For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘ముందు అన్నయ్యతో లవ్.. బ్రేకప్..! తర్వాత నాకు ప్రియురాలిగా..’ రేస్ సినిమాలా మారిన మా ప్రేమ కథ...!

|

బాలీవుడ్ లో సైఫ్ అలీఖాన్, బిపాసా బసు, అనిల్ కపూర్, అమిషా పటేల్ తో సహా ఇంకా ఎందరో స్టార్లు కలిసి నటించిన 'రేసు' సినిమా గుర్తుండే ఉంటుంది.

అందులో అన్నయ్యతో పెళ్లి.. తమ్ముడితో శోభనం.. తమ్ముడితో పెళ్లి అన్నయ్యతో శోభనం వంటి సీన్లు వింతగా అనిపించినప్పటికీ.. అందరినీ ఆకట్టుకుంటాయి. అయితే అదంతా రీల్ లైఫ్ స్టోరీ కాబట్టి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కేవలం ఎంటర్ టైన్మెంట్ వరకే చూశారు. కానీ అచ్చం ఇలాంటి కథే రియల్ లైఫ్ లోనూ జరిగింది.

కాకపోతే ఇక్కడ అన్నయ్య ప్రియురాలికి బ్రేకప్ చెప్పాక.. తమ్ముడు తనని లైన్ లో పెట్టేశాడు. అనుకోకుండా తనకు ఎమోషనల్ గా బాగా దగ్గరయ్యాడు. అయితే తాను చేస్తోంది కరెక్టా కాదా.. అనే సందేహంలో పడిపోయాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరు? తన సమస్యకు పరిష్కారం దొరికిందా లేదా అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కారు లోన్ కట్టాక.. బ్రేకప్ చెప్పింది.. సరిగ్గా పెళ్లికి ముందే మాజీ ప్రియుడితో..!కారు లోన్ కట్టాక.. బ్రేకప్ చెప్పింది.. సరిగ్గా పెళ్లికి ముందే మాజీ ప్రియుడితో..!

హాయ్ 'నా పేరు సోమేశ్వర్(పేరు మార్చాం). నా వయసు 22 సంవత్సరాలు. మా అన్నయ్య ప్రియురాలు చాలా అందంగా ఉండేది. వారిద్దరూ రెండేళ్ల పాటు డేటింగులో ఉన్నారు. అయితే ఏమయిందో తెలీదు కానీ.. వారిద్దరి మధ్య ఏదో విషయంలో విభేదాలు వచ్చి బ్రేకప్ చెప్పుకున్నారు. అయితే తను ఎంత అందంగా ఉంటుందో అంత మంచిది కూడా. అంత మంచి అమ్మాయిని ఎలా వదులుకున్నాడా అని బాధపడేవాడిని.

నాతో స్నేహం..

నాతో స్నేహం..

అయితే తనతో బ్రేకప్ చెప్పడానికి ముందు నుండి తను నాతో స్నేహంగా ఉండేది. మా అన్నయ్యతో విడిపోయాక తన గురించి పెద్దగా ఆలోచించడం లేదు. తన జీవితంలో గతంలో జరిగిన విషయాల గురించి మరచిపోవాలని డిసైడ్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే నాతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటోంది. నేను కూడా తనతో ఎక్కువ సమయం గడుపుతున్నాను.

భావోద్వేగ బంధం..

భావోద్వేగ బంధం..

ఇలా రోజులు గడిచేకొద్దీ మా ఇద్దరి మధ్య భావోద్వేగ బంధం పెరిగింది. నాకు తెలియకుండానే తనతో ప్రేమలో పడిపోయానేమో అనిపిస్తోంది. అయితే నేను మా అన్నయ్య ప్రేమించిన అమ్మాయిని.. అది కూడా రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన అమ్మాయిని ప్రేమించొచ్చా? లేదా అనే విషయం నాకు అర్థం కావడం లేదు' అంటూ తన సందేహాన్ని వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో తనకు ఎలాంటి సమాధానం వచ్చిందో చూసేద్దాం రండి...

ఆ విషయంలో ఆందోళన చెందుతున్నారా? అయితే ఇలా చేసి చూడండి...!ఆ విషయంలో ఆందోళన చెందుతున్నారా? అయితే ఇలా చేసి చూడండి...!

మంచి బంధం..

మంచి బంధం..

మీ ఇద్దరికీ ముందు నుండే మంచి పరిచయం మరియు బంధం ఉంది. అందుకే తను మీ కుటుంబ సభ్యుల్లో ఒకరనే భావన కలుగుతుంది. మీరిద్దరికీ ఒకరిపై ఒకరికి బలమైన కోరికలు, ఫీలింగ్స్ ఉన్నట్లయితే మీరు మీ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లొచ్చు.

మీ అన్నకు చెప్పండి..

మీ అన్నకు చెప్పండి..

అయితే ముందుగా ఈ విషయం గురించి మీ అన్నయ్యకు చెప్పండి. వారిద్దరూ మంచి ఉద్దేశ్యంతో విడిపోయి, వారి మధ్య ఎలాంటి విభేదాలు, మనస్పర్దలు లేనట్లయితే మీ ప్రయత్నం మరింత సులభమవుతుంది. ఇక్కడ మీ ఇద్దరి గురించే కాకుండా.. మీ సోదరుని గురించి కూడా ఆలోచించండి. ఎందుకంటే భవిష్యత్తులో మీ మధ్య రిలేషన్ షిప్ లో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు.

అభ్యంతరం లేకపోతే..

అభ్యంతరం లేకపోతే..

మీ ఇద్దరి మధ్య స్నేహం ఉండి, మీ అన్నయ్యకు ఇలాంటి రిలేషన్ షిప్ గురించి ఎలాంటి అభ్యంతరం లేకపోతే మీరు మీ ప్రేమను నిరంభ్యంతరంగా కొనసాగించొచ్చు. మీ ప్రేమను పెళ్లి దాకా తీసుకెళ్లొచ్చు. మీరిద్దరూ జీవితాంతం హాయిగా, ఆనందంగా జీవించొచ్చు.

English summary

Should I Love My Brother's Ex-Girlfriend?

Read on to know the details, should i love my brother's ex-girlfriend.
Story first published: Saturday, May 22, 2021, 17:18 [IST]