For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పార్ట్ నర్ తో పడకగదిలోనే కాదు.. అలాంటి బంధమూ ‘కీ’లకమే...

మీ భాగస్వామిలో ఇలాంటి లక్షణాలు ఉంటే.. తను మీతో ఎలా ఉంటారో తెలుసుకోవడానికి ఇక్కడ ఓ లుక్కేయండి.

|

మనకు జీవితంలో పరిచయం అయ్యే ప్రతి వ్యక్తితనోనూ ఏదో ఒక బంధం ఉంటుంది. అయితే కేవలం కొందరితో మాత్రమే భావోద్వేగ సంబంధం ఉంటుంది. దీన్ని మాటల్లో చెప్పలేం.

Signs You Have a Strong Emotional Connection With Your Partner

అయితే జీవిత భాగస్వామితో మాత్రం ఎప్పటికైనా ఆరోగ్యకరమైన రిలేషన్ షిప్ చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు మీ భాగస్వామితో జీవితాంతం కంఫర్ట్ గా జీవించాలి. దీని వల్లే మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది.

Signs You Have a Strong Emotional Connection With Your Partner

అప్పుడే మీరు మీ రిలేషన్ షిప్ లో మీ భాగస్వామితో ప్రతి విషయాన్నీ షేర్ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా మీ భాగస్వామితో భావోద్వేగ సంబంధం కలిగి ఉన్న సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

'ఏడాదికి ఒకట్రెండు సార్లు మాత్రమే ఏకాంతంగా కలుస్తున్నాం.. రెగ్యులర్ గా కలవాలంటే.. ఏం చేయాలి..''ఏడాదికి ఒకట్రెండు సార్లు మాత్రమే ఏకాంతంగా కలుస్తున్నాం.. రెగ్యులర్ గా కలవాలంటే.. ఏం చేయాలి..'

స్నేహంగా ఉంటే..

స్నేహంగా ఉంటే..

ఏ బంధానికైనా స్నేహమే పునాది. కాబట్టి మీ రిలేషన్ షిప్ లో అది దాన్ని చెక్కుచెదరకుండా ఉండేలా చూసుకోండి. మీరు ఎంత ఎదిగినా.. మీ ఇద్దరి మధ్య ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. మీకు ఎన్ని మనస్పర్దలు వచ్చినా మీరు స్నేహితుల్లా ఉంటే చాలు.. గొడవలు, సమస్యలు అన్నీ వాటంతటే అవే సమిసిపోతాయి. ఎందుకంటే ఏ బంధానికైనా బలమైన పునాది స్నేహం.

ప్రత్యేకంగా సమయాన్ని..

ప్రత్యేకంగా సమయాన్ని..

మీ డైలీ లైఫ్ లో మీ పార్ట్ నర్ చాలా ముఖ్యమని తెలుసుకోవాలి. కాబట్టి మీ భాగస్వామితో ప్రతిరోజూ ఏదో ఒక విషయం గురించి క్లోజ్ గా మాట్లాడుతూ ఉండాలి. ఒకవేళ మీకు అలా కుదరకపోతే.. మీరిద్దరూ కొంత ప్రత్యేక టైం కేటాయించుకోవాలి.

మానసిక అనుబంధం..

మానసిక అనుబంధం..

భార్యభర్తల మధ్య బంధం అంటే.. కేవలం రొమాన్స్, శారీరక అనుబంధం ఒక్కటే కాదు. అంతకుమించిన మానసిక అనుబంధం భావోద్వేగ సంబంధం.. మీ జీవితంలో మంచి లేదా చెడు ఎంత జరిగినా మీరు వారితో ప్రతిదీ షేర్ చేసుకోవాలి. మీ కలలు, భయాలు, లక్ష్యాలు, కుటుంబంతో ఇంకా ఏదైనా విషయం గురించి మాట్లాడితే.. మీ ఇద్దరి మధ్యనున్న డీప్ రిలేషన్ షిప్ కు సంకేతం.

<strong>పెళ్లికాని ప్రసాదులు పెరిగిపోవడానికి ప్రధాన కారణాలివే...!</strong></p><p>పెళ్లికాని ప్రసాదులు పెరిగిపోవడానికి ప్రధాన కారణాలివే...!

బలహీనం చేయొద్దు..

బలహీనం చేయొద్దు..

ఈ లోకంలో ప్రతి ఒక్కరికీ ఏ బంధంలో అయినా ఏదో ఒక సందర్భంలో గొడవలు వస్తుంటాయి. అది స్నేహమైనా.. ప్రేమైనా.. వివాహ బంధమైనా.. కాబట్టి ఏవైనా గొడవలు పడితే వాటిని మాట్లాడుకుని పరిష్కరించుకోండి. అంతేగానీ ఆ గొడవలు మీ బంధాన్ని బలహీనం చేయకుండా జాగ్రత్త పడాలి.

ఇద్దరికీ తెలియాలి..

ఇద్దరికీ తెలియాలి..

మీరు రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు వీలైనంత సన్నిహితంగా ఉండాలి. కాబట్టి మీరు ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవాలి. మీరు మీ పార్ట్ నర్ తో కలిసి ఎక్కడికెళ్లినా తనతోనే ఉండాలి. నలుగురిలో తనను గౌరవించాలి. వారితో చాలా క్లోజ్ గా ఉండాలి. అప్పుడే మీ బంధం మరింత బలపడుతుంది.

ఎలాంటి సీక్రెట్స్ ఉండవు..

ఎలాంటి సీక్రెట్స్ ఉండవు..

మీ భాగస్వామితో మీకు బలమైన భావోద్వేగ సంబంధం ఉంటే.. మీరు వారితో ఎలాంటి సీక్రెట్స్ పెట్టుకోరు. ప్రతి ఒక్క రహస్యాన్ని పార్ట్ నర్ తో షేర్ చేసుకుంటారు. ఏ తప్పు జరిగినా.. ఒప్పు జరిగినా.. ఓపెన్ గా మాట్లాడుకుంటే మీ ఇద్దరి మధ్య ఎలాంటి పొరపచ్చాలే ఉండవు.

మరో కోణం..

మరో కోణం..

మీ భాగస్వామితో బలమైన భావోద్వేగ సంబంధాన్ని కోరుకుంటే.. మీరు కొత్త కోణాన్ని బయటపెట్టాలి. అయితే మీకు నచ్చినట్టు ఉండాలి. అప్పుడే మీ పార్ట్ నర్ కూడా మీ మానసిక గాయాలను వారితో షేర్ చేసుకుంటారు.

English summary

Signs You Have a Strong Emotional Connection With Your Partner

Here we are talking about the signs you have an emotional connection with your partner. Read on.
Desktop Bottom Promotion