For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పడకగదిలో మూడ్ పెరగాలంటే.. ఇలా ట్రై చేయండి...

|

మనలో పెళ్లైన జంటలు లేదా లివింగ్ రిలేషన్ షిప్ లో ఉండే జంటలు పడకగదిలో తమ కోరికలను తీర్చుకోవాలని.. రతి క్రీడలో రోజూ రెచ్చిపోవాలని కోరుకుంటూ ఉంటారు.

కానీ కొందరికి బెడ్ రూమ్ లోకి వెళ్లగానే అస్సలు మూడ్ రాదు. ఉన్న మూడ్ కాస్త వెళ్లిపోతుంది. ఎందుకంటే రోజూ అదే పడకగదిలో చేయాలంటే.. మరీ రోటీన్ గా ఆ కార్యంలో పాల్గొనడం అంటే బోర్ గా ఫీలవుతూ ఉంటారు.

ఇలాంటి సమయంలోనే ఏదైనా రిసార్ట్ లేదా లాడ్జ్ లో మంచి రూమ్ బుక్ చేసుకోవాలని ఆశిస్తారు. అయితే ప్రస్తుత కరోనా మూడో దశ, కొత్త రకం వైరస్ లు పుట్టుకొస్తున్న తరుణంలో బయటకు వెళ్లి రతి క్రీడలో పాల్గొనడం అంత శ్రేయస్కరం కాదు. కాబట్టి మీరు ఉండే ఇంట్లోనే మీ పడకగదిలో కొన్ని మార్పులు చేసుకుంటే చాలు రొమాన్స్ లో ప్రతిరోజూ కీలుగుర్రంలా రెచ్చిపోవచ్చు. అదెలాగో మీరే చూడండి...

లేడీస్! బెడ్ రూములో మీ భర్తలు ఎలాంటి కోరికలు ఎక్కువగా కోరుకుంటారో తెలుసా...

మూడ్ రావాలంటే..

మూడ్ రావాలంటే..

మీరు ఉండే ఇంట్లో పడకగదిలో మీరు అడుగు పెట్టినప్పుడు మీకు మూడ్ రావాలంటే అందుకోసం మీరు కొన్ని చిన్న పనులు చేయాలి. ముఖ్యంగా క్లీన్ గా ఉన్న బెడ్ రూమ్ ను కొంత అదనపు హంగులతో అలంకరించుకోవాలంటున్నారు నిపుణులు అప్పుడే మీలో రొమాంటిక్ భావన కలిగి మూడ్ ఆటోమేటిక్ గా పెరుగుతుందట.

హాయిగా అనిపించాలి..

హాయిగా అనిపించాలి..

మీరు పడక గదిలోకి అడుగుపెట్టగానే మంచి సువాసనలు వెదజల్లే పర్ఫ్యూమ్స్ మరియు రూమ్ స్ప్రేలు వాడాలి. మీరు అలా అడుగుపెట్టగానే మీ మనసు గాల్లో తేలుతున్నట్టు అనిపించాలి. ఇక బెడ్ మీద అడుగు పెట్టగానే ఎంతో హాయిగా అనిపించాలి. ఇలా జరగాలంటే మీరు పిల్లో మిస్డ్ వాడాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇది మంచి సువాసనలను వెదజల్లుతుంది.

గుడ్ ఫీల్..

గుడ్ ఫీల్..

ఈ పిల్లో మిస్ట్ అని మంచి సువాసనలు వ్యాప్తి చేస్తుంది. దీన్ని సహజమైన చెట్ల ఆకుల నుండి తయారు చేస్తారు. కాబట్టి దీని వల్ల మీకు పడకగదిలో గుడ్ ఫీల్ కలుగుతుంది. నిద్రలేమితో బాధపడే వారు సైతం వీటిని వాడొచ్చు. అప్పుడు మీరు ఎంతో ప్రశాంతంగా నిద్రపోతారు.

మగాళ్ల గురించి ఈ ఇంట్రస్టింగ్ విషయాలు తెలుసా...

తాజాగా ఉండాలి..

తాజాగా ఉండాలి..

పడకగది ఎంత అందంగా అలంకరించినా.. మన దగ్గర తాజాదనం లేకపోతే ఏం చేస్తాం. అందుకే మనం చాలా తాజాగా ఉండాలి. అలా ఉండాలంటే మీరు రాత్రి పూట కూడా మంచి సువాసన వెదజల్లే సబ్బుతో స్నానం చేయాలి. అందుకోసం బాత్ సోక్స్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి మార్కెట్లో చాలా రకాలే అందుబాటులో ఉంటాయి. వీటిని వాడినా కూడా రొమాంటిక్ మూడ్ వచ్చేస్తుందట. స్వర్గంలో ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుందట.

నచ్చినపూలు..

నచ్చినపూలు..

పడకగదిలో మంచి సువాసన వచ్చేందుకు చాలా మంది మార్కెట్లో దొరికే కెమికల్స్ ఐటమ్స్ వాడుతూ ఉంటారు. అయితే దానికి బదులు మీరు సహజ సిద్ధమైన వాటిని వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు మల్లెపూలు మీ పడకగదిలో ఉంచుకుంటే.. ఆటోమేటిక్ గా మిమ్మల్ని మత్తెక్కిస్తుంది. అలాగే మీకు నచ్చిన పూలను కూడా ఎంచుకోవచ్చు. పూలు ఎండిపోయిన తర్వాత వాటిని ఓ గాజు సీసాలో వేసి దానిలో ఎసెన్షియల్ ఆయిల్స్ వేస్తే మరింత సువాసన వెదజల్లుతుంది.

బాడీ రిలాక్స్..

బాడీ రిలాక్స్..

మంచి సహజ నూనెలతో భాగస్వామితో బాడీ మసాజ్ చేసుకుంటే.. మీ బాడీకి మంచి రిలాక్సేషన్ ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొబ్బరి నూనెతో తయారు చేసిన క్యాండిల్స్ ని మీ పడకగదిలో పెట్టుకుంటే.. ఇవి మీలో మరింత మంచి ఫీలింగ్ ని కలుగజేస్తాయి.

చల్లని వాతావరణంలో..

చల్లని వాతావరణంలో..

ప్రస్తుతం వర్షం బాగా కురుస్తోంది. దీనికి తో అప్పుడప్పుడు పవర్ కూడా పోతోంది. ఇలాంటప్పుడు వర్షంలో బయటికి పోలేం.. ఇంట్లోనూ హ్యాపీగా ఉండలేం. అయితే కాస్త రొమాంటిక్ గా థింక్ చేస్తే చాలు.. ఇంట్లోనే మీ పడకగదిలో ఆనందంగా గడిపే వీలుంటుంది. మీ పడకగదితో పాటు మీ ఇల్లంతా అందమైన క్యాండిల్స్ తో అలంకరించండి. ఫోన్లో మాంచి రొమాంటిక్ మ్యూజిక్ పెట్టుకుని అందరూ ఆనందంగా భోజనం చేయండి.

అలా గడిపేయొచ్చు..

అలా గడిపేయొచ్చు..

ఓ పక్క బయట వర్షం కురుస్తుంటే.. దాన్ని కిటికీలో లేదా బాల్కనీ చూడటాన్ని చాలా మంది ఇష్టపడతారు. అలా చూస్తే వేడి వేడిగా ఏవైనా ఐటమ్స్ తింటూ.. పక్కన పార్ట్నర్ తో రొమాన్స్ లో పాల్గొంటే ఆ మజాయే వేరుగా ఉంటుంది. ఆ టైంలో ఒకరికొకరు గిల్లికజ్జాలాడుతూ సమయం గడిపితే.. మీరు కొత్త ప్రపంచంలో విహరిస్తున్నట్టు అనిపిస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఆ కార్యంలో పాల్గొంటే.. కొంచెం కొత్తగా ఉంటుంది.

English summary

Romantic Bedroom Ideas That Set The Mood

Here are the romantic bedroom ideas that set the mood. Take a look