For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెగ్యులర్ సెక్స్ గురించి సైన్స్ చెబుతున్న సెవెన్ సెన్సెషనల్ విషయాలను అస్సలు మిస్సవ్వొద్దు...

|

ఆరోగ్యకరమైన శృంగారం అనేది ఆలుమగలిద్దరికే కాదు.. వారి ఆరోగ్యానికి కూడా ఎంతగానే ఉపయోగకరం. శృంగారం వల్ల వచ్చే లాభాల గురించి ఇప్పటికే బోలెడన్నీ అధ్యయనాలు చెప్పేశాయి. అయితే శృంగారం ఎంత చెప్పుకున్నా.. ఎంతో కొంత మిగిలే ఉంటుంది.

అయితే శృంగారం ఎంత ఎక్కువగా చేస్తే, అంత ఎక్కువ మెమోరీ పవర్ పెరుగుతుందట. అయితే అది అమ్మాయిలకే ఎక్కువగా జరుగుతుందని ఓ పరిశోధనలో తేలింది.

అంతేకాదు రెగ్యులర్ గా శృంగారంలో పాల్గొంటే, భార్యభర్తలిద్దరికీ గుండెజబ్బులు అనేవి వారి దరిచేరవని మరికొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

నిద్రలేమిని సమస్యలను పోగొట్టి.. రోగ నిరోధక శక్తితో పాటు జంటల ఆరోగ్యాన్ని పెంచే అద్భుతమైన శక్తి శృంగారానికి ఉందని సైన్స్ చెబుతోంది. ఈ నేపథ్యంలో రోటీన్ గా శృంగారంలో పాల్గొనేటప్పుడు కొన్ని విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి. అలా చేయడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ చిట్కాలను పాటిస్తే స్త్రీలు ఉత్తమ ఉద్వేగం పొందడం ఖాయమంటున్న నిపుణులు...!

బంధం బలంగా మారేందుకు..

బంధం బలంగా మారేందుకు..

మీరు మరియు మీ భాగస్వామి శృంగారం చేసిన వెంటనే ప్రపంచంలోని ఏ శక్తి మిమ్మల్ని వేరు చేయలేదని మీరు భావిస్తారు. కానీ ప్రతిదాన్ని శృంగారభరింత మాత్రం చేయలేకపోతారు. శృంగారం తర్వాత మీ శరీరంలో ఇలాంటి మార్పులు ఈ ఆలోచనవైపు మిమ్మల్ని లాగుతాయి. ఎందుకంటే శృంగారం తర్వాత మీ శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. దీనిని కడిల్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఈ కారణంగా, మీ బంధం బలంగా మారుతుంది.

హనీమూన్ దశలో..

హనీమూన్ దశలో..

హనీమూన్ దశలో ఉండే జంటలు ఒకరినొకరు సన్నిహితంగా ఉండేందుకు అవకాశం అంతగా ఉండకపోవచ్చు. కానీ ఈ సమయం ముగిసిన వెంటనే సంబంధం యొక్క శృంగార భాగం ఎక్కడో లేదో గుర్తించాలి. అంతేకాదు మీరు నిబద్ధతగా ఉండి, పూర్తిస్థాయిలో శృంగారంలో పాల్గొంటే, అది మీ ఇద్దరికీ శక్తిని ఇస్తుంది. మిమ్మల్ని మరింత యవ్వనంగా మారుస్తుంది.

రతి క్రీడలో పాల్గొనేందుకు..

రతి క్రీడలో పాల్గొనేందుకు..

ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా మీరు బయటికి ఎక్కువ వెళ్లకుండా.. ఎక్కువగా ఇంట్లోనే గడుపుతున్నారా? అయితే మీరు మీ భాగస్వామి కోసం కొంత ప్రత్యేక సమయం కేటాయించాలి. ముఖ్యంగా నిద్రలోకి జారుకునే ముందు గంట లేదా రెండు గంటల పాటు రతి క్రీడలో పాల్గొనండి. ఆ తర్వాత మీరు హాయిగా నిద్రపోవచ్చు.

కామసూత్రాలలో ఉన్న ఈ రహస్యాలను స్త్రీలు తప్పక తెలుసుకోవాలి...!

పొగడ్తలు ముఖ్యం..

పొగడ్తలు ముఖ్యం..

ఈ లోకంలో పొగడ్తలకు పడని వారు ఎవ్వరూ ఉండరు. ఎవ్వరైనా పొగడ్తలకు పడిపోవాల్సిందే. అలా మీరిద్దరూ తరచుగా ఒకరినొకరు పొగుడుకోండి. అలాగే రొమాంటిక్ డిన్నర్ చేయడం.. ప్రస్తుతం అన్ లాక్ ప్రారంభమైంది, కాబట్టి ఇద్దరూ కలిసి బయటకు వెళ్లడం వంటివి చేయొచ్చు. ఇలా చేయడం ద్వారా మీరిద్దరూ ఒకరికొకరు ప్రత్యేకమైన అనుభూతిని పొందవచ్చు. మీ మధ్య దూరం అనేది కూడా సులభంగా తగ్గిపోతుంది.

ప్రతి సారీ కొత్తగా..

ప్రతి సారీ కొత్తగా..

శృంగారం అనేది సముద్రం లాంటిది. మీరు ఇందులో పాల్గొన్న ప్రతిసారీ ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలనే ఆసక్తితో ప్రయత్నించాలి. సినిమాల్లో చూసినట్లు విచిత్ర ప్రయోగాలు చేయకుండా ఉండాలి. ఒకవేళ అలా చేయాలనుకుంటే.. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముందుగా మీ భాగస్వామిని అందుకు ఒప్పించాలి. అప్పుడే మీరిద్దరూ మరింతగా దగ్గరవుతారు. అలాంటి క్షణాలు మీకు అందమైన క్షణంగా మారిపోతుంది.

సెక్స్ వెనుక సైన్స్..

సెక్స్ వెనుక సైన్స్..

సైన్స్ ప్రకారం, సెక్స్ అనేది గొప్ప ఎక్సర్ సైజ్. ఉదాహరణకు మీరు వ్యాయామం చేస్తున్నప్పుడు రెగ్యులర్ గా దాన్ని చేయాలి. ప్రతి ఒక్కరూ రోజువారీ వ్యాయామం చేయాలని డాక్టర్లు సిఫార్సు చేస్తారు. అలాగే సెక్స్ కూడా. మీరు నిత్యం శృంగారంలో పాల్గొనడం వల్ల మీపై ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. మీరిద్దరూ ఎప్పుడైనా ఒత్తిడికి లోనవుతుంటే, వెంటనే అరగంట పాటు అందులో పాల్గొనండి. వెంటనే ఒత్తిడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. లేదంటే ఒత్తిడి పెరిగిపోయి, ఒకరికొకరి మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుంది.

కోరికలను స్వేచ్ఛగా..

కోరికలను స్వేచ్ఛగా..

శృంగారం చేసే సమయంలో ఎలాంటి మాటలు అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా కేవలం సైగలు మాత్రమే. మీ ఇద్దరికి ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉందో వ్యక్తపరిచే హావభావాలను ప్రదర్శించాలి. ఇది మీ అంకిత భావాన్ని వ్యక్తపరిచే అన్ టోల్డ్ భాష. ఈ సమయంలో మీ మధ్య ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉంటాయి కాబట్టి, మీరు మీ కోరికలను స్వేచ్ఛగా వ్యక్తపరచొచ్చు.

English summary

Regular sex brings couple closer through these ways

Here are the regular sex brings couple closer through these ways. Take a look
Story first published: Tuesday, June 30, 2020, 17:53 [IST]