For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ కార్యం గురించి స్వార్థంగానే ఆలోచిస్తారా? ఈ సంకేతాలుంటే మీరూ స్వార్థపరులే...!

రిలేషన్ షిప్ లో ఈ సంకేతాలు కనిపిస్తే.. మీకు ఆ విషయంలో స్వార్థం ఎక్కువని చెప్పొచ్చు.

|

మనలో చాలా మంది స్వార్థపరులు ఉంటారు. మన చుట్టూ అనునిత్యం తిరుగుతూనే ఉంటారు. ఈ లోకంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక విషయంలో స్వార్థం అనేది ఉంటుంది. అయితే జీవితంలోని ప్రతి విషయంలో స్వార్థపూరితంగా ఉంటే చాలా సమస్యలొస్తాయి.

Signs You Are the Selfish Partner in Your Relationship in Telugu

అలాంటి వారిని మనం కనిపెట్టడం కష్టమే. వారి మనసులో ఎప్పుడు ఎలాంటి దుర్భుద్ధి పుడుతుందో ఎవ్వరికీ తెలీదు. ఇక రిలేషన్ షిప్ లో మన సమాజంలో ఎంతోమంది స్వార్థపూరితంగా ఉంటుంటారు. కానీ పైకి మాత్రం తాము చాలా నిజాయితీగా, నిక్కచ్చిగా ఉన్నట్టు బిల్డప్ ఇస్తుంటారు. తమ రిలేషన్ షిప్ విషయంలో చాలా త్యాగం చేస్తున్నట్టు చెబుతుంటారు.

Signs You Are the Selfish Partner in Your Relationship in Telugu

కానీ లోలోపల చేసేదంతా గుట్టుచప్పుడు కాకుండా చేస్తారు. అయితే భాగస్వామితో మాత్రం జీవితాంతం మనం కలిసే ఉంటాం.. 'నేను ఏడిస్తే నువ్వు తట్టుకుంటావో లేదో తెలీదు కానీ.. నువ్వు ఏడిస్తే మాత్రం నేను చచ్చిపోతా' అనే పెద్ద పెద్ద డైలాగ్ లు కొడుతూ ఉంటారు. అందులో ఎలాంటి తప్పులేదు. కానీ కొందరు మాత్రం కేవలం తమ ఆనందం కోసం స్వార్థపూరితంగా ఆలోచిస్తుంటారు. అలాంటి లక్షణాలు ఉన్నవారు మీ లైఫ్ లో కూడా ఉన్నారా? వారు మీ భాగస్వామి, స్నేహితులలో ఉంటే ఈ లక్షణాలను బట్టి గుర్తించేయండి...

తనువు దాహం తీర్చుకోవాలంటే.. తగ్గాల్సిందేనా...!తనువు దాహం తీర్చుకోవాలంటే.. తగ్గాల్సిందేనా...!

అన్నీ తాము చెప్పినట్టే..

అన్నీ తాము చెప్పినట్టే..

స్వార్థపూరితంగా ఉండే వారు ప్రతి విషయంలో అంతా తాము చెప్పినట్టే జరగాలని కోరుకుంటారు. ఎదుటి వ్యక్తులు ఏం చెప్పినా అస్సలు పట్టించుకోరు. కనీసం వారు చెప్పే విషయాన్ని కూడా వినరు. మీరు ఏదైనా మంచి విషయం చెప్పినా కోప్పడతారు. మీకు వారు చెప్పింది నచ్చలేకున్నా సరే అనాలంటారు. అంతేకాదు కేవలం ఒకే యాంగిల్ లో ఆలోచిస్తారు. ప్రతి ఒక్క విషయంలో తమ ప్రయోజనాల గురించే ఆలోచిస్తారు. ఇది మీ రిలేషన్ షిప్ కి అంత మంచిది కాదు. ఇది మీ సంబంధాన్ని నాశనం చేస్తుంది.

మౌనంగా ఉంటే..

మౌనంగా ఉంటే..

మీరు ఏదైనా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడేటప్పుడు మౌనంగా ఉండిపోతారు. మీరు వారితో ఎంతలా మాట్లాడాలని ప్రయత్నించినా వారు మౌనంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. ఎందుకంటే అలాంటి సమయంలో మాట్లాడితే.. తాము కూడా మాట్లాడితే తమ మీద ఎలాంటి భారం పడుతుందోనని భావిస్తారు. అయితే చివర్లో మాత్రం ఏదో ఒక హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం.

ఆ విషయంలో సిద్ధహస్తులు..

ఆ విషయంలో సిద్ధహస్తులు..

మీ భాగస్వామి లేదా ఇంకెవరైనా స్వార్థపరులైతే.. వారు ఏదైనా పొరపాటు లేదా తప్పు చేసినప్పుడు మనం వారిని నిందిస్తే.. వారు దాన్ని అస్సలు భరించరు. పైగా వెంటనే వారు మనపై ఎదురు తిరుగుతారు. అంతేకాదు రివర్స్ లో మనల్నే బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తారు. చివరకు నిజంగా తప్పు చేసింది తామేనేమో అనే ఫీలింగ్ వచ్చేలా చేయడంలో వీరు చాలా సిద్ధహస్తులు.

పెళ్లి మళ్లీ మళ్లీ చేసుకున్న తారలెవరో చూసెద్దామా...పెళ్లి మళ్లీ మళ్లీ చేసుకున్న తారలెవరో చూసెద్దామా...

కలయిక విషయంలోనూ..

కలయిక విషయంలోనూ..

ఇక పడకగదిలో భాగస్వామి కలయిక విషయంలో కూడా ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. వారికి మీ నుండి ఏదైనా కావాలనిపించినప్పుడు మాత్రమే కలయికలో పాల్గొంటారు. రతి క్రీడలో పాల్గొనేందుకు మీకు మాయ మాటలు చెబుతుంటారు. అప్పుడు కూడా కేవలం వారి సుఖాన్ని మాత్రమే చూసుకుంటారు. మీరు కనీసం సాటిస్ ఫై అయ్యారా లేదా అనే విషయాన్ని కూడా అడగరు. మీకు ఎలాంటి యాంగిల్స్ ఇష్టం వంటి విషయాలను కూడా అస్సలు పట్టించుకోరు.

రాజీ పడరు..

రాజీ పడరు..

మనలో ప్రతి ఒక్కరూ జీవితంలో చాలా సందర్భాల్లో రాజీ పడాల్సి వస్తుంది. ఎవరైనా రాజీ పడితేనే తమ లైఫ్ లో హ్యాపీగా రాణించగలరు. ముఖ్యంగా తమకిష్టమైన వారి కోసం కొన్ని త్యాగం కూడా చేస్తుంటారు. కానీ స్వార్థపరులు మాత్రం తమకు ఇష్టమైన వారి కోసం కూడా ఏ విషయంలోనూ రాజీ పడరు. వారికి ఏది కావాలో అదే చూసుకుంటారు. రాజీ పడటం అనేది వీరి జీవితంలోనే ఉండదు.

అది చాలా ఎక్కువ..

అది చాలా ఎక్కువ..

ఎవరైతే స్వార్థపూరితంగా ఉంటారో.. తమ గురించే చూసుకుంటారో అలాంటి వారికి అభద్రతా భావం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే వీరు నలుగురిలో తామే హైలెట్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. ఇక జీవిత భాగస్వామి విషయంలో చాలా పొసెసివ్ గా ఉంటారు.

పెళ్లయినా పక్కచూపులు ఎందుకు చూస్తారో తెలుసా...పెళ్లయినా పక్కచూపులు ఎందుకు చూస్తారో తెలుసా...

ఏదైనా సమస్య వస్తే..

ఏదైనా సమస్య వస్తే..

వీరు వివాహ బంధంలో ఉన్నా.. ప్రేమ బంధంలో ఉన్న సమయంలో తమ భాగస్వామికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా అండగా నిలబడరు. నీ ప్రాబ్లమ్ నా ప్రాబ్లమ్ కాదు.. నీది నువ్వే చూసుకో అని మెల్లగా జారుకుంటారు.

మీ అవసరాలను..

మీ అవసరాలను..

ఆరోగ్యకరమైన రిలేషన్ షిప్ లో ప్రధానమైన విషయం ఏంటంటే.. భాగస్వామి ఇష్టయిష్టాలను తెలుసుకోవడం.. వారి అవసరాలను మరియు కోరికలను తీర్చడం. దీనర్థం మీ భాగస్వామి మిమ్మల్ని నిరంతరం సంతోషపెట్టాలని కాదు. అయితే మీ కనీస అవసరాలను పట్టించుకోకపోతే వారు పక్కా స్వార్థపరులని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.

English summary

Signs You Are the Selfish Partner in Your Relationship in Telugu

Here are the signs you are the selfish partner in your relationship in Telugu. Have a look
Story first published:Monday, July 5, 2021, 16:32 [IST]
Desktop Bottom Promotion