునే విషయాలను ఓపెన్ చేసుకోవడానికి ఇది కూడా ఒక్కని సందర్భం. ఇలాంటివి చేసినప్పుడు కూడా మీ ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది. అయితే ప్రతిరోజూ కుకింగ్ చేయడం కుదరకపోవచ్చు. కాబట్టి వారానికోసారైనా.. లేదా రెండు మూడుసార్లు అయినా కలిసి కుకింగ్ చేయండి.

ఆర్థిక విషయాలపై..

ఆర్థిక విషయాలపై..

కపుల్స్ ఒకరిగా మారిప్పుడు.. ఆర్థిక పరమైన విషయాలు వ్యక్తిగతంగా ఉండకూడదు. ఆదాయం గురించి కపుల్స్ కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. మీరిద్దరూ జంటగా ఎదిగేందుకు ప్రణాళికలు చేసుకోవాలి. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో ఇద్దరూ కలిసి అడుగు ముందుకేయాలి.

మీ అలవాట్లలో..

మీ అలవాట్లలో..

ఈ లోకంలో ప్రతి ఒక్కరికీ రెగ్యులర్ గా కొన్ని అలవాట్లు ఉంటాయి. వారి అలవాట్లను బట్టి ఒక వ్యక్తి ఎలా ఉంటాడో అంచనా కూడా వేయొచ్చు. కాబట్టి ఈ కొత్త సంవత్సరం వేళ మీరు, మీ పార్ట్ నర్ కలిసి ఒకే అలవాటును పెంచుకునేందుకు ప్రయత్నించండి. ఈ చిన్న పని మీ బంధాన్ని మరింత మారుస్తుంది. దీని వల్ల ఏమి జరుగుతుందో తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. సో ఇప్పటినుండి అలా ట్రై చెయ్యండి. మీ బంధం ఎంత బలంగా మారుతుందో చూసేయ్యండి.

బెడ్ రూమ్ లో ఈ టిప్స్ ఫాలో అయితే.. రొమాన్స్ లో మీరే రారాజు అవుతారట...!బెడ్ రూమ్ లో ఈ టిప్స్ ఫాలో అయితే.. రొమాన్స్ లో మీరే రారాజు అవుతారట...!

ఇద్దరూ కలిసి వ్యాయామం..

ఇద్దరూ కలిసి వ్యాయామం..

ప్రస్తుత సమయంలో ప్రతి ఒక్కరికీ ఫిట్ నెస్ అనేది చాలా అవసరం. కాబట్టి కొత్త సంవత్సర వేళ కపుల్స్ ఇద్దరూ కలిసి వ్యాయామం చేయండి. జిమ్ కు వెళ్లినా.. గ్రౌండ్ కు వెళ్లినా.. వర్కవుట్లు చేసినా.. ఏది చేసినా కలిసే చేయండి. ఇది మీ బాడీపై మంచి ప్రభావం కూడా చూపుతుంది. అంతేకాదు మీరు నిత్యం ఫిట్ గా ఉండేందుకు కూడా తోడ్పడుతుంది. ఇలాంటి రిజల్యూషన్ వల్ల మీ ఇద్దరి మధ్య మానసిక బంధం మరింత బలపడుతుంది.

ఫ్యామిలీతో కలిసి గడపడం..

ఫ్యామిలీతో కలిసి గడపడం..

కపుల్స్ అన్నాక కచ్చితంగా ఇద్దరి వైపు కుటుంబాలు అనేవి ఉంటాయి. కాబట్టి కొత్త సంవత్సరం వేళ కుటుంబంతో కూడా కలిసి ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించండి. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికీ చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కాబట్టి మీకు వీలైనంత మేరకు ఫ్యామిలీతో కలిసి గడిపేందుకు ప్రయత్నించండి.

కలిసి భోజనం చేయాలని..

కలిసి భోజనం చేయాలని..

మీరిద్దరూ కలిసి ప్రతిరోజూ ఒక్కసారైన భోజనం చేయాలని తీర్మానం చేసుకోండి. అంతేకాదు దానిని ఎట్టి పరిస్థితుల్లో మరిచపోకుండా ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా మీరిద్దరూ కలిసి తింటున్న సమయంలో మీ స్మార్ట్ ఫోన్లు మీకు దూరంగా ఉండాలని గుర్తుంచుకోవాలి. దీని వల్ల మీ ఇద్దరి మధ్య ముచ్చట్లు పెరిగి.. హెల్దీ రిలేషన్ పెరుగుతుంది.

ఫ్రీడమ్ ఇవ్వడం..

ఫ్రీడమ్ ఇవ్వడం..

కపుల్స్ లో ఇద్దరికీ కొన్నిసార్లు సింగిల్ గా ఉండాలనిపిస్తుంది. అలాంటి సమయంలో మీరు మీ భాగస్వామికి ఫ్రీడమ్ ఇవ్వడం మంచిది. ముఖ్యంగా వారి ఆలోచనల మధ్యలో కూడా దూరకుండా వారు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా వదిలేయడం మంచిది. ఇది అంత ఈజీ కాదు. కానీ కొత్త సంవత్సరం వేళ ఈ నిర్ణయాన్ని కచ్చితంగా పాటించేందుకు ప్రయత్నించండి.

తను తప్ప మరో లోకం లేదన్నట్లుగా ఉండేది.. అంతలోనే...!తను తప్ప మరో లోకం లేదన్నట్లుగా ఉండేది.. అంతలోనే...!

హెల్ప్ చేయడం..

హెల్ప్ చేయడం..

మీరిద్దరూ కలిసి సమాజంలో ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే.. అందుకు ఇద్దరు సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా మీరిద్దరూ కలిసి సొసైటీకి ఏదైనా చేయడం వల్ల ఇతరులకు ఎంతగానో ఉపయోగమని గుర్తుంచుకోవాలి. దీని వల్ల మీ రిలేషన్ మరింత బలపడుతుంది.

షెడ్యూల్ రెడీ చేసుకోండి..

షెడ్యూల్ రెడీ చేసుకోండి..

మీరిద్దరూ కలిసి కొత్త సంవత్సర వేళ కొత్త రిజల్యూషన్లు తీసుకుని.. ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు.. స్టార్టింగ్ ట్రబుల్స్ ఉండొచ్చు. దీని వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు అయితే దీన్ని ఓ అలవాటుగా మార్చుకోండి. ముఖ్యంగా రిమైండర్స్ పెట్టుకోవడం లాంటివి చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుంది.

ప్రాబ్లమ్స్ విషయంలో..

ప్రాబ్లమ్స్ విషయంలో..

మీరు కొత్త సంవత్సరం వేళ కొత్త రిజల్యూషన్స్ తీసుకున్న వెంటనే ఎలాంటి సమస్యా లేకుండా అంతా సాఫీగా సాగుతుందని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి రంగంలోనూ అడ్డంకులు అనేవి వస్తుంటాయి. ఇందులో కొన్నిసార్లు మన రిజల్యూషన్సే మనకు బద్ధకంగా.. ప్రత్యర్థిగా మారే అవకాశం ఉంటుంది. అందుకు ప్రాబ్లమ్స్ ఎక్కడ ఎదురవుతున్నాయో గుర్తించి.. వాటిని అధిగమించేందుకు ట్రై చెయ్యాలి.

ఫ్రెండ్స్ తో కలిసి..

ఫ్రెండ్స్ తో కలిసి..

కొత్త సంవత్సరం వేళలో చాలా మంది కొన్ని కొత్త రిజల్యూషన్స్ తీసుకుంటారు. కానీ కొంతకాలం తర్వాత బద్ధకంతో వాటిని వదిలేస్తుంటారు. అందుకే ఇలాంటి విషయాల గురించి మీకు బాగా క్లోజ్ గా ఉండే ఫ్రెండ్స్ కు వీటి గురించి చెప్పాలి. అప్పుడు మీకు వీలైనప్పుడల్లా మీకు దానిని గుర్తు చేస్తూ మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. పైగా మీకు కూడా పదే పదే గుర్తు చేయడంతో.. మీరు వారికి భయపడి అయినా దానిని కంటిన్యూ చేస్తారు.

English summary

New Year's Resolutions for Couples in Telugu

Here we talking about the new year's resolutions for couple in Telugu. Read on
Desktop Bottom Promotion