For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంబంధాల విషయంలో ఈ సంకేతాలుంటే.. వాళ్లంతా సెల్ఫీష్ అని ఫిక్స్ అవ్వొచ్చు...

రిలేషన్ షిప్ విషయంలో ఈ సంకేతాలు కనిపిస్తే అర్థమేంటో తెలుసా.

|

రిలేషన్ షిప్ అన్నాక.. స్త్రీ, పురుషులిద్దరూ సమానమే. అయితే ఆ విషయాన్ని చాలా మంది అంగీకరించారు. ప్రతిసారీ తమదే పైచేయి కావాలని భావిస్తారు. అలా ఎవరికి వారు తమదే ఆధిపత్యం కావాలని ప్రయత్నించినప్పుడు రిలేషన్ షిప్ విషయంలో పరిస్థితులు అద్వానంగా మారతాయి.

Signs You Are Being Self-Centered In Your Relationship

అంతేకాదు ఆ విషయాలు చాలా దూరం వరకు వెళ్తాయి. అది ఎంతలా అంటే ఏకంగా విడాకులు తీసుకుని.. ఇద్దరూ కలిసి ఉండకుండా.. ఎవరి దారి వారు చూసుకునేంతలా మారిపోతుంటాయి. అయితే అలాంటి పరిస్థితులకు చాలాసార్లు మీరే కేంద్రంగా మారే సందర్భాలు కూడా ఉండొచ్చు. అయితే ఇలాంటి విషయాలను మీరు గ్రహించకపోవచ్చు.

Signs You Are Being Self-Centered In Your Relationship

కానీ మీరు చేసే కొన్ని పనులు మరియు మాటల వల్ల మీరు రిలేషన్ షిప్ విషయంలో స్వార్థపూరితంగా ఉన్నారని అనిపించొచ్చు. ఈ సందర్భంగా మీరు రిలేషన్ షిప్ విషయంలో మీరు స్వార్థపరులుగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ సంకేతాలపై ఓ లుక్కేయండి.. మీలో స్వార్థపూరిత లక్షణాలు ఉన్నాయో లేదో తెలుసుకోండి...

'ఆ'కార్యం పట్ల ఆసక్తి తగ్గుతోందా... అలా చేయండి.. రతిక్రీడను ఆస్వాదించండి...'ఆ'కార్యం పట్ల ఆసక్తి తగ్గుతోందా... అలా చేయండి.. రతిక్రీడను ఆస్వాదించండి...

మీ అవసరాలకే ప్రాధాన్యత..

మీ అవసరాలకే ప్రాధాన్యత..

మీరు రిలేషన్ షిప్ విషయంలో స్వయం కేంద్రంగా ఉన్నారని చెప్పే అతిపెద్ద సంకేతాలలో ఇదొకటి. మీ ఇద్దరి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి బదులుగా, మీరు కేవలం మీ అవసరాలనే తీర్చుకోవడానికే ఎక్కువ మొగ్గు చూపుతుంటే.. మీ భాగస్వామి ఏమి కోరుకుంటున్నారో పట్టించుకోకపోతే.. కొన్ని సమయాల్లో, మీరు మీ భాగస్వామి యొక్క అవసరాలను చూసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అలాంటి సందర్భాల్లో మీరు సులభంగా కోపం తెచ్చుకోవడం వంటి చేయొచ్చు.

మీ భాగస్వామి సెల్ఫిష్ అని..

మీ భాగస్వామి సెల్ఫిష్ అని..

మీ భాగస్వామి స్వార్థపూరితంగా ఉన్నారని మీరు తరచుగా ఆరోపిస్తుంటే.. మీ భాగస్వామి మిమ్మల్ని సంతోషపెట్టడానికి మరియు ప్రత్యేకమైన అనుభూతిని కలిగించే పనులు చేసినప్పటికీ, మీరు అతని/ఆమె ప్రయత్నాలను ఎప్పటికీ అభినందించరు. వాస్తవానికి, మీ మానసిక స్థితిని పాడు చేస్తున్నట్లు మీరు అతని/ఆమెపై తరచుగా ఆరోపణలు చేయొచ్చు. ఏదైనా వాదన సమయంలో కూడా మీరు మీ భాగస్వామిని సెల్ఫిష్ అని పిలుస్తారు.

తిట్టుకుంటూ ఉండటం..

తిట్టుకుంటూ ఉండటం..

మీరు మీ భాగస్వామిని ఎల్లప్పుడూ తిడుతూ ఉండటం.. అతను/ఆమెలో లోపాలను అదే పనిగా వెతకడం వంటి పనులు చేస్తుంటే.. మీ రిలేషన్ షిప్ విషయంలో మీరే స్వయంకేంద్రంగా ఉన్నారనడానికి సంకేతం. ఉదాహరణకు మీరు మీ భాగస్వామి యొక్క ప్రతి అలవాటును విమర్శించవచ్చు. మీ భాగస్వామి పరిస్థితులు మెరుగుపరచడానికి ఎంత ప్రయత్నించినా, మీరు ఎల్లప్పుడూ మీ భాగస్వామిలో ఏదో ఒక లోపం కనుగొంటారు. మీరు తప్పు చేసినప్పటికీ, మీరు మీ తప్పులను ఎప్పటికీ అంగీకరించరు.

రతి క్రీడలో గొప్ప ఉద్వేగం మీ సొంతం కావాలంటే.. ఈ చిట్కాలను ఫాలో అవ్వండి...!రతి క్రీడలో గొప్ప ఉద్వేగం మీ సొంతం కావాలంటే.. ఈ చిట్కాలను ఫాలో అవ్వండి...!

ఎప్పుడూ వినరు..

ఎప్పుడూ వినరు..

రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు భాగస్వాములు ఇద్దరూ సమానమైనవారు మరియు ముఖ్యమైనవారు. వారి అభిప్రాయాలు మరియు ఆలోచనలు కూడా అలానే ఉంటాయి. అయితే మీరు మీ భాగస్వామి అభిప్రాయాలు మరియు ఆలోచనలను వినడానికి మీకు ఎల్లప్పుడూ ఆసక్తి లేకపోతే, మీరు సెల్ఫిష్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీ భాగస్వామినే స్వయంగా కల్పించుకుని.. ఏదైనా విషయం గురించి మీతో మాట్లాడటానికి వచ్చినప్పుడు.. మీరు ముఖం తిప్పుకుని వెళ్లడం వంటివి చేస్తే.. మీ భాగస్వామి అతని/ఆమె సమస్యల గురించి మాట్లాడేటప్పుడు మీకు విసుగు కలుగుతుంది.

తరచుగా అంతరాయం..

తరచుగా అంతరాయం..

మీ భాగస్వామి ఏదో విషయం గురించి చెప్పడానికి.. ఆమె/అతని సమస్యల గురించి మాట్లాడటానికి ప్రయత్నించిన క్షణంలో మీరు తరచుగా వారికి అంతరాయం కలిగించడం.. మీ భాగస్వామి చెప్పేది వినడానికి బదులుగా, మీరు వారిని సైలెంట్ గా ఉండమని చెప్పడం వంటివి చేయొచ్చు. వారు ఏదైనా ముఖ్యమైన విషయం చెబుతున్నా లేదా అతని/ఆమె బాధ వెనుక గల కారణాలను తెలియజేసినా మీకు అది వినాలని అనిపించకపోతే.. మీ సమస్యలు మరియు అభిప్రాయాలను పంచుకునే విషయానికొస్తే వాటిని పట్టించుకోకపోవడం చేసినప్పుడు ఇలా జరుగుతుంది.

ప్రతి విషయాన్ని నిందించడం..

ప్రతి విషయాన్ని నిందించడం..

ప్రతి తప్పుకు మీరు మీ భాగస్వామిపై ఎల్లప్పుడూ ఆరోపణలు చేస్తూ ఉండటం.. చాలా సమయాల్లో తప్పు ఎవరు చేసినా నిందలు మాత్రం మీ భాగస్వామి మీదే వేయడం.. వంటివి చేసే సంకేతాలు కనిపిస్తే.. మీరు స్వార్థపూరితులుగా భావించాలి. అంతేకాదు.. ప్రతి విషయంలో మీరే పరిపూర్ణులుగా భావించడం.. రిలేషన్ షిప్ లో ప్రతి ప్రమాదానికి మీ భాగస్వామిని తరచుగా బాధ్యత వహించని చెప్పిన సందర్భాల్లో మీరు సెల్ఫిష్ గా పరిగణించబడతారు.

మీకోసం మారాలని..

మీకోసం మారాలని..

మీ భాగస్వామి మీ కోసం పూర్తిగా మారాలని ఆశించడం అనేది మీ సంబంధంలో మీరు స్వార్థపూరితంగా మరియు స్వార్థపరులుగా ఉన్నారని చెప్పే సందర్భం. ప్రతిసారీ మీరు మీ భాగస్వామిని అతను/ఆమె అలవాటు మార్చుకోవాలని మరియు తన కోసం పని చేయమని చెప్పినప్పుడు, మీ జీవనశైలి మరియు అలవాట్లలో సానుకూల మార్పులను తీసుకురావడానికి బదులుగా, మీ భాగస్వామిని మీ ప్రకారం అడ్జస్ట్ అవ్వమని తరచుగా అడగొచ్చు.

సమాన ప్రాముఖ్యత

సమాన ప్రాముఖ్యత

ఇలాంటి స్వయం కేంద్రంగా ఉండే సంకేతాలు మీ బంధాన్ని బలహీన పరుస్తుంది. అంతేకాదు మీకు, మీ భాగస్వామికి మధ్య తేడాలను తీసుకొస్తుంది. మీరు మీ భాగస్వామికి సమానమైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని చూపిస్తుంది. పైన ఉన్న సంకేతాలకు బదులుగా, మీ రిలేషన్ షిప్ విషయంలో సమతులత్యతను పాటించేందుకు ప్రయత్నించండి.. మీ రిలేషన్ షిప్ ను కాపాడుకోండి...

English summary

Signs You Are Being Self-Centered In Your Relationship

Do you know that there can be times when your actions and words can make you self-centered in your relationship? Even though you deny being so, there are some signs that will tell if you are being selfish. Read the article to know more.
Desktop Bottom Promotion