For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తను అలాంటిదని తెలుసు... అయినా ఆమెనే కావాలనిపిస్తోంది.. ఆమెను మరువలేకపోతున్నా...!

నువ్వు తనతో ప్రేమలో పడ్డావని చెబుతున్నారు. ఇది నిజమేనా.. కాదా? అనే అయోమయంలో ఉన్నాను. ఇదిలా ఉంటే ఆ అబ్బాయి సమస్య పరిష్కారమయ్యిందా?

|

నా పేరు రాజేష్ (పేరు మార్చాం). 'నేను డేటింగ్ చేస్తున్న అమ్మాయి అలాంటి వ్యక్తి అని నాకు ముందునుంచే తెలుసు. అయితే నేను అలాంటి అలవాటును ఆమెతో మాన్పించాలని నాకు తెలియకుండానే ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఆమెకు అన్ని రకాలుగా సహాయం చేయాలని అనిపిస్తుంది.

She is bad for me, but I love her madly!

ఎందుకంటే నేను ఆమెతో ప్రేమలో పడ్డానని కూడా అనుకుంటున్నాను. అందుకే నేను తనతో కలిసి ఎక్కువగా బయటికెళ్లేవాడిని. అయితే అలాంటి సమయంలో నన్ను ఎక్కువగా తిట్టేది. అయితే నాకు అవి పొగడ్తల్లా అనిపించేవి. ఇలాంటివేవీ నాకు ఇబ్బందిగా అనిపించేది కాదు. అయితే మేమిద్దరం బయటికి వెళ్లిన ప్రతిసారీ ఇతర మగాళ్లకు లైన్ వేయడం.. లేదా తెలిసిన వాళ్లతో సరసాలాడుతూ ఉంటుంది.

She is bad for me, but I love her madly!

వీటిని కూడా నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. అయితే ఎప్పుడూ అలాగే చేస్తే నాకు కూడా అప్పుడప్పుడు కోపం వస్తుంది. అయితే ఆమె మీద నాకు అభిమానం, ఇష్టం ఉండటంతో నేనే సర్దుకుపోయేవాడిని. అయితే నాకు తెలియకుండానే నేను తన ప్రేమలో పడిపోయానేమో అనిపిస్తూ ఉంటుంది.

She is bad for me, but I love her madly!

ఇది తెలుసుకున్న నా స్నేహితులు ఆమె నన్ను మోసం చేస్తుందని, తనని మరచిపోవాలని సలహా ఇస్తున్నారు. అయితే నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఆమెను మాత్రం నేను మరచిపోలేకపోతున్నా.

ఆమెతో లేకపోతే...

ఆమెతో లేకపోతే...

ఆమెతో నేను అప్పుడప్పుడు డేటింగుకు వెళ్లే అలవాటు ఉండటంతో ఆమె నాకు తెలియకుండానే నాలో కొంత భాగం అయిపోయింది. అది నన్ను నీచంగా మారుస్తుందని నాకు తెలుసు.

అలా ఆలోచించలేను..

అలా ఆలోచించలేను..

ఎందుకంటే ఆమె లేకపోవడాన్ని నేను అస్సలు ఊహించుకోలేకపోతున్నాను. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా నేను కూడా లాక్ అయిపోయాను. దీంతో ఆమెను కలవలేకపోతున్నాను. ఈ ఒంటరితనంలో విరహ వేదనతో రగిలిపోతున్నాను. దీనికి పరిష్కారం ప్రయత్నించాను.

ఆన్ లైన్ లో వెతికితే..

ఆన్ లైన్ లో వెతికితే..

ఈ సమస్య గురించి ఆన్ లైన్ లో వెతికాను. అందులో నిపుణుల యొక్క సమాధానాలను, ఉదాహరణాలను చూశాను. అందులో ఒకటి ఇలా ఉంది. ఆమె లేకుండా నన్ను నేను ఊహించుకోలేకపోతే, నేను సంబంధం సాధ్యం కాని స్థితికి చేరుకునే వరకు కొనసాగించడం తప్ప నాకు వేరే మార్గం లేదని తెలుసుకున్నాను.

ఆమె మారొచ్చు..

ఆమె మారొచ్చు..

అలాగే అందులో ఓ వాక్యం నాకు బాగా నచ్చింది. అదేంటంటే.. ఆమెతో నేను సన్నిహితంగా ఉంటే, భవిష్యత్తులో ఆమె మంచిగా మారేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని చెప్పారు.

అది ఒక అంచనా మాత్రమే..

అది ఒక అంచనా మాత్రమే..

అయితే అది ఒక అంచనా మాత్రమే అని, వెంటనే నన్ను నిరుత్సాహపరిచే సమాధానం కూడా ఇచ్చాడు. అయితే మీరు అన్ని రకాలుగా, ముఖ్యంగా మానసికంగా బలంగా ఉండి, భవిష్యత్తులో మీకు ఇబ్బంది కలగకుండా నిర్ణయాన్ని తీసుకోవాలి. అయితే అందులో కొంత పెయిన్ ఉంటుందని చెప్పారు.

ఆమె కోణంలో..

ఆమె కోణంలో..

అయితే మీరు అనుకున్నదానికి భిన్నంగా ఆమె కోణంలో ఉండకపోవచ్చు. ఆమె మనసులో మీకు ఉన్నదానికి భిన్నమైన అభిప్రాయం కూడా ఉండొచ్చు. అయితే ఆమె మీకు ఎలాంటి చేయదు అని మాత్రం చెప్పారు.

మరో సమాధానం ఆలోచింపజేసింది..

మరో సమాధానం ఆలోచింపజేసింది..

అయితే అందులో ఉండే మరో సమాధానం నన్ను కాస్త ఆలోచింపజేసింది. నా పట్ల గౌరవం లేని వ్యక్తిని నేను ఎందుకు ప్రేమిస్తున్నాను. నేను నమ్మకంగా ఉండటానికి తగినంత వ్యక్తిని ప్రేమించలేదని స్పష్టంగా ఉన్నప్పుడు, తన గురించి ఆలోచించటం కరెక్టేనా అని తిరిగి ప్రశ్న ఎదురైంది.

నిజమే అనిపించింది..

నిజమే అనిపించింది..

అప్పుడు నాకు కొంత జ్ణానోదయం కలిగింది. నేనంటే ఇష్టపడని, ప్రేమించని వ్యక్తిని నేనేందుకు ఇష్టపడుతున్నాను. కేవలం అలాంటి సంబంధం కోసమేనా అని ఆలోచించాను. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను.

అలా ముగించాను..

అలా ముగించాను..

ఇక తన గురించి ఆలోచించకుండా.. నా గురించి ఎవరైతే ఆలోచిస్తారో.. లేదా కనీసం నన్ను పట్టించుకునే వారి గురించి ఆలోచించాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే అలాంటి వ్యక్తులతో ఎప్పటికైనా ప్రమాదకరమే అని తెలుసుకున్నాను. మీరు కూడా ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని చెప్పదలుచుకున్నా‘ అని ఆ యువకుడు తన అంతరంగాన్ని ఓ మెయిల్ ద్వారా పంచుకున్నాడు.

English summary

She is bad for me, but I love her madly!

Here we talking about she is bad for me, but i lover her madly!. Read on.
Story first published:Monday, May 11, 2020, 14:16 [IST]
Desktop Bottom Promotion