For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పార్ట్ నర్ తో ప్రేమ పెరగాలంటే... రొమాన్స్ ఒక్కటే కాదు... ఇవీ ముఖ్యమే...

|

ప్రేమ అనే రెండక్షరాలకు ఎంతో శక్తి ఉంది. అది అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ అలాగే నిలిచిపోతుంది. అలాంటి ప్రేమ ఇద్దరు వ్యక్తులను జీవితాంతం కలిసి ఉండేలా చేస్తుంది.

అయితే ఆ ప్రేమ బంధం బలంగా ఉండాలంటే.. జీవితాంతం ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలంటే.. వారి మధ్య ప్రేమ, ఆకర్షణ అనేవి అస్సలు తగ్గకుండా ఉండాలి. ఒకరి సాన్నిహిత్యాన్ని మరొకరు ఆస్వాదించాలి. ముఖ్యంగా ఒకరి కోసం మరొకరు విరహవేదనతో వేచి ఉండాలి. అప్పుడే ఆ బంధం మరింత బలంగా మారుతుంది. ఇలాంటి బంధాన్నే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

కానీ ఇలాంటి బంధం కోసం మనం ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదు. రోజు వారీ జీవితంలో మీరు చేసే చిన్న చిన్న విషయాలే మిమ్మల్ని అద్భుతమైన పార్ట్ నర్ గా మారుస్తాయి. అంతేకాదు మీ జీవిత భాగస్వామి మీ కోసం ఎప్పుడూ ఊహాల లోకంలో విహరించేలా చేసేస్తుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

మీ రాశిని బట్టి మీకు ఎలాంటి భార్య వస్తుందో తెలుసా...

హనీమూన్ తర్వాత..

హనీమూన్ తర్వాత..

చాలా మంది కపుల్స్ ప్రేమించుకుని.. పెళ్లి చేసుకున్న తర్వాత హనీమూన్ కు వెళ్తుంటారు. అయితే ఎప్పుడైతే అది పూర్తవుతుందో అప్పటి నుండి రోటీన్ వర్క్ లో బిజీ అయిపోతారు. అసలు తమ మధ్య కేవలం ఫిజికల్ రిలేషన్ తప్ప ప్రేమకు చోటే లేదన్నట్టు ప్రవర్తిస్తారు.

సర్ ప్రైజ్ చేయండి..

సర్ ప్రైజ్ చేయండి..

భార్యభర్తల బంధంతో పాటు ఏ సంబంధంలో అయినా సర్ ప్రైజ్ అంటే అందరూ ఇష్టపడతారు. దానికి మించిన అద్భుతం మరొకటి లేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే మీ పార్ట్ నర్ కు ఏ ఫుడ్ ఇష్టమో తెలుసుకుని.. స్వయంగా మీరే ప్రిపేర్ చేసేయ్యండి.

ప్రేమగా తినిపించండి..

ప్రేమగా తినిపించండి..

మీ భాగస్వామి రోజంతా ఎక్కడెక్కడి నుండో తిరిగి ఇంటికి అలసిపోయి వచ్చిన తర్వాత మీరే స్వయంగా తనకిష్టమైన రెసిపీ రెడీ చేసి ప్రేమగా తినిపించండి. ఇది కేవలం స్త్రీలకే కాదు.. మగవారికి కూడా వర్తిస్తుందని గుర్తుంచుకోండి. దీని వల్ల మీ ఇద్దరి మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది.

పెళ్లిలో కన్యాదానం అక్కర్లేదంట.. సెకండ్ మ్యారేజ్ కూడా మంచిదట... ఎందుకో మీరే చూడండి...

మళ్లీ మళ్లీ ప్రేమ కావాలంటే..

మళ్లీ మళ్లీ ప్రేమ కావాలంటే..

మీ భాగస్వామి చేసే ఏ చిన్న పనైనా మీకు నచ్చితే చాలు తనను పొగడ్తలతో ముంచేయండి. తనను దగ్గరకు తీసుకుని.. డార్లింగ్ అంటూ ఓ రొమాంటిక్ కిస్ కానుకగా ఇచ్చేయండి. మీ కోసం వారు ప్రత్యేకంగా ఏది చేసినా వెంటనే గుర్తించి మీరిచ్చే రొమాంటిక్ రియాక్షన్ వల్ల వారిని మళ్లీ మళ్లీ ప్రేమలో పడేలా చేస్తుంది.

నలుగురిలో ప్రత్యేకంగా..

నలుగురిలో ప్రత్యేకంగా..

మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం నలుగురిలోనూ ప్రదర్శించండి. సాధారణంగా ఏకాంతంగా ఉన్న సమయంలో ఒక్క క్షణం కూడా భాగస్వామిని వదిలి ఉండని వారు, నలుగురిలో మాత్రం ఏమి తెలియని అమాయకుల్లా ప్రవర్తిస్తారు. అయితే మీరు అలా చేయకుండా నలుగురిలో ఉన్నప్పుడు తన చేయిని వదలకుండా పట్టుకుని చూడండి. నలుగురిలో మీరు ప్రత్యేకంగా కనిపిస్తున్నారని వారికి అర్థమయ్యేలా ప్రవర్తించండి.

వాదనలొస్తే..

వాదనలొస్తే..

భార్యభర్తలు లేదా ప్రేమికుల మధ్య బంధం ఎంత బలంగా ఉన్నప్పటికీ, తమ మధ్య ఏదో సందర్భంలో అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. అలాంటి సమయంలో తమదే ఆధిపత్యం కావాలని, వాదనలు పెట్టుకోకండి. ఎవరో ఒకరు రాజీ పడండి. లేదంటే మీ భాగస్వామికే అవకాశం ఇవ్వండి.

ఇద్దరూ కలిసి షో చూస్తే..

ఇద్దరూ కలిసి షో చూస్తే..

మీరిద్దరూ మాత్రమే ఇంట్లో ఉండి టివిలో ఏదైనా సినిమా లేదా షో చూస్తుంటే.. అది మీకు నచ్చకపోయినా.. తనకిష్టం కాబట్టి మీరు కూడా తను ఏది చెబితే దానికి వత్తాసు పలకండి. ఎందుకంటే అలా చేస్తే ఆ తర్వాత మీకిష్టమైన షో చూస్తున్నప్పుడు వారు కూడా మద్దతు ఇస్తారు. అలా మీ ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది.

ఏదైనా టూర్..

ఏదైనా టూర్..

మీరిద్దరూ వారంలో ఆరు రోజులు రోటీన్ పనులు చేస్తుంటారు కాబట్టి వారాంతంలో ఏదైనా టూర్ ప్లాన్ చేయండి. అయితే టూర్ అనగానే దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. సరదాగా లాంగ్ డ్రైవ్ కు వెళ్లండి. ఆ ఫీలింగ్ మాత్రం సూపర్ గా ఉంటుంది.

English summary

Small acts of love that make you an extraordinary partner in Telugu

Here are some small acts listed to make you an extraordinary lover for your partner. Read on.
Story first published: Tuesday, February 23, 2021, 14:55 [IST]