For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగాళ్లు ఎంత అందంగా ఉన్నా.. అలా ఉంటే ‘ఆ’ కార్యం కష్టమంటున్న అమ్మాయిలు...!

|

ఒకప్పుడు గడ్డం పెంచితే ప్రేమలో ఫెయిల్ అయ్యావా అని అడిగేవారు. కానీ ఇటీవలి కాలంలో ఇదొక ట్రెండ్ గా మారిపోయింది. అయితే ఏ ట్రెండ్ కూడా ఓ పట్టానా ఉండదు కదా.. అందుకే ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ మార్పులు జరుగుతూనే ఉంటాయి.

ఒకప్పుడు గడ్డం పెంచడం అంటే కేవలం మునులు, రుషులు మాత్రం చేసేవారు. వారి తర్వాత ఆ సంప్రదాయాన్ని సైంటిస్టులు, రచయితలు కొనసాగించారు. ఇలా గడ్డం పెంచడం అనేది, వారు మాత్రమే అనుకునేవారు. రొమాంటిక్ ఫెలోస్ అవసరం లేదనుకునేవారు.

పైగా గడ్డం, మీసాలు ఎక్కువగా ఉండే అబ్బాయిలను అంకుల్స్ గా భావించేవారు అమ్మాయిలు. దీంతో సినిమా హీరోలు కూడా గడ్డం, మీసం లేకుండా అందంగా కనిపించారు. కానీ మళ్లీ ట్రెండ్ మారడంతో గడ్డం పెంచడమే ట్రెండీగా మారిపోయింది. అయితే కేవలం హీరోలే కాదు.. వారితో పాటు స్పోర్ట్స్ స్టార్లు, పొలిటిషియన్లు కూడా గడ్డాలు పెంచేశారు.

ఇలా పెంచిన చాలా మంది మగాళ్లు అమ్మాయిల కంటికి హాట్ గా కనిపించడం అలవాటుగా చేసుకున్నారు. అయితే గడ్డం పెంచుకోవడం వల్ల డేటింగుకు వెళ్లినప్పుడు అమ్మాయిలు చాలా ఇబ్బందులు పడతారట. అందుకే స్త్రీలందరూ తాజాగా 'Break The Beard' అనే పల్లవిని అందుకున్నారట. ఇంతకీ అబ్బాయిలు గడ్డం పెంచడం వల్ల అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందులు ఎదరవుతాయి.. వారు ఎందుకని తమ నిర్ణయం మార్చుకున్నారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

రొమాన్స్ లో మగువలు అలా చేస్తే.. మగాళ్లు మరింత రెచ్చిపోతారంట..

కిస్ చేయడంలో..

కిస్ చేయడంలో..

మగవారు గడ్డం తీయడంలో ఎలాంటి తప్పులేదు. ఎందుకంటే గడ్డంలో ఉన్నప్పుడు ఎంత హాట్ గా కనిపించినప్పటికీ, కిస్ చేసే సమయంలో అమ్మాయిలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కిస్ చేసే టైములో గడ్డం లేకపోతేనే చాలా బెటర్ అని 69 శాతం మంది అమ్మాయిలు ఓ సర్వేలో వెల్లడించారు.

గడ్డంపై దద్దుర్లు..

గడ్డంపై దద్దుర్లు..

మనం గడ్డం పెంచినప్పుడు దానిపై దద్దుర్లు రావడం అనేది సహజంగానే జరుగుతుంది. కాబట్టి అలా గడ్డంతో ఉన్న ఎవరైనా కిస్ చేయడం వల్ల వారి ముఖం లేదా శరీరంపై దద్దుర్లు వస్తాయి. అందుకే గడ్డం తీసేసి రొమాన్స్ చేయడం బెటర్. ఇందుకోసం మీరు ఫేషియల్ మరియు బాడీ క్రీమ్ సిద్ధంగా ఉంచుకోవాలి.

గడ్డం గురించి..

గడ్డం గురించి..

తన భాగస్వామి గడ్డం ఉన్న వ్యక్తి అని, తనకు గడ్డం ఉంటే ఎలా ఉంటారో అనే ఫీలింగ్ అందరిలోనూ ఉంటుంది. అయితే చాలా మంది అమ్మాయిలు గడ్డం లేకుండా క్లీన్ షేవింగ్ చేసుకుంటేనే ఇష్టపడతారంట.

ఆ సమయంలో..

ఆ సమయంలో..

మీరు ప్రతిరోజూ అద్దం ముందు నిలబడి గడ్డాన్ని పదే పదే చూసుకోవడం... గడ్డాన్ని విపరీతంగా పెంచుకోవడం.. ఆ పెంచిన గడ్డాన్ని సినిమా హీరోలతో పోల్చుకోవడం వంటివి చేస్తుంటారు. అంతేకాదు తమ అభిమాన హీరోలా మాదిరిగా స్టైలీష్ గడ్డం పెంచేందుకు ప్రయత్నిస్తారు. అయితే డేటింగుకు వెళ్లే సమయంలో ఈ గడ్డం ఇబ్బందిగా ఉంటుందట.

ఇతర స్త్రీల శ్రద్ధ..

ఇతర స్త్రీల శ్రద్ధ..

మీరు గడ్డం పెంచుకుని, మీ ప్రియురాలితో డేటింగుకు వెళితే.. అప్పుడు మీరు నిజంగా ఆకర్షణీయంగా ఉంటే, తనపై కచ్చితంగా ఇతర స్త్రీల ఫోకస్ ఉంటుందట. అలాంటి సందర్భంలో మీ ప్రియురాలు చాలా ఇబ్బంది పడుతుందట.

గడ్డానికి ఏదైనా తగిలితే..

గడ్డానికి ఏదైనా తగిలితే..

మీరు మీ ప్రియురాలితో కలిసి డేటింగుకు వెళ్లినప్పుడు ఏదైనా ఆహారం, టిష్యూ పేపర్ లేదా ఇతర వస్తువులు మీ గడ్డానికి అంటుకుంటే అది చూడటానికి చాలా అసహ్యకరంగా అనిపిస్తుంది. ప్రారంభంలో దాన్ని మీరు ఉల్లాసంగా చూసినప్పటికీ, కాలక్రమేణా మీరు ఆ సమయాన్ని అంతగా ఆస్వాదించలేరు.

గడ్డం తొలగించమని..

గడ్డం తొలగించమని..

సాధారణంగా గడ్డం గీసేసుకోమని.. మిమ్మల్ని ఒప్పించడానికి మీ తల్లిదండ్రులు ఎప్పుడూ ఒత్తిడి చేస్తూనే ఉంటారు. ఎందుకంటే సమాజం గడ్డం ఉన్న వ్యక్తులకు కొంత విచిత్రంగా చూస్తుందని భయం. మరో విశేషం ఏంటంటే.. మీ గడ్డం అహంకారానికి ప్రతీక అని వారు భావిస్తారట.

తరచూ అడ్డు రావచ్చు.

తరచూ అడ్డు రావచ్చు.

గడ్డం చాలా నిర్వహణ అవసరం. మీ గడ్డం చక్కగా ఉంచడానికి, కత్తిరించిన జుట్టుకు తరచుగా మీ ఇంటి సింక్ అడ్డుపడేలా మీరు చూడవచ్చు. కాబట్టి మీ గడ్డాన్ని ఎప్పటికప్పుడు తొలగించడం ఉత్తమం.

విహారయాత్రలో..

విహారయాత్రలో..

మీరు మీ ప్రియురాలితో కలిసి ఏదైనా బైక్ పై లాంగ్ డ్రైవ్ కు వెళ్లినప్పుడు కూడా గడ్డం ఎక్కువగా ఉంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే రోడ్లపై ఉండే దుమ్ము, ధూళి అంతా మీ గడ్డంపై పేరుకుపోయి అసహ్యంగా కనిపించే అవకాశం ఉంటుంది.

అంకుల్స్ మాదిరిగా..

అంకుల్స్ మాదిరిగా..

గడ్డం, మీసాలు ఎక్కువగా ఉండే వారు వారి అసలు వయసు కంటే చాలా పెద్దవారిగా కనిపిస్తారు. కాబట్టి మీరు చాలా యంగ్ గా కనిపించాలంటే.. మీరు మీ పార్ట్ నర్ తో మంచిగా ఎంజాయ్ చేయాలంటే.. గడ్డం పూర్తిగా తొలగించాల్సిందే..

ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, గడ్డం ఉన్న పురుషుల విషయానికి వస్తే, దాన్ని తొలగించడానికి అంతగా ఇష్టపడరు. కేవలం ప్రియురాలి కోసం కష్టపడి పెంచిన గడ్డాన్ని తీసేందుకు తీవ్ర నిరాశ చెందుతారు. కానీ అమ్మాయిలకు అవి ఇష్టం లేదు కాబట్టి మీరు కొంత త్యాగం చేయాల్సి ఉంటుంది.

English summary

Real Challenges Of Women Who Date Bearded Men in Telugu

Here we are talking about the real challenges of women who date bearded men in Telugu.Read on.
Story first published: Wednesday, February 3, 2021, 17:56 [IST]