For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోహిత్, రితికాలలో ఎవరు ముందు లవ్ ప్రపోజల్ పెట్టారో తెలుసా...

|

ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అనేది ఎప్పటికీ మరచిపోలేనిది. చిన్నప్పుడు స్కూల్ లో చదువుకున్న రోజులు.. ఫ్రెండ్స్ కలిసి చేసే అల్లరి.. అందమైన ప్రేమకథలు అందరికీ జీవితాంతం గుర్తుండిపోతాయి. అయితే కొన్ని ప్రేమలు కాలేజీలో చదువు పూర్తి కాగానే అర్థాంతరంగా ఆగిపోతుంటాయి. మరికొన్ని బ్రేకప్ అవుతుంటాయి.. కొన్ని మాత్రం పెళ్లికి దారి తీసి జీవితాంతం నిలిచిపోతూ ఉంటాయి.

ఇక మనం ఓ ప్రముఖ క్రికెటర్ యొక్క ప్రేమ కథ గురించి తెలుసుకోబోతున్నాం. అతనెవరో కాదు ముంబై ఇండియన్స్ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. సుమారు ఆరేళ్ల పాటు రితికాతో లవ్ లో ఉన్న ఈ టీమిండియా మాజీ కెప్టెన్ ఎట్టకేలకు తన చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు ఈ జంట ఓ పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చారు. ఈ విషయాలన్నీ క్రికెట్ అభిమానులందరికీ తెలిసిందే. అయితే రోహిత్ కు తన చిన్ననాటి స్నేహితురాలితో పరిచయం ఎలా ఏర్పడింది.. అది ప్రేమగా మారినప్పటికీ.. వారి పెళ్లి ఎందుకంత ఆలస్యం అయ్యింది అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

త్వరలో బుల్లి విరాట్ లేదా చిన్ని అనుష్క రాబోతున్నారు.. స్వయంగా చెప్పిన విరుష్క జంట..!

ఎలా కలుసుకున్నారంటే..

ఎలా కలుసుకున్నారంటే..

వాస్తవానికి రోహిత్ మరియు రితికా చిన్ననాటి స్నేహితులే అయినప్పటికీ వారు పెద్దయ్యాక వారి వారి రంగాల్లో బిజీగా మారిపోయారు. అయితే రితికా ఒక స్పోర్ట్స్ ఈవెంట్ మేనేజర్ గా ఉండేవారు. రోహిత్ ఎప్పుడైతే స్టార్ బ్యాట్స్ మెన్ గా ఎదుగుతున్నాడో ఆ క్రమంలోనే రితికా రోహిత్ స్పోర్ట్స్ మేనేజర్ గా మారిపోయారు. అలా వారిద్దరూ ఆరేళ్ల పాటు ప్రేమించుకున్నారట.

బెస్ట్ ఫ్రెండ్స్ గా..

బెస్ట్ ఫ్రెండ్స్ గా..

రోహిత్ మరియు రితికా ముందుగా తమ స్నేహాన్ని కంటిన్యూ చేశారు. వారు మంచి స్నేహితులుగా ఉంటూనే అందరినీ కలిసేవారు. అలా వారి స్నేహం కాస్త ప్రేమకు తొలిమెట్టుగా ఉపయోగపడింది. ఆ బంధాన్ని మరింత ముందుకు నడిపించాలని నిర్ణయించుకున్నారు.

ఆరేళ్లు డేటింగ్ తర్వాత..

ఆరేళ్లు డేటింగ్ తర్వాత..

ఇలా వారిద్దరూ ఆరు సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన తర్వాత.. ఓ రోజు రోహిత్ లవ్ ప్రపోజల్ తో రితికాను ఆశ్చర్యపరచాలని అనున్నాడు. అంతే రోహిత్ కు ఎంతగానో ఇష్టమైన ముంబైలోని ఓ అందమైన ప్రదేశంలో సాలిటైర్ రింగుతో మోకాళ్లపైన కూర్చుని, బోరివాలి స్పోర్ట్స్ క్లబ్ లో ఆమెకు లవ్ ప్రపోజల్ పెట్టాడు. అక్కడే యువరాజ్, ఇర్ఫాన్ పఠాన్ కూడా ఉన్నారట. వారు కూడా తనను ఎంకరేజ్ చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

రితికా ఓకే చెప్పేసింది..

రితికా ఓకే చెప్పేసింది..

తను 11 సంవత్సరాల వయసులో ఎక్కడైతే క్రికెట్ ఆటను ప్రారంభించాడో.. అదే మైదానంలో రితికాకు లవ్ ప్రపోజల్ చేయడంతో ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తన లవ్ ప్రపోజల్ కు ఓకే చెప్పేసింది. ఆ తర్వాత వెంటనే నిశ్చితార్థ ఏర్పాట్లను నిర్ణయించుకున్నారు.

సోషల్ మీడియాలో...

సోషల్ మీడియాలో...

ఈ విషయాలన్నింటినీ రోహిత్ వర్మ సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. రోహిత్, రితికాతో కలిసి దిగిన ఓ అందమైన ఫొటోను షేర్ చేశాడు. ఆ ఫొటో అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. ఈ అందమైన జంట అలా 2015, జులై 3న నిశ్చితార్థం చేసుకుంది.

అదే ఏడాదిలో..

అదే ఏడాదిలో..

అదే సంవత్సరంలో అంటే 2015, డిసెంబర్ 13వ తేదీన రోహిత్ మరియు రితికా ముంబైలోని తాజ్ ల్యాండ్స్ హోటల్ లో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు బాలీవుడ్, ప్రపంచంలోని ప్రముఖ క్రికెటర్లు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు.

పెళ్లి తర్వాత..

పెళ్లి తర్వాత..

అయితే పెళ్లి తర్వాత ఓ ఇంటర్వ్యూలో రోహిత్ ఇలా మాట్లాడాడు. ‘నేనుప్రతి చిన్న పనికీ తన అనుమతి కచ్చితంగా తీసుకుంటాను. ఒక్క బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తప్ప. నేను అనుమతి తీసుకోని ఏకైక సమయం' అని అన్నాడు.

రితికా సపోర్ట్..

రితికా సపోర్ట్..

వీరిద్దరూ వివాహం చేసుకుని, దాదాపు ఐదేళ్లు పూర్తి కావస్తోంది. వీరిద్దరూ పెళ్లి చేసుకున్న నాటి నుండి చాలా అందమైన జీవితాన్ని గడుపుతున్నారు. అంతేకాదు రోహిత్ గురించి రితికా కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. రోహిత్ కు అన్ని సమయాల్లోనూ తన మద్దతు ఉంటుందని తెలిపింది. ‘మీరు నాకు తెలిసిన బలమైన వ్యక్తి.. నేను మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నాను. ఐపిఎల్ కప్ గెలిచిన మీకు మరియు మీ టీమ్ సభ్యులందరికీ హ్యాట్సాఫ్' అంటూ ట్విట్టర్లో ట్వీట్ చేసింది.

సమీర ఎంట్రీ..

సమీర ఎంట్రీ..

ఇక వీరిద్దరి అందమైన జీవితంలోకి.. వీరి ప్రేమకు ప్రతీకగా రెండేళ్ల క్రితమే సమీర ఎంట్రీ ఇచ్చింది. తను పుట్టినప్పటి నుండి రోహిత్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఏ మాత్రం సమయం దొరికినా తనతో సరదాగా గడిపేస్తున్నాడు. అంతేకాదు ఆమెతో గడిపిన ఆనంద క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నాడు.

ఈ అందమైన నిండు నూరేళ్లు ఇలాగే హాయిగా జీవించాలని మనందరం కోరుకుందాం... ముందుగా 2020 ఐపిఎల్ టీమ్ లో మరోసారి మెరుపులు మెరిపిస్తారని ఆశిస్తున్నాం.. ముందుగా అన్ని జట్లకు ఆల్ ది బెస్ట్...

All Images Credited to : Twitter

English summary

Rohit Sharma And Ritika Sajdeh's Love Story in Telugu: When Best Friends Become Soulmates

Here we talking about Rohit Sharma and Ritika Sajdeh's love story in telugu. When best friends become soulmates. Read on