For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Signs He Likes You :మీ ప్రియుడు మీ మనసును ఇష్టపడుతున్నాడా? లేదా మీ బాడీనా?

|

భావోద్వేగాల విషయంల స్త్రీ, పురుషులను పోల్చి చూస్తే.. అబ్బాయిల కన్నా అమ్మాయిలకే ఆ ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి. వారి మనసులోని భావాలను బయట పెట్టడంలోనూ మగవారి కంటే మహిళలే ముందు ఉంటారట.

అయితే చాలా మంది పురుషులు తమ ఫీలింగ్స్ ను అంత సులభంగా బయటపెట్టరట. అంతమాత్రాన వారు మిమ్మల్ని తక్కువగా లవ్ చేస్తున్నారని అర్థం కాదు. ఈ నేపథ్యంలోనే కొందరు అమ్మాయిలకు తమ ప్రియుడి కోసం ఎన్ని చేసినా.. ఎంత చేసినా.. తమను నిజంగా ప్రేమిస్తున్నాడా? తమను నిజంగానే ఇష్టపడుతున్నాడా లేదా అనే సందేహాలు కలుగుతూ ఉంటాయి.

ఈ సందర్భంగా మీరు వారికి కొన్ని రకాల ప్రశ్నలు అడగడం ద్వారా.. కొన్ని పరీక్షలు పెట్టడం ద్వారా వారి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారా లేదా అనే విషయాలను తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ వయసులో ఉండే మగువలు ఎక్కువ రొమాన్స్ కావాలని కోరుకుంటారట...!

ప్రేమగా మాట్లాడుతుంటే..

ప్రేమగా మాట్లాడుతుంటే..

మీరిద్దరూ మంచి రిలేషన్ షిప్ లో ఆ కార్యం గురించి ఆలోచించడం అనేది సర్వసాధారణం. ఇలాంటి సమయంలో కొందరు అమ్మాయిలు తమ ప్రియుడు తమ మనసును ప్రేమిస్తున్నాడా? లేక తమ శరీరాన్ని మాత్రమే ఇష్టపడుతున్నాడా అని అనుమానపడుతూ ఉంటారు. అయితే అలాంటి విషయాలను నేరుగా అడిగితే.. క్లియర్ ఆన్సర్ రాదని వారికి కూడా తెలుసు. అందుకే వారు ప్రియుడి ప్రవర్తనను బట్టి.. వారితో ప్రేమగా మాట్లాడుతూ సమాధానాలు రాబడతారని నిపుణులు చెబుతున్నారు. అయితే కొందరు మాత్రం అస్తమానం పొగుడుతూ ఫ్లర్ట్ చేయాలని చూస్తుంటారు. అలాంటి వారిని నమ్మకూడదని సూచిస్తున్నారు.

నిజాయితీ సమాధానం..

నిజాయితీ సమాధానం..

మీ ఇద్దరు దీర్ఘకాలిక రిలేషన్ షిప్ కావాలని కోరుకుంటే.. అలాంటి సందర్భాల్లో మీరు చాలా విషయాల్లో క్లారిటీగా ఉండాలి. వారు మీతో ఎంత టైం కలిసి జీవించాలనుకుంటారో అనే విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి. ఈ ప్రశ్నకు తను చెప్పే సమాధానం బట్టి మీ ఫ్యూచర్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు. అయితే.. తను చెప్పే సమాధానం నిజాయితీగా ఉందా లేదా అనేది పరిగణనలోకి తీసుకోవాలి.

పడకగదిలో పరిస్థితులపై..

పడకగదిలో పరిస్థితులపై..

మీరిద్దరూ మీ బంధాన్ని మరింత బలంగా మార్చుకోవాలనుకుంటే.. పడకగదిలో బెడ్ పై ఏం చేయాలి.. ఎలా చేయాలనే విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలట. కొందరు తమ సామర్థ్యం బలహీనంగా ఉన్నప్పటికీ.. ఏవేవో కబుర్లు చెబుతుంటారు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. వారు చెప్పే మాటలకు చేతలకు పొంతన ఉందా అనే విషయాల్ని కచ్చితంగా గమనించాలి. అప్పుడే మీరు సంతోషంగా ఉంటారు.

మిమ్మల్ని ఇష్టపడుతుంటే..

మిమ్మల్ని ఇష్టపడుతుంటే..

మీరు ప్రేమిస్తున్న వ్యక్తి నిజంగా మిమ్మల్ని ఇష్టపడుతుంటే.. మీరు తనను ఎప్పుడు పిలిచినా.. ఆ సమయంలో వారు ఎంత బిజీగా ఉన్నా.. తనకు అస్సలు కుదరకపోయినా.. అలాంటి సమయాన్ని అడ్జస్ట్ చేసుకుని మీ కోసం వచ్చే వ్యక్తిని.. తనకు ఇష్టం లేని వాటిని మీరు ఆర్డర్ చేసినా.. ఏ మాత్రం కోపం పడకుండా మీ ఇష్టాన్నే తన ఇష్టంగా భావిస్తే.. తను మిమ్మల్ని సీన్సియర్ గా లవ్ చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.

మీకు సరైన జోడిని ఎలా కనుక్కొంటారు?

అనుమానం ఉండదు..

అనుమానం ఉండదు..

ఏ ఇద్దరు వ్యక్తులు నిజాయితీ గల ప్రేమలో ఉంటారో.. వారి మధ్య అనుమానం అనే దానికి అస్సలు తావుండదు. అందుకే మీ బాయ్ ఫ్రెండ్ అంటే మీకు నిజంగా ప్రేమ ఉంటే.. వారిపై మీకు ఏ మాత్రం అనుమానం ఉండదు. వారు కూడా మీ ఫోన్, మీ ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఛాటింగ్ హిస్టరీ, బ్రౌజింగ్ హిస్టరీ వంటి వాటిని అస్సలు చెక్ చేయరు. ఒకవేళ ఏదైనా కావాలన్నా కచ్చితంగా మీ పర్మిషన్ అడుగుతారు. మీరు ఇతర పురుషులతో కలిసి మాట్లాడుతున్నా.. ‘వారు కేవలం మీ స్నేహితులే అనుకుంటూ.. మీ మదిలో తనకే స్థానం ఉంటుందన్న ఫీలింగ్' వారి మనసులో ఉంటుంది.

మీరు మాట్లాడకపోతే..

మీరు మాట్లాడకపోతే..

మీరంటే నిజంగా ఇష్టపడే వ్యక్తి.. వారి మనసులో మీ కంటూ ఓ స్థానాన్ని ఫిక్స్ చేసుకున్న అబ్బాయిలు మీరు మాట్లాడకపోతే.. అస్సలు తట్టుకోలేరు. కొన్నిసార్లు మీపై అసూయ కూడా చూపుతారు. ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలని చూసినా.. మీకు లైన్ వేయడం వంటివి చేసినప్పుడు కాస్త ఇబ్బందిగా ఫీలవుతారు. అయితే ఇదంతా ప్రేమలో భాగమేనని మీరు అర్థం చేసుకోవాలి. ఈ ఫీలింగ్స్ అన్నీ తను మీతో చెప్పలేరు.

గొడవలు జరిగినప్పుడు..

గొడవలు జరిగినప్పుడు..

భార్యభర్తలైనా.. ప్రేమికులైనా.. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా అప్పుడప్పుడు ఏదో ఒక విషయంలో గొడవలు, వివాదాలు జరుగుతూ ఉంటాయి. అయితే కొందరు ప్రేమికులు చిన్న చిన్న తప్పులకే బ్రేకప్ చెప్పుకుంటూ ఉంటారు. కానీ మీ ప్రియుడు మిమ్మల్ని నిజాయితీగా ప్రేమిస్తుంటే.. మీ ఇద్దరి మధ్య ఎంత పెద్ద గొడవ జరిగినా.. మిమ్మల్ని తిరిగి కలిసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే మీపైన ప్రేమ ఉండటం వల్ల అవన్నీ టీ కప్పులో తుఫానులా మాయమవుతాయి.

తరచుగా ఐ లవ్ యూ అనకపోయినా..

తరచుగా ఐ లవ్ యూ అనకపోయినా..

తను మీకు తరచుగా ఐ లవ్ యూ చెప్పకపోయినా.. మీరంటే ఏదో ఒక రూపంలో ప్రేమను చూపుతూనే ఉంటాడు. దీంతో తనకు మీ మీదున్న ప్రేమ మరింతగా పెరిగిపోయిందని అర్థం చేసుకోవచ్చు.

English summary

Signs He Likes You : How to know if a guy really likes you?

Here are these signs he likes you:How to know if a guy really likes you? Have a look
Story first published: Tuesday, September 7, 2021, 16:03 [IST]