For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ కొత్త రకమైన డేటింగ్ గురించి మీకు తెలుసా.. మీకు తెలియకుండానే ఏదేదో జరిగిపోతోంది..

|

ఆర్బిటింగ్ (కక్ష్య) అంటే అందరూ ఇది ఖగోళ శాస్త్రానికి సంబంధించింది అనుకుంటారు. కానీ డేటింగ్ ప్రపంచంలో ఈ ఆర్బిటింగుకు వేరే అర్థం ఉంది. మేము ఇప్పుడు చెప్పబోయేది మరో ఖగోళం గురించి. ఇక్కడ ఆర్బిటింగ్ అంటే ఇది మన శరీరం చుట్టూ తిరిగే ఖగోళ శరీరం అని అర్థం. రిలేషన్ షిప్ కక్ష్యలో ఉండటం అంటే, మీరు వెతుకుతున్న లేదా చూస్తున్న వ్యక్తి (డేటింగ్) అకస్మాత్తుగా మాయమవుతుంది. కానీ మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా అది మిమ్మల్ని తనిఖీ చేస్తుంది. అలాంటి వివరాలను తెలుసుకునేందుకు కింది వరకు పూర్తిగా స్క్రోల్ చేయండి.. అన్ని వివరాలను తెలుసుకోండి.. సందేహాలను నివృత్తి చేసుకోండి.

Orbiting

అతను లేదా ఆమె మీరు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులన్నీ ఇష్టపడవచ్చు. మీరు పెట్టే పోస్టులన్నింటినీ ఫాలో అవ్వొచ్చు. మీ పోస్టులకు కామెంట్లు చేయొచ్చు. కానీ మీతో వ్యక్తిగతంగా మాత్రం కమ్యూనికేట్ చేయరు. కానీ అకస్మాత్తుగా ఆ వ్యక్తి మాయమవుతాడు. కమ్యూనికేషన్ కు సంబంధించిన వాటిని వదిలేసుకుంటాడు. ఇదే కక్ష్యలో కాస్త భిన్నమైన విషయం. కక్ష్యలో ఉన్న వ్యక్తి కనిపించకుండా పోతాడు కాని పరిచయాలు మరియు ఇతర వివరాలను మాత్రం తగ్గించడు. మీరిద్దరూ ఒకరితో ఒకరు కొట్టుకోకపోవచ్చు. అయినప్పటికీ మీరు ఎప్పటికీ మాట్లాడరు. కనీసం ఎక్కడా కలిసి పాల్గొనరు. కానీ కక్ష్యలో, ఒకరు తమ భాగస్వామిని నిరంతరం తనిఖీ చేయవచ్చు. దీనికి సంబంధించి కొందరి అభిప్రాయాలను తెలుసుకుందాం.

1) ఓ యువతి అనుభవం..

1) ఓ యువతి అనుభవం..

ఢిల్లీకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రియా(23) బోల్డ్ స్కై తో ఇలా అన్నారు. ‘‘ కొంతకాలం క్రితం నేను ఒక వ్యక్తితో స్నేహం చేశాను. మా ఇద్దరికీ తెలిసిన స్నేహితులు ఇంకొందరు ఉన్నారు. మేము రోజూ చాట్ చేయడం ప్రారంభించాం. కానీ ఒకరోజు అతను నన్ను కాఫీ తాగడానికి రమ్మని అడిగారు. నేను కూడా అంగీకరించాను. కానీ అతను రాలేదు. ఏమిటని అడిగితే అతను ఇంకొక రోజు కలుద్దామని బదులిచ్చాడు. అంతేకాదు అకస్మాత్తుగా అతను మాయమైపోయాడు‘‘. ఒకరోజు ఫేస్ బుక్ లో నా పోస్టు ఒకటి ఇష్టపడ్డట్టు నేను చూశాను. అంతేకా అతను నా ఇన్ స్టాగ్రామ్ కథలను చెక్ చేశాడు. మూడు నెలల తర్వాత ‘నేను మీ నగరంలో ఉన్నాను. మిమ్మల్ని కలిసి ఓ కప్పు కాఫీ తాగాదాం‘ అని చెప్పాడు. నాకు ఆశ్చర్యమేసింది. ఎందుకంటే అతను నాకు ప్లేస్ అండ్ టైమ్ చెప్పలేదు. అతను నా సోషల్ మీడియా పోస్టులను చెక్ చేస్తూనే ఉన్నాడు. చివరికి, నా సోషల్ మీడియా అకౌంట్స్ నుండి నేను అతనిని బ్లాక్ చేశాను‘‘ అని ఆమె తెలిపారు.

2) అకస్మాత్తుగా అదృశ్యం..

2) అకస్మాత్తుగా అదృశ్యం..

ఇదే తరహాలో బీహార్ కు చెందిన బ్లాగర్ అయిన 23 ఏళ్ల ఆద్య బోల్డ్ స్కైతో మాట్లాడుతూ ‘‘నేను ఒక కల్చరల్ ప్రోగ్రామ్ లో ఓ వ్యక్తిని కలిశాను. మేము ఒకరినొకరు మా సోషల్ మీడియా అకౌంట్స్ లో భాగమయ్యాం. స్టార్టింగులోనే నాకు అర్థమయ్యింది అతని చాటింగును బట్టి మేము కలవాలని. అందుకే ఇద్దరం కలవాలని నిర్ణయించుకున్నాం. కానీ అతను అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. అతను నా ఫేస్ బుక్ స్టోరీలను, పోస్టులను చూసినప్పటికీ, నా కాల్స్ మరియు మెసేజ్ లకు స్పందించడం మానేశాడు. అప్పటి నుండి మేము మాట్లాడలేదు‘‘ అని చెప్పారు.

3) సాంకేతికత వరమా.. శాపమా..

3) సాంకేతికత వరమా.. శాపమా..

టెక్నాలజీ ఒక వరం.. దానితో మనం రోజంతా భాగస్వాములతో సన్నిహితంగా ఉండగలిగినప్పటికీ, రిలేషన్ షిప్ లో ఏవైనా తప్పులు జరిగినప్పుడు, అదే టెక్నాలజీ కూడా మనకు శాపంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో, కక్ష్యలో ఉండటం వెనుక ఉన్న వ్యక్తిని నిజంగా బాధ పెడుతుంది. వారి భాగస్వామికి ఏమి తప్పు జరిగిందో అని ఆశ్చర్యపడతారు.

4) నేను మోసపోయాను..

4) నేను మోసపోయాను..

ప్రియా ఇలా అంటున్నారు.‘‘ మొదట్లో నేను అతని గురించి చాలా ఆత్రుతగా ఆందోళన చెందేదాన్ని, కానీ చివరికి అతను ఎగిరిపోతున్నాడని తెలుసుకున్నాను. అతని నుండి నేను ఊహించిందంతా సమాచారం ఇవ్వడమే. కానీ అది కూడా జరగలేదు. కానీ సోషల్ మీడియాలో తనిఖీ అవుతుండేవి. నా మెసేజ్ లకు రిప్లై వచ్చేది కాదు. దీంతో నేను మోసపోయానని భావించాను. ఒక సంవత్సరం తర్వాత కూడా నాకు ఇలాంటి సమస్యలే వచ్చాయి‘‘.

5) కంట్రోల్..

5) కంట్రోల్..

అందుకే ఇలాంటి కక్ష్యలో ఉండటం వల్ల వ్యక్తిని మానసికంగా నాశనం చేయవచ్చు. ఒక వ్యక్తిపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుంది. అతను లేదా ఆమె ద్రోహం చేసినట్లు లేదా మోసపోయినట్లు అనిపించవచ్చు. ఒక వ్యక్తి జీవితంలో ఒకరి విలువ గురించి అనిశ్చితంగా ఉండటం కూడా కష్టం. చివరికి బాధితుడు తన/ఆమె సోషల్ మీడియా అకౌంట్ నుండి కక్ష్యను తీసివేసి కంట్రోల్ చేయవచ్చు.

6) బంధానికి సమయవివ్వండి..

6) బంధానికి సమయవివ్వండి..

అందుకే మీరు మీ భాగస్వామిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువగా మీరు అటువంటి వాటిలో పాల్గొనాలి అనుకుంటే మీరు మీ సంబంధానికి సమయం ఇవ్వండి. అప్పుడే మీ బంధం మరింత బలపడుతుంది. మీ భాగస్వామి కూడా మీ గురించి నిజమైన ఉద్దేశాలను మీరు కచ్చితంగా తెలుసుకుంటారు.

గమనిక : వారి గోపత్యను నిర్ధారించడానికి వ్యక్తుల పేర్లు మరియు ఇతర వివరాలన్నీ మార్చబడ్డాయి.

English summary

Orbiting: A New Dating Trend That You Must Know

Priya, 23, a software engineer from Delhi, told Bold Sky. Some time ago I was friends with a guy. We both have friends who know each other. We started chatting on a regular basis. But one day he asked me to drink coffee. I also agreed. But he didn't come. When asked what he did, he replied that he would meet another day. And suddenly he disappeared.
Story first published: Tuesday, September 17, 2019, 14:19 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more