For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ విషయంలో ఆందోళన చెందుతున్నారా? అయితే ఇలా చేసి చూడండి...!

రిలేషన్ షిప్ లో ఆందోళన కలిగించే సంకేతాలేంటో చూడండి.

|

ఈ లోకంలో యవ్వనంలో ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ లేదా పెళ్లి అనేది అనివార్యం. అయితే కొందరి ప్రేమ బంధం లేదా వివాహ బంధం జీవితాంతం నిలిస్తే.. ఇంకొందరి విషయంలో మాత్రం వివిధ సమస్యల కారణంగా ఆ బంధం మధ్యలోనే తెగిపోతుంది. ప్రేమ అనే రెండక్షరాలకు ఎంతో శక్తి ఉంది.

Signs Your Relationship Is Giving You Anxiety

మనతో మనం ఇష్టపడే వ్యక్తి పక్కన ఉంటే.. ఎంతో హాయిగా ఉంటుంది. అయితే మీ ఇద్దరి మధ్య బంధంలో అలా జరగుతోందా? లేదా మీరు ఇష్టపడే వ్యక్తి మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారా? మీరు ఎంత ప్రేమగా మాట్లాడినా.. ఏదైనా వాట్సాప్ మెసెజ్ చేసినా.. ఆశించిన రీతిలో స్పందన లభించడం లేదా?

Signs Your Relationship Is Giving You Anxiety

తనతో మాట్లాడాలంటే టెన్షన్ గా ఉంటోందా? ఎప్పుడూ ఏదో ఒక ఆందోళన ఉంటుందా? అయితే మీ బంధంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నట్టేనని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూసేయ్యండి.. అందుకు గల పరిష్కారాలను కనుగొనండి...

కారు లోన్ కట్టాక.. బ్రేకప్ చెప్పింది.. సరిగ్గా పెళ్లికి ముందే మాజీ ప్రియుడితో..!కారు లోన్ కట్టాక.. బ్రేకప్ చెప్పింది.. సరిగ్గా పెళ్లికి ముందే మాజీ ప్రియుడితో..!

అది తగ్గిపోతుందట..

అది తగ్గిపోతుందట..

ప్రస్తుత జీవనశైలి కారణంగా, కొందరికి క్షణ క్షణం మూడ్ మారుతూ ఉంటుంది. దీంతో తమ పార్ట్ నర్ తో సమస్యలు ప్రారంభమవుతాయి. అక్కడి నుండి తామిద్దరి మధ్య బంధానికి బీటలు వారతాయా? బ్రేకప్ జరుగుతుందా అనే భయం ఉండకూడదట. అలాంటి వారు ఎంత ప్రయత్నించినా ఎప్పటికీ ప్రశాంతంగా ఉండలేరట. అంతేకాదు మానసిక సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తుంటారు. అంతేకాదు ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోతుందట.

త్వరగా గుర్తించలేరు..

త్వరగా గుర్తించలేరు..

మనలో చాలా మంది తాము తెలీకుండానే ఒత్తిడిలోకి వెళ్తున్నామనే విషయాన్ని త్వరగా గుర్తించలేరు. అలా కాకుండా మీరు ప్రతి చిన్న విషయానికి ఒత్తిడికి గురవుతున్నారని గుర్తిస్తే, అదే మీ రిలేషన్ షిప్ లో ఆందోళన ఉన్నట్లు సంకేతంగా చెప్పొచ్చు.

చిన్న విషయాలకే ఏడవడం..

చిన్న విషయాలకే ఏడవడం..

కొందరు చాలా చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందడం.. వెంటనే కళ్లల్లో నీరు కార్చడం వంటివి చేస్తున్నారంటే.. మీరు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్టేనని నిపుణులు చెబుతున్నారు. అప్పుడు మీ బంధం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టేనని అర్థం చేసుకోవచ్చు.

పార్ట్ నర్ తో పొట్లాటే కాదు.. రాజీ పడటమూ ముఖ్యమే...!పార్ట్ నర్ తో పొట్లాటే కాదు.. రాజీ పడటమూ ముఖ్యమే...!

భాగస్వామితో చెప్పాలి..

భాగస్వామితో చెప్పాలి..

మీరు గానీ లేదా మీ భాగస్వామి గానీ ఏదైనా విషయంలో సమస్యలను ఎదుర్కొంటే.. వాటి గురించి కచ్చితంగా వారితో చెప్పి తీరాలి. అలా చెప్పకపోతే.. మీరు మరింత ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటారని గుర్తించాలి. ఆ విషయం చిన్నదా.. పెద్దదా అనే విషయాన్ని పట్టించుకోకూడదు.

ఎక్కువ ఆలోచనలు..

ఎక్కువ ఆలోచనలు..

రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు అతి అనేది ఎప్పుడైనా హానికరమే. ఇది ఒక్క రిలేషన్ లో మాత్రమే కాదు..ఎందులో అయినా పరిమితంగా ఉన్నంత వరకు ఏదైనా బాగానే ఉంటుంది. అది ఆలోచన విషయంలోనూ వర్తిస్తుంది. కాబట్టి ఎక్కువగా ఆలోచించడం కూడా చాలా ప్రమాదమట.

మీలోనే సమస్య..

మీలోనే సమస్య..

మీ పార్ట్ నర్ తో ఏదైనా విషయం గురించి మాట్లాడిన తర్వాత, మీరు దాని గురించి పదే పదే ఆలోచించడం.. ఆ విషయం గురించే ఆలోచిస్తూ దిగులు చెందుతున్నారంటే.. అప్పుడు సమస్య మీలోనే ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. ఇలాంటి సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలి. లేదంటే మీరిద్దరూ సమస్యలను ఎదుర్కొంటారు.

ఇలా చేస్తే..

ఇలా చేస్తే..

ఇలాంటి సమస్యలు, ఆలోచనల నుండి బయటపడాలంటే.. మీరు మీ మైండ్ ను ప్రశాంతంగా ఉంచుకుని.. హాయిగా కూర్చుని ఓ పది నిమిషాల పాటు ఊపిరి తీసుకోవాలి. కేవలం శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉండాలి. అలా చేయడం వల్ల అతి ఆలోచనల నుండి బ్రేక్ దొరుకుతుంది. మీకు కూడా కాస్త ఉపశమనం దొరుకుతుంది.

English summary

Signs Your Relationship Is Giving You Anxiety

Here are the signs your relationship is giving you anxiety. Take a look
Desktop Bottom Promotion