Latest Updates
-
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.! -
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు!
సెక్స్ వల్ల స్త్రీలకు లాభమా? నష్టమా?.. ఆ సర్వేలో ఏమి తేలిందంటే...
ఓ సర్వేలో మహిళలకు శృంగారం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వెల్లడయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
కపుల్స్ లేదా ప్రేమికుల మధ్య సుఖమైన మరియు సంతోషకరమైన జీవనానికి, శృంగారం ఎంతో అవసరమని చెబుతున్నారు వైద్య నిపుణులు.

భార్యభర్తలిద్దరు కలయిక వల్ల సంతోషాన్నిచ్చే హర్మోన్లను విడుదల చేయడంతో పాటు తలనొప్పి తగ్గిపోయి.. ఒత్తిడంతా మాయమైపోయి హాయిగా నిద్రపోవచ్చు.

ఇక హిందూ సంప్రదాయంలోని వేదాల ప్రకారం అయితే స్త్రీలు నవంబరు నుండి ఫిబ్రవరి వరకు ఆలుమగలిద్దరూ శృంగారంలో ఎక్కువగా పాల్గొనవచ్చు.

అయితే వేసవికాలంలో రెండు వారాలకొకసారి పాల్గొనడం మేలని పెద్దలు చెబుతున్నారు. ఇక ప్రస్తుత వర్షాకాలంలో వారానికి ఒకటి లేదా రెండు సార్లు కలయికలో పాల్గొంటే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఆరోగ్యకరమైన శృంగారం వల్ల భార్యాభర్తల్లో ఇమ్యునోగ్లోబులిన్ స్థాయి కూడా పెరుగుతుంది. ఇది శరీరంలోని బ్యాక్టీరియా, వైరస్, విషాలకు విరుగుడుగా పని చేస్తుంది.

మంచి ఎక్సర్ సైజ్ వంటి సెక్స్ వల్ల గుండె కండరాలు బలోపేతమై రక్తపీడనం తగ్గుతుంది. దీని వల్ల 50 శాతం గుండెపోటు ప్రమాదాలు కూడా తగ్గుతాయట. మహిళల కటి కండరాలను బలంగా మారి, మూత్రాశయ నియంత్రణ కూడా మెరుగుపడుతుంది.

వీటితో పాటు శృంగారం వల్ల స్త్రీలకు ఇంకా ఏమేమీ ప్రయోజనాలున్నాయో అనే విషయంపై ఓ పరిశోధన నిర్వహించారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఒత్తిడిని తగ్గిస్తుంది..
శృంగారం అనేది మన శరీరానికే మాత్రమే కాదు.. మనసుకు కూడా శాంతిని అందిస్తుంది. శృంగారం సమయంలో విపరీతమైన ఆనందాన్ని అనుభవించడం ద్వారా శరీరంలో ఉత్పత్తి అయ్యే మంచి హర్మోన్లు, మనస్సుపై ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి. ఎందుకంటే సెక్స్ చేయడం వల్ల ఒత్తిడికి కారణమయ్యే ఆక్సీటోసిన్ విడుదల అవుతుంది.

సౌందర్యాన్ని పెంచుతుంది..
మీరు శృంగారంలో వివిధ రకాల భంగిమలు ప్రయత్నిస్తే.. వివిధ కండరాల సమూహాలను బలంగా చేస్తాయి. ఇది శరీర సౌందర్యాన్ని పెంచుతుంది. ఈ సమయంలో బయటకు వచ్చే హార్మోన్లు చర్మాన్ని మెరుగుపరుస్తాయి.

నొప్పి తగ్గిస్తుంది..
శృంగారం వల్ల కొన్ని నొప్పులు సహజంగా తగ్గిపోతాయి. దీన్ని సహజ నొప్పి నివారణ అని కూడా అంటారు. తలనొప్పి, పీరియడ్స్ పెయిన్ లేదా వెన్నునొప్పులన్నీ మాయమవుతాయి.

గర్భాశయ క్యాన్సర్ నివారణ..
శృంగారం తర్వాత ఉద్వేగం చేరే ప్రక్రియ వల్ల మహిళలకు గర్భాశయ క్యాన్సర్ తో పోరాడే శక్తిని ఇస్తుంది. వాస్తవానికి పురుషులలో స్ఖలనం ప్రోస్టేట్ క్యాన్సర్ నుండి రక్షిస్తుంది. అయితే మహిళల్లో స్ఖలనం గర్భాశయ క్యాన్సర్ నుండి రక్షిస్తుంది.

రక్తపోటును నియంత్రిస్తుంది..
ఒక పరిశోధన ప్రకారం, సాధారణ లైంగిక సంబంధం ఉన్న వారికి ఇతరుల కన్నా ఎక్కువ రక్తపోటు(బిపి) ఉంటుంది. దీని వల్ల మీకు గుండె సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. అంతేకాదు, ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. శరీరంలోని ఎన్నో రకాల వ్యాధులపై బాగా పోరాడగలదు.

కలయికతోనే ఆనందం..
చాలా మంది శృంగారం వల్ల గర్భం ధరిస్తారని.. సుఖ వ్యాధులు వంటివి మాత్రమే వస్తాయని భావిస్తారు. అయితే ‘సెక్స్ వల్ల ఆనందం' పొందుతారని ఈ పరిశోధనలో తేలింది. అందుకే క్రమబద్ధంగా వైవాహిక జీవితంలో కలయిక పట్ల అవగాహన పెంచుకుని, శృంగార జీవితాన్ని అనుభవించాలని నిపుణులు సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications
