`
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శృంగారం గురించి నిరంతరం కలలు ఎందుకొస్తాయో తెలుసా...!

|

ఈ లోకంలో జీవించే ప్రతి ఒక్కరికీ పైసా ఖర్చు లేకుండా ఆనందాన్ని ఇచ్చేది కల. అయితే అదే కల మనల్ని ఒక్కోసారి ఇబ్బందికి గురి చేస్తుంది. అందుకే చాలా మంది కళ్లు మూసిన కాసేపటికే కలల లోకంలో విహరిస్తూ ఉంటారు.

అయితే కొన్ని సార్లు మన బ్రెయిన్ సబ్ కాన్షియస్ స్టేజీలోకి వెళ్లిపోయి చాలా చిలిపిగా మారిపోతుందట. అప్పుడే చాలా మందికి శృంగారానికి సంబంధించిన స్థిరమైన కలలు వస్తాయంట.

ఈ కలల్లో విచిత్రమేమిటంటే.. కొంతమందికి తమ మాజీ ప్రియుడితో లేదా ప్రియురాలితో ఆ కార్యంలో పాల్గొన్నట్టు కలలు వస్తే.. మరికొందరికి ఇందుకు భిన్నమైన కలలు వస్తుంటాయి. అయితే ఇలాంటి కలలొస్తే చాలా సానుకూలంగా ఉంటుందని పలు అధ్యయనాలలో తేలిందట.

అయితే మీరు రెగ్యులర్ గా కేవలం శృంగారం గురించి కలలు కంటూ ఉంటే.. కొందరికి ఇది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే ఇది చాలా సహజమైన విషయమని మీరు తెలుసుకోవాలి. వాస్తవానికి స్వప్నం అనేవి రకరకాల కారణాల వల్ల వస్తాయి. అయితే మీరు స్థిరంగా రొమాన్స్ గురించి కలలు కనడానికి గల కారణలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

కొందరికి శృంగారం తర్వాత అక్కడ తీవ్రమైన నొప్పి ఎందుకొస్తుందో తెలుసా... దానికి పరిష్కారాలేంటి...

విడిపోవాలనుకున్నప్పుడు..

విడిపోవాలనుకున్నప్పుడు..

మీరు నిద్రలోకి జారుకున్న వెంటనే కలలో శృంగారం గురించి ఆలోచనలు వస్తే.. మీరు దానికి ప్రభావితం కావచ్చు. అయితే ఇదంతా రోజువారీ సాధారణ కార్యకలాపాలు కాకుండా, అకస్మాత్తుగా ఎవరైనా కొత్త వ్యక్తులను చూసినప్పుడు, వారి నచ్చితే, అలాంటి వారి గురించే ఆలోచిస్తూ కలలు కంటూ ఉంటారట. వారిలో ఏదో ఒక క్వాలిటీ మిమ్మల్ని ప్రభావితం చేయడం వల్ల కలలు వస్తుంటాయట. అంతేకాదు, మీరు ప్రస్తుత రిలేషన్ షిప్ లో మీ పార్ట్ నర్ తో ఏదో మిస్సవుతున్నారని, అందుకే వారితో విడిపోవాలని చూస్తున్నట్లయితే, అప్పుడు కూడా ఇలాంటి కలలు రావొచ్చు.

కలలు గుర్తుండవు..!

కలలు గుర్తుండవు..!

మనకొచ్చే కలలు మన అపస్మారక కోరికలను బయటకు తెస్తాయి. అయితే మనలో చాలా మందికి కలలు అనేవి ఎక్కువగా గుర్తుండవు. అయితే మన ప్రవర్తన మరియు షెడ్యూల్ ను మనం రోజువారీగా చేర్చుకునే గొప్ప మార్గం అని విశ్లేషించుకోవచ్చు. మన జీవితంలో ఒక కొత్త దశలోకి ప్రవేశించినప్పుడు, తాజా అనుభవాలు, వ్యక్తీకరణలు మనల్ని పలకరిస్తాయి.

ఆకర్షణకు లోనై..

ఆకర్షణకు లోనై..

మీరు ప్రతిరోజూ వెళ్లే ప్రాంతంలో ఎవరైన అందమైన వ్యక్తి ఎదురైతే, ఆ వ్యక్తి పట్ల మీరు ఆకర్షితులైతే.. మీరు నిద్రలో కచ్చితంగా వారి గురించి కలలు కంటారు. ఎందుకని ఇలా జరుగుతుందంటే.. వారిలో ఏదో ఒక లక్షణం మిమ్మల్ని ఆకర్షించడం లేదా ప్రభావితం చేసి ఉండొచ్చు. అందుకే ఇలాంటి కలలు వస్తుంటాయి. దీని వల్ల అనేక రకాల విషయాలను ఊహించుకుంటారు. దీంతో మీరు వారివైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు.

స్టడీ : అక్రమ సంబంధాల వైపు అడుగులెందుకు వేస్తున్నారో తెలుసా...!

గౌరవం దక్కేచోట..

గౌరవం దక్కేచోట..

మనలో ఇది చాలా మందికి ఆశ్చర్యకరంగా అనిపించొచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తిని వారి లక్షణాలను గౌరవిస్తే లేదా ఆరాధిస్తే.. అలాంటి వారి గురించి మీరు కలలు కనడం వంటివి చేయొచ్చు. మీరు వారిని ఆకర్షించాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే మీరంటే ఆరాధించే ఒక గుణం ఉండటం వల్ల అది ఈ పరిస్థితులకు దారి తీస్తుంది. ఇలాంటి సమయంలో శృంగార కలలు మనలో మనం కనుగొనాలనుకునే ముఖ్యమైన లక్షణాల వైపు మళ్లిపోతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది మనకు సాహసం మరియు ఉద్దేశ్యం యొక్క భావాన్ని ఇస్తుంది.

అది లేకపోవడం..

అది లేకపోవడం..

శృంగారం అనేది మీ జీవితంలో చాలా కాలం నుండి కోల్పోయిన ముఖ్యమైన సమయం ఒక కారణం. చాలా కాలంగా మీరు లైంగికంగా చురుకుగా ఉండకపోతే, మీ జీవితంలో శృంగారం లేకపోవడం వల్ల కూడా మీరు తరచుగా అలాంటి కలలు కనేందుకు కారణమవుతుందట. దీని వల్ల మన శారీరక ప్రేరణలను ఉత్తేజపరచడానికి మొగ్గు చూపుతాయి. శృంగారం లేకపోవడం అంటే మీ శరీరం ఆ ప్రాంతంలోని లోపానికి ప్రతి స్పందిస్తుందనడానికి సంకేతం.

ఓపెన్ రొమాన్స్..

ఓపెన్ రొమాన్స్..

మనం ఏదైనా పబ్లిక్ ప్లేసులో ఉన్నప్పుడు.. మనకు నచ్చిన వ్యక్తితో రొమాన్స్ చేయడం చాలా కష్టమైన పని. అందులోనూ ఇతరులు మనల్ని గమనిస్తున్నారని తెలిస్తే.. అది మరింత కష్టంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మీకు అలా పబ్లిక్ రొమాన్స్ చేస్తున్నట్టు కలలొస్తే.. మీరు నలుగురిలో రొమాన్స్ చేస్తే, అవమానానికి గురవుతారేమో అనే భయం కూడా మీ కలలకు కారణమవుతుంది.

కొంచెం తేడాగా..

కొంచెం తేడాగా..

మీరు ఎవరిని అయితే అస్తమానం తిట్టుకుంటూ ఉంటారో.. అలాంటి వ్యక్తులు మీ కలలోకి వస్తే.. అందులోనూ మీరు అతనితో ఆ కార్యంలో పాల్గొనడం అంటే కాస్త ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కానీ దీనికి కారణమేమిటంటే.. మీ ఇద్దరిలో ఏవైనా కొన్ని లక్షణాల సారూప్యతను మీరు గమనించి ఉండొచ్చు. లేదా మీరు కూడా వాటిని పెంచుకోవాలని భావిస్తూ ఉండొచ్చు.

English summary

Reasons why constantly dream of sex in telugu

Here are the reasons why constantly dream of sex in telugu. Take a look